sabitaindra reddy
-
సీఎం పరిశీలనలో డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల నియామకం కోసం తెలంగాణలో త్వరలో డీఎస్సీ వేసే అంశం సీఎం పరిశీలన లో ఉందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. లాక్డౌన్ కారణంగా గతేడాది పది, ఇంటర్ విద్యార్థులను పరీక్ష లేకుండానే పాస్ చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దూరదర్శన్, డిజిశాట్ ద్వారా 85 శాతం విద్యార్థులకు పాఠాలు బోధించామన్నారు. ఇటీవల హైదరాబాద్ వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి కొత్తవి ఇచ్చామన్నారు. రాష్ట్రంలో గురుకులాలు, మోడల్, కేజీబీవీ విద్యార్థులు అన్ని ప్రవేశపరీక్షల్లో జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. వర్సిటీల్లో వీసీల నియామకాలు చేస్తామన్నారు. డీఎస్సీ అంశం సీఎం పరిధిలో ఉందని, ఆయన పరిశీలిస్తున్నారని అన్నారు. ప్రైవేటు టీచర్ల జీతాలపై తిరుపతిరావు కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కరోనా ముప్పు పోలేదు: ఈటల ‘ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. తప్పకుండా త్వరలోనే ఖాళీలను భర్తీ చేస్తాం. సిద్దిపేట, నల్లగొండ తదితర తొమ్మిది మెడికల్ కాలేజీల్లో నిమ్స్, గాంధీ ఆసుపత్రుల స్థాయి సేవలందిస్తాం. నేరుగా పెద్ద ఆసుపత్రులకు రాకుండా పీహెచ్సీ, జిల్లా తరువాత నిమ్స్, గాంధీకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. దేశంలో కుటుంబ నియంత్రణలో ముందున్నాం. వ్యాక్సినేషన్లో 96 శాతంతో ముందంజలో ఉన్నాం. కోవిడ్ నియంత్రణలో దేశంలో తొలిమూడు స్థానాల్లో నిలిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. రెండోసారి సోకే ప్రమాదముంది. మాస్కులు, టెస్టులు, వెంటిలేటర్లు, మందులు దేనికీ కొరత లేదు. 5 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి’అని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సభ్యులకు సమాధానమిచ్చారు. డీఎస్సీ నిర్వహించాలి హైదరాబాద్:ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయని, విద్యా బోధనలో నాణ్యత పడి పోకుండా వచ్చే జూన్‌లోగా ప్రత్యేక డీఎస్సీ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాలని టీఆర్ఎస్ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య సిబ్బందిని తిరిగి నియమించాలని సూచించారు. విద్య, వైద్యం, పురపాలక, ఆబ్కారీ, అటవీ, దేవాదాయ తదితర శాఖల 2021–22 వార్షిక బడ్జెట్ పద్దులపై బుధవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు అధికార, విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడారు. మధ్యాహ్న భోజనం పెండింగ్ బిల్లులు చెల్లించాలని సండ్ర కోరారు. జూనియర్ కళాశాలలు లేని మండల కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులపై ప్రభుత్వ నియంత్రణ ఉండే విధానం తీసుకురావాలన్నారు. ఎంఈఓ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. జిల్లా, మండల కేంద్రాల్లో విలేకరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులు వస్తున్నారని, ఎవరు జర్నలిస్టులనేది ప్రభు త్వం నిర్వచించాలన్నారు. టీఆర్టీ పోస్టులకు ఎంపికైన 250 మందిని పక్కనపెట్టారని, వీరిలో అర్హులను గుర్తించి ఉద్యోగాల్లో నియమించాలని రఘునందన్‌రావు కోరారు. ప్రతి నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాన్ని సత్వరం పూర్తిచేసి స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలన్నారు. కరోనా నేపథ్యంలో గాంధీ, టిమ్స్, జిల్లా ఆస్ప త్రుల్లో నియమించిన తాత్కాలిక పారా మెడికల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వేతనాలు పెంచాలన్నారు.ధూపదీప నైవేద్యాల పథకం కింద ఇస్తున్న నిధులను పెంచాలన్నారు. ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన దేవాలయ, వక్ఫ్ భూములను తిరిగి ఆయా సంస్థలకు అప్పగిం చాలని సూచించారు. కిడ్నీ రోగుల అవసరాలను తీర్చడానికి డయాలసిస్ కేంద్రాల్లో పరికరాల సంఖ్య పెంచాలని సంజయ్ సూచించారు. -
Telangana: నేటి నుంచి బడి బంద్..
ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి జరగాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా ప్రథమ, నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) ప్రకటించింది. మిగతా సెమిస్టర్ల వారికి ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని ఆదేశించింది. జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు తమ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని ఆదేశించాయి. అయితే సెమిస్టర్, సప్లిమెంటరీ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించాయి. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ కూడా తమ పరిధిలో పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని వెల్లడించింది. ఇంటర్మీడియట్లో వచ్చే నెల ఏడో తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. విద్యాసంస్థల మూసివేత నేపథ్యంలో ప్రాక్టికల్స్ వాయిదా పడే పరిస్థితి ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కరోనా కేసులు పెరిగితే.. ప్రాక్టికల్స్‌కు బదులుగా ఇంటర్నల్ అసెస్మెంట్తో మార్కులు వేసే పరిస్థితి ఉండొ చ్చని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా విస్తృతి నేపథ్యంలో విద్యాసంస్థలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని నాలుగు రోజుల కిందట సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు. పద్దులపై చర్చ సందర్భంగా మంత్రులు సమాధానం చెప్తున్న సమయంలో అత్యవసర ప్రకటన ఉం దంటూ స్పీకర్ పోచారం వెల్లడించారు. ఆ వెంటనే సబితారెడ్డి స్కూళ్లు, కాలేజీల మూసివేతకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ‘‘దేశంలో మరోసారి కరోనా తీవ్రంగా వ్యాపి స్తోంది. మన పొరుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలోని విద్యాసంస్థల్లోనూ చెదురుమదురుగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సామూహికంగా జరుగుతాయి. దానివల్ల కరోనా విజృంభించే ప్రమాదం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు విద్యాసంస్థలను మూసివేశాయి. మన రాష్ట్రంలోనూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కరోనా వ్యాప్తి విషయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయాలని విజ్ఞప్తులు వచ్చా యి. ఈ పరిస్థితులను సంపూర్ణంగా సమీక్షించిన మీదట.. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం ముందుజాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నింటినీ బుధవారం (24 మార్చి) నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య కళాశాలలు మినహా.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలకు వర్తిస్తాయి. విద్యార్థులకు గతంలో నిర్వహించినట్టుగా ఆన్లైన్ శిక్షణ తరగతులు కొనసాగుతాయి..’’ అని సబితారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని ఆమె కోరారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజేషన్ తదితర జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యక్ష బోధన ప్రారంభమై 50 రోజులు కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం 2020 మార్చిలో విద్యా సంస్థలను మూసివేసింది. చాలా వరకు పరీక్షలను కూడా రద్దు చేసి, విద్యార్థులను ప్రమోట్ చేసింది. తర్వాత జూన్‌లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కూడా వాయిదా పడింది. చివరికి విద్యార్థులు నష్టపోతున్నారనే ఆలోచనతో.. గతేడాది సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్/ డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించింది. చాలా వరకు కార్పొరేట్, పెద్ద ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ విద్యా బోధన చేపట్టగా.. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలను (టీశాట్, దూరదర్శన్ పాఠాలు, యూట్యూబ్‌లో వీడియో పాఠాలు) పాఠాలను ప్రారంభించారు. సాధారణ స్కూళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలలకు అమలుచేసిన డిజిటల్ పాఠాలనే విద్యార్థులకు సూచించాయి. ఇలా ఐదు నెలలు కొనసాగాయి.కరోనా నిబంధనల్లో చాలా వరకు సడలింపులు ఇవ్వడం, సాధారణ జనజీవనం మొదలుకావడం, ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇవ్వాలని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒత్తిడి తేవడంతో.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకుంది. కాలేజీల్లో అన్ని కోర్సులకు, స్కూళ్లలో 9, 10 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించవచ్చని ఫిబ్రవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాజమాన్యాలు స్కూళ్లు, కాలేజీలు తెరిచాయి. తర్వాత అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారికి కూడా ప్రత్యక్ష బోధన మొదలైంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఫీజులు కూడా వసూలు చేసుకున్నాయి. కానీ మళ్లీ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో విద్యాసంస్థల మూసివేతకు సర్కారు నిర్ణయం తీసుకుంది. అన్నింటిలో ఆన్లైన్ తరగతులనే కొనసాగించాలని ప్రకటించింది. టెన్త్, ఇంటర్ పరీక్షలపై తర్వాత నిర్ణయం విద్యాసంస్థల మూసివేతపై అసెంబ్లీలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన అనంతరం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి అనుగుణంగా పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన కూడా డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల బంద్‌కు సంబంధించి చర్యలు చేపట్టాలని సూచించారు. అయితే గతంలో ఆన్లైన్ విద్యా బోధన నిర్వహించినపుడు ప్రభుత్వ టీచర్లు, కాలేజీల లెక్చరర్లు రొటేషన్ పద్ధతితో 50 శాతం చొప్పున హాజరయ్యారు. ఇప్పుడు వారి విషయంలో స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం మే ఒకటో తేదీ నుంచి ఇంటర్, అదే నెల 17వ తేదీ నుంచి టెన్త్ వార్షిక పరీక్షలు జరగాల్సి ఉంది. వీటిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివేస్తున్నామని.. టెన్త్, ఇంటర్, ఇతర పరీక్షల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆయా పరీక్షలకు ఇంకా సమయం ఉందని చెప్పారు. -
బతుకుదెరువు తెలంగాణ కావాలి
తమ్మినేని వీరభద్రం ఇబ్రహీంపట్నంరూరల్/మహేశ్వరం: బంగారు తెలంగాణ కాదు.. బతుకుదెరువు ఉన్న తెలంగాణ కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన మహాజన పాదయాత్ర సోమవారం రంగారెడ్డి ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్, ఎంపీ పటేల్‌గూడ, కొంగర కలాన్ గ్రామాల్లో పూర్తి చేసుకొని, మహేశ్వరం మండలం రావిర్యాల, తుక్కుగూడ గ్రామాల్లో ప్రవేశించింది. పాదయాత్ర బృందానికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సామాజిక న్యాయం-తెలంగాణ సమగ్రాభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే సీఎం కేసీఆర్ చౌకబారు విమర్శలు చేస్తున్నారని అన్నారు. 92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీలు బాగుపడకుండా రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ఏమాత్రం అందడం లేదని, గ్రామీణ ప్రజలు టీఆర్ఎస్ పాలన, కేసీఆర్‌పై ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు విద్య, ఉపాధి వస్తుందని కలలు కంటే అవి కలలుగానే మిగిలిపోయాయన్నారు. కొంగర కలాన్, అదిభట్ల గ్రామాల్లో ప్రజల వద్ద నుంచి ప్రభుత్వం వందలాది ఎకరాల భూములను కారుచౌకగా తీసుకుందని, ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి మాట తప్పిందని అన్నారు. కొంగరకలాన్‌లో రైస్‌హబ్‌కు బదులు సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట కాలువలు, కట్టలను కబ్జా చేస్తున్నా పట్టించుకునే నాథుడేలేడన్నారు. మహేశ్వరం మండలంలోకి ప్రవేశించిన పాదయాత్రకు పీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని ఆమె విమర్శించారు. కార్యక్రమంలో ప్రజావేదిక కన్వీనర్ చంద్రకుమార్, లంబడా హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ఎన్నికల వేళ.. ‘పుర’పోరు గోల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాధారణ ఎన్నికల ముంగిట్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఆయా పార్టీల నేతలను ఆత్మరక్షణలో పడేసింది. శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలనే తపనతో ఏడాది కాలంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న ఆశావహులకు తాజా పరిణామాలు తలనొప్పిగా మారాయి. వారం, పదిరోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారపర్వాన్ని భుజానెత్తుకోవడం వారి జేబులకు కత్తెర వేయనుంది. రిజర్వేషన్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఊహించని విధంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒకే వార్డుకు పలువురు పోటీపడుతుండడం, వీరిని బుజ్జగించడం వారిని తలకుమించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం తేడా వచ్చిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపుపై ప్రభావం చూపుతుందనే బెంగ వారిని వెంటాడుతోంది. పట్టణ ఎన్నికలు కావడం.. సాధారణ ఎన్నికల ఫలితాలకు ఇవి సంకేతాలని విశ్లేషిస్తున్న తరుణంలో... ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఆరు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే అడ్డగోలుగా డబ్బులు వెదజల్లిన స్థానిక నేతలు.. ఈ ఎన్నికల్లోనే అదే ధోరణిని కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. మున్సిపాలిటీల్లేని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు/ఆశావహులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వీటి ప్రభావం ఉన్నవారు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు నగర పంచాయతీలున్నా యి. కొత్త మున్సిపాలిటీలుగా అవతరించిన పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో అధిపత్యాన్ని కొనసాగించడ ం ఆయా రాజకీయపార్టీలకు సవాలుగా పరిణమించింది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉండడం.. అధికార, ప్రతిపక్ష పార్టీలను కలవరపెడుతోంది. తాండూరు మున్సిపాలిటీ ఎన్నికలు స్థానిక శాసనసభ్యుడు మహేందర్‌రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయనకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. తన ప్రాభవాన్ని కాపాడుకునేందుకు.. రాజకీయ అస్థిత్వం నిలుపుకునేందుకు ఇవి ప్రామాణికంగా మారనున్నాయి. ప్రత్యర్థి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి మహేందర్ హవాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వికారాబాద్ పట్టణ ఎన్నికలు తాజా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రసాద్ పలుకుబడిని దెబ్బతీయడం నైతికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో మంచి ఊపు మీద ఉన్న టీఆర్ఎస్కు సీట్లు దక్కకుండా చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహేశ్వరం సెగ్మెంట్ పరిధిలోని బడంగ్పేట్ నగర పంచాయతీల్లో ఆధిక్యతను కనబరచడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి కూడా ఈ పురపోరు సవాల్‌గా మారింది. దీంట్లో సత్తా చూపితేనే కేడర్‌లో ఉత్సాహం వస్తుందని, ఇప్పటికీ టీ ప్రకటనతో కుంగిపోయిన పార్టీ శ్రేణులు.. ఓటమి పాలైతే నైరాశ్యంలో కూరుకుపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.