సాక్షి విజయవాడ: ఏడు మండలాల విలీన వివాదంపై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 7 మండలాలను అన్యాయంగా ఏపీలో కలిపారన్నది అవాస్తవం..
చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. పోలవరం ముంపు గ్రామాలన్నీ ఏపీకే చెందుతాయని.. రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోనే ఉంది. విభజన ఆస్తులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి’’ అని చలసాని డిమాండ్ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం ఏపీపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆస్తులను తెలంగాణకు అప్పగించారు. విభజన హామీల అమలు కోసం నాటి తెలంగాణ ప్రభుత్వం కృషి చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై దుర్మార్గంగా వ్యవహరించింది. తెలుగు రాష్ట్రాల మద్య సమస్య పరిష్కారం చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో కమిటీ వేయాలంటే ఎందుకు కేంద్రం ఒప్పుకోవడం లేదు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి.’’ అంటూ చలసాని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment