ఈ ఇసుక మనదే!
ప్రభుత్వం అనుకున్నట్లుగా, ఆమోదించినట్లుగా నిబంధనలు అమలైతే ఇక జిల్లాలోఇసుక అక్రమ వ్యాపారానికి తెర పడినట్లే. పట్టాభూములలో ఇసుకమేటల తొలగింపు పేరిట మంజీరా నదిని తోడేసే ‘ఇసుక మాఫియా’కు కాలం చెల్లినట్లే. ఎడాపెడా అక్రమ తవ్వకాలు, తరలింపు ఆటలు సాగే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ద్వారా కావాల్సినంత ఇసుకను ప్రజలకు సరఫరా చేసేందుకు సర్కారే కసరత్తు చేయబోతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఇసుక మాఫియాను కట్టడి చేసేం దుకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలు చేయబోతోంది. ఇందు కోసం జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ, భూగర్భ జలవనరుల శాఖ, నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు ఎనిమిది రీచ్‌లను గుర్తించి పర్యావరణశాఖ ఆమోదంతో ప్రభుత్వానికి నెలరోజుల కిందటే ప్రతిపాదనలు పంపించారు. కొత ఇసుక విధానంలో భాగంగా ప్రభుత్వం వీటికి అమోదం తెలిపింది. కోటగరి మండలం కొడిచర్లలో రెండింటితోపాటు బిచ్కుంద, బీర్కూరు, బో ధన్ మండలాలలో మరో ఆరు రీచ్‌లను ఇందులో ప్రతి పాదించారు.
మొత్తం 104 హెక్టార్ల నుంచి 14,27,400 క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయవచ్చని అధికారుల బృం దం భావించింది. ఈ మేరకు మొదటి విడతగా పట్టాభూములకు చెందిన ఐదు రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకా లు జరిపేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే బీర్కూర్ మండలంలోని బరంగేడ్గి గ్రామ శివారులోని మంజీరా తీర ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఇసుక క్వారీ స్థలాన్ని మైనిం గ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. బరంగేడ్గి గ్రా మానికి చెందిన వడ్ల సావిత్రి, వడ్ల లక్ష్మణ్, నీలకంఠప్ప కు చెందిన 4.20 ఎకరాల స్థలంలో ఇసుక మేటలు నిండాయని తమ కార్యాలయానికి ప్రతిపాదనలు అందిన నేపథ్యంలో పరిశీలించామని వెల్లడించారు. కోటగిరి మండలంలోని పొతంగల్, కారేగాం,మద్నూర్, బిచ్కుంద మం డలంలోని పుల్కల్, కుర్ల గ్రామాలలో ఇసుక పాయింట్ల ను గుర్తించామన్నారు. ఇక్కడ త్వరలోనే కొత్త మార్గదర్శకాల ప్రకారం తవ్వకాలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
లెక్కకు మించి తవ్వకాల కథ కంచికి చేరినట్లేనా!
పట్టాభూములలో ఇసుక మేటల తొలగింపు పేరిట ‘మాఫియా’ అక్రమ వ్యాపారం చేస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో క్వారీలను సీజ్ చేసిన ప్రభుత్వం, లెక్కకు మిం చిన తవ్వకాల ‘ఫైలు’ మూసేసినట్లేనా? అన్న సందేహా లు వ్యక్తమవుతున్నాయి. కోటగిరి, బిచ్కుంద, బీర్కూరు మండలాలలో మంజీర చుట్టూ రెండు నెలలపాటు ఏడు ఇసుక క్వారీలు నిరాటంకంగా నడిచాయి. ఈ ఇసుక మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన కొందరు పెద్దల హస్తం, ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇంకొందరి ప్రత్యక్షపాత్రపైనా బహిరంగంగా నే చర్చ జరిగింది.
చివరకు చినికి చినికి గాలివానలా మారిన ఇందూరు జిల్లాలోని ఇసుక మాఫియా సెగ రా జధానికి తాకింది. యుద్ధప్రాతిపదికన ఇసుక క్వారీలపై అధికార యంత్రాంగం దాడులు నిర్వహించింది. పెద్ద ఎత్తున చర్యలకు దిగినప్పటికీ ‘ఇసుక మాఫియా’ అప్పటికే అనుమతులను మించి ఐదారు రెట్లు ఎక్కువ తోడేసింది. వచ్చే వేసవిని విస్మరించిన కొందరు వ్యాపారులు బరితెగించి రక్షిత మంచినీటి పథకాల చుట్టూ తవ్వకాలు చేపడితే, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్లు మూసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు తాగునీటి ఎద్దడి ఆ ‘వాటర్ స్కీమ్’ పరిధిలో తీవ్రమైంది.
విజిలెన్స రంగంలోకి దిగినా!
ఇదిలా ఉండగా నిబంధనలు విస్మరించి ఐదారు రెట్లు ఎక్కువగా తవ్వకాలు జరిపిన వైనంపై ‘విజిలెన్స్’ రం గంలోకి దిగినా, పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అక్రమ తవ్వకాలపై విచారణ జరిపి ఫెనాల్టీ వేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త క్వారీలను సర్కారు శ్రీకారం చుడుతుండటం చర్చనీయాంశమవుతోంది.