rtc tmu
-
సీఎం బెదిరింపులకు భయపడేది లేదు
సాక్షి, మెదక్: రాష్ట్రంలోని అన్నివర్గాల మద్దతును కూడకట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి నియంత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు విశ్రమించేదిలేదని సీఎం ఇచ్చిన 24 గంటల వ్యవదిగడిచిపోయిందని ఆయన బెదిరింపులకు భయపడేదిలేదని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్రకార్యదర్శి ఎంఆర్‌కె రావు పేర్కొన్నారు. ఆదివారం వందలాది మంది ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలను నోటికి కట్టుకుని పట్టణంలో ర్యాలినిర్వహించి పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అంబేడ్కర్ విగ్రహానికి ఇచ్చారు. అనంతరం పట్టణంలోని గుల్షన్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. న్యాయపరమైన కోరికలను తీర్చాలని 5 మాసాలముందే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామన్నారు. సమస్యలను పరిష్కరించక పోవటంతోనే సమ్మెబాట పట్టామన్నారు. సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం కార్మికులను బెదిరించటం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో 55 వేల మందికార్మికులు ఒక్కమాటపై నిలబడి సమ్మెలో కొనసగాడం కార్మికుల నైతిక విజయం అని అన్నారు. చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది.. రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుకుని అందర్ని మోసం చేసిన కేసీఆర్‌కు గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ఎంఆర్కే రావు అన్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించనా రాష్ట్రం అగ్నిగుండం కావటం కాయమని ఎంఆర్‌కె రావు అన్నారు. ఆటోడ్రైవర్లను లారీడ్రైవర్లును తీసుకొచ్చి ఎలాంటి టికెట్లు లేకుండా బస్సులను నడపిస్తూ సీఎం దోపిడిదారితనానికి ఆజ్యం పోస్తున్న నియంత సీఎం కేసీఆర్ అని విమర్శించారు. అనంతరం ఆర్టీసీ టీఎంయూ రీజనల్ సెక్రటరి, డిపోకార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, శాకయ్యలు మాట్లాడుతూ.. సీఎం ఇచ్చిన హామాలనే నెరవేర్చ కుండా మాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. టీచర్లను, రైతులను, నిరుద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, ఉపాద్యాయులను, ఉద్యోగులను అందరిని మోసం చేసిన నియంత పాలనకు చరమగీతం పాడేందుకు అన్నివర్గాల ప్రజలం ఏకం కావల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమానికి సీఐటీయూతో పాటు పలు ఉపాద్యాయ సంఘాలు మద్దతును ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో టీఎంయూ నాయకులు బోస్, నర్సింలుతో పాటు కార్మికులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ ధర్నా
నిర్మల్అర్బన్ : జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూని యన్ రాష్ట్ర కార్యదర్శి ఎల్.రమేశ్ డిమాండ్ చేశారు. వేతన సవరణపై యాజమాన్యం అవలంభిస్తున్న మొండి వైఖరి, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టీఎంయూ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్‌డిపో వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కండక్టర్, డ్రైవర్, శ్రామిక్, క్లరికల్, సూపర్వైజర్లతో పాటు అన్ని కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. పెంచిన కిలోమీటర్లను తగ్గించి, తగ్గించిన ఓటిని రన్నింగ్ టైమ్‌ను పునరుద్ధరించాలన్నారు. సర్క్యులర్ ప్రకారం రూటు సర్వే చేసి, రన్నింగ్ టైమ్ ఇవ్వాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించేందకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. సర్క్యులర్ 01/2018ని రద్దు చేయాలన్నారు. గ్యారేజీ కార్మికులపై పెంచిన పని భారాన్ని తగ్గించాల ని, అధునాతన పనిముట్లు, విడిభాగాలు సరఫరా చేయాలన్నారు. తార్నాక హాస్పిటల్లో డాక్టర్లను నియమించాలని, మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలన్నారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. కాలం చెల్లిన రెగ్యులేషన్స్ మార్చాలన్నారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, అద్దె బస్సులు రద్దు చేసి కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7వ తేదీన ‘చలో బస్ భవన్’ చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘం నాయకుడు కేఎంరెడ్డి, నిర్మల్ డిపో సెక్రెటరీ గంగాధర్, నాయకులు ఆర్ఎన్ రెడ్డి, పీవీఎస్‌రెడ్డి, శేఖర్, నారాయణ, అసదుల్ల, నర్సయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శిగా కొండయ్య
మహబూబ్‌నగర్ అర్బన్: ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బి.కొండయ్యను నియమిస్తూ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వర్థామ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా మహబూబ్‌నగర్ రీజియన్ కమిటీ సభ్యులను నియమించారు. చైర్మన్‌గా డబ్ల్యూకే బసప్ప, ఉపాధ్యక్షులుగా టీఎస్ఎస్ రెడ్డి, ఎం.రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా దమ్మాయపల్లి శ్రీనివాసులు, కార్య నిర్వాహక కార్యదర్శులుగా కేఎస్ శివప్రసాద్, జి.ఆంజనేయులు, ఆర్ఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా భానుప్రకాశ్ రెడ్డిని ఎంపిక చేశారు.