sammative
-
వెబ్సైట్లో మూల్యాంకన విధివిధానాలు
కర్నూలు(కొండారెడ్డిఫోర్టు): ఎస్సీఈఆర్టీ తయారు చేసిన సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించిన విధివిధానాలను డీఈఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి ఓ ప్రకటనలో ప్రధానోపాధ్యాయులు/కరస్పాండెంట్లను కోరారు. ఇందులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మూల్యంకన విధివిధానాలు ఉన్నాయన్నారు. అంతేకాక ఆరు నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టుల జవాబు పత్రాల బండిళ్లను ఈనెల 13వ తేదీలోపు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో అందజేయాలని ఆయన ఆదేశించారు. -
రేపటి నుంచి సమ్మెటివ్–1 పరీక్షలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని అన్ని యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలను నిర్వహించాలని డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో ఆదేశించారు. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు పరీక్షలను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరారు. ప్రశ్న పత్రాలను సంబంధిత కీ సెంటర్ల నుంచి ఆథరైజేషన్ లెటర్, డీసీఈబీకి చెల్లించిన కాంట్రిబ్యూషన్ రసీదును సమర్పించి పొందాలని సూచించారు.