రవిశాస్త్రికి ఏడాదికి రూ. కోటిన్నర!
ముంబై: భారత జట్టు టీమ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ కెప్టెన్ రవిశాస్త్రికి ఏడాదికి రూ.1.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఇతరత్రా సౌకర్యాలు అదనంగా ఉంటాయి. బీసీసీఐ గ్రేడ్ ‘ఎ’ కాంట్రాక్ట్‌లో ఉన్న కెప్టెన్ ధోని, కోహ్లికి అందే మొత్తం కన్నా ఇదే ఎక్కువ.
తక్కువ మొత్తంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రవిశాస్త్రి ఇష్టపడలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. అలాగే రెండేళ్ల పాటు స్వేచ్ఛగా వదిలేస్తేనే బాధ్యతలు తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం. టీవీ వ్యాఖ్యాత, మీడియా కాలమిస్ట్‌గా అందుకునే పారితోషికాన్ని కూడా బోర్డు నష్టపరిహారం కింద ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రి కోరాడు.