Salar Jung Museum
-
సాలార్జంగ్ మ్యూజియంలో ఆద్య కళల ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 20 మ్యూజియంలు
-
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
-
సాలార్ జంగ్ మ్యూజియం అరుదైన ఆఫర్స్ : అందరికీ ప్రవేశం ఉచితం
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మ్యూజియం సాలార్ జంగ్ మ్యూజియం సందర్శకులకు ఒక బంపర్ ఆఫర్. అంతర్జాతీయ మ్యూజియం డే ని పురస్కరించుకుని కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లా పెద్దా అంతా ఉచితంగా మ్యూజియాన్ని సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. అంతేకాదు ప్రత్యేక వర్క్‌షాప్‌లు, పెయింటింగ్స్ ఎగ్జిబిషన్, ఫోటోగ్రఫీ పోటీలను కూడా ఏర్పాటు చేసింది. మే 16వ తేదీ నుంచి 21 తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల వివరాలను నిర్వాహకులు మీడియాకు వెల్లడించారు. ‘ఇంటర్నేషనల్ మ్యూజియం డే’ 1977 నుండి ప్రతి సంవత్సరం మే 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం డేని నిర్వహిస్తున్నారు. సమాజ అభివృద్ధిలో మ్యూజియంలు ఎంత ముఖ్యమైనవో అవగాహన కల్పించే లక్ష్యంతో అంతర్జాతీయ మ్యూజియమ్స్ కౌన్సిల్ (ఐకామ్) ఈ పిలుపు నిచ్చింది. 2022లో ‘పవర్ ఆఫ్ మ్యూజియమ్స్’ అనే థీమ్‌తో ఈ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల్లో పాల్గొంటాయి. గత సంవత్సరం, సుమారు 158 దేశాల్లో 37వేలకు పైగా మ్యూజియంలు ఈ వేడుకల్లో పాలు పంచుకున్నాయి. 75 వసంతాల ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలో కేంద్రం, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ డా.నాగేందర్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియంలో కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయని తెలిపారు. అలాగే రాత్రి 9 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మ్యూజియంను తెరిచి ఉంచుతామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించు కోవాలని తెలిపారు. భవిష్యత్తులో కూడా రాత్రి తొమ్మిదిగంటల వరకు మ్యూజియం సందర్శన అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు సెల్ఫీలు లేదా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా సెల్పీ, ఫోటో పాయింట్లను ఈ సందర్భంగా లాంచ్ చేయనున్నామని చెప్పారు. మ్యూజియాన్ని సందర్శించేలా దివ్యాంగులు, అనాథ విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని ఆయన వెల్లడించారు. ఉత్సవాల చివరి రోజైన 21వ తేదీన వివిధ విదేశీ కార్యాలయాల ప్రతినిధులు కూడా మ్యూజియాన్ని సందర్శిస్తారని నాగేందర్ చెప్పారు. అలాగే చక్కటి పెయింటింగ్స్‌తో ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంటుందని హైదరాబాద్ ఆర్ట్ అసోసియేషన్ సెక్రటరీ రమణారెడ్డి వెల్లడించారు. ఈ సెలబ్రేషన్స్‌లో విజేతలకు క్యాష్ అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. ఆరు రోజుల ఉత్సవాల్లో భాగంగా 18వ తేదీ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. మ్యూజియం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న పోటీదారులు ఒక్కొక్కరు 25 దాకా ఎంట్రీలను పంపవచ్చన్నారు. భాగ్య నగర్ ఫోటో ఆర్ట్ క్లబ్ సౌజన్యంతో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సిగ్మా అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ సెక్రటరీ కే జనార్థన్ తెలిపారు. వీటితో పాటు ఇంటాక్ కన్వీనర్ అనురాధారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు ప్రత్యేకమైన బిద్రి ఆర్ట్‌పై ప్రసంగిస్తారని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రివెంటివ్ కన్జర్వేషన్ మీద ఒక వెబ్‌నార్ నిర్వహిస్తామని కూడా వెల్లడించారు. కాగా హైదరాబాద్‌లోని సాలార్ జంగ్ మ్యూజియం భారతదేశంలో మూడో అతిపెద్దది. ఈ మ్యూజియం ప్రపంచంలోని విభిన్న యూరోపియన్, ఆసియా, దూర ప్రాచ్య దేశాలకు కెందిన కళాత్మక వస్తువుల భాండాగారం. ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన విలువైన వస్తువులు, అరుదైన కలాఖండాలు ఇక్కడ కొలువు దీరాయి. ముఖ్యంగా ఈ మ్యూజియంలో గంటల గడియారం ఒక పెద్ద ఆకర్షణ. ఇంకా మేలిముసుగు రెబెక్కా, స్త్రీ-పురుష శిల్పం, ప్రధానంగా చెప్పు కోవచ్చు. ఇంకా అలనాటి అపురూప కళాఖండాలు, ఏనుగు దంతాల కళాకృతులు, పాలరాతి శిల్పాలు, బొమ్మలు, వస్త్రాలు, చేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు, చెస్ బోర్డులు ఇలా చాలానే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సాలార్ జంగ్ మ్యూజియంలోని విశేషాలను కనులారా వీక్షించండి. -
సాలార్జంగ్ మ్యూజియంలో రౌడీషీటర్ల మేళా
సాక్షి, హైదరాబాద్: దీర్ఘ కాలంపాటు ఎలాంటి నేరాలు చేయకుండా బుద్ధిగా మెలిగిన 31 మంది రౌడిషీటర్లపై ఉన్న రౌడీషీట్లను పోలీసులు క్లోజ్ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. పాతబస్తీ సౌత్ జోన్ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన రౌడీషీటర్ల మేళా సాలార్ జుంగ్ మ్యూజియంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ... పాతబస్తీలో సత్ప్రవ్తన కలిగి నేరాలకు దూరంగా ఉన్న 31 మంది రౌడీ షీటర్ల పేర్లను పోలీస్ రికార్డుల్లోంచి తొలగించాం. వీరంతా కొత్త జీవితాన్ని గడిపేందుకు అవకాశం కలిపించాం. గతంలో వీరంతా తప్పులు, నేరాలు చేసి జైలుకి వెళ్లిన వారు. కానీ, ఇప్పుడు బుద్ధిగా ఉంటున్నారు. వీరిపై ఉన్న రౌడీషీట్లు తొలగిపోవడంతో అందరికీ ఆదర్శంగా ఉంటూ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుతున్నా. సమాజంలో మంచిగా మెలగండి. బాధ్యతగా ప్రవర్తించండి. తిరిగి ఎలాంటి నేరాలకు పాల్పడినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మళ్లీ జైలుకు వెళతారు’అని సీపీ పేర్కొన్నారు. -
మ్యూజియంలూ, కళాఖండాలపైనా నిర్లక్ష్యమే..!
హైదరాబాద్ రాష్ట్రం 1956లో రాష్ట్ర విభజనకు ముందు వస్తుప్రదర్శన శాలలు, పురాతన కళాఖండాలకు పెట్టింది పేరుగా ఉండేది. హెదరాబాద్ స్టేట్ మ్యూజియం, హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం దేశంలోనే పేరుగాంచాయి. అయితే 1956లో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత, తెలంగాణ ప్రాంతంలోని పురావస్తు ప్రదర్శనశాలల పరిరక్షణ, విస్తరణపై ఆంధ్రా పాలకులు ఎలాంటి శ్రద్ధా పెట్టలేదు. తెలంగాణ 2 వేల ఏళ్ల క్రితం శాతవాహనులు పాలించిన ప్రాంతంగా ఉండేది. వీరి తర్వాత అనేక రాజవంశాలు ఈ ప్రాం తాన్ని క్రీ.శ. 1948 వరకు పాలించాయి. శాతవాహనుల నుంచి 1948లో ముగిసిన అసఫ్ జాహి పాలన వరకు 2 వేల ఏళ్లకుమించి సంక్షుభిత చరిత్రను కలిగి ఉన్నప్పటికీ, తెలంగాణలో అనేక చారి త్రక స్థలాలు, పురాతన కళాఖండాలు ఉన్నాయి. వీటిలో కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల, పెద్దబంకూరు, ధూళికట్ట... మెదక్ జిల్లా లోని కొండాపూర్ ప్రాచీన చరిత్రలో పేరెన్నిక గన్నవి. అయితే ఈ ప్రాంతాలన్నింటిలోనూ పురావస్తు తవ్వకాలపై ఆంధ్రా పాలకులు ఏమంత శ్రద్ధ చూపలేదు. దీనితో తెలంగాణ ప్రజల ఉనికి, వారసత్వం ఈ ప్రాంతాల్లోని, భూమి పొరల్లోనే ఉండిపోయాయి. బ్రిటిష్ పాలనా కాలంలో భారత్‌లోని పలు నగరాల్లో -కోల్‌కతా, పట్నా, బాంబే, మద్రాస్- పురావస్తు ప్రదర్శన శాలల స్థాపన ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం వాటికి ఎనలేని ప్రాధాన్య మిచ్చింది. క్రీ.శ. 1814లో స్థాపించిన కోల్‌కతా మ్యూజియం దేశంలో ప్రాచీనమైనది. ఈ కాలంలోనే బరోడా, మైసూర్, ట్రావెన్కోర్, హైదరాబాద్ వంటి పలు సంస్థానాలు కూడా తమ తమ సంస్థానాల్లో పురావస్తు ప్రదర్శన శాలలను స్థాపించాయి. హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం సుప్రసిద్ధమైనది. అన్ని రంగాలకు సంబంధించి ఒకే ఒక్క వ్యక్తి సేకరించి అపురూప వస్తువులతో, కళాఖండాలతో దీన్ని నెలకొల్పారు. ప్రపంచంలోనే ఇంతటి విశిష్ట, అరుదైన మ్యూజియం లేదు. అలాగే హైదరా బాద్‌లోని బిర్లా మ్యూజియం కూడా ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలు అనేక మ్యూజియం లను (మహారాష్ట్ర (22), తమిళనాడు (14), కేరళ (15), పశ్చిమ బెంగాల్ (12) స్థాపించాయి. కానీ గత ప్రభుత్వాలు మ్యూజి యంల స్థాపనకు చొరవ తీసుకోకపోవడంతో వీటితో పోలిస్తే చాలా ఆంధ్రప్రదేశ్ వెనకబడింది. 1980 తర్వాతే ఏపీ ప్రభుత్వం వివిధ జిల్లాల్లో పురావస్తుప్రదర్శన శాలల ఏర్పాటుకు నిర్ణయిం చుకుంది. ఈ పథకం కింద తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మ్యూజియంలు స్థాపించారు. అయితే ఇవన్నీ సరైన సామగ్రి, నిర్దిష్ట భవనాల లేమిని ఎదుర్కొన్నాయి. నిజామాబాద్ మ్యూజియం మూడేళ్లలోపే మూలబడింది. పైగా వీటికి శాశ్వత సిబ్బంది లేరు. మూడు జిల్లాలకు ఒక అసిస్టెంట్ డెరైక్టర్ ఇన్ చార్జిగా ఉన్నప్పటికీ ఈయన ప్రధాన కార్యాలయం హైదరా బాద్‌లో ఉంది. ఈ స్థితిలో ఈ మ్యూజియం అభివృద్ధి, విస్తరణకు అవకాశమే లేకుండా పోయింది. తెలంగాణలో పురావస్తు తవ్వకాలకు సంబంధించి గతంలో ఎలాంటి చర్యా చేపట్టలేదు. పైగా 1992 నుంచి పురావస్తు శాఖకు శాశ్వత డెరైక్టర్లు లేరు.ఇతర విభాగాల నుంచి వీరిని డిప్యుటేషన్ కింద తీసుకొచ్చారు. దీంతో అర్హత, అనుభవం లేని ఇతరులు పురావస్తుశాఖ డెరైక్టర్ పదవులను చేపట్టారు. ఇక ప్రధాన కార్యాల యంలో జాయింట్ డెరైక్టర్ లేరు. ఒకే ఒక డిప్యూటీ డెరైక్టర్ మాత్రమే అన్ని పనులూ చేస్తున్నారు. మరోమాటలో చెప్పాలంటే డిప్యూటీ, అసిస్టెంట్ డెరైక్టర్లకు సంబంధించిన పలు పదవులు, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. పురావస్తు శాఖ పూర్తిగా సాంకేతిక విభాగం. దీనికి ప్రత్యేక అర్హతలు, అనుభవం కలిగిన సంచాలకులు అవసరం. కాబట్టి పురావస్తు శాఖలో దిద్దుబాటు కోసం కింది చర్యలు చేపట్టాలని సూచించడమైనది. 1. పురావస్తుశాఖకు శాశ్వత డెరై క్టర్‌ను నియమించాలి 2. జాయింట్ డెరైక్టర్లు, అసిస్టెంట్ డెరైక్టర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు చెందిన ఖాళీలను పూరించాలి. 3. క్రీ .పూ 250 నుంచి అసఫ్‌జాహీల కాలం వరకు వివిధ కాలాలకు చెందిన 4 లక్షల కంటే ఎక్కువ నాణేలు హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నందున టెక్నికల్ అసిస్టెంట్లకు బిర్లా నషిక్ కాయిన్స్ మ్యూజి యంలో తప్పక శిక్షణ ఇప్పించాలి. 5. అన్ని జిల్లా స్థాయి మ్యూజి యాల్లో పూర్తి కాలం పనిచేసే అధికారులు కావాలి. 6. తవ్వకాల సమయంలో భారీ పురావస్తు ప్రాంతాలు బయటపడిన కోటిలిం గాలలో, కరీంనగర్‌లోని ఇతర ప్రాంతాల్లో స్థల మ్యూజియాలు నెలకొల్పాలి. పై అంశాలన్నీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి కాబట్టి గొప్ప దార్శనికత, కల్పనాశక్తి కలిగిన వారు ఈ శాఖకు మంత్రిగా ఉండటం అవసరం. అలాగే పురావస్తు శాఖకు తగిన కార్యాచరణ పథకం రూపకల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పర్చాలని సూచించడమైనది.ఈ చర్యలను అమలు చేయడం ద్వారానే శాతవాహనులు, కాకతీయ రాజవంశం తెలంగాణకు వదిలిపెట్టి వెళ్లిన మనదైన వారసత్వాన్ని మనం కాపాడి, సంరక్షించుకోగలం. వ్యాసకర్త మాజీ ఎంపీ, నిజామాబాద్ 7702941017 - ఎం. నారాయణ్‌రెడ్డి -
దివాన్ దేవిడీ
దివాన్ దేవిడీ అంటే ప్రధాని అధికార నివాసం అని తెలుగులో సమానార్థంగా చెప్పుకోవచ్చు. అసఫ్‌జాహీ ప్రభువుల ఆస్థానంలో పనిచేసిన పలువురి ప్రధాన మంత్రుల అధికార నివాసం ‘దివాన్ దేవిడీ’. చార్మినార్‌కు వెళ్తుంటే ముందుగా వచ్చే మదీనా హోటల్‌కు ఒక పక్కగా ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చిన్నా, చితక అంగళ్లు కనపడుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో దివాన్ దేవ్డీకి గుర్తుగా అవశేషాలున్నాయి. దేవిడీకి తూర్పు-ఉత్తర దిశలో రెండు పెద్ద సింహద్వారాలున్నాయి. ఈ అధికార నివాసంలో ఆయినా ఖాన్, లఖడ్ కోటా, చీనాఖాన్, నిజాం భాగ్, నూర్ మహల్... ఇలా అందమైన, అపురూపమైన, అద్భుతమైన కట్టడాలు అదృశ్యమయ్యాయి. నిజాం నవాబుల ఆస్థానంలో గొప్ప ప్రతిభా సంపన్నులుగా కీర్తినందుకున్న ప్రధాన మంత్రులు సాలార్జంగ్-1, 2, 3 దివాన్ దేవిడీ నుంచి తమ అధికార హోదాలో సేవలందించారు. కళాసాంసృ్కతిక, ఆర్థిక, రాజకీయ రంగాలల్లో కీలక పాత్ర పోషించారు. మీర్తురబ్ అలీఖాన్, సాలార్జంగ్-1, 3, లు సేకరించిన విశిష్ట కళాఖండాలను దివాన్ దేవిడీలోనే ప్రప్రథమంగా ప్రదర్శించారు. 1968 ప్రాంతంలో మూసీనది తీరంలో సాలార్జంగ్ మ్యూజియం నిర్మాణం జరిగింది. అప్పటిదాకా దివాన్ దేవిడీలోనే సాలార్‌జంగ్‌లు సేకరించిన అపురూపాలు ప్రజలకు అందుబాటులో ఉండేవి. సాలార్జంగ్ మ్యూజియంను కొత్త పరిపాలనా వ్యవహారాలకు, కళాసాంసృ్కతిక వైభవానికి ఈ మ్యూజియంను కొత్త భవనాలకు తరలించారు. నాటి రాజకీయాలకు, నిజాం ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలకు కళాసాంస్కృతిక వైభవానికి దివాన్ దేవిడీలో అసఫ్‌జాహీల పాలనకంటే ముందుగానే 1724లో మొఘల్ చక్రవర్తి తరఫున వైస్రాయ్ (సుబేదార్) హోదాలో నియమించిన ముబారీస్ఖాన్ ఈ భవనాన్ని తన అధికార నివాసంగా ఉపయోగించారని చరిత్రకారులు చెబుతారు. ఆ తర్వాత అసఫ్‌జాహీల ప్రధాన మంత్రిగా పని చేసిన నవాబ్ మీర్ ఆలం, నవాబ్ మునీర్-ఉల్-ముల్క్ దివాన్ దేవిడీలో నివాసమున్నారు. అయితే... రాజనీతిజ్ఞుడుగా కీర్తి గడించిన నిజాం ఆస్థాన ప్రధాని సాలార్జంగ్-1 మీర్ తురభ్అలీఖాన్ పరిపాలనా కాలంలో ‘దివాన్ దేవిడీ’ ప్రతిభ మరింతగా ప్రకాశించిందని చెప్పొచ్చు. సాలార్జంగ్-1, 1853 నుంచి 1883 వరకు ప్రధానిగా పనిచేశారు. సాలార్జంగ్-1 పరిపాలనా కాలంలోనే దివాన్ దేవిడీ పలు విధాల అభివృద్ధి చెందింది. బర్మా టేకుతో చేసిన ‘లక్కడ్కోట’ భవన సముదాయం, నిలువువెత్తు అద్దాలు, షాండిలియర్లున్న ‘ఐనా ఖానాహాలు‘ దివాన్ దేవిడీలో ప్రధాన ఆకర్షణ. ‘ప్యార్ కియాతో డర్నా క్యా’ వంటి కొన్ని హిందీ చిత్రాలు ఇందులోనే చిత్రీకరించారు. సాలార్జంగ్-3... సుమారు 1400 చ.కి.మీ. విస్తీర్ణంలోని ఎస్టేట్‌లో రెండు లక్షల మంది పనిచేసేవారట. ఆనాడే వారి వార్షికాదాయం రూ.15 లక్షలు పైబడి ఉందేది. సాలార్జంగ్-1 మరణానంతరం ఆయన కుమారుడు సాలార్జంగ్-2 మీర్ లాయిక్ అలీఖాన్ (1884-87) తన 23 సంవత్సరాల వయస్సులో నిజాం ఆస్థాన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, కేవలం 27 ఏళ్ల వయసులోనే ఆయన మరణించాడు. అప్పటికి అతని ఏకైక కుమారుడు నెలల పసిగుడ్డు. అతనికి మీర్ యూసుఫ్ అలీఖాన్‌గా పేరు పెట్టారు. మీర్ యూసుఫ్ అలీఖాన్ పాలనా పోషణల బాధ్యతను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ చేపట్టాడు. కళాభిమానిగా, మేధావిగా మీర్ యూసుఫ్ అలీఖాన్ కీర్తి పొందాడు. మీర్ యూసుఫ్ అలీఖాన్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ పాలనా కాలంలో సాలార్జంగ్-3గా నియమితులయ్యాడు. కేవలం రెండేళ్లు (1912-1914) నిజాం ఆస్థాన ప్రధానిగా చేసిన సాలార్జంగ్-3 తన పదవి వదలి దేశ, విదేశీ పర్యటనకు వెళ్లాడు. విలువైన కళాకృతులు సేకరించాడు. బ్రహ్మచారిగా ఉన్న ఆయన కళలు, సాహిత్యం అభివృద్ధికి ఎనలేని సేవ చేశాడు. వ్యక్తిగత హోదాలో సేకరించిన వస్తువుల ప్రదర్శన కేటగిరీలో సాలార్జంగ్ మ్యూజియం నేటికీ ప్రపంచ స్థాయిలోనే మొదటిదని చరిత్రకారుల అభిప్రాయం. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న దివాన్ దేవిడీ నేడు ఎలాంటి ఆలనాపాలనా లేకుండా పోవడం దురదృష్టకరం. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
ఆర్ట్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు గీసిన చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్లో 90 మందికిపైగా ఆర్టిస్టులు గీసిన పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ సోమవారం ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ ఆర్టిస్టులు లకా్ష్మగౌడ్, యక్క యాదగిరి, ఏలె లక్ష్మణ్, శంకర్, అంజూ పొద్దర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు సినీ దర్శకుడు బి.నర్సింగరావు 1987లో తీసిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తెలంగాణ పల్లెల్లోని వాతావరణానికి కళ్లకు కట్టేలా చూపిన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకోసం ఆరు వేల కిలోమీటర్లు చుట్టుముట్టి సుమారు వంద గ్రామాలను కలియ తిరిగానని నర్సింగరావు పాతరోజులను గుర్తుచేసుకున్నారు. -
అలుపెరుగని పర్యాటకురాలు
భారతీయ ప్రాచీన కళలు, సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడే ప్రతిష్టాత్మక సంస్థ పేరు ‘ఇన్టాక్.’ హైదరాబాద్‌లోని వారసత్వ సంపద విశేషాలు తెలుసుకోవడానికి, ఆయా ప్రాంతాలను సందర్శించి వివరాలు సేకరించడానికి ఈ ప్రతిష్టాత్మక సంస్థ ముప్పై ఏళ్ల క్రితం ఓ గృహిణిని ఆహ్వానించింది. తమ సంస్థలో ముఖ్య సభ్యురాలిగా స్థానమిచ్చింది. గృహిణిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తల్లిగా పిల్లల సంరక్షణ చూసుకుంటూనే, ట్రావెలర్‌గా ప్రపంచమంతా పర్యటిస్తూ తనదైన కలను నెరవేర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు తరగని సంపదను కానుకగా ఇస్తున్న ఆమె పేరు పి.