కాసుల వేటలో.. కలుషిత పోటీ | polluted compitation in money hunt | Sakshi
Sakshi News home page

కాసుల వేటలో.. కలుషిత పోటీ

Published Fri, Aug 21 2015 12:09 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

polluted compitation in money hunt

 సమకాలీనం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995-2000 మధ్య దాదాపు 1,250 వుంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఉన్నత విద్యావుండలి  వైస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ నీరజారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం కమిటీ వేసింది.
 ఆ కమిటీ 2001లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ కాలేజీల్లోగాని, రోజువారీ పిల్లలు చదివే ప్రైవేటు కాలేజీల్లోగాని జరగని ఆత్మహత్యలు, రెసిడెన్షియల్... అదీ కార్పొరేట్లకు చెందిన రెసిడెన్షియల్స్‌లోనే జరుగుతుండటాన్ని కమిటీ ఎత్తిచూపింది.

 
 భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకోవాలని మహోపాధ్యా యుడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అభిలషించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు తరగతి గదుల్లో దేశ భవిష్యత్తును పూడ్చిపెడుతున్నారు. తల్లిదం డ్రుల ఆశల పందిళ్లపై లేత తీగెల వంటి పిల్లలు కాలేజీ ప్రాంగణాల్లో ప్రాణా లొదులుతున్నారు. హత్యలో, ఆత్మహత్యలో, ఒత్తిళ్ల నడుమ బలవన్మరణాలో.. ఏదైతేనేం, ఎదిగివస్తున్న పిల్లలు కన్నవాళ్లకూ, కడకు దేశానికీ కాకుండా పోతు న్నారు. ఎందుకీ పరిస్థితి? ఎవరు బాధ్యులు? మనిషి వికాసానికి హేతువైన విద్యనే ఫక్తు వ్యాపారం చేసిన దళారీలు, వారిని రాజకీయ-ఆర్థికావసరాల కోసం పెంచిపోషిస్తూ చేష్టలుడిగిన ప్రభుత్వాలు... వెరసి కాలేజీ విద్యావ్యవస్థ తెలుగు రాష్ట్రాల్లో భ్రష్టుపట్టిపోయింది. ప్రధానంగా ఇంటర్మీడియట్ విద్య. అందులోనూ ప్రైవేటు కాలేజీల్లో, అదీ కార్పొరేట్ కళాశాలల్లో, మరీ ముఖ్యం గా రెసిడెన్షియల్స్ ఉన్నచోట నేడు భయోద్విగ్న వాతావరణం నెలకొంది. తెగించి ఆత్మహత్యలకు తలపడుతున్నది కొందరైతే, విద్య ముసుగులో వ్యాపారానికి తెగబడ్డ యాజమాన్యపు ఒత్తిళ్లలో నలిగి జీవచ్ఛవాలవుతున్న విద్యార్థులు వేనవేలు. మధ్యతరగతి ఆశల్ని ఆలంబన చేసుకొని కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు మాత్రం ఏటా కోట్లు గడిస్తున్నారు. విద్యార్థుల్లో వికా సం, తల్లిదండ్రుల్లో భరోసా పెంచాల్సిన ప్రభుత్వాలు, అందుకు బదులు ‘విద్యావ్యాపారులకు’ దన్నుగా నిలుస్తున్నాయి. వీరంతా కలసి... పిల్లల భవి ష్యత్తు అక్కడే బంగారమవుతుందని తల్లిదండ్రుల్ని భ్రమల్లో ముంచుతు న్నారు. విద్యార్థుల్లో సృజన నలిపేస్తున్నారు. మార్కుల వేటలో పరుగులు తీయిస్తున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక, బాధ చెప్పుకునే వేదిక, వెంటిలేషన్ దొరక్క లోలోపల కుమిలి పోతున్నారు. కిందా మీదా పడి ర్యాంకులు సాధిం చిన వాళ్లలోనూ అత్యధికులు, ఆ తర్వాతి దశల్లో సృజనతో కూడిన జాతీయ- అంతర్జాతీయ పోటీల్ని తట్టుకోలేక తెట్టగిలపడుతున్నారు.

