జోరుగా స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని అధ్యయన సంస్థ సీఎంఆర్ వెల్లడించింది. మొత్తం 15.8 మిలియన్ల 4జీ పరికరాలు అమ్ముడవగా వాటిలో... 97.9 శాతం స్మార్ట్‌ఫోన్లు, 1.5 శాతం డాటా కార్డులు, 0.6 శాతం టాబ్లెట్ పీసీలు ఉన్నట్లు తాజా పరిశోధన పేర్కొంది. మొత్తంగా 63 శాతం సెల్యులర్ పరికరాలు అమ్ముడైనట్లు తెలిపింది. ప్రస్తుతం 4జీ హవా నడుస్తున్న తరుణంలో... 32 శాతం విక్రయాలతో శ్యాంసంగ్ మార్కెట్లో దూసుకె ళ్తోంది.
12.6 శాతంతో రిలయన్స్ జియోకు చెందిన లైఫ్, 13.4 శాతంతో లెనోవో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే డాటా కార్డుల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయని తెలియజేసింది. టాబ్లెట్ విభాగంలో శ్యాంసంగ్, ఆపిల్, ఐబాల్ అమ్మకాలలో ముందంజలో ఉండగా, డాటా కార్డుల విభాగంలో హువావే, జెడ్‌టీఈ, మైక్రోమ్యాక్స్ అమ్మకాలు జోరుగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ల హవా నడుస్తున్న సమయంలో టాబ్లెట్, డాటా కార్డుల ప్రాధాన్యం క్రమంగా త గ్గిపోయిందని టె లికం ఎనలిస్ట్ కృష్ణ ముఖర్జీ వెల్లడించారు.