RS. 10
-
మెయ్‌జు ఎం5 స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర?
సుదీర్ఘ విరామం తర్వాత మెయ్‌జు తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎం5' ను విడుదల చేసింది. భారత మార్కెట్ లో దీని ధరను రూ.10,499 లుగా కంపెనీ ప్రకటించింది. బ్లూ, షాంపైన్ గోల్డ్ కలర్ వేరియంట్లలో టాటాసిలిక్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. అలాగే 2జీబీ, 3 జీబీ వేరియంట్లలో అక్టోబర్ లో చైనాలో లాంచ్ చేసిననప్పటికీ 3 జీబీ ఎంను మాత్రమే ప్రస్తుతం భారత్ లో లాంచ్ చేసింది. ఫింగర్ ప్రింట్ సెన్సర్బట్, హోమ్ బటన్ క్రింద అమర్చింది. పాలీ కార్బోనేట్బాడీతో డిజైన్ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ లో కుడి అంచున పవర్ , వాల్యూమ్ బటన్లను, 3.5 ఎంఎ ఆడియో జాక్, స్పీకర్లు, చార్జింగ్ పోర్ట్ కిందిభాగాన పొందుపర్చింది. ఇక మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి. మెయ్‌జు ఎం5 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ డ్యుయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0 ఎల్ఈ 3070 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం చైనాలో లాంచ్ చేసిన చాలా తక్కువ సమయంలోనే దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టామని మొయిజు సౌత్ ఆసియా మార్కెటింగ్ హెడ్ లియాన్ జాంగ్ ప్రకటించింది. కీలక మార్కెట్ గా ఉన్న భారతకు మంచి ఆదరణ లభిస్తోందని ఈ నేపథ్యంలో కొన్ని నెలల కాలంలోనే దీన్ని భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. -
సీఎం ఇచ్చిన వరాల ఖరీదెంతో తెలుసా?
-
10,565 కోట్లు
- పదివేల కోట్లు దాటిన కొత్త హామీల పద్దు - కలెక్టరేట్ల నిర్మాణానికి రూ.1,032 కోట్లు - సబ్సిడీపై గొర్రెల పెంపకానికి రూ. 5 వేల కోట్లు - వీఆర్ఏ, అంగన్వాడీల జీతాల భారం 313 కోట్లు - ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల ప్రోత్సాహకాలకు రూ. 300 కోట్లు - గృహ రుణాల బకాయిలకు రూ. 3,920 కోట్లు - బడ్జెట్ లెక్కలేసుకుంటున్న ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్ బడ్జెట్ ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్ఏల వేతనాలను భారీగా పెంచింది. వివిధ వర్గాలకు భారీ ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలను ప్రకటించింది. రెండు లక్షల గొర్రెల యూనిట్లు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకం, నవజాత శిశువులకు కేసీఆర్ కిట్లు, అంగన్వాడీలకు సన్నబియ్యం వంటి కార్యక్రమాలు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జనహిత వేదికగా వరుసగా వివిధ వర్గాలతో సమావేశమైన సీఎం కొత్త హామీలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. బలహీన వర్గాల గృహ నిర్మాణం పథకంలో ఇప్పటికే ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల బ్యాంకు బకాయిలను కూడా రద్దు చేస్తామని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం ఇచ్చిన వరాల ఖరీదెంత? ప్రభుత్వ ఖజానాపై ఆర్థికంగా ఎంత అదనపు భారం పడుతుంది? ఆర్థిక శాఖ ఈ మేరకు లెక్కలేసుకుంటోంది. ఇప్పటికే వచ్చిన అంచనా ప్రకారం ఈ వరాల పద్దు రూ.10,565 కోట్లకు చేరుతోంది. కొత్త కలెక్టరేట్ల డిజైన్లకు ఓకే కొత్త సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలకు రూ.1,032 కోట్లు వెచ్చించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. మంగళవారం ఈ ఫైలుపై సంతకం చేశారు. త్వరలో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు. పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కొత్త జిల్లాలతో పాటు పలు పాత భవనాలున్న జిల్లా కేంద్రాల్లోనూ కొత్త కలెక్టరేట్లు నిర్మించనున్నారు. సంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో ఈ నిధులు ఖర్చు చేస్తారు. కలెక్టరేట్ల నిర్మాణ కన్సల్టెంట్‌గా ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి డిజైన్ చేసిన నమూనాలను ముఖ్యమంత్రి ఆమోదించారు. ప్రాజెక్టు వ్యయంలో