 దోషులెవరు? లోపమెక్కడ?
 కార్పొరేట్ కాలేజీల నిర్వహణ, ముఖ్యంగా రెసిడెన్షియల్ కాలేజీల నిర్వహణ ఉభయ రాష్ట్రాల్లో ఎంతో లోపభూయిష్టంగా ఉంది. వందో, రెండు వందలో ప్రతిభావంతులైన విద్యార్థులపై దృష్టి కేంద్రీకరించి, వారి ద్వారా సాధించిన ర్యాంకుల్ని పెట్టుబడిగా ప్రచారం చేసుకుంటూ కొన్ని లక్షల మంది నుంచి ఫీజులు పిండుకుంటున్నారు. మార్కులు, పర్సంటేజీలు, ర్యాంకులు... అం టూ వారి స్థాయికి మించిన భారం మోపుతున్నారు. గ్రామీణ నేపథ్యంతో వచ్చే పిల్లలు అటు తల్లిదండ్రులు ఉన్నదంతా వెచ్చించి తమపైనే ఆశలు పెట్టు కున్న వైనం, ఇక్కడ మిగతా పిల్లలతో తాము పోటీ పడలేకపోతున్న దైన్యం, ఈ చదువులకు ఉద్యోగ హామీ లేని భవిష్యత్తేమవుతుందోనన్న భయం తీవ్ర ఒత్తిళ్లకు గురి చేస్తోంది. విద్యార్థి-విద్యార్థి నడుమ, విద్యార్థులు-టీచర్ల మధ్య సుహృద్భావ వాతావరణమే లేని యాంత్రిక వ్యవస్థను ఈ కార్పొరేట్ సంస్థలు బలోపేతం చేశాయి.

ఈ సంస్థల్లో టీచర్లెవరూ నిలకడగా ఉండరు, ఉండని వ్వరు. విద్యార్థుల మానసిక స్థితిని అర్థం చేసుకునే టీచరే ఉండడు. అప్పుడ ప్పుడు తలిదండ్రులొచ్చినా, జైళ్లలో ఖైదీలతో ములాఖత్‌ల లాగా పొడిపొడి సంభాషణలతోనే సరిపెట్టే పరిస్థితులు కల్పిస్తారు తప్ప మనసు విప్పి మాట్లా డుకునే వాతావరణం ఉండదు. 1983 వరకు హాయిగా ఉన్న ఇంటర్ విద్యా వాతావరణం ఎంసెట్ పరీక్షా విధానం తర్వాత చెడిపోయింది. అప్పటి వరకు ఇంజనీరింగ్, మెడిసిన్ బాగా స్థాయి ఉన్న వాళ్లకేననుకున్న మధ్య తరగతి అటు మొగ్గలేదు. ఎంసెట్ వచ్చాక, హైదరాబాద్‌తోపాటు విజయవాడ, గుం టూరులలో ఉన్న కొన్ని కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ పొందిన మధ్య తరగతి పిల్లలకు కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ సీట్లు రావడంతో ఆశలు పెరిగాయి. దాన్ని సొమ్ము చేసుకోవడానికి, రోజులో కొన్ని గంటలు మాత్రమే శిక్షణని స్తున్న కోచింగ్ సంస్థలు, తామే ఎందుకు కాలేజీలు నడపరాదు? ఎందుకు విద్యను పెద్ద ఎత్తున వ్యాపార ఫార్ములా చే యకూడదు? అని ఆలోచించి, కార్పొరేట్ ఆచరణ ప్రారంభించాక ఇంటర్ విద్య వినాశకర దిశ పట్టింది.
 అడ్డూ, అదుపూ, నియంత్రణ నిల్

 హైదరాబాద్‌లో అయ్యుప్ప సొసైటీలోనే నారాయుణ, శ్రీచైతన్య, గాయుత్రీ, గౌతమి, ఎన్‌ఆర్‌ఐ తదితర 70 వరకు కార్పొరేట్ కాలేజీలున్నారుు. అక్కడున్న భవనాలకు అనువుతుల్లేనట్టే ఆ కాలేజీలకూ అనువుతి ఉండదు. ‘క్రీం బ్యాచ్’ పేరుతో ఎక్కడెక్కడి వారినో ఒక చోటికి తెచ్చి ఇక్కడి భవనాల్లో చదివిస్తుం టారు. ఇంటర్మీడియుట్ ఒక్కొక్క సెక్షన్‌లో 88 వుందికి మించి ఉండరాదని నిబంధన. కాని, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో కాలేజీలో, ఒక్కో బ్రాంచీలో 9 సెక్షన్ల వరకు నడుపుతున్నారుు. 7 సెక్షన్లకు మించి ఉండకూడదు, అందు లోనూ విధిగా రెండు ఆర్ట్స్ గ్రూపులు ఉండాలి. అన్నిచోట్లా సైన్స్/మ్యాథ్స్ తప్ప ఆర్ట్స్ గ్రూపు ఉండదు. బోర్డు అనువుతి లేకుండా కాలేజీలను షిఫ్ట్ చేస్తారు. బోర్డు నిబంధనలను, టైంటేబుల్, అకడమిక్ క్యాలెండర్‌ను అవులు చేయురు. ఆదివారాలు, ఇతర సెలవుదినాలు, వేసవి సెలవుల్లోనూ తరగతులు నిర్వహిస్తారు.

తనిఖీలకు వస్తే అదేస్థాయిలో మేనేజ్ చేస్తారు. అవసరం అరుుతే జరిమానా కడదామనే ఆలోచనతో ఉంటారు. ఆ తరువాత ప్రభుత్వ స్థారుులో మేనేజ్ చేస్తారు కనుక జరిమానా కూడా కట్టరు. ఇంటర్మీడియుట్ కాలేజీల్లో ఐఐటీ, ఎన్‌ఐటీ కోచింగ్ నిర్వహించడానికి వీల్లేదు. దాదాపు కార్పొరేట్ కాలేజీలన్నీ ఈ కోచింగులు కొనసాగిస్తున్నారుు. క్రీడల మాట అటుండనీ! క్రీడా మైదానాలే ఉం డవు. సాధారణంగా మొదట జూనియుర్ కాలేజీని ప్రారంభిస్తారు. దానికి సంబంధించిన అనువుతి కోరుతూ ఒక దరఖాస్తును ఇంటర్మీడియుట్ బోర్డులో వేస్తారు తప్ప దాన్ని పట్టించుకోరు. ఒకవేళ అధికారులు వెంటపడితే, అనువుతి తీసుకొని దాన్ని కాలేజీ అం టారు. ఈ లోపున బోర్డు అధికారులు తనిఖీకి వచ్చి ఆ కాలేజీకి అనువుతి లేదని నిలదీస్తే, కాలేజీ కాదు అకాడమీ అంటారు. అకాడమీకి బోర్డు అను వుతి అవసరం లేదంటారు. పైగా అకాడమీని కాలేజీగా వూర్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాం, మీ వద్దే జాప్యం జరుగుతోందనీ బుకాయిస్తారు. ఇదీ వరుస! కార్పొరేట్ విద్యాసంస్థలు కొనసాగిస్తున్న హాస్టళ్లకు ఇంటర్మీడియుట్ విద్యా కమిషనరేట్ అనువుతి లేదు.

నారాయుణ వంటి కార్పొరేట్ పరిధిలో 90 శాతం హాస్టళ్లకు అనువుతుల్లేవు. రాష్ట్రంలో ఇంటర్మీడియుట్ విద్య కమిష నరేట్ కార్పొరేట్ కాలేజీల హాస్టళ్లకు అనువుతులు ఇచ్చిన దాఖలాలూ లేవు. కొన్ని సాధారణ కాలేజీల వారు వూత్రమే హాస్టళ్లకు అనువుతులు తీసుకు న్నారు. హాస్టళ్లకు అనువుతి లేదెందుకని కార్పొరేట్ విద్యాసంస్థల వారిన డిగితే, ‘ఇవి స్టూడెంట్ మేనేజ్డ్ హాస్టళ్లు, అనుమతి అవసరంలేద’ని చెబు తారు. ప్రభుత్వం నిర్ణరుుంచిన ఫీజు రెసిడెన్షియుల్ అరుుతే 3,250 వూత్రమే. కాని హాస్టల్, కాలేజీ ఫీజుల కింద బ్రాంచీని బట్టి రూ.85 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 1,700 ప్రైవేటు కాలేజీలుంటే, ఏపీలో 2,009 ఉన్నాయి. తెలంగాణలో 402 ప్రభుత్వ కాలేజీలుండగా ఏపీలో 444 ఉన్నాయి. తెలంగాణలో 177 మోడల్ స్కూళ్లు, 300 రెసిడెన్షియుల్ స్కూళ్లు ఉండగా ఏపీలో 180 వరకు ఎయిడెడ్ స్కూళ్లు న్నాయి.

వీటన్నింటిలో కలిపి రెండు రాష్ట్రాల్లో 9.50 లక్షల వుంది ఇంటర్ చదు వుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో దాదాపు 3.10 లక్షల వుంది విద్యార్థులు, మోడల్ స్కూళ్లు, ఎయిడెడ్, రెసిడెన్షియుల్‌లలో కలిపి సుమారు రెండు లక్షల వుంది వరకు ఉంటారు. ఇక మిగిలిన ప్రైవేటు కాలేజీల్లో నాలుగున్నర లక్షల మంది ఉండగా అందులో మెజారిటీ కార్పొరేట్ కాలేజీల్లోనే చదువుతున్నారు.

