Sada Shiva
-
కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో బీటీ రోడ్డు..!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో సరికొత్త మార్పులు, ప్రయోగాలకు సిద్దిపేట కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డు నిర్మాణంలో మరో కొత్త విధానానికి ఇక్కడే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో కాయిర్ జియో టెక్స్టైల్ (కొబ్బరినార) సాంకేతికతతో తొలిసారిగా రోడ్డు నిర్మించడంతో.. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా రోడ్ల నిర్మాణం చేసేటప్పుడు ముందుగా నేలను చదును చేస్తారు. ఆ తర్వాత వివిధ సైజుల్లో ఉన్న కంకరను పొరలు పొరలుగా పోసి రోలర్ సాయంతో తొక్కిస్తారు. ఆ మార్గం గట్టిపడిందని నిర్ధారించుకున్న తర్వాత బ్లాక్‌టేప్ (బీటీ) మిశ్రమంతో రోడ్డును నిర్మిస్తారు. లేదంటే నేరుగా సిమెంట్ రోడ్డును నిర్మించడం ఇప్పటివరకు చూశాం. అయితే, ఇటీవల సిద్దిపేటలో కొత్తగా కొబ్బరినారతో రోడ్డును నిర్మించారు. కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో హుస్నాబాద్‌లో ఉమ్మాపూర్ నుంచి పోతారం(ఎస్) వరకు నాగారం మీదుగా 3.5 కి.మీ. నిడివితో బీటీ రోడ్డు వేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రూ.2.31 కోట్లు కేటాయించారు. అయితే నేషనల్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌ఆర్‌ఆర్‌డీ) సూచనలతో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ విధానంలో తాగి పడేసిన కొబ్బరి బొండాల నుంచి నారును వేరు చేశారు. దీన్ని ఒక మిషన్‌లో వేసి జాలీ మాదిరిగా అల్లారు. ముందుగా నేలను చదునుగా చేసి రోలర్‌తో తొక్కించిన తర్వాత కొబ్బరి నారతో చేసిన జాలీని పరిచారు. దీనిపై 5 అంగుళాల సన్న కంకరను ఒక పొరగా వేసి.. దానిపై 6 అంగుళాల మందంతో కంకరను మరో పొరగా పోసి రోలర్‌తో తొక్కించారు. అనంతరం పై నుంచి బ్లాక్‌టేప్ డాంబర్ వేసి రోడ్డును వేశారు. రాష్ట్రంలో తొలిసారిగా వేసిన ఈ రోడ్డును పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇటీవల పరిశీలించారు. ఇలాంటి రోడ్ల నిర్మాణానికి డబ్బు ఆదా అవుతుందని, నాణ్యత కూడా బాగా ఉంటుందని ఆయన చెప్పారు. ఖర్చు తక్కువ.. సాధారణ రోడ్ల నిర్మాణంలో 9 అంగుళాలు, 6 అంగుళాల మందంతో కూడిన కంకరను వినియోగిస్తారు. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. పైగా రోడ్డు వాడకంలోకి వచ్చాక వాహనాల బరువుతో కలిగే ఒత్తిడి వల్ల 9 అంగుళాల మందమున్న కంకర స్థానభ్రంశం చెంది రోడ్డు కుంగిపోతుంది. ఇలా వచి్చన పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిలుస్తుంది. దీని వల్ల బ్లాక్‌టేప్‌లో ఉండే పటుత్వం తగ్గుతుంది. ఫలితంగా రోడ్డులో గుంతలు ఏర్పడతాయి. అదీగాక, 15 అంగుళాల ఎత్తుతో రోడ్డు నిర్మించడం వల్ల రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల కంటే రోడ్డు ఎక్కువ ఎత్తుగా కనిపిస్తుంది. రోడ్డు