అనూరాధా రెడ్డి. కాసేపు ఆమెతో మాట్లాడితే మన జీవితానికీ ఓ కొత్త ప్రయాణమార్గం కళ్లకు కడుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అటు నుంచి ప్రపంచ దేశాల వరకు.. చారిత్రక ప్రదేశాలను సందర్శించి, అపురూపమైన వాటిని కెమరా కన్నుతో వీక్షించడం అనూరాధారెడ్డి ప్రత్యేకత. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి భాష నేర్చుకోవడం ఆమెకున్న మరో ఆసక్తికరమైన అలవాటు. పాతికేళ్ల వయసు నుంచే ఒంటరిగా దేశాలు చుట్టిరావడం, అక్కడి ప్రత్యేకతలను తెలుపుతూ పుస్తకం రూపంలో తీసుకురావడం ఆమె ఒక దైవ కార్యంగా భావిస్తూ వచ్చారు. సాలార్జంగ్ మ్యూజియంలో వారసత్వ ప్రదేశాల వివరాలు తెలిపే ప్రజెంటేషన్స్ ఇస్తుంటారు. చారిత్రక కట్టడాల సంరక్షణకు ఏం చేయాలో ఉపన్యాసాలు ఇస్తుంటారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులను ‘హిస్టారికల్ వాక్’కు తీసుకెళుతుంటారు. ప్రతి ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులకు ఒక ‘హెరిటేజ్ క్లబ్’ ఏర్పాటు చేయాలి అని సూచించే అనూరాధారెడ్డి ‘జీవితమంతా పర్యటనలతో ముడిపడింది’ అంటూ తన ప్రయాణమార్గం గురించి ఇలా వివరించారు... గొప్పతనం తెలియజేయాలని... ‘‘మనం ఇప్పుడు జీవిస్తున్నది ముందు తరాలకు మార్గదర్శనం చేయడానికే అన్నది నా అభిమతం. డిగ్రీ వరకు చదువుకున్న నేను ఉద్యోగాలంటూ ఏమీ ఎంచుకోలేదు. పెళ్లై అత్తవారింట అడుగుపెట్టినా, ఇద్దరు అబ్బాయిలకు తల్లినైనా నా చూపు మన ప్రాచీన సంపద పరిరక్షణ వైపే ఉండేది. హైదరాబాద్‌లో ఎన్నో చారిత్రక కట్టడాలున్నాయి. అవన్నీ నిర్లక్ష్యానికి లోనవుతున్నాయి. వాటి చారిత్రక నేపథ్యం మరుగునపడకూడదని నా తాపత్రయం. అందుకే వాటి గురించి తెలుసుకోవడం, సందర్శించడం, ఫొటోలు తీసి పత్రికలకు అందజేయడం విధిగా పెట్టుకున్నా. ఈ పని ఎంతో మందిని కలిసే అవకాశాన్నిచ్చింది. హైదరాబాద్ ఇన్టాక్ సంస్థకు కన్వీనర్‌నీ చేసింది. పరిశోధక విద్యార్థులకు నా ప్రయత్నం ఉపయోగపడుతున్నందుకు ఆనందిస్తుంటా. ఇదంతా మా అమ్మ నాలో నింపిన స్ఫూర్తి! పొత్తిళ్లలోనే పునాది మా అమ్మ స్నేహలతా భూపాల్. ఆమె తొంభై ఏళ్లకు చేరువలో ఉన్నారు. నాన్న శ్రీరామ్ భూపాల్ (ఆరు నెలల క్రితం మరణించారు) హెచ్.సి.ఎస్ ఆఫీసర్‌గా కొనసాగారు. వారు సిరినపల్లి సంస్థానాధీశులు. ఆ రోజుల్లో అమ్మకి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆసక్తితో లెక్కల టీచర్‌గా, ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేశారు. అమ్మాయిల చదువుపై ఆమె అమితమైన శ్రద్ధ పెట్టేవారు. నన్నూ, తమ్ముడినీ చూసుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాలలో, క్రీడలలో పాల్గొనేవారు. ఆ రోజుల్లోనే బ్యాడ్మింటన్‌లో జాతీయ స్థాయిలో రాణించారు. సంగీతంలో మేటి అనిపించుకున్నారు. మా ఇంట మహిళా జాగృతికి సంబంధించిన చర్చలు జరుగుతుండేవి. అమ్మ, అమ్మమ్మల ధైర్యం, జీవితం పట్ల వారికున్న ఎనలేని గౌరవం ప్రతి దశలో నాకూ స్ఫూర్తిగా నిలిచాయి. వారి నుంచే తెలుగు, తమిళం, ఉర్దూ, మరాఠీ, కన్నడం నేర్చుకున్నా. పర్యటనలతో విదేశీ భాషలు పరిచయమయ్యాయి. అమ్మాయిల పురోభివృద్ధిలో అమ్మ పాత్ర చాలా ఉంటుంది అనడానికి మా అమ్మే ఉదాహరణ. నిరంతర శోధనా భాండాగారం ఐదేళ్ల వయసులో నాన్నగారిచ్చిన చిన్న కెమెరాతో నా శోధన మొదలైంది. నాన్నతో కలిసి ఎన్నో ప్రాంతాలు సందర్శించా. వ్యవసాయం, కళలు, ధనిక, పేద.. - అన్నింటినీ దగ్గరుండి చూశా. విషయాలన్నీ వివరంగా నాకు తెలియజేసేవారాయన. నాటి నుంచి ఎక్కడికెళ్లినా అక్కడి ప్రత్యేకతలు, వాతావరణం, చారిత్రక కట్టడాలు - ఇలా ప్రతి అంశాన్నీ ఫొటోలు, వీడియోలు తీయడం అలవాటుగా మారింది. చారిత్రక అంశాలను క్రోడీకరిస్తూ వ్యాసాలుగా భావితరాలకు అందించడం వ్యాపకమైంది. జగమంత కుటుంబం ఏ దేశానికి వెళ్లినా అక్కడ కొన్ని కుటుంబాలతో అనుబంధం ఏర్పడుతుంది. నలభై ఏళ్ల వయసులో జర్మనీ వెళ్లినప్పుడు అక్కడ స్థానిక రైలులో ప్రయాణిస్తున్నాను. ఒంటరి ప్రయాణం... ఒక స్టేషన్లో ఒక పెద్దావిడ రెలైక్కి, సీట్ కోసం అడిగింది. 