Rubber bullets
-
రెండు కళ్లలోకి బుల్లెట్లు దూసుకుపోయి..
సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు చమురు ఎగుమతులతో సమద్ధిగా ఎదిగిన దేశం వెనిజులాలో నిత్యావసరాల కోసం అక్కడి ప్రజలు నిత్యం ఆందోళనలు చేయడం, వారిని పోలీసులు పాశవికంగా అణచివేయడం నిత్యకత్యమైంది. అలాగే వంట గ్యాస్ కోసం తల్లి ఆండ్రియానా వెంట కుమారులు రూఫో ఛాకన్ (16), ఆండ్రియాన్ (14)లు తారిబా పట్టణంలో రెండు వారాల క్రితం ఆందోళన చేస్తుండగా, వారిపైకి పోలీసులు రబ్బర్ బుల్లెట్లు కాల్చారు. ఆ బుల్లెట్లకు సంబంధించిన 51 ముక్కలు వచ్చి రూఫో ఛాకన్ ముఖానికి తగులగా, వాటిల్లో 16 ముక్కలు నేరుగా రెండు కళ్లలోకి దూసుకుపోయాయి. దీంతో రెండు కళ్ల నుంచి రక్తం చిమ్మింది. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స అందించినప్పటికీ రెండు కళ్లు పోయాయి. చూపు తెప్పించే ఆస్కారమే లేదని వైద్యులు తేల్చి చెప్పారు. వంట గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న తల్లికి అండగా తాను ఆందోళనకు వెళ్లినందుకు ఇప్పుడు తల్లికి భారంగా మారాల్సి వచ్చిందని ఆ తనయుడు బాధ పడుతున్నాడు. ఇంక తానే మాత్రం ఏడ్వదల్చుకోలేదని, ఆస్పత్రిలోనే కావాల్సినంత ఏడ్చేశానని మీడియా ముందు వాపోయాడు. తాను మదిలో రంగులు మర్చిపోకముందే చూపు రావాలని కోరుకుంటున్నానని, తనకు జీవితంలో ఏ కలలు చావలేదని, చూపు కోసం తాను ఎంత కష్టపడాలన్నా పడతానని, అలాంటి దారి ఉంటే చూపుమని మీడియాను కూడా వేడుకున్నాడు. బాధ్యతారహితంగా రబ్బర్ బుల్లెట్లను పేల్చిన ఇద్దరు పోలీసులను వెనిజులా యంత్రాంగం గుర్తించి వారిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికా ఆంక్షల వల్ల ఇప్పుడు వెనిజులాలో చమురు, వంట గ్యాస్ కొరత తీవ్రమైంది. -
నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను కోర్టు మెట్లు ఎక్కిస్తానని పాకిస్థాన్ తెహరీక్ ఏ ఇన్పాఫ్ (పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాను దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఇమ్రాన్ తెలిపాడు. త్వరలోనే పార్లమెంట్ ను మోసం చేస్తున్న నవాజ్ ను సుప్రీంకోర్టు బహిష్కరిస్తుందన్నాడు. షరీఫ్ ప్రభుత్వంతో చర్చల్లో భాగంగా డైలాగ్ కమిటీ ఇచ్చిన ఐదు హామీలను తమ పార్టీ అంగీకరించినా.. అందుకు సంబంధించి రాత పూర్వంగా ఎటువంటి నివేదిక ఇవ్వకపోవడాన్ని ఇమ్రాన్ తప్పుబట్టారు. 'షరీఫ్ ను ప్రధాని పదవి నుంచి దింపడానికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. పీటీఐపై ఆయన పార్లమెంట్ లో అసత్యాలు వల్లిస్తున్నారు. దీనిపై అతన్ని కోర్టుకు లాగుతాం ' అని ఇమ్రాన్ హెచ్చరించాడు. గత కొంతకాలంగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను వెంటనే గద్దె దిగిపోవాలని ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో రిగ్గింగ్ కేసు విచారణ జరుగుతున్నందున్న పదవి నుంచి తప్పుకోవాలని ఇమ్రాన్ నిరసన బాటపట్టారు. -
పాక్ విపక్షాల నిరసన హింసాత్మకం
ప్రధాని ఇంటి ముట్టడికి ఆందోళనకారుల యత్నం లాఠిచార్జీ, రబ్బరు బుల్లెట్లు ముగ్గురి మృతి...500 వుందికి గాయూలు ఇస్లావూబాద్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ గద్దెదిగాలనే డిమాండ్‌తో దేశంలో గత 18 రోజులుగా జరుగుతున్న విపక్షాల నిరసనలు శనివారం రాత్రి హింసాత్మకంగా మారాయి. మాజీ క్రికెటర్, తెహ్రికే ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్, కెనడాకు చెందిన మత పెద్ద, పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ చీఫ్ తహిరుల్ ఖాద్రీ నాయకత్వంలో మద్దతుదారులు కర్రలు చేతబూని ఇస్లామాబాద్‌లోని ప్రధాని ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు వారిపై ఉక్కుపాదం మోపారు. లాఠిచార్జీ చేయడంతోపాటు బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. ఇరుపక్షాల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతిచెందగా 500 మంది గాయపడ్డారు. వీరిలో కొందరు జర్నలిస్టులున్నారు. అయితే భద్రతా దళాల దాడిలో తమ పార్టీకి చెందిన ఏడుగురు మృతి చెందినట్టు ఖాద్రీ ఆరోపించారు. కాగా, పోలీసుల ఉక్కుపాదంపై మండిపడ్డ ఇమ్రాన్.. నిరంకుశ ప్రభుత్వం బారి నుంచి ప్రజలకు స్వేచ్ఛ కల్పించేందుకు పోరాడే క్రమంలో మరణించేందుకైనా సిద్ధమన్నారు. ఈ ఆందోళనలు ఇమ్రాన్ పార్టీలో చిచ్చురేపాయి. ప్రధాని ఇంటి ముట్టడిని విమర్శించినందుకు ఏకంగా పార్టీ చీఫ్ హష్మీతోపాటు ముగ్గురు ఎంపీలను ఇమ్రాన్ బహిష్కరించారు. మరోపక్క.. ప్రభుత్వం, సైన్యం వేర్వేరుగా అత్యవసర సమావేశం నిర్వహించాయి.