మూడు శాతం ఆర్కిటెక్ట్ ఉషారెడ్డికి కన్సల్టెంట్ ఫీజుగా ప్రభుత్వం చెల్లించనుంది. ఈ ఫీజును మరొక శాతం పెంచాలని ఆర్కిటెక్ట్ చేసిన విజ్ఞప్తి ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ఫైలును సైతం ఆమోదించే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు కొత్త సచివాలయం నిర్మాణానికి వచ్చే బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించనున్నారు. వీఆర్ఏలు, అంగన్వాడీల జీతాల భారం ఇదీ.. వీఆర్ఏలు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.313 కోట్ల భారం పడనుంది. తాజాగా వీఆర్ఏల వేతనాన్ని భారీగా పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.4,700 చొప్పున రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్ఏలకు ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏటా రూ.109 కోట్ల అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలో ఉన్న 35,700 మంది అంగన్వాడీ టీచర్లకు జీతాలను పెంచారు. ఒక్కొక్కరికి రూ.3,500 చొప్పున జీతం పెంచటంతో.. ఏడాదికి రూ.150 కోట్ల భారం పడనుంది. అలాగే అంగన్వాడీ హెల్పర్లకు రూ.1500 చొప్పున జీతం పెరగనుంది. దీంతో జీతాల పద్దు రూ.54 కోట్ల మేర పెరగనుంది. కాన్పులకు ప్రోత్సాహకం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు కొత్త కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడాదికి 6.30 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో 31 శాతం కాన్పులు.. అంటే ఇంచుమించుగా 2 లక్షల కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలకు రూ.12 వేల సాయం, పుట్టిన పిల్లలకు అవసరమైన బేబీ సోప్స్, షాంపూలు, మందులుండే రూ.2 వేల విలువైన కిట్‌ను అందిస్తామని సీఎం ప్రకటించారు. ఆడపిల్ల పుడితే మరో రూ.1,000 అదనంగా సాయం అందిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు కేంద్ర ప్రభుత్వం రూ.6,000 ప్రోత్సాహకంగా అందించనుంది. దీనికి రెండితల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటంతో దీనికి దాదాపు రూ.300 కోట్లు అవసరమవుతాయని ఆర్థిఖ శాఖ లెక్కలేసింది. ప్రభుత్వ పక్కా ఇళ్ల రుణాల మాఫీ ప్రభుత్వ పక్కా ఇళ్లు పొందిన లబ్ధిదారుల గృహ రుణ బకాయిలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రకటించారు. 1983 నుంచి 2014 వరకు ఉన్న రూ.3,920 కోట్ల రుణభారాన్ని తొలగించాలని నిర్ణయించారు. రుణాల కోసం బ్యాంకుల్లో తనఖా పెట్టిన ఇళ్ల పట్టాలను నెల రోజుల్లోనే తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కొత్త బడ్జెట్లో గృహ రుణాల మాఫీకి ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం రేషన్ షాపులు, మధ్యాహ్న భోజనం, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే బియ్యం సబ్సిడీకి ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు వెచ్చిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు కేంద్రం 3,200 టన్నుల బియ్యం కేటాయిస్తోంది. కిలో రూ.30.50 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కొనుగోలు చేస్తోంది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ మినహాయిస్తే మిగిలిన రేటును రాష్ట్రమే భరించాల్సి ఉంటుంది. దీంతో బియ్యం సబ్సిడీ భారం మరో రూ.100 కోట్లు పెరుగుతుందని అంచనా. గొర్రెల పెంపకానికి పెద్ద వాటా గొర్రెల పెంపకానికి రాబోయే రెండేళ్లలో రూ.5 వేల కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 75 శాతం సబ్సిడీతో 2 లక్షల యూనిట్ల పంపిణీని లక్ష్యంగా ఎంచుకుంది. 21 గొర్రెలుండే ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షల అంచనా ఖర్చుతో ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీంతో కొత్త వరాల్లో ఇదే పెద్ద వాటాను ఆక్రమించనుంది. అలాగే నిరుటి తరహాలోనే చేపల పెంపకానికి నిధులు ఖర్చు చేయనుంది. వీటితోపాటు ఎంబీసీ వర్గాల చేయూతకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. -
పెద్దనోట్లపై మరో షాకింగ్ న్యూస్..!