నిర్మాణంలో కొబ్బరి పీచు వాడితే నిర్మాణ వ్యయం ప్రతీ కిలోమీటరుకు రూ.2 లక్షల వరకు తక్కువ అవుతుంది. దీంతోపాటు వృథాగా ఉంటూ దోమల పెరుగుదలకు కారణమయ్యే కొబ్బరి బొండాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. రోడ్డుపై వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా హుస్నాబాద్‌లో కాయిర్ జియో టెక్స్టైల్ టెక్నాలజీతో రోడ్డు నిర్మించాం. రోడ్డు పైన పడే వర్షపు నీరు భూమిలోకి వెళ్లకుండా కొబ్బరి పీచులోకి ఇంకుతుంది. తర్వాత ఈ నీరు బయటకు రావడం వల్ల రోడ్డు చాలా రోజులు మన్నికగా ఉంటుంది. గుంతలు పడే అవకాశాలు తక్కువ. ఇదే విధంగా మరిన్ని రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం చెప్పింది. –సదాశివరెడ్డి, డీఈ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ -
పీఎంకే ఎమ్మెల్యేపై వరకట్నం కేసు
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కుటుంబంపై వరకట్నం కేసు నమోదైంది. తనను కొద్దిరోజులుగా వేధిస్తున్నట్లు కోడలు ఇచ్చిన ఫిర్యాదుతో సూరమంగలం మహిళా పోలీసులు మంగళవారం రంగంలోకి దిగారు. వివరాలు.. సేలం జిల్లా మేట్టూరు పీఎంకే ఎమ్మెల్యేగా సదా శివం వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు శంకర్‌కు 2019లో సర్కారు కొల్లపట్టికి చెందిన మనోలియాతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర బిడ్డ ఉంది. ఈ పరిస్థితుల్లో తన భర్త శంకర్, మామ సదాశివం, అత్త బేబి, ఆడపడుచు కలైవాణి వరకట్నం కోసం తీవ్రంగా వేధిస్తున్నట్లు మనోలియా ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబంపై ఆరు సెక్షన్లతో కేసు నమోదైంది. కాగా విచారణకు రావాలని ఎమెల్యేకు మంగళవారం మహిళా పోలీసు స్టేషన్ అధికారులు సమన్లు జారీ చేశారు. -
సదాశివ మాస్టర్ విగ్రహ ఏర్పాటుకు సహకరిస్తా
కాగజ్‌నగర్‌రూరల్ : మహనీయులు, మన ప్రాంతీయులైన దివంగత డాక్టర్ సామల సదాశివ మాస్టరు విగ్రహాన్ని కాగజ్‌నగర్‌లో ప్రతిష్టించేందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక పద్మశాలి భవన్లో అష్టవధాని, విశ్రాంత ఆంగ్ల ఉపన్యాసకులు, కవి, సాహితీ వేత్త, అవధాన కర్త, ముద్దు రాజయ్యకు సదాశివ సాహితి పురస్కారం అందజేసిన సందర్భంలో ఏర్పాటైన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా డాక్టర్ మాడుగుల భాస్కర్ శర్మ వ్యవహరించగా, సమన్వయ కర్తగా తెలుగు సాహితీ సదస్సు కార్యదర్శి పెండ్యాల కిషన్‌శర్మ వ్యవహరించారు. సాహితీ వేత్తలో అణిముత్యాన్ని కోల్పోవడం దురదుష్టాకరమని సదాశివ మాస్టర్ పేరుతో చేపట్టే ప్రతి కార్యక్రమానికి తనవంతు సహకారం ఉంటుందని తెలిపారు. సదాశివ రచనలు అనేకం గౌరవ సలహాదారుడు కె. నారాయణగౌడ్ మాట్లాడుతూ తాను సామల సదాశివ శిష్యునేనని, ఆయన పేరు చిరస్థాయిగా ఉండేందుకు అందరదూ సహకరించాలని కోరారు. సదాశివ మాస్టర్ రచనలు ఐదువందల వరకు ఉన్నాయని వాటిని ముద్రించేందుకు అందరూ సహకరించాలని