Sajivadahanam
-
యూపీలో మరో దారుణం
పాత్రికేయుడి తల్లికి నిప్పంటించిన పోలీసులు బారాబంకీ: ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోరం! జితేంద్రసింగ్ అనే పాత్రికేయుడిని పోలీసులు సజీవదహనం చేసిన ఉదంతం మరువకముందే అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను విడిపించుకునేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లిన ఓ పాత్రికే యుడి తల్లికి పోలీసులు నిప్పంటించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. బారాబంకీ జిల్లా కోథీ పోలీసు స్టేషన్ పోలీసులు స్థానిక హిందీ దినపత్రిక జర్నలిస్టు సంతోష్ తండ్రి అయిన రామ్ నారాయణ్‌ను ఈవ్‌టీజింగ్ కేసులో విచారించాలంటూ శనివారం తీసుకె ళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్‌కు వచ్చిన నీతూను పోలీసులు రూ. లక్ష డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమెను అవమానించి, దుర్భాషలాడి గెంటేశారు. తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితురాలు లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసు స్టేషన్ ఇన్చార్జి రామ్ సాహెబ్ సింగ్ యాదవ్, ఎస్ఐ అఖిలేశ్ రాయ్‌లే తన కు నిప్పంటించారని బాధితురాలు మేజిస్ట్రేట్, మీడియా ముందు వాంగ్మూలం ఇచ్చింది. ‘అందరూ చోద్యం చూస్తున్నారు. నాకెవరూ సాయం చేయలేదు. నాపై పెట్రోల్ చల్లి, అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారు’ అని చెప్పింది. అయితే, బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తల్లికి పోలీసులే నిప్పంటించారని సంతోష్ చెప్పారు. పోలీసులపై మోపిన అభియోగాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన తండ్రిని అక్రమంగా 24 గంటలు నిర్బంధంలో ఉంచుకున్నారన్న కారణంతోనే ఇద్దరు పోలీసు అధికారులనూ సస్పెండ్ చేశారన్నారు. వారిపై హత్య కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని సీఎం అఖిలేశ్ వెల్లడించారు. -
దారుణం
కొల్లాపూర్(కోడేర్): మూఢనమ్మకమనే భూతం జడలు విప్పింది. హైటెక్‌యుగంలో అటవికచర్య చోటుచేసుకుంది. బాణామతి నెపంతో ఓ వ్యక్తిపై కిరోసిన్‌పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. సంచలనం రేకెత్తించిన ఈ ఘటన మంగళవారం మండలంలోని రాజాపూర్‌లో వెలుగుచూసింది. మరో సంఘటనలో చేతబడి నెపంతో మహిళను చితకబాదారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు.. రాజాపూర్ గ్రామానికి చెందిన తెలుగు పాలకొండ రాములు(47), అతని భార్య బాలకిష్టమ్మ సోమవారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికొచ్చారు. ఇదిలా ఉండగా, ఇదే గ్రామానికి చెందిన నంది కుర్మయ్య పెద్దకొడుకు ఆంజనేయులు ఇటీవల మృతిచెందడంతో బాణామతి చేసి మీరే చంపారంటూ రాములును రచ్చకట్ట వద్దకు మంగళవారం ఈడ్చుకెళ్లారు. కుర్మయ్య కులస్తులు కుర్మయ్య, మద్దిలేటి, ఎర్రయ్య, దత్తయ్య, రాములమ్మ, లక్ష్మి, బాగ్యమ్మ, భారతితో అక్కడికి వచ్చారు. వారిలో కొందరు రాములుపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దీంతో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి చికిత్సకోసం కొల్లాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నిందితులను వదిలిపెట్టం : సీఐ ఘటనస్థలాన్ని కొల్లాపూర్ సీఐ రాఘవరావు రాజాపూర్‌కు చేరుకుని విచారించారు. రాములును అమానుషంగా సజీవ దహనం చేసిన నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే సహించేదిలేదన్నారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొల్లాపూర్‌కు తరలించి నిందితులపై కేసునమోదు చేసినట్లు తెలిపారు. సీఐ వెంట కోడేరు