saikishore
-
రంజీ క్వార్టర్ ఫైనల్స్.. రెచ్చిపోయిన ఆంధ్ర బౌలర్లు
రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళ (ఫిబ్రవరి 23) మొదలయ్యాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో విదర్భ-కర్ణాటక.. రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై-బరోడా.. మూడో క్వార్టర్స్‌లో సౌరాష్ట్ర-తమిళనాడు.. నాలుగో క్వార్టర్ ఫైనల్లో మధ్యప్రదేశ్-ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. చెలరేగిన ఆంధ్ర బౌలర్లు.. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆంధ్ర బౌలర్ల హవా కొనసాగింది. ఆంధ్ర పేసర్లు ఎంపీ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. శశికాంత్ (4/37), నితీశ్ రెడ్డి (3/50), గిరినాథ్ రెడ్డి (1/40) ధాటికి ఎంపీ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఎంపీ బ్యాటర్లలో యశ్ దూబే (64) అర్దసెంచరీతో రాణించగా.. హిమాన్షు మంత్రి (49), సరాన్ష్ జైన్ (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సరాన్ష్ జైన్‌కు జతగా కుల్వంత్ కేజ్రోలియా (1) క్రీజ్‌లో ఉన్నాడు. సెంచరీతో కదంతొక్కిన అథర్వ తైడే.. కర్ణాటకతో జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. అథర్వ తైడే (109) సెంచరీతో కదంతొక్కగా.. యశ్ రాథోడ్ (93) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. కరుణ్ నాయర్ (30), అక్షయ్ వాద్కర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో కావేరప్ప, కౌశిక్, హార్దిక్ రాజ్ తలో వికెట్ పడగొట్టారు. ముషీర్ ఖాన్ అద్భుత శతకం.. బరోడాతో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ముంబై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (128 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. అతనికి జతగా హార్దిక్ తామోర్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. పృథ్వీ షా 33, ఆజింక్య రహానే 3 పరుగులు చేసి ఔటయ్యారు. బరోడా బౌలర్లలో భార్గవ్ భట్ 4, నినాద్ రత్వ ఓ వికెట్ పడగొట్టారు. ఐదేసిన సాయికిషోర్.. తమిళనాడుతో జరుగుతున్న మూడో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర 183 పరుగులకే ఆలౌటైంది. సాయికిషోర్ (5/33) తన స్పిన్ మాయాజాలంతో సౌరాష్ట్ర పతనాన్ని శాశించాడు. అజిత్ రామ్ 3, సందీప్ వారియర్ 2 వికెట్లు పడగొట్టారు. సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో హార్వక్ దేశాయ్ (83) ఒక్కడే రాణించాడు. సీనియర్ బ్యాటర్ పుజారా (2) విఫలమయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన తమిళనాడు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. విమల్ కుమార్ (5) ఔట్ కాగా.. జగదీశన్ (12), సాయికిషోర్ (6) క్రీజ్‌లో ఉన్నారు. -
Duleep Trophy 2022: సాయికిశోర్‌కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్‌లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్‌నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్‌లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
ఏసీటీఓకు రూ.10 కోట్ల అక్రమ ఆస్తులు
నల్గొండ : నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ సాయికిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో గురువారం ఉదయం నల్గొండ, హైదరాబాద్ లలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. రూ.10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కలిగిఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయికిశోర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు.