ఆర్ట్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు గీసిన చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సాలార్‌జంగ్ మ్యూజియంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్‌లో 90 మందికిపైగా ఆర్టిస్టులు గీసిన పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ సోమవారం ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్‌లో ప్రముఖ ఆర్టిస్టులు లకా్ష్మగౌడ్, యక్క యాదగిరి, ఏలె లక్ష్మణ్, శంకర్, అంజూ పొద్దర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 12 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు సినీ దర్శకుడు బి.నర్సింగరావు 1987లో తీసిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తెలంగాణ పల్లెల్లోని వాతావరణానికి కళ్లకు కట్టేలా చూపిన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకోసం ఆరు వేల కిలోమీటర్లు చుట్టుముట్టి సుమారు వంద గ్రామాలను కలియ తిరిగానని నర్సింగరావు పాతరోజులను గుర్తుచేసుకున్నారు.