Rural laborers
-
వంద రోజులు.. కొందరికే !
- పనులు చూపించలేకపోతున్న అధికారులు - ఉపాధి హామీ కూలీల ఇక్కట్లు - పనిచేసిన వారికీ దక్కని గిట్టుబాటు కూలి చెన్నూర్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని లభించడంలేదు. పనులు లేక చేసిన పనులకు కూలి గిట్టుబాటు కాక పలువురు వలస బాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. వేసవి కాలంలో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు చెందిన గ్రామీణ కూలీలు పట్టణ ప్రాంతాలకు ఇటుక తయారీ పనుల కోసం వలస వెళ్లారు. ఇలాగే జిల్లాలోని చాలా ప్రాంతాల నుంచి కూలీలు వలస వెళ్లినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లోనైనా అధికారులు మేల్కొని కూలీ లకు సరైన రీతిలో పని కల్పించని పక్షంలో ఈ వల సలు పెరిగే అవకాశం లేకపోలేదు. చట్టం ఏం చెబుతోంది.. కూలీలు పనుల కోసం వలస బాట పట్టకుండా ఉం డేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2005లో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకవచ్చాయి. ఈ చట్టం ప్రకారం ప్రతి కూలీకి 100 రోజులు పని కల్పించాల్సి ఉంది. జిల్లాలో 5,33,346 లక్షల మంది జాబ్ కార్డులు పొం దగా, ఇందులో 3,92,744 మంది కూలీలు పని చేస్తున్నారు. 2014 నుంచి 2015 జూలై వరకు 14,801 మంది కూలీలు మాత్రమే 100 రోజులు పని కల్పిం చగా, మిగతా 3,77,743 మందికి అరకొరగానే పను లు దక్కాయి. అంతే కాకుండా గతంలో రూ.150 ఉన్న కూలిని రూ.180కి పెంచారు. కానీ పొద్దంతా పని చేసిన కూలీలకు రూ. 80 నుంచి రూ. 100 వరకే అందుతోంది. ఒక్కో రోజు రూ. 60 వచ్చిన సందర్భాలు ఉన్నాయని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పనులు కల్పించకపోవడమే కాకుం డా చేసిన పనికి గిట్టుబాటు కూలి దక్కకపోవడంతో కూలీల పరిస్థితి దయనీయంగా మారింది. పది రోజులకు మించడం లేదు... జిల్లా అధికారుల లెక్కల ప్రకారం ఉపాధి హామీ కూలీలకు నెలకు పది రోజులకు మించి పని చూపిం చలేకపోతున్నారు. ఆర్థిక సంవత్సరంలోనే మండలా ల వారీగా పనులను గుర్తిస్తున్నారు. గ్రామీణ ప్రాం తాల్లో వేసవి మూడు నెలల పాటు పనులు లభించక కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇక మార్చి నుంచి జూన్ వరకు నెలలో 25 రోజులైనా ప ని కల్పించాలి. అధికారులు సమయానికి పనులు చూపించలేకపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. డబ్బు చెల్లింపులో జాప్యం రెక్కాడితేనే డొక్కాడే ఉపాధి కూలీలకు కూలీ పనులు దక్కకపోవడం ఓ సమస్య అయితే.. చేసిన పనులకు సంబంధించిన కూలి చెల్లింపులో జాప్యం జరుగుతుండడం మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. పను లు చేసిన వారికి నెలల తరబడి డబ్బు చెల్లించకపోవవడంతో కూలీలు ఉపాధి హామీ పనులపై ఆసక్తి చూప డం లేదు. ఏదైనా పని లభిస్తే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిందేనని చెబుతున్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో... నియోజకవర్గంలోని చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 34,701 మంది కూలీలు ఉ న్నారు. ఇందులో 1,407 మంది కూలీలకు మాత్రమే 100 రోజుల పని కల్పించారు. మిగితా 33,204 మం ది కూలీలకు సంవత్సర కాలంలో 50 నుంచి 60 రో జుల పని కల్పించిన దాఖలాలు లేవు. చెన్నూర్ మం డలంలోని 8,619 మంది కూలీల్లో 317మందికి, జై పూర్లో 10,545 మంది కూలీల్లో 517మందికి, కోట పల్లిలో 11,110 మందిలో 388మందికి, మందమర్రిలోని 4,427 మందిలో 185 మంది కూలీలకే వంద రోజుల పని దక్కింది. ఈ లెక్కన 35 శాతం కూలీలు మాత్రమే 100 రోజులు పనులు చేస్తున్నారు. ఇక వం ద రోజులు పని చేసిన కూలీలకు ప్రభుత్వం ప్రకటిం చిన రోజు వారి కూలి రూ.180 గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఇళ్లు, పిల్లలను వదిలి పట్టణాలకు వెళ్లలేక.. ఇంటి వద్దే పని చేసుకోవచ్చని ఉపాధి హామీని నమ్ముకుంటే ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్య వసాయ పనులు కరువైన ప్రస్తుత తరుణంలోనైనా ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయకపోతే కూలీలకు న్యాయం జరిగే అవకాశం ఉండదు. -
‘ఉపాధి’ జోరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ కూలీలకు పని కల్పించే ప్రక్రియ ఊపందుకుంది. గత కొద్ది నెలలుగా జిల్లాలో వ్యవసాయపనులు ముమ్మరంగా కొనసాగుతుండటం, వరి, పత్తి, మిరప, పెసర, శనగ వంటి పంటలు వేయడంతో కూలీలకు చేతినిండా పని దొరికింది. దీంతో ఉపాధి హామీ పనులు తగ్గిపోయాయి. అయితే ఇప్పటికే కొన్ని పంటలు చేతికి రావడం, మరికొన్ని పంటలు ఫిబ్రవరి మొదటి వారం వరకు పూర్తి కానుండడంతో కూలీలకు పని కల్పించేందుకు డ్వామా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించారు. ఉపాధి కోసం జిల్లా నుంచి ఏ ఒక్కరూ వలస వెళ్లకుండా ప్రతి గ్రామంలో పని కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని భద్రాచలం మినహా 39 మండలాల్లోని 669 గ్రామాల్లో వచ్చేనెల మొదటివారం నాటికి ప్రతి గ్రామంలో కనీసం ఒక పని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఒక్కో పనికి పది మందికి తగ్గకుండా కూలీలకు ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తయిన గ్రామాలు, మండలాల కూలీలు తమకు పని కల్పించాలని కోరడంతో గత నాలుగు రోజులుగా పనులు చేపడుతున్నారు. తొలి రోజు 1600 మందికి ఉపాధి చూపించిన అధికారులు.. శుక్రవారం వరకు రోజుకు 3వేల మంది చొప్పున ఉపాధి కల్పించారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు గ్రామాల్లో కూలీలకు పని ఉండదు. దీన్ని పరిగణనలోకి తీసుకుని దాదాపు రూ.100 కోట్లతో 4.50 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు గాను 12,878 పనులను గ్రామాల వారీగా కేటాయించారు. ఏ ఒక్క కూలీకి ఉపాధి లభించలేదన్న భావన కలగకుండా గ్రామాల్లో ఉన్న శ్రమశక్తి సంఘాలు అడిగిన మరుక్షణం ఆ గ్రామంలో పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందికి డ్వామా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని నర్సరీలలో పనులు నిర్వహిస్తుండగా, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.100 కోట్ల విలువైన పనులను గ్రామాల వారీగా పూర్తి చేయడం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించనున్నారు. ఈజీఎస్ ద్వారా లింక్ రోడ్లు, కొత్త రోడ్ల నిర్మాణం, కచ్చారోడ్లపై గ్రావెల్ వేయడం వంటి పనులతోపాటు గ్రామాల్లో గుర్తించిన పనులు చేపట్టనున్నారు. కేటాయించిన పనికి సంబంధించిన బడ్జెట్లో 60 శాతం సొమ్ము పనిచేసిన వారికి ఇవ్వాలని, 40 శాతం మెటీరియల్ కాంపౌండింగ్‌కు కంపోనెంట్‌గా వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 26 వేల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించారు. వీటికి సంబంధించిన బిల్లులను సైతం పూర్తిస్థాయిలో చెల్లించారు. ఇంకా 13వేల మరుగుదొడ్లు అసంపూర్తిగా మిగిలాయి. వీటిని ఈనెల 31 నాటికి పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పథకాన్ని ఈజీఎస్ నుంచి మినహాయించి స్వచ్ఛభారత్‌లో కలపడంతో.. నిర్మాణ పనులు వేగవంతం చేయకపోతే ఇందుకు సంబంధించిన నిధులు వెనక్కుపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో గ్రామాల్లో ఈ పనులు కొంతమేర ఊపందుకుంటున్నాయి. జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా గ్రామాల వారీగా కొత్త పనులను గుర్తించే ప్రక్రియకు సైతం డ్వామా అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు గుర్తించే పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. -
‘ఉపాధి’ కార్యాలయం ముట్టడి
వలేటివారిపాలెం, న్యూస్‌లైన్ : గత ఏడాది మే, జూన్‌లో చేసిన పనులకు సంబంధించి కూలిడబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మండలంలోని అన్ని గ్రామాల కూలీలు సోమవారం ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు వారు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కూలిడబ్బుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధమైన ఉపాధి కూలీలకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెంట్యాల హనుమంతరావు, డివిజన్ కార్యదర్శి జి. వెంకటేశ్వర్లు సంఘీభావం తెలిపారు. ధర్నా వద్ద హనుమంతరావు మాట్లాడుతూ ఉపాధి పనులు చేసిన 15 రోజుల్లో కూలి చెల్లించాల్సి ఉంటుందని, లేకుంటే ప్రభుత్వం అపరాధ రుసుం ఇవ్వాల్సి ఉందన్నారు. బకాయిలు రూ.33.82 లక్షలు చెల్లించకపోవడం కూలీల కడుపు కొట్టడమేనని విమర్శించారు. ఈ ఏడాది ఉపాధి పనులకు సంబంధించి కూడా 6 వారాల కూలి చెల్లించకపోవడం దారుణమన్నారు. పీడీని ప్రశ్నించిన హనుమంతరావు.. ఉపాధి హామీ పథకం జిల్లా పీడీ పోలప్పను హనుమంతరావు ఫోన్లో సంప్రదించారు. గత ఏడాది కూలి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కూలీల సమస్యను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్పందించిన పీడీ, వెంటనే ఏపీఓకు ఫోన్ చేసి కూలీల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ర్యాలీ నిర్వహించిన కూలీలు ధర్నా అనంతరం కూలీలు ఉపాధి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ముట్టడించారు. దీంతో ఏపీఓ అబ్దుల్లా స్పందిస్తూ, ఈ ఏడాది కూలిడబ్బులను ఈ నెల 30వ తేదీలోపు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గత ఏడాదికి సంబంధించి కూలి సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో మండల మేట్ల సంఘం అధ్యక్షుడు టి.సుధాకర్, కార్యదర్శి ఎల్.లక్ష్మీనరసింహం, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.