S V mohan reddy
-
చంద్రబాబు చెప్పిన తర్వాతే నేను స్పందిస్తా
-
యువ గర్జన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులతో రూపొందించిన ఫ్లెక్సీని పెట్రోల్ పోసి తగలబెట్టారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదోనిలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, ప్రసాదరావు, సన్నీ, ఫయాజ్, సాయిరాంల నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో వైఎస్సార్సీపీ నాయకులు చిన్నవెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు. బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక క్రీడామైదానం నుంచి పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. డోన్‌లో స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు, గుల్షన్ నాయకత్వంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్మారం సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ ఫ్లెక్సీని తగలబెట్టి దహనం చేశారు. మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్యల ఆధ్వర్యంలో కర్నూలు-రాయచూరు రహదారిని దిగ్బంధించారు. నంద్యాలలో పట్టణ కన్వీనర్ మల్లికార్జునశెట్టి, సుభాన్, వడ్డె శ్రీను, మనోజ్‌ల నాయకత్వంలో పద్మావతి నగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మాచారి నాగరాజు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్, బలరాంల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి విద్యార్థులు మద్దతు ప్రకటించారు. సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. - న్యూస్‌లైన్, కర్నూలు -
జాతీయ రహదారుల దిగ్బంధం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉదృతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా బుధ, గురువారాల్లో జాతీయ రహదారులను దిగ్భందించాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆ మేరకు జిల్లా నాయకులు సిద్ధమవుతున్నారు. ఆళ్లగడ్డ, నంద్యాల, పాణ్యం, డోన్, కర్నూలు పరిధిలోని జాతీయ రహదారులతో పాటు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లోని రహదారులను సైతం స్తంభింపజేయాలని స్థానిక నేతలు నిర్ణయించారు. ఇందుకోసం రెండు రోజులుగా కార్యకర్తలతో విసృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలతో సోమవారం సంప్రదించారు. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ రహదారులను దిగ్భందించాలని సూచించారు. బుధవారం ఉదయం నుంచి 48 గంటల పాటు ఈ దిగ్బంధాన్ని కొనసాగించాలని వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ఏపీఎన్జీఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు, వ్యాపారులు, రైతులు కలసి రావాలని కోరారు. అదేవిధంగా ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిదని.. రైతులు కూడా పంట దిగుబడుల విక్రయాలను మంగళవారం ముగించుకోవడం, లేదా శుక్రవారానికి వాయిదా వేసుకుని ఉద్యమానికి ఊతమివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలాఉండగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి స్థానిక నేతలు, కార్యకర్తలతో ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు. కర్నూలులో ఎస్వీ మోహన్‌రెడ్డి నగరంలో వార్డుల వారీగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపైన ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను స్తంభింపజేయనున్నారు. అదే విధంగా డోన్ పరిధిలో బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి, పాణ్యం గౌరు చరిత, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆదోనిలో సాయిప్రసాద్‌రెడ్డి, పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి, ఆత్మకూరు పరిధిలో బుడ్డా రాజశేఖరరెడ్డి, బనగానపల్లిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, ఆలూరు పరిధిలో గుమ్మనూరు జయరాం, నందికొట్కూరు పరిధిలో ఐజయ్య, బండిజయరాజ్, శివానందరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్భందించనున్నారు.