samaikyandhra student jac
-
తెలుగుజాతి ద్రోహులను అడ్డుకుంటాం
హైదరాబాద్: తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్‌గాంధీల, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ సీమాంధ్రలో పర్యటిస్తే అడ్డుకుంటామని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆడారి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పూర్తిగా భాగస్వామ్యులవుతామని చెప్పారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ నెల 5న గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో 14 విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు సమావేశమై విద్యార్థి జేఏసీ రాజకీయ ప్రవేశం, 2014 ఎన్నికల్లో విద్యార్థుల భాగస్వామ్యం అంశాలపై చర్చిస్తారన్నారు. కార్యక్రమంలో స్టూడెంట్స్ జేఏసీ ప్రధాన కార్యదర్శి రాయపాటి జగదీష్, ఏ.రాజేష్, ఆదిత్యసాయి, వేంకటేశ్వర్రావు, సత్యనారాయణరాజు, కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కమల్‌నాథ్‌కు ‘సమైక్య’ సెగ
ఢిల్లీలో ఆయన ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర విద్యార్థి జాక్ సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఢిల్లీలోని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇంటిని ముట్టడించారు. జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదివారం ఈ ముట్టడిలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును మూజువాణి ఓటుతోనైనా నె గ్గిస్తామని కమల్‌నాథ్ పేర్కొనడాన్ని కిశోర్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ కార్యాలయం ముట్టడి: సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దళిత విద్యార్థి జాక్ నాయకులు ఎ.రాజేశ్, జగదీశ్, వెంకట రమణ, సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, మన్యసీమ జేఏసీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. -
సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విఫలయత్నం
అడ్డగోలు విభజనపై సమైక్యాంధ్ర విద్యార్థి నేతల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు బుధవారం సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఉదయం 11 గంటల సమయంలో సచివాలయం వద్దకు చేరుకున్న విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఒక్క పెట్టున నినాదాలు చేశారు. పోలీసు బలగాలు ప్రధాన ద్వారం వద్ద ఉన్నప్పటికీ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నిం చారు. పోలీసులు విద్యార్థులను అరెస్టుచేసి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వారిని సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. ధర్నా సందర్భంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన ప్రక్రియను ఆపకుంటే పార్లమెంటు గోడలను బద్దలు కొడతామని హెచ్చరించారు. కాగా, పోలీసులు విద్యార్థులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేయడాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నాయకులు లంకా దినకర్, కడియాల రాజేందర్, చలసాని శ్రీనివాస్, ప్రొఫెసర్ నడింపల్లి శ్రీరాం, ఏపీ రాష్ర్ట పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్ వి. లక్ష్మణ్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.