 నీరజారెడ్డి కమిటీ సహా నివేదికలన్నిటికీ నీళ్లు
 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995-2000 మధ్య దాదాపు 1,250 వుంది విద్యా ర్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో ఉన్నత విద్యావుండలి వైస్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ నీరజారెడ్డి ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం కమిటీ వేసింది. ఆ కమిటీ 2001లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిం ది. ప్రభుత్వ కాలేజీల్లోగాని, రోజువారీ పిల్లలు చదివే ప్రైవేటు కాలేజీల్లోగాని జరగని ఆత్మహత్యలు, రెసిడెన్షియల్... అదీ కార్పొరేట్లకు చెందిన రెసిడెన్షియ ల్స్‌లోనే జరుగుతుండటాన్ని కమిటీ ఎత్తిచూపింది. నిర్వహణా లోపాలు, అనారోగ్యకర పోటీ, తీవ్ర ఒత్తిళ్లు వంటి అంశాలే ప్రధాన కారణాలుగా నిర్ధా రించింది. నివారణకు సిఫారసులు చేసింది. ప్రతి ఆత్మహత్యపై న్యాయ విచా రణ జరపాలని, బోర్డు నియమావళిని కార్పొరేట్ కాలేజీలు కచ్చితంగా పాటించాలని, స్ట్రెస్ తొలగించడానికి నిర్ణీత గంటలే చదువు చెప్పాలని, కౌన్సి లింగ్‌కు ఒక మానసిక నిపుణుడిని అందుబాటులో ఉంచాలని, నెలకోసారి తల్లిదండ్రులు-విద్యార్థుల భేటీలుండాలని, క్రీడలకు సమయం కేటాయించా లని, సాయంత్రం 7- ఉదయం 7 మధ్య పిల్లలపై ఏ ఆంక్షలూ విధించవ ద్దని... ఇలా పలు కీలక సిఫారసులు చేసింది.

కానీ, ఏ ఒక్క సిఫారసును అమ లుపరచడానికి ప్రభుత్వం ముందుకురాలేదు. తదనంతరం చాలా ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలకు ఇదే గతిపట్టింది. దాంతో, ప్రస్తుతం కడప నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై విచా రణకు ‘ఉన్నతస్థాయి కమిటీ’ వేసినా, వాస్తవాలు వెలుగుచూసేనా అన్న అను మానాలు కలుగుతున్నాయి. ఇద్దరు విద్యార్థులు ఒకే గదిలో, ఒకేసారి ఆత్మ హత్య చేసుకోవడంపై సందేహాలున్నాయి. ఇవి ఆత్మహత్యలా? హత్యలా? తేలాలనే డిమాండ్ వస్తోంది. న్యాయ విచారణ కోరుతున్నా, ఎంపిక చేసిన కొందరు అధికారులతో ఓ కమిటీని వేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందనే విమర్శలున్నాయి.
 అంతా కళ్లు తెరిస్తే తప్ప...!
 ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమై నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ కార్పొరేట్లు సృష్టించిన కాలుష్య వాతావరణం నుంచి ఇంటర్ విద్యను కాపాడాలి. కార్పొరేట్, ఇతర ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాపార ధోరణి వీడి, విద్యార్థి సర్వతోముఖ వికాసానికి దోహదపడాలి.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లల అభిరుచి-శక్తి సామర్థ్యాల్ని బట్టే ఆయా కోర్సుల్లో చేర్పించాలి. మార్కు లు, ర్యాంకుల గోల వీడాలి. ‘ఇంతలేసి ఫీజులు కట్టి ఫలానా సంస్థలో వేశాం, ఇంకేం! వాళ్లే చూసుకుంటార’న్న ధీమాతో ఉండొద్దు. ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులు, సామాజిక వేత్తలు, అకడమీషియన్లు, మేధావులు-ఆలోచనాప రులు.. అంతా కలసి సరైన ప్రత్యామ్నాయాల్ని ప్రతిపాదించి, అమలుకు పట్టుబడితే తప్ప మన యువతకు భవిత లేదు, దేశ భవిష్యత్తుకు దిక్కులేదు.
 

 

(వ్యాసకర్త: దిలీప్ రెడ్డి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement