Sales of smartphones
-
జోరుగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని అధ్యయన సంస్థ సీఎంఆర్ వెల్లడించింది. మొత్తం 15.8 మిలియన్ల 4జీ పరికరాలు అమ్ముడవగా వాటిలో... 97.9 శాతం స్మార్ట్ఫోన్లు, 1.5 శాతం డాటా కార్డులు, 0.6 శాతం టాబ్లెట్ పీసీలు ఉన్నట్లు తాజా పరిశోధన పేర్కొంది. మొత్తంగా 63 శాతం సెల్యులర్ పరికరాలు అమ్ముడైనట్లు తెలిపింది. ప్రస్తుతం 4జీ హవా నడుస్తున్న తరుణంలో... 32 శాతం విక్రయాలతో శ్యాంసంగ్ మార్కెట్లో దూసుకె ళ్తోంది. 12.6 శాతంతో రిలయన్స్ జియోకు చెందిన లైఫ్, 13.4 శాతంతో లెనోవో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డాటా కార్డుల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని తెలియజేసింది. టాబ్లెట్ విభాగంలో శ్యాంసంగ్, ఆపిల్, ఐబాల్ అమ్మకాలలో ముందంజలో ఉండగా, డాటా కార్డుల విభాగంలో హువావే, జెడ్‌టీఈ, మైక్రోమ్యాక్స్ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న సమయంలో టాబ్లెట్, డాటా కార్డుల ప్రాధాన్యం క్రమంగా త గ్గిపోయిందని టె లికం ఎనలిస్ట్ కృష్ణ ముఖర్జీ వెల్లడించారు. -
4జీ స్మార్ట్ఫోన్ల జోరు
21% పెరిగిన స్మార్ట్ఫోన్ల విక్రయాలు ఐడీసీ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో 4జీ స్మార్ట్పోన్ల జోరు పెరుగుతోంది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 21 శాతం పెరిగి 2.83 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ తెలిపింది. చౌక ధర 4జీ ఫోన్లకు డిమాండ్ మూడు రెట్లు పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఐడీసీ తెలిపింది. ఐడీసీ నివేదికలో వెల్లడించిన వివరాల ప్రకారం.., * గత ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌కు స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 2.33 కోట్లుగా ఉన్నాయి. * ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో ఈ విక్రయాలు 2.65 కోట్లు. * ఇంతకు ముందటి క్వార్టర్‌తో పోల్చితే జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 4జీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. అమ్ముడైన ప్రతి మూడు స్మార్ట్ఫోన్లలో ఒకటి 4జీ స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. ఇక అమ్ముడయ్యే ప్రతి రెండు స్మార్ట్ఫోన్లలో ఒకటి 5 అంగుళాల కంటే ఎక్కువ డిస్ప్లే ఉన్నవే. * ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్వంటి వంటి ఈ కామర్స్ సంస్థలు చైనా సంస్థల నుంచి భారీగా 4జీ స్మార్ట్ఫోన్లను దిగుమతి చేసుకుంటున్నాయి. * 150 డాలర్ల కంటే తక్కువ ధరకే గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్, గెలాక్సీ జే2, వంటి ఫోన్లను అందిస్తూ శామ్సంగ్ కంపెనీ 4జీ మార్కెట్లో అగ్రస్థానంలో ఉంది. * స్మార్ట్ఫోన్ల మార్కెట్లో శామ్సంగ్ కంపెనీదే అగ్రస్థానం. 24 శాతం మార్కెట్ వాటాతో శామ్సంగ్ కంపెనీ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(17 శాతం), ఇంటెక్స్(11 శాతం), లెనోవొ గ్రూప్ (10 శాతం),లావా (5 శాతం) ఉన్నాయి. -
2వ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్!
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాల జోరు పెరగనుంది. 2017 నాటికి రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ కలిగిన దేశంగా భారత్ అవతరించనుంది. ఈ విషయం ప్రముఖ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఐడీసీ నివేదిక ప్రకారం.. గతేడాది రెండో త్రైమాసికంలో ఉన్న 1.84 కోట్ల యూనిట్లుగా ఉన్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు, ఈ ఏడాది అదే సమయంలో 44 శాతం వృద్ధితో 2.65 కోట్ల యూనిట్లకు పెరిగాయి. -
రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా భారత్!
2016కల్లా అమెరికాను వెనక్కినెట్టే చాన్స్ ఈమార్కెటీర్ నివేదికలో వెల్లడి న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా ఉన్నాయి. 2016 కల్లా అమెరికాను తోసిరాజని స్మార్ట్ఫోన్లకు రెండో అతి పెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనున్నది. కంపెనీలు అందుబాటు ధరల్లో స్మార్ట్ఫోన్లను అందించడమే దీనికి కారణమని ప్రముఖ రీసెర్చ్ సంస్థ, ఈమార్కెటీర్ పేర్కొంది. ఈ సంస్థ వెలడించిన వివరాల ప్రకారం..., వృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరల్లో స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో 2016 కల్లా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 200 కోట్లను దాటనున్నది. భారత్‌లో 2016 నాటికి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లకు పెరుగుతుంది. దీంతో అమెరికాను తోసిరాజని భారత్ రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరిస్తుంది. అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా చైనా తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుంది. 62.47 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులతో చైనా మొదటిస్థానంలో ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో భారత్(20 కోట్లు), అమెరికా(19.8 కోట్లు), రష్యా (6.5 కోట్లు), జపాన్(6.1 కోట్లు)లు ఉంటాయి. వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్లను వినియోగించే వారి సంఖ్య ప్రపంచ జనాభాలో పావువంతు కంటే ఎక్కువగానే ఉండనున్నది. ఇది 2018 కల్లా మొత్తం ప్రపంచ జనాభాలో మూడో వంతుకు పెరగనున్నది. 2015లో 191 కోట్లుగా ఉండే స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 2016లో 13 శాతం వృద్ధితో 216 కోట్లకు, పెరగనున్నది. -
స్మార్ట్ఫోన్లు పెరుగుతున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలు జనవరి-మార్చి త్రైమాసికంలో 28.6 శాతం పెరిగి 28.15 కోట్లకు చేరుకున్నాయి. 2013 నాల్గవ త్రైమాసికంలో జరిగిన 28.96 కోట్ల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య 2.8 శాతం తక్కువ. అయితే 2013 తొలి త్రైమాసికంలో మొత్తం అమ్ముడైన ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 50.7 శాతం. ఈ ఏడాది ఇది 62.7 శాతానికి ఎగబాకిందని పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విపరీతమైన డిమాండ్, అందుబాటు ధరలో లభించడం, 4జీ సేవలు విస్తరించడం అమ్మకాల జోష్‌కు ప్రధాన కారణాలు. స్మార్ట్ఫోన్లలో 40 శాతం చైనా కస్టమర్లు చేజిక్కించుకున్నారు. శాంసంగ్‌దే హవా.. కంపెనీల వారీగా చూస్తే స్మార్ట్ఫోన్ల అమ్మకాల్లో శాంసంగ్ అగ్రస్థానంతో 30.2 శాతం వాటా కైవసం చేసుకుంది. ఆపిల్ 15.5, హువావె 4.9 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆపిల్ తొలిసారిగా ఒక త్రైమాసికంలో 4 కోట్ల యూనిట్ల మార్కును దాటింది. భారత్‌తోసహా చైనా, జపాన్, బ్రెజిల్, ఇండోనేసియా మార్కెట్లలో ఆపిల్ రెండంకెల వృద్ధి నమోదు చేసింది. ఇక 2013 జనవరి-మార్చితో పోలిస్తే ఈ ఏడాది 3.9 శాతం వృద్ధితో ఫీచర్, స్మార్ట్ఫోన్లు మొత్తం 44.86 కోట్ల యూనిట్లు విక్రయమయ్యాయి. శాంసంగ్ 10.89 కోట్లు, నోకియా 5.05 కోట్లు, ఆపిల్ 4.37 కోట్ల పీసులతో అగ్రస్థానంలో ఉన్నాయి.