90 ఏళ్లుంటాయి ఆమెకు. జర్మన్ భాషలోనే ఆమెకు సమాధానమిస్తూ సీట్ ఇచ్చాను. ఆమె నా వేషధారణ చూసి ఇండియన్ అని గుర్తుపట్టింది. ఆశ్చర్యపోయి, ‘మీరు ఇండియన్. అయినా జర్మన్ భాష బాగా మాట్లాడుతున్నారే’ అంది. అలా ఆమెతో మాట్లాడు తుండగా ‘మీరు మా దేశానికి అతిథిగా వచ్చారు. ఎక్కడ ఉండబోతున్నారు?’అనడిగింది. ఇంకా నిర్ణయించుకోలేదు అని చెప్పాను. ఆవిడ తన కుమారుడి ఇంటికి వెళుతున్నట్టు చెబుతూ నన్నూ రమ్మని ఆహ్వానించింది. నేను తన వెంట వాళ్లింటికి వెళ్లేంతవరకు నన్ను వదల్లేదు. ఆతిథ్యంతో పాటు ఆ ప్రాంతంలో చూడదగిన ప్రాచీన కట్టడాలు, అందమైన ప్రదేశాలన్నింటినీ వారి కుటుంబసభ్యులంతా దగ్గరుండి మరీ చూపించారు. ఇప్పటికీ వారింటి మూడు తరాలతో నాకు అనుబంధం ఉంది. ఆ పెద్దావిడ మరణించేంతవరకు నన్ను బిడ్డగా భావించేది. ఇండియాకు వారు వచ్చినప్పుడు మా ఇంట్లోనే ఉంటారు. మన వంటలు నేర్చుకుంటారు. ఏడాదికి రెండు టూర్లు... ఇప్పుడైతే పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు కానీ వారు పాఠశాల స్థాయిలో ఉన్నప్పుడూ సెలవుల సమయంలో టూర్లు ప్లాన్ చేసుకునేదాన్ని. నా పరిశోధనల కోసమే కాదు, కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకూ ఉత్సాహం చూపేదాన్ని. ఇందుకు నా భర్త జనార్దనరెడ్డి పూర్తి సహకారం అందించేవారు. పన్నెండేళ్ల క్రితం వరకు అయితే ఒంటరిగానే విదేశీ ప్రయాణాలు చేసేదాన్ని. ఆ తర్వాత ఒక ట్రావెల్ గ్రూప్‌ను ఏర్పాటు చేశా. వారితో కలిసి ఇప్పటికీ ఏడాదికి రెండు విదేశీ టూర్లు ఉండేలా ప్రణాళిక వేసుకుంటా. నిజానికి మా గ్రూప్ ఏర్పాటు కూడా గమ్మత్తుగా జరిగింది. ఒకసారి టాంజానియాలోని మా కజిన్ కుమారుడి పెళ్లికి నన్ను ఆహ్వానించారు. అక్కడికి దక్షిణ ఆఫ్రికా దగ్గర కావడంతో ఈ రెండు ప్రాంతాల వారసత్వ సంపదను కూడా చూసి రావాలనుకున్నాను. స్నేహితులు, బంధువులలో ఆసక్తి గలవారు తామూ వస్తామని ఉత్సాహం చూపారు. అలా పన్నెండు మందితో కలిసి కిలిమంజారో, జాంజిబార్ ఐలాండ్, అరుషా, గో రంగోరో నేషనల్ పార్క్, లేక్ విక్టోరియా, నైల్ రివర్ మొదలయ్యే ప్రాతం నుంచి మెడిటేరియన్ వరకు.. ఇవన్నీ ప్లాన్ చేసి మరీ చూసొచ్చాం. తర్వాత్తర్వాత ఈజిప్ట్, టర్కీ, బ్రెజిల్, వియత్నాం, కాంబోడియా, భూటాన్, థాయ్‌లాండ్, చైనా, రష్యా, ఇండొనేషియా, మెక్సికో, బర్మా, దుబాయ్ చూసొచ్చాం. ఇవన్నీ కాలానుగుణంగా ప్లాన్ చేసుకోవడం, వెళ్లి రావడం చేస్తూనే ఉన్నాం. మొదట 12 మందితో మొదలైన గ్రూప్ ఇప్పుడు 40 మందికి చేరింది. మా గ్రూప్‌లో 80 ఏళ్ల వయసున్నవారూ ఉండటం విశేషం!’’ అంటూ తమ పర్యటన అనుభవాలను తెలిపారు ఆమె. టైమ్ గడవడం లేదు అంటూ ఖాళీ చేతులతో కాలాన్ని వెళ్లదీయడం కాదు. భావితరాలకు సుసంపన్నమైన ప్రాచీన భాండాగారాన్ని అందజేయాలి అనే ఆలోచన కలిగించే ఇలాంటి స్త్రీ మూర్తుల కృషి ఎప్పుడూ అనుసరణీయమే! సంభాషణ: నిర్మలారెడ్డి ఏ ప్రదేశానికి వెళ్లినా మనం మాట్లాడే భాష, ఎదుటివారికి ఇచ్చే మర్యాద, అలాగే వారితో స్నేహంగా ఉండటం.. బాగా తోడ్పడతాయి. అయితే, ఒక స్త్రీ గా అప్పుడూ ఇప్పుడూ నా జాగ్రత్తల్లో నేనుంటా. స్వచ్ఛందంగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఓ సూచిక అవుతుందని ఆనందిస్తుంటా. చదువు క్రమశిక్షణను నేర్పుతుంది. తల్లితండ్రులు కొంతవరకు దారి చూపుతారు. ఆ తర్వాత క్రమశిక్షణతో మన దారిని మనమే వెతుక్కుంటూ ముందుకెళ్లాలి. మనిషి ఎప్పుడూ నిత్య విద్యార్థి. నేర్చుకున్నదాంట్లో కొంతైనా భావితరాలకు అందజేయడం ఆ విద్యార్థి కనీస బాధ్యత. నేను చేస్తున్నది అదే. -
