బడ్జెట్ ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది. అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, వీఆర్‌ఏల వేతనాలను భారీగా పెంచింది. వివిధ వర్గాలకు భారీ ప్రయోజనాలు కల్పించే కార్యక్రమాలను ప్రకటించింది. రెండు లక్షల గొర్రెల యూనిట్లు, చేపల పెంపకం, ఎంబీసీల సంక్షేమానికి చేయూత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలకు ప్రోత్సాహకం, నవజాత శిశువులకు కేసీఆర్ కిట్లు, అంగన్‌వాడీలకు సన్నబియ్యం వంటి కార్యక్రమాలు ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.