పెండింగ్లో 13 ‘సమైక్య కేసులు’
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో నమోదైన కేసుల తొలగింపుపై పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. 257 కేసుల ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోవాలని సమీక్ష కమిటీ ప్రభుత్వానికి గురువారం నివేదించింది. దాదాపు 1,900 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వం అప్పట్లోనే ఎత్తివేసింది. ఏపీ డీజీపీగా వెంకటరాముడు బాధ్యతలు చేపట్టే నాటికి 847 కేసులు మిగిలాయి. అన్ని కేసులను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచిన నేపథ్యంలో పోలీసు విభాగం కసరత్తు చేపట్టింది. 13 కేసులు తీవ్రమైన ఆరోపణలతోపాటు రైల్వేలు లాంటి కేంద్రం ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి కేసులున్నట్లు కమిటీ గుర్తించింది. వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పింది.