Sampark abhiyan
-
బీజేపీ విస్తరణకు సంపర్క్ అభియాన్
సాక్షి, హన్మకొండ: పార్టీ విస్తరణలో భాగంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రావు పద్మ తెలిపారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 30వ తేదీ సోమవారం హన్మకొండ రాంనగర్లోని నిత్య బాంక్వెట్ హాల్లో జరిగే సదస్సులో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే, నగరంలోని పలువురు ప్రముఖులను కలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి మాట్లాడగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయకులు సంగని జగదీశ్వర్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
లోటు తగ్గింది.. రాబడి పెరిగింది
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సంగారెడ్డి క్రైం: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సంపర్క్ అభియాన్’ పేరిట వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమం లో దత్తాత్రేయ పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వల్ల నేడు ఆర్థిక పరిస్థితి లోటు నుంచి పరిపుష్టికి చేరుకుందని చెప్పారు. ఇదివరకు లోటు బడ్జెట్ ఉండేదని బీజేపీ అధికారంలోకి వచ్చాక రాబడి పెరిగిందన్నారు. రూ. 500 కోట్లతో ఓడీఎఫ్ విస్తరణ సంగారెడ్డి మండలం ఎద్దుమైలారంలోని ఓడీఎఫ్ కర్మాగారాన్ని రూ.500 కోట్లతో విస్తరిస్తున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు. పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగ కల్పించడానికి కేంద్ర రక్షణ శాఖమంత్రితో మాట్లాడతానని చెప్పారు. బీడీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి రూ.45 వేల నుంచి రూ.లక్ష వరకు ప్రతిపాదనలు పంపినట్టు తెలిపారు.