కార్యదర్శి పెండ్యాల కిషన్ శర్మ అన్నారు. డెప్యూటీ ఈవో పీఎల్ఎన్ చారి మాట్లాడుతూ సదాశివ మాస్టరు సిర్పూర్ తాలుకా దహెగాం మండలం తెనుగుపల్లి నివాసి అని తెలిపారు. సదాశివ మాస్టర్ కుమారుడు శ్రీవర్ధన్ తన ప్రసంగంలో తన తండ్రి శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే హామీ ఇచ్చినందుకు కతజ్ఞతలు తెలిపారు. పీఆర్టీయూ ప్రధాన సంపాదకుడు పర్వతి సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తునప్పటికీ మాతృభాష తెలుగుపై పట్టు సాధించాలని కోరారు. అంతకు ముందు అవార్డు గ్రహీత ముద్దు రాజయ్యను ఎమ్మెల్యేతో పాటు సభలో పాల్గొన్న పలువురు పట్టు శాలువలతో సన్మానించారు. నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సామల సదాశివ కుమారులు రాజవర్ధన్, చంద్రశేఖర్, డాక్టర్ టి. దామోదర్‌రావు, తెలుగు సాహితీ సదస్సు ప్రచార సమితి అధ్యక్షుడు ఎస్. లక్ష్మీ రాజయ్య, ఎంఈవో జి. భిక్షపతి, కటకం మధుకర్, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు సామల రాజయ్య, ఉర్దూ కవి సాబీర్ హుస్సేన్, దయాకర్లతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమ చివరిలో ముద్దు రాజయ్యతో అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
సంకటహరుడుసదాశివుడు
ప్రతిమాసంలోనూ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశికి ‘మాసశివరాత్రి’ అని పేరు. ఆనాడు శివునికి జరిపే అభిషేకాలు, అర్చనలు, విశేష ఫలాన్ని అనుగ్రహిస్తాయి. ఇటువంటి మాస శివరాత్రులు పన్నెండు మాసాలలోనూ పన్నెండు వస్తాయి. వానిలో మాఘ బహుళ చతుర్దశి నాటి శివరాత్రికి విశిష్టత అధికం. అందుకే దీనికి ‘మహాశివరాత్రి’ అని పేరు వచ్చింది. ఆరోజు చేసే పూజాభిషేకాలవల్ల కలిగే పుణ్యం అపరిమితంగా ఉంటుంది. పద్ధెనిమిది పురాణాలలో పది పురాణాలు కేవలం శివుణ్ణే పరమదైవతంగా ప్రస్తుతిస్తే, మిగిలిన అందరు దేవతలకీ కలిపి ఎనిమిది పురాణాలే మిగిలాయని పరమశివాధిక్యాన్ని లెక్కగట్టి మరీ నిరూపించాడు మహాకవి శ్రీనాథుడు. అభిషేకప్రియః శివః: శివునికి అభిషేకం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే తలమీద గంగను ధరించాడేమో! విష్ణువుకి అలంకారం అంటే అధిక ప్రీతి. అందుకే వనమాలా కౌస్తుభరత్నాలు ధరించాడేమో! వాస్తవం పరిశీలిస్తే శివకేశవులకు ఏ విధమైన భేదం లేదనేదే మన పెద్దల సిద్ధాంతం. శివకేశవులే కాదు, బ్రహ్మకూడా వీరి తోటివాడే. అందుకే మహాకవి కాళిదాసు ఇలా అంటాడు. ఒక్క త్రిమూర్తుల విషయమే కాదు, సాత్త్వికుడైన శివభక్తుడు ఎవరు ఏ దేవతను ఉపాసించినా శివుణ్ణి ఉపాసించినట్లే భావిస్తాడు. అందుకే ‘శివ మహిమ్నా స్తోత్రం’లో పుష్పదంతుడు ఈవిధంగా చెప్పాడు: నదులన్నీ చివరికి ఏవిధంగా సముద్రంలో సంగమిస్తాయో, అలాగే మనుషులు వారి వారి సంస్కారాలను బట్టి దేనిని అనుసరించినా, వారి చివరి గమ్యం శివుడే! లింగోద్భవకథ: ఒకసారి బ్రహ్మవిష్ణువులు ఒకచోట చేరి, ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని జబ్బలు చరుచుకున్నారు. అటువంటి సందర్భంలో వారి ముందు ఒక లింగం ఆవిర్భవించిందట. దాని ఆద్యంతాలు తెలుసుకొనడానికి హంసరూపంతో బ్రహ్మ ఊర్ధ్వముఖంగా పైకి, వరాహరూపంతో విష్ణువు అధోముఖంగా కిందికీ ప్రయాణం కట్టారట. ఎంతకాలం ఎంతదూరం సాగినా వారికి ఆ లింగం ఆద్యంతాలు అందలేదట. ఈవిధంగా శివుడు బ్రహ్మవిష్ణువుల అహంకారాన్ని అణచి, అటుపిమ్మట అనుగ్రహించాడట. ఆ శివలింగం ఏనాటి అర్ధరాత్రంలో ఆవిర్భవించిందో అది ‘మహా శివరాత్రి’గా వాడుక అయ్యిందట. శివరాత్రి వ్రతం: ఈనాడు చేయవలసినది వ్రతకార్యం. శివరాత్రికి ముందురోజు ఒంటిపూట భోజనం చెయ్యాలి. శివరాత్రి నాడు తెల్లవారుజామునే లేచి, స్నానం, నిత్యం చేసుకునే సంధ్యావందనాది జపపూజాదులు పూర్తి చేసుకుని, పిమ్మట శివరాత్రి వ్రతాన్ని ఆచరించడానికి సంకల్పించాలి. దీనిని ఇంటివద్దగాని, దేవాలయంలోగాని చేయవచ్చు. ఇంటివద్ద చేసేటప్పుడు నవరత్నాలలో ఏదైనా ఒక రత్నంతోగాని, బంగారం, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, సీసం వంటి లోహాలతోగాని, మట్టితోగాని లింగాన్ని లేదా లింగాలను చేసి అర్చించవచ్చు. ఈ అర్చన, అభిషేకాలు రాత్రివేళ నాలుగు జాములలోనూ చెయ్యాలి, అభిషేకానికి శుద్ధజలం, గంగోదకం, పంచామృతాలు తగినవి. పూజకు బిల్వదళాలు, తుమ్మి, ఉమ్మెత్త, గన్నేరు పువ్వులు మేలయినవి. ఈవిధంగా రాత్రి నాలుగు జాములలోనూ చేసి, జాగరణం ఉండి, ఆ మరునాడు మళ్లీ పూజచేసి, యథాశక్తి దానాలు చేసి, అన్నసంతర్పణ చెయ్యాలి. ఇలా చేస్తే సంసార క్లేశాలు తొలగిపోతాయి. పూర్వం కొందరు షట్కాలలోనూ శివపూజలు చేసేవారు. అలా నిత్యం కాకపోయినా, సంవత్సరానికి ఒకసారయినా, అదీ కాకపోతే జన్మలో ఒకసారి అయినా ఈ వ్రతాన్ని ఆచరించండి అని చెప్పడానికే జన్మానికో శివరాత్రి అనే వాడుక ఏర్పడి ఉంటుంది. - డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ అందుకే ఆ నియమాలు ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు పాటించాలి. ఉపవాసం అంటే భోజనం చేయకుండా ఉండడం అనే అర్థం వాడుకలో ఉంది. అసలు అర్థం భగవంతుని మీద మనస్సు లగ్నం చెయ్యడం అని. మానవుణ్ణి లొంగదీసుకునేవి లోకంలో మూడు విషయాలు. అవి 1. ఆకలి. 2. నిద్ర 3. కామం. ఈ మూడింటికీ లోనుకాకుండా మనస్సును భగవంతుని మీదకు మళ్లించడం గొప్ప సాధన. ఆ సాధనలో ఉన్నత స్థితికి చేరుకోవడానికే ఉపవాసం, జాగరణం, బ్రహ్మచర్యం అనే నియమాలు ఈ వ్రతంలో ఏర్పడ్డాయి. లింగతత్త్వం ‘లింగ్యతే జ్ఞాయతే అనేన ఇతి లింగం’ అని వ్యుత్పత్తి. పరమాత్మ తత్త్వం దీనివల్ల తెలుస్తుంది కనుక ఇది లింగమయ్యింది. వాస్తవానికి పరమాత్మకు రూపం లేదు. అందుకే లింగానికి కరచరణాది అవయవాలు ఉండవు. అయినప్పటికీ ఒక ఆకారం ఉంది కదా, అని ప్రశ్న. ఏదో ఒక విధమైన ఆకారం లేకపోతే భక్తుల ఉపాసనకు ఆలంబన లేకుండా పోతుంది కదా! అందుకే లింగానికి రూపం ఉందా అంటే ఉంది. లేదా అంటే లేదు. సగుణ నిర్గుణ తత్త్వాలకు వారధివంటిదన్నమాట.