న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 లకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ ఒకటి ఆందోళన పుట్టిస్తోంది. నవంబరు 8న అత్యధిక చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను రద్దుచేసి సంచనం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలన ఆర్డినెస్స్ జారీ చేయనుందట. ఈ కొత్త చట్టం ప్రకారం నిషేధిత రూ.500 ,రూ.1000 రూపాయి నోట్లను రూ.10,000పైగా కలిగి ఉండటం ఇకమీదట నేరంగా పరిగణిస్తారు. రూ. 10 వేలకు పైగా రద్దయిన పాత నోట్లను కలిగి వుంటే భారీ జరిమానా విధించనుంది. రూ.50వేల జరిమానా లేదా పట్టుబడిన సొమ్ముకు అయిదు రెట్లు జరిమానా విధించనుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పురపాలక మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో విచారించి, జరిమానాను నిర్ణయిస్తారు. అలాగే డిసెంబర్ 30తరువాత రద్దయిన నోట్లను నేరుగా రిజర్వ్ బ్యాంక్ కౌంటర్లలో డిపాజిట్ చేయవచ్చు. దీనికి సంబంధించిన గ్రేస్ పీరియడ్ ను తరువాత ప్రకటించనుంది. డిసెంబర్30లోపు ఈ ఉత్తర్వులను విడుదల చేసేందుకు యోచిస్తోందట. కాగా 80 శాతం చెలామణిలో రూ. 15.44 లక్షల కోట్ల నోట్ల రద్దు తర్వాత డిసెంబర్ 13 నాటికి 12.44 లక్షల కోట్ల డిపాజిట్ అయినట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిసెంబర్ 30 గడువు లోపల మొత్తం డిపాజిట్లు రూ.13-13.5 లక్షల కోట్లగా ఉండనుందని ఆర్థిక వేత్తలు అంచనావేస్తున్నారు. పెద్దనోట్ల డిపాజిట్ల గడువు ఈ నెల 30తో ముగియనున్న సంగతి తెలిసిందే. -
కనీస వేతనం రూ. 10,700
- అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం - ప్రస్తుతమున్న రూ. 7,500కు మరో రూ. 3,200 చేర్చి ఖరారు - స్కిల్డ్ కార్మికులకు రూ.18 వేల నుంచి 22 వేలుగా నిర్ణయం - రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు - మొత్తం 17 లక్షల మంది కార్మికులకు లబ్ధి సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనాన్ని రూ. 10,700గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కనీస వేతనం రూ. 7,500కు అదనంగా రూ. 3,200 కలిపింది. దేశవ్యాప్తంగా కనీస వేతనం రూ. 10 వేలు ఉండేలా చట్టం చేస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలో అంతకన్నా ఎక్కువగానే కనీస వేతనం ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే నైపుణ్య కార్మికులకు కనీస వేతనం రూ. 18 వేల నుంచి రూ. 22 వేల వరకు ఉండేలా ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువరించనుంది. ధరల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రంలో కనీస వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలంటూ కార్మిక సంఘాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న కార్మికశాఖ ఈ మేరకు ప్రభుత్వానికి వివరిస్తూ నివేదికను అందజేసింది. అయితే పరిశ్రమ యాజమాన్యాలతోపాటు వివిధ వర్గాల వారితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పలుమార్లు చర్చించి కనీస వేతనం రూ.10,700గా ఉండాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదముద్ర వేశారు. నైపుణ్యరహిత కార్మికులందరికీ పరిశ్రమలన్నీ కచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన వేతనాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంతో స్కిల్డ్, అన్‌స్కిల్డ్ రంగాలకు చెందిన దాదాపు 17 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉందని కార్మికశాఖ అంచనా వేస్తోంది. కనీస జీవన ప్రమాణాల మేరకు.. నిత్యావసరాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని కనీస జీవన ప్రమాణాలకు అనుగుణంగా కనీస వేతనాలను నిర్ణయించేందుకు కార్మికశాఖ పలు రంగాలకు చెందిన నిపుణులతో కమిటీని వేసింది. ఈ మేరకు కమిటీ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిత్యావసరాలు, దుస్తులు, పిల్లల చదువులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కనీస వేతనాన్ని లెక్కించింది. మరోవైపు కేంద్రం దేశవ్యాప్తంగా కనీస వేతనాన్ని రూ. 10 వేలుగా నిర్ణయించనున్న నేపథ్యంలో రాష్ట్రంలో దానికన్నా అదనంగా కనీస వేతనం ఉండేలా చర్యలు తీసుకుంటామని మేడే వేడుకల సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.10,700గా నిర్ణయించింది. లక్షల మందికి లబ్ధి.. రాష్ట్రంలోని మొత్తం 39,864 పరిశ్రమల్లో దాదాపు 85 లక్షల 17 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో నైపుణ్యరహిత విభాగానికి సంబంధించి దాదాపు లక్ష మందికిపైగా పనిచేస్తున్నట్లు కార్మికశాఖ గుర్తించింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులతోపాటు మిగతా విభాగాల్లో 70 వేల మంది ఉన్నట్లు లెక్కవేసింది. వీరందరికీ కనీస వేతనం అందేలా చూడాలని నిర్ణయించింది. కనీస వేతనాన్ని తొలి విడతలో భాగంగా ఎలక్ట్రానిక్స్, బేకరీ, గాజు పరిశ్రమల వంటి ఎంపిక చేసిన వాటిల్లో కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కార్మికశాఖ భావిస్తోంది. ఒకవేళ ఉత్తర్వులను బేఖాతరు చేస్తే కార్మిక చట్టాలను అనుసరించి వారిపై కేసులు నమోదు చేయాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.