Art at telangana
-
ఆర్ట్ ఆఫ్ తెలంగాణ
తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా కళాకారులు గీసిన చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సాలార్జంగ్ మ్యూజియంలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఎగ్జిబిషన్లో 90 మందికిపైగా ఆర్టిస్టులు గీసిన పెయింటింగ్‌లను ప్రదర్శనకు ఉంచారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్ సోమవారం ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖ ఆర్టిస్టులు లకా్ష్మగౌడ్, యక్క యాదగిరి, ఏలె లక్ష్మణ్, శంకర్, అంజూ పొద్దర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 12 వరకు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందు సినీ దర్శకుడు బి.నర్సింగరావు 1987లో తీసిన 51 నిమిషాల నిడివిగల ‘మా ఊరు’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. తెలంగాణ పల్లెల్లోని వాతావరణానికి కళ్లకు కట్టేలా చూపిన ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకోసం ఆరు వేల కిలోమీటర్లు చుట్టుముట్టి సుమారు వంద గ్రామాలను కలియ తిరిగానని నర్సింగరావు పాతరోజులను గుర్తుచేసుకున్నారు. -
ఆర్ట్ ఎట్ మ్యూజ్
తారామతి బారాదరిలో పల్లవించిన కుంచె.. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో పరవశించింది. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహించిన ఆర్ట్ ఎగ్జిబిషన్లో 90 మంది కళాకారులు కన్వాస్‌పై చిలకరించిన రంగులు.. కళాప్రియులను పులకరింపజేస్తున్నాయి. ప్రకృతి కాంత హొయలు, పల్లె పడుచు చిత్రం, గిరిజన వనిత జీవనం.. ఇలా ఎన్నో అంశాలను ప్రతిబింబించిన చిత్రరాజాలు అందర్నీ కట్టిపడే స్తున్నాయి. మంత్రి కె.తారకరామారావు, ఎంపీ కె.కేశవరావు సోమవారం ఈ ఆర్ట్ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ ఎక్స్పో 15 రోజులపాటు అలరించనుంది. ఈ సందర్భంగా ఆర్ట్ ఎట్ తెలంగాణ వెబ్సైట్ ప్రారంభించారు. -
‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: వందేళ్ల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర ప్రతిబింబించే చిత్రాలతో కూడిన ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ఆవిష్కరిం చారు. దీనికి మెట్రోపొలిస్ సదస్సు వేదికైం ది. 1994 -2014 వరకు ఆధునిక చిత్రకళ పరిణామక్రమాన్ని తెలిపేవిధంగా వందమంది చిత్రకారులు వేసిన చిత్రాలు ఇందు లో ఉన్నాయి. పుస్తకం తొలి ప్రతిని మెట్రోపొలిస్ అధ్యక్షుడు జీన్‌పాల్ హ్యూకన్కు అందజేశారు. ప్రముఖ సినీ దర్శకుడు, చిత్రకారుడు బి.నరసింగరావు, చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే, సీనియర్ న్యాయవాది నిరంజ న్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావులతో కూడిన ట్రస్ట్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ పుస్తకాన్ని వెలువరించింది. ఈ పుస్తకంలోని చిత్రాలను వేసినవారు ఇటీవల నిర్వహిం చిన చిత్రకళాశిబిరంలో వేసిన చిత్రాలను సైతం వేదిక వద్ద ప్రదర్శనకు ఉంచారు. కలాంను ఆకట్టుకున్న చిత్రాలు మెట్రోపొలిస్ సదస్సులో కీలకోపన్యాసం చేసేందుకు వడి వడిగా వెళ్తున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చిత్ర