samakaalinam
-
నిరసనను అణచేది నియంతలే!
పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులు అది పసిగడుతున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేందుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటగింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో... ‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. ఇది దారుణం. ‘‘నీ వాదనను నేను తిరస్కరించవచ్చు గాక! కానీ, అది వినిపించే నీ హక్కును... నా ప్రాణాలు పణంగా పెట్టయినా కాపాడుతా’’ – వాల్తేర్ (ఫ్రాన్స్ రచయిత, తాత్వికుడు) దేశంలో సాగుతున్న ఓ ప్రమాదకర అణచివేత పరి స్థితికి సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్య అద్దం పట్టింది. ‘భిన్నాభిప్రాయం, నిరసనని వ్యక్తం చేయడం ప్రజా స్వామ్యంలో భాగం. అణచివేత సరికాదు. ఈ హక్కు ప్రజాస్వామ్యానికే సేఫ్టీ వాల్వ్లాంటిది, కాదని మీరు దాన్ని అణగదొక్కితే, ఏదో రోజు ప్రజాస్వామ్యం ఫ్రెషర్ కుక్కర్‌లా పేలిపోతుంది’ అని ప్రభుత్వ నిర్వాకంపై న్యాయస్థానం చేసిన ఈ వ్యాఖ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. హింసకు కుట్ర పన్నారంటూ దేశ వ్యాప్తంగా పేరెన్నికగన్న అయిదు గురు పౌరహక్కుల నేతల్ని ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. వారందరినీ గృహనిర్బంధానికే పరిమితం చేయాలని ఆదేశిస్తూ, వచ్చే బుధవారం లోపు ఈ కేసులో ప్రతివా దన తెలుపాలని ప్రభుత్వాల్ని నిర్దేశించింది. హక్కుల కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులను ఆందోళనకు గురిచేసిన ఇది దుందుడుకు చర్య అని సుప్రీంకోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టు, పుణె కోర్టు, జాతీయ మానవహక్కుల సంఘం, ఇతర ప్రజా సంఘాలు తప్పుబట్టాయి. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కొంత కాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల్ని చెప్ప కనే చెబుతున్నాయి. కక్ష సాధిస్తారనే భయం లేకుండా పౌరులు తమ అభిప్రాయాల్ని, నిరసన చట్టపరిధిలో స్వేచ్ఛగా వ్యక్తం చేయగలగడం వల్లనే ప్రజాస్వామ్య పాలనకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని చెప్పుకునే మన దేశంలో ఆ హక్కును ప్రభుత్వాలు కాలరాయడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఈ తీర్పు వెలువడు తున్న సమయానికి, ఇక్కడ తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రజా స్వామ్య నిరసనను సర్కారు కర్క శంగా అణచి వేసింది. ముఖ్యమంత్రి పాల్గొన్న ఓ సభలో దూరంగా నిలబడి, ప్లకార్డులు చూపుతూ తమకు న్యాయం చేయండని గొంతెత్తిన పలువురు ముస్లీం యువకుల్ని పోలీసులు నిర్బంధించారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియనీకుండా గోప్యంగా ఉంచి, మీడియా ఎండగట్టడంతో 24 గంటలకు అరెస్టు చూపించారు. విచిత్రంగా వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసనకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ప్రభు త్వాన్ని నిలదీస్తారనుకుంటే చాలు సభలు, సమా వేశాలకూ అనుమతి లభించదు. ముందస్తు అరె స్టులు, నిర్బంధకాండ. తర్వాత కక్షసాధింపులు ఇవన్నీ మామూలే! హక్కుల చేతనను అంగీకరించరా? సామాజిక మాధ్యమాల్లో చెడు పరివ్యాప్తం చేయొ ద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఒక పిలుపునిచ్చారు. తన నియోజకవర్గ (వారణాసి) పార్టీ కార్యకర్తలను ద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు. ప్రేరణ ఏమై ఉంటుంది? నిజమే! అడ్డూ అదుపూ లేకుండా సామా జిక మాధ్యమాలు వేదికగా ఇటీవల ఏదేదో ప్రచారం లోకి వస్తోంది. దృవీకరణ లేకున్నా, విశ్వసనీయత కొరవడినా... సదరు సమాచారం రేపుతున్న దుమా రం ఇంతంత కాదు. ముఖ్యంగా మత, కుల, ప్రాంతీయ, సామాజిక వర్గ భావనలను రెచ్చగొట్టి పలు విపరిణామాలకు ఇది కారణమవుతున్న సంద ర్భాలెన్నో! వీటిని తప్పక నియంత్రించాల్సిందే! ‘ఫేస్బుక్’ ‘వాట్సాప్’ వంటి వేదికల్ని నిర్వహించే సంస్థలతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపు తోంది. చెడు, తప్పుడు సమాచారం సృష్టిస్తున్న మూలాల్ని పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో ఈ మాధ్యమాల వల్ల పౌరు లకు చాలా విషయాలు తెలిసి వస్తున్నాయి. తమ హక్కుల గురించిన స్పృహ, ప్రభుత్వాల బాధ్య తకు సంబంధించిన చైతన్యం పౌరుల్లో పెరుగు తోంది. పాలకపక్షాలు తప్పుడు హామీలిచ్చినపుడు, ఇచ్చిన హామీలు మరచినపుడు, మాయమాటలతో పబ్బం గడుపుకోజూసినపుడు... చేతనతో పౌరులది పసిగడు తున్నారు, ప్రశ్నించి నిలదీస్తున్నారు. ఓట్ల వేటలో.. పౌరుల్లో తప్పుడు భావనలు కల్పించి లబ్ది పొందేం దుకు చేసే రాజకీయ సంకుచిత యత్నాల్ని ప్రజలు ఎత్తి చూపుతున్నారు. అధికారంలో ఉన్నవారికి ఇది కంటకింపుగా మారుతోంది. పౌరుల ప్రశ్నలకు, సందేహాలకు సమాధానమిచ్చుకోలేని ఇరకాటపు పరిస్థితుల్లో...‘ఈ నిరసనలకు, నిలదీతకు ఆస్కారమే లేకుంటే బావుండుకదా!’ అనుకోవడం సహజం. అధికార వ్యవస్థను అరచేత పట్టుకొని నిరసన గొంతు నొక్కే అణచివేతకు పాల్పడుతున్నారు. తమ ఈ తప్పుడు పంథాను హేతుబద్దం చేసుకోవడానికి, నియంతృత్వపు పోకడల్ని కప్పిపుచ్చడానికి దేశభక్తి, జాతీయత వంటి భావనల ముసుగు తొడుగు తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారనో, ప్రత్యర్థి రాజకీయ పక్షాల ప్రోద్బలంతో సాగుతున్న కుట్ర అనో ప్రజా నిరసన గళాన్ని చిన్నబుచ్చే యత్నం చేస్తున్నారు. ఎవరిది టెర్రర్ చర్య? పాలకుల నిర్లక్ష్యం వల్ల కడుపు కాలిందనో, కొంప కూలిందనో, బతుకు చెడిందనో, భవిష్యత్తు అంధ కారమౌతోందనో... ఆక్రందనలు చేసే వారిని అనున యించకపోగా తీవ్రవాదులని ముద్ర వేస్తున్నారు. ఉగ్రవాదులని, దేశద్రోహులని, జాతి వ్యతిరేకులనీ, అర్బన్‌నక్సల్స్ అనీ... ఇలా కొత్త కొత్త పదజాలం వాడుతూ ప్రభుత్వాలు నిష్కర్షగా అణచివేతకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల్ని వ్యతిరేకిం చేవారు ‘టెర్రరిస్టులే’ అంటూ కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి రాధాకృష్ణన్ గత నెల్లో చెన్నైలో చేసిన ప్రకటన ఇటువంటిదే! తమిళనాడు తూటుకుడిలో వాయుకాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన తెలపుతున్న పౌరులపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి 13 మందిని పొట్టనపెట్టుకోవడం కన్నా టెర్రరిస్టు చర్య ఏముంటుంది? పైగా, ప్రభుత్వ చర్యల్ని నిరసిస్తూ సాగిన స్టెరిలైట్ వ్యతిరేకపోరా టంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న కార్య కర్తలు, న్యాయవాదులు, వార్తా కథనాలిచ్చిన జర్నలి స్టుల్ని కూడా ప్రభుత్వం నిర్బంధించింది. ముంబయి –అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టు కోసం చేపట్టిన భూసేకరణను వ్యతి రేకిస్తున్న రైతులపై మహారాష్ట్ర ప్రభుత్వం దమన కాండ కొనసాగిస్తూనే ఉంది. అటవీచట్టాల సాక్షిగా తమ హక్కుల పరిరక్షణ కోసం ఒడిశాలోని నియమ్ గిరి గిరిజన తెగలు అక్కడి వేదాంత–బాక్సైట్ తవ్వకాల్ని వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యయుత మైన వారి పోరాట పటిమ, మొత్తం ప్రపంచానికే స్ఫూర్తినిస్తే, స్వయంగా కేంద్ర హోమ్‌మంత్రి, ‘నియ మ్గిరి సురక్షా సమితి’కి మావో యిస్టులతో సంబం ధాలు అంటగట్టారు. సర్దార్ సరో వర్ వంటి బారీ ప్రాజెక్టులు పర్యావరణానికి, స్థానిక గిరిజనుల మను గడకు ప్రమాదకరమని నర్మదా బచావో ఆందో ళన్(ఎన్బీయే) చేసిన పోరుపై సుదీర్ఘ కాలం సాగిన ప్రభుత్వ నిర్బంధ కాండ తెలిసిందే! తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పంథా! విభజనతో రెండుగా ఏర్పడ్డ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లోనూ పౌర నిరసను çసర్కార్లు సహించే పరిస్థితుల్లేవు. అడుగడుగున అణచివేస్తు న్నారు. ముస్లీమ్ యువకుల్ని చెరబట్టి ముప్పతిప్పలు పెడుతున్న కర్నూలు తాజా ఘటన ఏపీ ప్రభుత్వ దాష్టీకాలకు మచ్చుతునక. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కినప్పుడు తమకు చాకిరీ తప్పించమని ఆశా వర్కర్లు గొంతెత్తినప్పుడు, సమస్యలు పరిష్కరించమని ఉపాధ్యాయ సంఘాలు శాంతి ర్యాలీ జరిపినప్పుడు, సీపీఎస్ రద్దు కోరి ఉద్యోగులు ఉద్యమించినప్పుడు... పోలీసులను మోహరించి ఏపీ సర్కారు ఈ నిరనలన్నింటినీ నిర్భీతిగా ఉక్కుపాదంతో అణచివేసింది. తెలంగాణలోనూ పరిస్థితి ఏమీ గొప్పగా లేదు. నిరసనలు తెలుపుకొనే వేదికగా ఇందిరాపార్కు వద్ద నున్న ధర్నాచౌక్‌ను ఎత్తేయించారు. సర్కారు ఏర్పడ్డ తొలినాళ్లలోనే, ‘ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక’ ఏర్పాటుకు జరిగిన యత్నాన్ని భగ్నం చేసి నాయ కులు, కార్యకర్తల్ని ఎక్కడికక్కడ ఇళ్లలోనే నిర్బంధించి ప్రభుత్వం దమనకాండకు తలపడింది. మల్లన్నసా గర్‌ను వ్యతిరేకించి నిరసన తెలిపిన వారికీ అదే గతి పట్టించింది. విద్యార్థి ఉద్యమాల్నీ ఎక్కడికక్కడ అణ చివేస్తోంది. మౌనం పంపే తప్పుడు సంకేతాలు కర్ణాటకకు చెందిన హేతువాది, రచయిత కె.ఎస్. భగవాన్ తనను చంపదలచుకున్నవారికి ఓ సవాల్ విసిరారు. ఒక తేదీ ఖరారు చేస్తే తాను బెంగళూరు లోని విధానసౌధ ముందుకు వస్తానని, ముఖ్య మంత్రి, పోలీసుల సమక్షంలో తనను చంపి హీరో లుగా కీర్తి పొందొచ్చన్నారు. సంపాదకురాలు గౌరీ లంకేష్ హత్యకేసు దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం భగవాన్ కూడా హంతకులు లక్ష్యంచేసు కున్న ‘బుద్దిజీవుల’ జాబితాలో ఉన్నారు. నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సరే, ఎమ్మెమ్ కల్బుర్గి లను హతమార్చినవారే పథకం ప్రకారం గౌరీ లంకేష్నూ హత్య చేశారని వెల్లడవడం తెలిసిందే! సహనంతో నిరసనల్ని అనుమతించే ప్రజాస్వామ్య వాతావరణ మైనా, అసహనంతో సాగించే నియంతృత్వపు అణచి వేతయినా.... అధికారంలో శీర్షస్థానంలోని వారిచ్చే సంకేతాల్ని బట్టే ఉంటుంది. బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి మారిన సీనియర్ సంపాదకుడు, రాజకీయవేత్త చందన్ మిత్రా చేసిన వ్యాఖ్యలు ఇక్కడ సందర్బోచితమనిపి స్తుంది. పథకం ప్రకారం సాగిన బుద్దిజీవుల హత్య లైనా, దేశంలో పలుచోట్ల ఉన్మాదపు అల్లరిమూకలు జరిపిన కొట్టిచంపడాలయినా మన సమాజంలో బలపడుతున్న ఛాందసవాదానికి, మితిమీరిన అస హనానికి పరాకాష్ట! సదరు హంత కులకు వత్తాసుగా కొన్ని హిందూ మత సంస్థలవారు, పాలకపక్ష ఎంపీలు, కేంద్ర మంత్రులు చేసిన వాఖ్యల్ని ఆయా ప్రభుత్వాలు ఉపేక్షించాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీటిని గట్టిగా నియంత్రించి ఉండాల్సిందని రెండుసార్లు రాజ్యసభకు ప్రాతి నిధ్యం వహించిన చందన్ మిత్ర మరో సీనియర్ జర్నలిస్టు బర్కాదత్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో చేసిన ఈ వ్యాఖ్యలు సగటు పౌరుల్లోనూ ఆలోచనలు రేపు తాయి. నిరసనను కర్కశంగా అణచి వేయడం అప్రజాస్వామికమన్న సుప్రీం వ్యాఖ్యలు పాలకులకు కర్తవ్య బోధ చేస్తాయి. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పారదర్శకత.. పదేళ్ల పాఠం
సమకాలీనం ఈరోజు, రేపు... రెండురోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ‘సమాచార హక్కు జాతీయ వార్షిక సదస్సు‘లో ఆర్టీఐ క్షేత్రస్థాయి కార్యకర్తల్ని భాగస్వా ముల్ని చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇది ఉద్దేశపూర్వక చర్య, కేంద్రంలోని ఎన్డీయే విభిన్న వైఖరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా సాగుతున్న పద్ధతికి తిలోదకాలిచ్చి, కేంద్ర-రాష్ట్ర కమిషనర్లు, ప్రభుత్వాధికారులకు తోడు పౌర సమాజం నుంచి ఎంపిక చేసిన కొందరు పెద్దల్ని మాత్రమే ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్టీఐ కార్యకర్తల్ని ఆహ్వానించకపోవడం వల్ల చట్టం అమలుపై జనాభిప్రా యం సదస్సులో చర్చకు వచ్చే అవకాశం పోతోంది. లోగడ జరిగిన వార్షిక సదస్సులలో వారు భాగస్వాములు. వారిచ్చే సమాచారం ఆధారంగా చర్చ, కొన్ని నిర్ణయాలూ జరిగేవి. చట్టం అమలు మొదలై పదేళ్లు పూర్తయిన సందర్భంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇటువంటి చర్య ఉపేక్షించదగింది కాదనేది విమర్శ. ఈ పదేళ్లపాటు దేశంలో, అనేక ప్రతిబంధకాల నడుమ ఆర్టీఐ సజీవంగా ఉండటానికి కార్యకర్తలే ముఖ్య కారణం. రెండు తెలుగు రాష్ట్రాలుసహా, దేశంలో పదేళ్ల ఆర్టీఐ ప్రస్థానాన్ని పరిశీలిస్తే రెండంశాలు స్పష్టమౌతున్నాయి. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతకు పట్టంకట్టిన సమా చార హక్కు చట్టం విజయవంతమైంది. కానీ, దాని అమలే విఫలమై పలు విధాలుగా భంగపడింది, భంగపడుతూనే ఉంది. పదేళ్లు చిన్న సమయమా? పెద్ద సమయమా? అంటే, వేళ్లూనుకు పోయిన దుర్వవస్థను సమూలంగా సంస్కరించడానికి ఇది పెద్ద సమయం కాకపోవచ్చు. కానీ, ఆశించిన లక్ష్యాల సాధన దిశలో సరైన పంథాలోనే ఉన్నామా అని సమీక్షించుకోవడానికి పదేళ్లు సముచిత సమయమే! వాడుకున్నోళ్లకు వాడుకున్నంత పిండికొద్ది రొట్టె వంటిది ఆర్టీఐ చట్టం. ఉపయోగిస్తేనే ప్రయోజనాలు. దర ఖాస్తుదారు ఆశపడ్డట్టే సంబంధిత అధికారులు స్పందిస్తేనే ఫలితం. మొదట్లో అంతగా లేదు కానీ, రానురాను వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి దాదాపు 50 లక్షలకు చేరింది. రాష్ట్రం లోనూ, మొదటి ఏడాది 2005-06లో 8 వేల పైచిలుకున్న దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి సగటున 1.7 లక్షలకు చేరింది. గతంలో గోప్యంగా ఉండే రకరకాల సమాచారం ఆర్టీఐ పుణ్యమాని ఇప్పుడు తేలికగా ప్రజా బాహుళ్యం లోకి వస్తోంది. పౌర సదుపాయాలతోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ప్రయోజనాలు- హక్కులు, ప్రజాపంపిణీ, భూయాజమాన్య హక్కులు, పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు వంటి విషయాల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అధికార యంత్రాంగం సహజ వైఖరి, గోప్యంగా ఉంచే తత్వంవల్ల సాధారణ పరిస్థితుల్లో నిరాకరించే సమాచారాన్ని కూడా ఈ చట్టం కింద కోరినపుడు ఇవ్వాల్సి వస్తోంది. వేగం, ప్రభావం పెరగాలి పౌర కార్యాలయాల స్థాయిలోనే సమాచారం తేలిగ్గా లభించాలి. ఆ మేరకు అధికారుల్లో స్పందన, బాధ్యత-జవాబుదారీతనం పెరగాలి. అది లోపించిన పుడు కఠిన చర్యలు తీసుకునేలా సమాచార కమిషన్లు బలోపేతం కావాలి. అప్పీళ్లు, ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో వేగంతో పాటు అధికార యంత్రాం గంపై వారి తీర్పులు, ఆదేశాల ప్రభావం పెరగాలి. వారి ఆదేశాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో సహకరించాలి. రెండూ జరగట్లేదు. చట్టం స్ఫూర్తిని పరిరక్షిస్తూ జనహితంతో ఆలోచించి, స్వతంత్రంగా వ్యవహరించే వారిని కమిషనర్లుగా నియమించాలి. గత పదేళ్ల అనుభవం మాత్రం ఇందుకు భిన్నం. చాలా రాష్ట్రాల్లో కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు నియమితులైన కమిషనర్లలో 76 శాతం మంది రిటైర్డ్ అధికారులని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వీసులో ఎక్కువమార్లు ప్రజలకు సమాచారం నిరాకరించి పారదర్శకతకు మంగళం పాడినవారు, పునరావాస కేంద్రంలో భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమే అన్నది నిపుణుల అభిప్రాయం. ఆర్టీఐ అప్పీళ్లు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయి. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (సీఈఎస్) అధ్యయనం ప్రకారం, ఇప్పుడున్న వేగంతో వాటిని పరిష్కరిస్తే ఒక్కో రాష్ట్రంలో కేసుల పరిష్కారానికి 20, 30, 40 సంవత్సరాల కాలం పట్టొచ్చు. ఈ పంథా మారాలి. అన్ని కీలక పదవులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లకే అప్పగించనవసరం లేదు, ఆయా రంగాల్లో నిపుణులైన బయటి వ్యక్తులకు ప్రాధాన్యమివ్వండని 2011, 2013లో సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. భద్రతకు భరోసా కావాలి! ఆర్టీఐ పదేళ్ల ప్రస్థానంలో కార్యకర్తలపై జరిగిన హత్యలు ప్రమాద సంకేతం. ఓ పరిశీలన ప్రకారం, దేశవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలపై 260కి పైగా దాడులు జరిగి 49 మంది హత్యకు గురయ్యారు. వేళ్లూనుకున్న పాలనా దాష్టీకాలకు, రాజకీయ-అధికార యంత్రాంగానికి, అక్రమార్కులకూ మధ్య చీకటి సంబంధాలకు ఇది ప్రతీక! చాలా సందర్భాల్లో... దరఖాస్తుదారు సమాచారం కోరిన సంగతి, అక్రమాలతో సంబంధమున్న అసాంఘికశక్తులకు పౌర సమాచార అధికారు (పీఐవో)లే చేరవేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘వ్యాపం’కేసులో, ఆర్టీఐ కార్యకర్త నిర్దిష్ట సమాచారం కోరినట్టు పీఐవో ద్వారా విషయం తెలుసుకున్న ఓ డాక్డర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సతీష్శెట్టి హత్యకేసు విచారిస్తూ, ఆర్టీఐ కార్యకర్తలకు తగిన రక్షణ కల్పించా లని 2010లో ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అంతకు ముందే, 2009లో ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒక ఉత్తర్వు ఇప్పించింది. సమాచారం కోరే ఆర్టీఐ కార్యకర్తలపై అధికారులుగానీ, వారి పనుపున అసాంఘికశక్తులుగానీ బెదిరిం పులు, భౌతికదాడులకు పాల్పడ్డపుడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సత్వరం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఆ ఆదేశం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది, అమలు మాత్రం అనుమానమే! ‘సమాజ వైతాళికుల రక్షణ చట్టం’ (డబ్లూబీపీఏ)కు పట్టిన గ్రహణం వీడటం లేదు. సమాజ హితం కోరి ఆర్టీఐనో మరో ప్రగతిశీల చట్టాన్నో వాడే కార్య కర్తల రక్షణ కోసం విజిల్ బ్లోయర్స్ యాక్ట్‌ను ప్రతిపాదించారు. 2011లో అప్పటి యూపీయే ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. 2014 మే 9న అది ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. అటుపై అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభు త్వం దాన్ని కనీసం నోటిఫై చేయకుండా ఉంచింది. సవరణలతో నీరుగార్చి బలహీనంగా తెచ్చే యోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నీరుగార్చే వైఖరివల్లే అనర్థాలు ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచీ దాన్ని నీరుగార్చే యత్నాలు సాగు తున్నాయి.. చట్టం పుట్టి ఏడాది గడవకముందే, 2006లో ఫైళ్లలో రహస్యాల్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించేందుకు జరిగిన యత్నాన్ని పౌరసమాజం తిప్పికొట్టింది. మధ్యలో చాలా కుతంత్రాలు జరిగాయి. పర్యవేక్షణ విభాగ మంటూ, సిబ్బంది-శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వశాఖ పేరిట చట్టం స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి గండికొట్టిన సందర్భాలెన్నో! ఒక కేసులో సీఐసీ ఉత్త ర్వుల్ని ధ్రువపరుస్తూ, ‘మీరు సమాచారం ఇవ్వాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వంచించేలా రాజకీయ పక్షాల్ని పరిధి నుంచి తప్పించే చట్ట సవరణ యత్నాలు సాగుతున్నాయిపుడు. అంతకన్నా ప్రమాదకరంగా, మంత్రివర్గ సమావేశ పత్రాలు, ఆర్థికవ్యవహార పత్రాలు వంటి కీలక సమా చారాన్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించే ముసాయిదా ప్రతిపాదనలు వేచి ఉన్నాయి. అర్థంపర్థంలేని దరఖాస్తుల (ఫ్రీవోలస్)ని ముద్రవేసి వినతులకు పురిట్లోనే సంధి కొట్టడానికి, కార్యకర్తల్ని భయపెట్టడానికి ఇంకో యత్నం సాగుతోంది. ఇలా అసంబద్ధ దరఖాస్తులు చేసిన వారిపై 30 వేల రూపాయల వరకు జరిమానా, 3 మాసా లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నారు. పౌరసమాజం మరింత చైతన్యవంతమై ఆర్టీఐని కాపాడుకోవాల్సిన అవసరాన్ని పదేళ్ల చరిత్ర నొక్కిచెబుతోంది. పాలనలో పారదర్శకత పెంచి వ్యవస్థను జవాబుదారుగా నిలిపే క్రమంలో.. సమాచార సాధన చేయాల్సిందే, ఆర్టీఐ చట్టాన్ని ఉపకరణంగా వాడాల్సిందే! దిలీప్ రెడ్డి ( వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్). dileepreddy@sakshi.com -
కాసుల వేటలో.. కలుషిత పోటీ
సమకాలీనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995-2000 మధ్య దాదాపు 1,250 వుంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఉన్నత విద్యావుండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ నీరజారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ 2001లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లోగాని, రోజువారీ పిల్లలు చదివే ప్రైవేటు కాలేజీల్లోగాని జరగని ఆత్మహత్యలు, రెసిడెన్షియల్... అదీ కార్పొరేట్లకు చెందిన రెసిడెన్షియల్స్లోనే జరుగుతుండటాన్ని కమిటీ ఎత్తిచూపింది. భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకోవాలని మహోపాధ్యా యుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అభిలషించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు తరగతి గదుల్లో దేశ భవిష్యత్తును పూడ్చిపెడుతున్నారు. తల్లిదం డ్రుల ఆశల పందిళ్లపై లేత తీగెల వంటి పిల్లలు కాలేజీ ప్రాంగణాల్లో ప్రాణా లొదులుతున్నారు. హత్యలో, ఆత్మహత్యలో, ఒత్తిళ్ల నడుమ బలవన్మరణాలో.. ఏదైతేనేం, ఎదిగివస్తున్న పిల్లలు కన్నవాళ్లకూ, కడకు దేశానికీ కాకుండా పోతు న్నారు. ఎందుకీ పరిస్థితి? ఎవరు బాధ్యులు? మనిషి వికాసానికి హేతువైన విద్యనే ఫక్తు వ్యాపారం చేసిన దళారీలు, వారిని రాజకీయ-ఆర్థికావసరాల కోసం పెంచిపోషిస్తూ చేష్టలుడిగిన ప్రభుత్వాలు... వెరసి కాలేజీ విద్యావ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టుపట్టిపోయింది. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్య. అందులోనూ ప్రైవేటు కాలేజీల్లో, అదీ కార్పొరేట్ కళాశాలల్లో, మరీ ముఖ్యం గా రెసిడెన్షియల్స్ ఉన్నచోట నేడు భయోద్విగ్న వాతావరణం నెలకొంది. తెగించి ఆత్మహత్యలకు తలపడుతున్నది కొందరైతే, విద్య ముసుగులో వ్యాపారానికి తెగబడ్డ యాజమాన్యపు ఒత్తిళ్లలో నలిగి జీవచ్ఛవాలవుతున్న విద్యార్థులు వేనవేలు. మధ్యతరగతి ఆశల్ని ఆలంబన చేసుకొని కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు మాత్రం ఏటా కోట్లు గడిస్తున్నారు. విద్యార్థుల్లో వికా సం, తల్లిదండ్రుల్లో భరోసా పెంచాల్సిన ప్రభుత్వాలు, అందుకు బదులు ‘విద్యావ్యాపారులకు’ దన్నుగా నిలుస్తున్నాయి. వీరంతా కలసి... పిల్లల భవి ష్యత్తు అక్కడే బంగారమవుతుందని తల్లిదండ్రుల్ని భ్రమల్లో ముంచుతు న్నారు. విద్యార్థుల్లో సృజన నలిపేస్తున్నారు. మార్కుల వేటలో పరుగులు తీయిస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక, బాధ చెప్పుకునే వేదిక, వెంటిలేషన్ దొరక్క లోలోపల కుమిలి పోతున్నారు. కిందా మీదా పడి ర్యాంకులు సాధిం చిన వాళ్లలోనూ అత్యధికులు, ఆ తర్వాతి దశల్లో సృజనతో కూడిన జాతీయ- అంతర్జాతీయ పోటీల్ని తట్టుకోలేక తెట్టగిలపడుతున్నారు. దోషులెవరు? లోపమెక్కడ? కార్పొరేట్ కాలేజీల నిర్వహణ, ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల నిర్వహణ ఉభయ రాష్ట్రాల్లో ఎంతో లోపభూయిష్టంగా ఉంది. వందో, రెండు వందలో ప్రతిభావంతులైన విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించి, వారి ద్వారా సాధించిన ర్యాంకుల్ని పెట్టుబడిగా ప్రచారం చేసుకుంటూ కొన్ని లక్షల మంది నుంచి ఫీజులు పిండుకుంటున్నారు. మార్కులు, పర్సంటేజీలు, ర్యాంకులు... అం టూ వారి స్థాయికి మించిన భారం మోపుతున్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చే పిల్లలు అటు తల్లిదండ్రులు ఉన్నదంతా వెచ్చించి తమపైనే ఆశలు పెట్టు కున్న వైనం, ఇక్కడ మిగతా పిల్లలతో తాము పోటీ పడలేకపోతున్న దైన్యం, ఈ చదువులకు ఉద్యోగ హామీ లేని భవిష్యత్తేమవుతుందోనన్న భయం తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తోంది. విద్యార్థి-విద్యార్థి నడుమ, విద్యార్థులు-టీచర్ల మధ్య సుహృద్భావ వాతావరణమే లేని యాంత్రిక వ్యవస్థను ఈ కార్పొరేట్ సంస్థలు బలోపేతం చేశాయి. ఈ సంస్థల్లో టీచర్లెవరూ నిలకడగా ఉండరు, ఉండని వ్వరు. విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే టీచరే ఉండడు. అప్పుడ ప్పుడు తలిదండ్రులొచ్చినా, జైళ్లలో ఖైదీలతో ములాఖత్‌ల లాగా పొడిపొడి సంభాషణలతోనే సరిపెట్టే పరిస్థితులు కల్పిస్తారు తప్ప మనసు విప్పి మాట్లా డుకునే వాతావరణం ఉండదు. 1983 వరకు హాయిగా ఉన్న ఇంటర్ విద్యా వాతావరణం ఎంసెట్ పరీక్షా విధానం తర్వాత చెడిపోయింది. అప్పటి వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ బాగా స్థాయి ఉన్న వాళ్లకేననుకున్న మధ్య తరగతి అటు మొగ్గలేదు. ఎంసెట్ వచ్చాక, హైదరాబాద్‌తోపాటు విజయవాడ, గుం టూరులలో ఉన్న కొన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందిన మధ్య తరగతి పిల్లలకు కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు రావడంతో ఆశలు పెరిగాయి. దాన్ని సొమ్ము చేసుకోవడానికి, రోజులో కొన్ని గంటలు మాత్రమే శిక్షణని స్తున్న కోచింగ్ సంస్థలు, తామే ఎందుకు కాలేజీలు నడపరాదు? ఎందుకు విద్యను పెద్ద ఎత్తున వ్యాపార ఫార్ములా చే యకూడదు? అని ఆలోచించి, కార్పొరేట్ ఆచరణ ప్రారంభించాక ఇంటర్ విద్య వినాశకర దిశ పట్టింది. అడ్డూ, అదుపూ, నియంత్రణ నిల్ హైదరాబాద్‌లో అయ్యుప్ప సొసైటీలోనే నారాయుణ, శ్రీచైతన్య, గాయుత్రీ, గౌతమి, ఎన్ఆర్ఐ తదితర 70 వరకు కార్పొరేట్ కాలేజీలున్నారుు. అక్కడున్న భవనాలకు అనువుతుల్లేనట్టే ఆ కాలేజీలకూ అనువుతి ఉండదు. ‘క్రీం బ్యాచ్’ పేరుతో ఎక్కడెక్కడి వారినో ఒక చోటికి తెచ్చి ఇక్కడి భవనాల్లో చదివిస్తుం టారు. ఇంటర్మీడియుట్ ఒక్కొక్క సెక్షన్లో 88 వుందికి మించి ఉండరాదని నిబంధన. కాని, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో కాలేజీలో, ఒక్కో బ్రాంచీలో 9 సెక్షన్ల వరకు నడుపుతున్నారుు. 7 సెక్షన్లకు మించి ఉండకూడదు, అందు లోనూ విధిగా రెండు ఆర్ట్స్ గ్రూపులు ఉండాలి. అన్నిచోట్లా సైన్స్/మ్యాథ్స్ తప్ప ఆర్ట్స్ గ్రూపు ఉండదు. బోర్డు అనువుతి లేకుండా కాలేజీలను షిఫ్ట్ చేస్తారు. బోర్డు నిబంధనలను, టైంటేబుల్, అకడమిక్ క్యాలెండర్‌ను అవులు చేయురు. ఆదివారాలు, ఇతర సెలవుదినాలు, వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తారు. తనిఖీలకు వస్తే అదేస్థాయిలో మేనేజ్ చేస్తారు. అవసరం అరుుతే జరిమానా కడదామనే ఆలోచనతో ఉంటారు. ఆ తరువాత ప్రభుత్వ స్థారుులో మేనేజ్ చేస్తారు కనుక జరిమానా కూడా కట్టరు. ఇంటర్మీడియుట్ కాలేజీల్లో ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్ నిర్వహించడానికి వీల్లేదు. దాదాపు కార్పొరేట్ కాలేజీలన్నీ ఈ కోచింగులు కొనసాగిస్తున్నారుు. క్రీడల మాట అటుండనీ! క్రీడా మైదానాలే ఉం డవు. సాధారణంగా మొదట జూనియుర్ కాలేజీని ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన అనువుతి కోరుతూ ఒక దరఖాస్తును ఇంటర్మీడియుట్ బోర్డులో వేస్తారు తప్ప దాన్ని పట్టించుకోరు. ఒకవేళ అధికారులు వెంటపడితే, అనువుతి తీసుకొని దాన్ని కాలేజీ అం టారు. ఈ లోపున బోర్డు అధికారులు తనిఖీకి వచ్చి ఆ కాలేజీకి అనువుతి లేదని నిలదీస్తే, కాలేజీ కాదు అకాడమీ అంటారు. అకాడమీకి బోర్డు అను వుతి అవసరం లేదంటారు. పైగా అకాడమీని కాలేజీగా వూర్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం, మీ వద్దే జాప్యం జరుగుతోందనీ బుకాయిస్తారు. ఇదీ వరుస! కార్పొరేట్ విద్యాసంస్థలు కొనసాగిస్తున్న హాస్టళ్లకు ఇంటర్మీడియుట్ విద్యా కమిషనరేట్ అనువుతి లేదు. నారాయుణ వంటి కార్పొరేట్ పరిధిలో 90 శాతం హాస్టళ్లకు అనువుతుల్లేవు. రాష్ట్రంలో ఇంటర్మీడియుట్ విద్య కమిష నరేట్ కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లకు అనువుతులు ఇచ్చిన దాఖలాలూ లేవు. కొన్ని సాధారణ కాలేజీల వారు వూత్రమే హాస్టళ్లకు అనువుతులు తీసుకు న్నారు. హాస్టళ్లకు అనువుతి లేదెందుకని కార్పొరేట్ విద్యాసంస్థల వారిన డిగితే, ‘ఇవి స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లు, అనుమతి అవసరంలేద’ని చెబు తారు. ప్రభుత్వం నిర్ణరుుంచిన ఫీజు రెసిడెన్షియుల్ అరుుతే 3,250 వూత్రమే. కాని హాస్టల్, కాలేజీ ఫీజుల కింద బ్రాంచీని బట్టి రూ.85 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1,700 ప్రైవేటు కాలేజీలుంటే, ఏపీలో 2,009 ఉన్నాయి. తెలంగాణలో 402 ప్రభుత్వ కాలేజీలుండగా ఏపీలో 444 ఉన్నాయి. తెలంగాణలో 177 మోడల్ స్కూళ్లు, 300 రెసిడెన్షియుల్ స్కూళ్లు ఉండగా ఏపీలో 180 వరకు ఎయిడెడ్ స్కూళ్లు న్నాయి. వీటన్నింటిలో కలిపి రెండు రాష్ట్రాల్లో 9.50 లక్షల వుంది ఇంటర్ చదు వుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 3.10 లక్షల వుంది విద్యార్థులు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, రెసిడెన్షియుల్లలో కలిపి సుమారు రెండు లక్షల వుంది వరకు ఉంటారు. ఇక మిగిలిన ప్రైవేటు కాలేజీల్లో నాలుగున్నర లక్షల మంది ఉండగా అందులో మెజారిటీ కార్పొరేట్ కాలేజీల్లోనే చదువుతున్నారు. నీరజారెడ్డి కమిటీ సహా నివేదికలన్నిటికీ నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995-2000 మధ్య దాదాపు 1,250 వుంది విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఉన్నత విద్యావుండలి వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ నీరజారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ 2001లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిం ది. ప్రభుత్వ కాలేజీల్లోగాని, రోజువారీ పిల్లలు చదివే ప్రైవేటు కాలేజీల్లోగాని జరగని ఆత్మహత్యలు, రెసిడెన్షియల్... అదీ కార్పొరేట్లకు చెందిన రెసిడెన్షియ ల్స్లోనే జరుగుతుండటాన్ని కమిటీ ఎత్తిచూపింది. నిర్వహణా లోపాలు, అనారోగ్యకర పోటీ, తీవ్ర ఒత్తిళ్లు వంటి అంశాలే ప్రధాన కారణాలుగా నిర్ధా రించింది. నివారణకు సిఫారసులు చేసింది. ప్రతి ఆత్మహత్యపై న్యాయ విచా రణ జరపాలని, బోర్డు నియమావళిని కార్పొరేట్ కాలేజీలు కచ్చితంగా పాటించాలని, స్ట్రెస్ తొలగించడానికి నిర్ణీత గంటలే చదువు చెప్పాలని, కౌన్సి లింగ్‌కు ఒక మానసిక నిపుణుడిని అందుబాటులో ఉంచాలని, నెలకోసారి తల్లిదండ్రులు-విద్యార్థుల భేటీలుండాలని, క్రీడలకు సమయం కేటాయించా లని, సాయంత్రం 7- ఉదయం 7 మధ్య పిల్లలపై ఏ ఆంక్షలూ విధించవ ద్దని... ఇలా పలు కీలక సిఫారసులు చేసింది. కానీ, ఏ ఒక్క సిఫారసును అమ లుపరచడానికి ప్రభుత్వం ముందుకురాలేదు. తదనంతరం చాలా ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలకు ఇదే గతిపట్టింది. దాంతో, ప్రస్తుతం కడప నారాయణ కాలేజీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై విచా రణకు ‘ఉన్నతస్థాయి కమిటీ’ వేసినా, వాస్తవాలు వెలుగుచూసేనా అన్న అను మానాలు కలుగుతున్నాయి. ఇద్దరు విద్యార్థులు ఒకే గదిలో, ఒకేసారి ఆత్మ హత్య చేసుకోవడంపై సందేహాలున్నాయి. ఇవి ఆత్మహత్యలా? హత్యలా? తేలాలనే డిమాండ్ వస్తోంది. న్యాయ విచారణ కోరుతున్నా, ఎంపిక చేసిన కొందరు అధికారులతో ఓ కమిటీని వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే విమర్శలున్నాయి. అంతా కళ్లు తెరిస్తే తప్ప...! ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమై నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ కార్పొరేట్లు సృష్టించిన కాలుష్య వాతావరణం నుంచి ఇంటర్ విద్యను కాపాడాలి. కార్పొరేట్, ఇతర ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార ధోరణి వీడి, విద్యార్థి సర్వతోముఖ వికాసానికి దోహదపడాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అభిరుచి-శక్తి సామర్థ్యాల్ని బట్టే ఆయా కోర్సుల్లో చేర్పించాలి. మార్కు లు, ర్యాంకుల గోల వీడాలి. ‘ఇంతలేసి ఫీజులు కట్టి ఫలానా సంస్థలో వేశాం, ఇంకేం! వాళ్లే చూసుకుంటార’న్న ధీమాతో ఉండొద్దు. ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు, అకడమీషియన్లు, మేధావులు-ఆలోచనాప రులు.. అంతా కలసి సరైన ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించి, అమలుకు పట్టుబడితే తప్ప మన యువతకు భవిత లేదు, దేశ భవిష్యత్తుకు దిక్కులేదు. (వ్యాసకర్త: దిలీప్ రెడ్డి)