రెండు మ్యూజియంల డి జిటైజేషన్ పూర్తి
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియం, నాగార్జునకొండలోని ఆర్కియాలజికల్ మ్యూజియంల డిజిటైజేషన్ పూర్తయినట్టు కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. మంగళవారం ఆ శాఖ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ దేశంలోని 10 మ్యూజియంల డిజిటైజేషన్ వివరాలతో కూడిన పోర్టల్‌ను ప్రారంభించారు. వీటి లో సాలార్జంగ్ మ్యూజియం, నాగార్జునకొండ మ్యూజియం కూడా ఉన్నాయి. -
అంతరంగాల యుద్ధచిత్రం
కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్ 90వ ఏట తాజాగా చిత్రించిన ఒక మహాకుడ్య చిత్రం సాలార్జంగ్ మ్యూజియంలో కొలువై ఉంది. పెయింటింగ్ ఒక్కటే! ఫలకాలు 16. మడతలు 8. ఎత్తు 9 అడుగులు. వెడల్పు 36 అడుగులు. ‘వార్స్ ఆఫ్ ద రెలిక్స్’ అనే ఈ తెలుపు-నలుపుల చిత్రం ప్రత్యేకత ఏమిటి? పికాసో ‘గెర్నికా’ ప్రత్యక్ష యుద్ధాన్ని కళ్లకు కడితే, కేజీ కుడ్యచిత్రం యుగయుగాల మానవ మస్తిష్కాల అంతరంగ యుద్ధాలను ఆవిష్కరించింది. జగమెరిగిన చిత్రకారుడు ఆయన. విద్యార్థి దశలో గాంధీ ప్రభావంతో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ చదువు తర్వాత కోల్‌కతా శాంతినికేతన్లో చేరి చిత్రకారుడిగా ఎదిగారు. మన కళా సంస్కృతులపై పలు పుస్తకాలు రాసి, వాటి వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనాపాటి కె.జి.సుబ్రహ్మణ్యన్. కేరళలోని కలపాతిలో పుట్టిన ఆయన పూర్తి పేరు కలపాతి గణపతి సుబ్రహ్మణ్యన్. ఆధునిక చిత్రకళకు సంబంధించి భారతీయ చిత్రకారుల్లో అగ్రగణ్యుడాయన. భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో సత్కరించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్‌తో సత్కరించింది. తొంభయ్యేళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో కళా సృజన సాగిస్తున్న సుబ్రహ్మణ్యన్ సాలార్జంగ్ మ్యూజియంలో తన చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో ముచ్చట్లు ఆయన మాటల్లోనే... - కె.జి. సుబ్రహ్మణ్యన్ ప్రసిద్ధ చిత్రకారుడు నేను హైదరాబాద్ వచ్చింది తక్కువసార్లే. అయినా, హైదరాబాద్ అంటే ఇష్టం. ఇక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో, అంతే గ్రీనరీ కనిపిస్తుంది. వెరీ నైస్ థింగ్. నగరం మధ్యలో హుస్సేన్‌సాగర్ మరో అందం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ కోసం ప్లానింగ్ జరుగుతున్నప్పుడు మెంబర్‌గా ఆ మీటింగ్స్ లో పాల్గొన్నా. సెంటర్ యూనిట్‌ను పెట్టేందుకు హైదరాబాద్, అహ్మదాబాద్ రెండూ పరిశీలనకు వచ్చాయి. అహ్మదాబాద్ కంటే హైదరాబాదే దేశానికి సెంటర్ పాయింట్ అని, ఆ ఇన్స్టిట్యూట్ను హైదరాబాద్‌లోనే పెట్టించాలని చాలా తపనపడ్డా. కానీ అది కాస్తా అహ్మదాబాద్‌కి తరలిపోయింది. శిష్యులు కాదు భక్తులు... ఆర్ట్‌కి సంబంధించి హైదరాబాద్ చాలా యాక్టివ్. నేను బరోడాలో ఫైన్ ఆర్ట్స్ ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఎల్జీ గుప్తా ఇక్కడి నుంచి... లక్ష్మా గౌడ్, డీఎల్ఎన్ రెడ్డి, వైకుంఠం వంటి కొందరు యంగ్ ఆర్టిస్టులను అక్కడకు పంపించారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లు నాకు శిష్యులు కాదు, భక్తులు. ఇక్కడ జగదీశ్ మిట్టల్ లోకల్ ఆర్ట్ కలెక్షన్ ఏ మ్యూజియానికీ తీసిపోదు. వెలుగులోకి రాని ఎన్నో కళలకు కాణాచి హైదరాబాద్. ఇదంతా ప్రపంచానికి తెలియాలంటే చాలా పని జరగాల్సి ఉంది. అయితే, దీనికి ప్రభుత్వాన్ని నిందించలేం. ప్రభుత్వం ఇతర పనులతో చాలా బిజీగా ఉంటుంది. దీనివల్ల ఆర్ట్ బ్యాక్ సీట్లోకి వెళ్లిపోతుంది. దీని గురించి పట్టించుకోమని ప్రభుత్వాన్ని అడిగితే, తప్పకుండా చేద్దామంటూ ఒక అకాడమీ పెట్టి చేతులు దులుపుకుంది. హైదరాబాద్‌లో డబ్బున్న ఆసాములు లేరా? సంస్కృతిని పరిరక్షించే బృహత్ కార్యాన్ని వాళ్లు తమ భుజాన వేసుకోవచ్చు కదా! వయసుతో పనిలేదు నాకు తొంభై ఏళ్లు నిండాయి. ఇప్పటికీ బొమ్మలు గీస్తా. నా పని వయసుకు సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది. నా ఆర్ట్‌కి వార్ధక్యం లేదు. విశ్వజనీనం ఒక మనిషికి తోటి మనుషులతో, పరిసరాలతో గల అర్థవంతమైన అనుబంధమే నా దృష్టిలో అసలైన ఆర్ట్. దానికి ఎలాంటి పరిమితులూ ఉండవు. అది విశ్వజనీనం. అప్‌కమింగ్ ఆర్టిస్టులు ముందుతరం వాళ్ల అనుభవాలను చదవాలి, సహవాసం చేయాలి, నేర్చుకోవాలనే తపన ఉంటే పర్ఫెక్షన్ కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తారు. మన విద్యావిధానం అస్తిత్వమే మారాలి మన ప్రాథమిక విద్యావిధానం ఏమాత్రం పసలేనిది. అది మనుషులను కాదు, కార్మికులను తయారు చేస్తోంది. ఈ చదువు ఆలోచన ఉన్న మనిషిని కాదు, చెప్పిన పని చేసే మరబొమ్మలను తయారు చేస్తోంది. అందుకే మన విద్యా విధానం అస్తిత్వమే మారాలి. అందులో సృజనకు తావుండాలి. - సరస్వతి రమ ఫొటోలు: సృజన్ పున్నా -
సాలార్జంగ్ మ్యూజియం వద్ద...వేలాడే వంతెనా
నైట్ బజార్ కూడా.. సిటీకి సరికొత్త హంగులు మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులు సన్నద్ధమవుతున్న జీహెచ్ఎంసీ అందే నిధులెన్నో.. చేసే పనులెన్నో? సాక్షి, సిటీబ్యూరో: మెట్రోపొలిస్ సదస్సుకు సిటీని సరికొత్త హంగులతో తీర్చిదిద్దాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దాదాపు రూ. 500 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీనిలో భాగంగా సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. నగరంలో మెట్రోపొలిస్ అంతర్జాతీయ సదస్సు వచ్చే అక్టోబర్‌లో జరగనున్నందున ఈ లోపే పనులన్నీ పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచీ వీలైనన్ని నిధులు పొందాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనే వంద దేశాల విదేశీ ప్రతి నిధుల ఎదుట హైదరాబాద్‌ను షోకేస్‌గా చూపించేందుకు తహతహలాడుతోంది. ఇం దులో భాగంగా పాతబస్తీకి సంబంధించిన పలు పనులతోపాటు సాలార్జంగ్ మ్యూజియం వద్ద వేలాడే వంతెన, నైట్‌బజార్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. అధికారులు ఆ దిశగా ప్రణాళిక.. అంచనా వ్యయం తదితరమైనవి రూపొందించే పనిలో పడ్డారు. దీనితోపాటు చార్మినార్ వద్దకు చేరుకునే అప్రోచ్‌రోడ్ల వెంబడి గ్రీనరీని పెంపొందించడం, ఆయా మార్గాలకు వారసత్వ శోభనిచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక వీధిదీపాలు తదితరమైనవి ఏర్పాటు చేయనున్నారు. అంతా బాగానే ఉంది కానీ... సీఓపీ సందర్భంగా రూ. 150 కోట్ల పనులే చేయలేకపోయిన జీహెచ్ఎంసీ.. మెట్రోపొలిస్ సదస్సు కోసం రూ. 500 కోట్ల పనులను.. అదీ ఇంత తక్కువ సమయంలో ఎలా చేయగలుగుతుందో అంతుబట్టడం లేదు. జీహెచ్ఎంసీ చేపట్టే పనుల్లో కొన్ని... మీరాలం చెరువు సుందరీకరణ, కిషన్‌బాగ్ వద్ద అమ్యూజ్మెంట్ పార్కు అన్ని ప్రధాన మార్గాల్లో రోడ్డు మార్కింగ్‌లు.. సైనేజీలు వారసత్వ ప్రాముఖ్యమున్న అన్ని మార్గాల్లోనూ ప్రత్యేక వీధిదీపాల ఏర్పాటు చాంద్రాయణగుట్టలో మల్టీపర్పస్ స్టేడియం పాతబస్తీలో చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులన్నీ పూర్తి ఆరాంఘర్ నుంచి ఒవైసీ హాస్పిటల్ వరకు మిగిలిపోయిన ప్రాజెక్టు పనుల పూర్తి చార్మినార్, మక్కామసీదు, మొజాంజాహీ మార్కెట్ ప్రాంతాల్లో సుందరీకరణ చార్మినార్ వద్ద ఫొటోగ్యాలరీ ఏర్పాటుకు నిర్మాణ పనులు