యువ గర్జన
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
కర్నూలులో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సోనియాగాంధీ, కిరణ్‌కుమార్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులతో రూపొందించిన ఫ్లెక్సీని పెట్రోల్ పోసి తగలబెట్టారు.
వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆలూరులో నియోజకవర్గం సమన్వయకర్త గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆదోనిలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ మధుసూదన్, ప్రసాదరావు, సన్నీ, ఫయాజ్, సాయిరాంల నాయకత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆళ్లగడ్డలో వైఎస్సార్‌సీపీ నాయకులు చిన్నవెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్మించారు.
బనగానపల్లెలో నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులు స్థానిక క్రీడామైదానం నుంచి పెట్రోల్ బంకు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.
డోన్‌లో స్థానిక నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు, గుల్షన్ నాయకత్వంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ధర్మారం సుబ్బారెడ్డి కార్యాలయం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ ఫ్లెక్సీని తగలబెట్టి దహనం చేశారు.
మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తనయుడు, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్‌రెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, సర్పంచు తెల్లబండ్ల భీమయ్యల ఆధ్వర్యంలో కర్నూలు-రాయచూరు రహదారిని దిగ్బంధించారు.
నంద్యాలలో పట్టణ కన్వీనర్ మల్లికార్జునశెట్టి, సుభాన్, వడ్డె శ్రీను, మనోజ్‌ల నాయకత్వంలో పద్మావతి నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మాచారి నాగరాజు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు షరీఫ్, బలరాంల నాయకత్వంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి విద్యార్థులు మద్దతు ప్రకటించారు. సోమప్ప సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. - న్యూస్‌లైన్, కర్నూలు