ఎస్ఐ వెంకటరమణ, పెద్దకొత్తపల్లి ఎస్ఐ ఉన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలి శాస్త్ర సాంకేతికరంగాల్లో పయనిస్తున్న ఈ రోజుల్లో చేతబడి అనుమానంతో రాజాపూర్‌కు చెందిన తెలుగు రాములును సజీవదహనం చేయడం అత్యంత దుర్మార్గమని, నిందితులను శిక్షించి బాధిత కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు యేసయ్య డిమాండ్ చేశారు. మరో మహిళపై దాడి హన్వాడ (మహబూబ్‌నగర్ క్రైం): బాణామతి నెపంతో ఓ మహిళపై నలుగురు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కోయిల్‌కొండ మండల కేంద్రానికి చెందిన సరోజ హన్వాడ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన కంచిమి వెంకటనర్సమ్మకు గతంలో కొంత నగదును అప్పుగా ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సరోజ అప్పు అడిగేందుకు బుద్దారం వచ్చింది. మధ్యాహ్నం ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వస్తోంది. ఇంతలో వెంకటనర్సమ్మకు బంధువులు అగు బాలమ్మ , చెన్నప్ప, బాలప్ప, మణెమ్మలు తమ పిల్లలకు అనారోగ్యానికి గురైయ్యారని ఇందుకు సరోజ తన పిల్లలకు చేతబడి చేసిందని అనుమానిస్తూ ఆమెను గ్రామంలోనే పట్టుకుని చితకబాదారు. దీంతో గ్రామస్తులు కలుగజేసుకుని పోలీసులకు సమాచారమందించారు. బాధితురాలు సరోజ ఫిర్యాదుమేరకు దాడిచేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్సకోసం బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ బాలునాయక్ తెలిపారు. -
కూతుళ్లతో తల్లి ఆత్మాహుతి
ప్యారిస్, న్యూస్‌లైన్: భర్త మద్యం అలవాటుతో జీవితంపై విరక్తి చెంది, కన్న కుమార్తెలను సజీవ దహనం చేసిన తల్లి, ఆత్మాహుతి చేసుకున్న సంఘటన తిరుచ్చిలో శుక్రవారం కలకలం రేపింది. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని పుత్తనై పక్కన ఉన్న కంబిలంపట్టికి చెందిన ముత్తళగు (34) బోర్వెల్ బండిలో పని చేస్తున్నాడు. ఇతనికి మీనా (28)తో వివాహమై 8 సంవత్సరాలు అవుతోంది. వీరికి ఇప్పటికే ముగ్గురు కుమార్తెలు సరస్వతి (7), సత్య (3), ధనలక్ష్మి (1) ఉన్నారు. వీరిలో సరస్వతి వడక్కు ఇలయపట్టిలో రెండో తరగతి చదువుతోంది. సత్య ఆ ప్రాంతంలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళుతోంది. ఇప్పుడు మళ్లీ మీనా గర్భవతి అరుుంది. అరుుతే ముత్తళగు మద్యానికి బానిసై రోజు రాత్రి ఇంటికి తాగి వచ్చి మీనాతో గొడవకు పడేవాడు. అంతేగాకుండా లైంగిక, శారీరక వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఈ స్థితిలో ఇటీవల ముత్తళగుకు చేతికి గాయం ఏర్పడడంతో పనికి వెళ్లడం లేదు. ఆదాయం లేక మీనా కుటుంబాన్ని పోషించేందుకు తీవ్రంగా పోరాడుతూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ముత్తళగు మద్యం తాగి, ఇంటికి వచ్చి మీనాతో గొడవపడ్డాడు. అనంతరం శుక్రవారం వేకువజామున ఇంటిలో నుంచి ముత్తళగు బయటకు వెళ్లిపోయాడు. భర్త ప్రవర్తనతో జీవితంపై విరక్తి చెందిన మీనా ఉదయం 7.30 గంటల సమయంలో ముగ్గురు కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పు అంటించింది. ఆ తర్వాత తనపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. దీంతో మంటలకు తట్టుకోలేక అందరూ పెద్దగా గావు కేకలు పెట్టారు. వారి కేకలు విని ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకున్నారు. అరుుతే సంఘటనా స్థలంలోనే మీనా, సరస్వతి, సత్య మృతి చెందారు. ప్రాణాలతో పోరాడుతున్న ధనలక్ష్మిని మనప్పారై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ చిన్నారి చికిత్స పొందుతున్నప్పటికీ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదం నింపింది.