ప్రదర్శనను చూసి ఆగిపోయారు. అందులోని చిత్రాలకు ముగ్ధుడయ్యారు. నల్లగొండ జిల్లాకు చెం దిన వర్ధమాన కళాకారుడు గుండా ఆంజనేయులు వేసిన ఒక చిత్రం ఆయనను కట్టిపడేసింది. తన ఉపన్యాసంలోనూ ఆయన ఈ చిత్రాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్రస్ట్ సీఈవో వైదేహిరెడ్డి, లక్ష్మణ్ ఏలే, ఆనంద్ హుటాహుటిన ఆంజనేయులును వేదిక వద్దకు రప్పించి కలాంకు పరిచయం చేశారు. ట్రస్ట్ తరఫున కలాంకు చిత్రపటాన్ని బహూకరించారు. ఆంజనేయులుకు మాదిరిగా తెలంగాణలోని చిత్రకారులందరికీ గుర్తింపు వస్తుందని ట్రస్ట్ విశ్వాసం వ్యక్తం చేసింది. -
కల్లంత.. థ్రిల్లింత
దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కల్లు రుచి చూసి థ్రిల్ ఫీలయ్యారు. కొందరు ఆకు దోనెలో పోయించుకుని ‘సిప్’ చేస్తే.. ఇంకొందరు ఫ్యాషనబుల్‌గా గ్లాసుల్లో తీసుకుని టేస్ట్ చేశారు. తారామతి బారాదరిలో ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ నిర్వహించిన ఆర్ట్‌క్యాంప్ సోమవారం ముగిసింది. ఈ ప్రదర్శనలోని చిత్రాలను తిలకించేందుకు వచ్చిన మెట్రోపొలిస్ ప్రతినిధులు.. ఇక్కడ అందుబాటులో ఉంచిన ఈత, తాటి కల్లు రుచులను ఆస్వాదించారు. - ఫొటో: సృజన్ పున్నా -
బొమ్మల బతుకమ్మ
విషయం.. విమెన్ ఆర్టిస్ట్‌ల గురించి సందర్భం.. ఆర్ట్ ఎట్ తెలంగాణ నిర్వహిస్తున్న ఆర్ట్ క్యాంప్ స్థలం.. తారామతి బారాదరి ప్రత్యేకత... వందేళ్ల తెలంగాణ ఆర్ట్, ఆర్టిస్టులతో కాఫీటేబుల్ పుస్తకం రాబోతోంది. ప్రస్తుతం ఈ క్యాంప్‌లో పాల్గొంటున్న కళాకారులందరి చిత్రాలు అందులో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్యాంప్ రెండు సెషన్స్‌గా జరుగుతోంది. బుధవారం రెండో సెషన్ ప్రారంభమైంది. ఈ రెండు సెషన్లలో దాదాపు పది మంది మహిళా చిత్రకారులు తమ కుంచెలకు రంగులద్దారు. ఈ క్యాంప్ కేవలం రంగు బొమ్మలకే కాదు పువ్వుల చిత్రానికీ.. బతుకమ్మ గీతాలకూ వేదికైంది. ఆర్ట్ ఎట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆగస్ట్ 27న ప్రారంభమైన ఆర్ట్ క్యాంప్ తెలంగాణ సృజనకు మెరుగులద్దే ప్రయత్నమే కాదు ఓ కొత్త సాంప్రదాయానికీ క్యాన్వాస్ పరిచింది. వయసులో చిన్న, పెద్ద, కళలో సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసాలకు స్థానం ఇవ్వకుండా తెలంగాణలోని ఆర్టిస్టులందరినీ ఒక్క చోటికి చేర్చింది. గురువులు.. ఆ గురువుల గురువులు, శిష్యులు వారి జూనియర్లు.. ఇలా నాలుగు తరాల చిత్రకారులను ఈ క్యాంప్ ఒక్కటి చేసింది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డి వంటి పెద్ద తరం చిత్రకారిణులు .. వాళ్ల దగ్గర బ్రష్ పట్టడం నేర్చుకున్న అర్చన సొంటి, వేముల గౌరి, కరుణ సుక్క లాంటి శిష్యమణులు.. వాళ్ల జూనియర్లు నిర్మలా బిలుక, ఉదయలక్ష్మి, రోహిణీ రెడ్డి.. యంగెస్ట్ ఆర్టిస్ట్ ప్రియాంక ఏలే వరకు అందరికీ ఈ క్యాంప్ అద్భుత జ్ఞాపకం. బతుకమ్మ ఆట... ‘ఈ క్యాంప్ మాకిచ్చిన వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే.. పండుగలకు ఎప్పుడూ కలసుకోని మేమంతా ఇలా ఒక్కచోట కలుసుకొని ఈ తారామతి బారాదరిలో బతుకమ్మ ఆడుకోవడం. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం ఇది. ఉదయం బొమ్మలు వేస్తున్నాం. సాయంత్రం అందరం కలసి బతుకమ్మ ఆడుతున్నాం. క్యాంప్‌లో ఏ థీమ్ లేకపోవడం వల్ల అందరూ స్వేచ్ఛగా ఫీలవుతున్నారు. వాళ్లకు తట్టిన ఆలోచనను క్యాన్వాస్పై చిత్రీకరిస్తున్నారు. నేచురల్‌గా రంగులద్దుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత మా గురువులను కలుసుకోవడం.. వాళ్లువర్క్ చేస్తుంటే చూసే అవకాశం కలగటం ఆనందాన్నిచ్చింది’ అని తెలిపింది వేముల గౌరి. గ్రేట్ హానర్.. ‘ఎక్సెలెంట్ అండ్ వెల్ ఆర్గనైజ్డ్ క్యాంప్ ఇది. క్వాలిఫైడ్ ఆర్టిస్ట్‌లకే కాదు సెల్ఫ్ మేడ్ ఆర్టిస్ట్‌లకూ ఇందులో ప్లేస్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకుంటున్నాం.. ఇంతమందిని ఒకేసారి కలుసుకోగలిగాం. అందరితో కలసి పనిచేయడం.. మాకూ రెడ్ కార్పెట్ హానర్ దొరకడం గ్రేట్ థింగ్స్’ అని చెప్పింది కరుణ సుక్క. తొంభైమంది ఆర్టిస్టులు.. ‘చాలా ఏళ్ల తర్వాత ఇంత పెద్ద క్యాంప్ పెట్టడం. ఇందులో పార్టిసిపేట్ చేయడం గర్వంగా ఫీలవుతున్న. ఈ క్యాంప్‌లో.. రెండు సెషన్స్‌కి కలిపి మొత్తం తొంభై మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. అందరూ తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బొమ్మలేయడం... చాలా బాగుంది. కవితా దివోస్కర్, అంజనీ రెడ్డిలాంటి గురువులను కలసుకునే అవకాశం దొరికింది. ఈ ఇద్దరి తర్వాత ఇక్కడున్న వాళ్లలో నేనే సీనియర్ని. అంటే వాళ్ల తర్వాత చాలా ఏళ్ల వరకు ఆర్ట్‌లోకి అమ్మాయిలు రాలేదు’ అని తన అభిప్రాయాన్ని పంచుకుంది సీనియర్ ఆర్టిస్ట్ అర్చన సొంటి. బిగ్ ఈవెంట్ ‘ఇంత బిగ్ ఈవెంట్లో నేనెప్పుడూ పార్టిసిపేట్ చేయలేదు. మాలాంటి యంగర్ జనరేషన్‌కి ఇందులో చోటు దొరకడం నిజంగా గ్రేట్ హానర్. పెద్దవాళ్ల ఎక్స్పీరియన్స్ మాకు లెసన్స్గా ఉపయోగపడుతున్నాయి. అసలు వాళ్లతో మాట్లాడటమే మాకు గొప్ప అవకాశం. ఈ క్యాంప్‌లో నేనూ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్‌గా ఉండడం.. నా వరకు నేనైతే మోర్ ప్రివిలెజ్డ్గా భావిస్తున్నాను’ అని చెప్పింది ప్రియాంక ఏలే! - సరస్వతి రమ -
తెలంగాణ కళావైభవం
ఆర్ట్ ఎట్ తెలంగాణ పేరిట తారావుతి బారాదరిలో ఏర్పాటు చేసిన కళా శిబిరం తెలంగాణ కళావైభవానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ శిబిరంలో తొలి విడత యూభై వుంది కళాకారులు తవు కళా సృజనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. శిబిరం రెండో విడతలో బుధవారం నుంచి వురో నలభై వుంది కళాకారులు తవు కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించనున్నారు. ఈ శిబిరం ఈ నెల 6 వరకు జరగనుంది. అనంతరం వరల్డ్ మెట్రోపోలిస్ కన్వెన్షన్‌లో ఈ నెల 7న ఏర్పాటు చేయునున్న కార్యక్రవుంలో తెలంగాణ కళాకారుల చిత్రాలతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ వుుఖ్యవుంత్రి కె.చంద్రశేఖరరావు బహూకరించనున్నారు. కళా శిబిరానికి సహకరించిన కళాకారుల గౌరవార్థం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో విందు ఏర్పాటు చేయునున్నారు. ఈ సందర్భంగా ఆర్ట్ ఎట్ తెలంగాణ వెబ్‌సైట్‌ను వుంత్రి కె.తారకరావూరావు ప్రారంభించనున్నారు. అలాగే, వచ్చేనెల ఫలక్‌నువూ ప్యాలెస్‌లో కళా ప్రదర్శన ఏర్పాటు చేయునున్నారు. -సిటీప్లస్