ఢిల్లీలో ఆయన ఇంటిని ముట్టడించిన సమైక్యాంధ్ర విద్యార్థి జాక్
సాక్షి, న్యూఢిల్లీ: సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు ఢిల్లీలోని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ ఇంటిని ముట్టడించారు. జేఏసీ కన్వీనర్ ఆడారి కిశోర్ కుమార్, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆదివారం ఈ ముట్టడిలో పాల్గొన్నారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును మూజువాణి ఓటుతోనైనా నె గ్గిస్తామని కమల్‌నాథ్ పేర్కొనడాన్ని కిశోర్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఏఐసీసీ కార్యాలయం ముట్టడి: సమైక్య విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం సాయంత్రం ఏఐసీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దళిత విద్యార్థి జాక్ నాయకులు ఎ.రాజేశ్, జగదీశ్, వెంకట రమణ, సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ, మన్యసీమ జేఏసీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు.
కమల్‌నాథ్‌కు ‘సమైక్య’ సెగ
Published Mon, Feb 17 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement