sandstorms
-
ఆకాశమే విరిగిపడిందా అన్నట్టు ఇసుక తుపాను, క్షణాల్లో..
ప్రకృతి కోపిస్తే.. దాన్ని తట్టుకోడం కష్టం. ఎన్నడూలేని విధంగా చైనాలో ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసే వర్షం. ఉధృతంగా ప్రవహించే వరద. అనుకోకుండా విరుచుకుపడే ఇసుక తుఫాన్లు. ఏం జరుగుతుందో.. తెలియని ప్రజల పరిస్థితి. ఏ దేవుడైనా కాపాడకపోతాడా.. అని ఎదురు చూసే జనం. కళ్ల ముందే కన్న వారు, అయిన వారు కొట్టుకుపోవడం. ఇలా ఒకటా.. రెండా.. చెప్పలేనిని కష్టాలు. ఊహకందని విపత్తులు చైనాను వెంటాడుతున్నాయి. బీజింగ్: చైనాలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. ఓ విపత్తు నుంచి మరో విపత్తు వచ్చి పడుతూ అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. చైనాలోని వాయువ్య ప్రాంతంలో 100 మీటర్ల పొడవున ఎత్తైన ఇసుక తుపాను డున్హువాంగ్ నగరాన్ని ముచ్చెత్తింది. ఆకాశమే విరిగిపడిందా అన్నట్టు అంతెత్తున ఇసుక తుపాన్ నగరాన్ని కమ్మేసింది. క్షణాల్లో నివాస సముదాయాలు, దుకాణాలు, ఆఫీసులు, రోడ్లు మొత్తం ఇసుక, దుమ్ముతో నిండిపోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇసుక ప్రభావంతో స్థానికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనేక మంది పౌరులకు, ముఖ్యంగా వృద్ధులకు శ్వాసకోశ సమస్య ఉన్న రోగులకు కష్టకాలంగా దాపురించింది. గోబీ ఎడారి అంచున ఉన్న ఈ నగరం తరచుగా ఇలాంటి విపత్కర పరిస్థితులకు గురవుతూనే ఉంది. Sandstorm today, #Dunhuang #沙尘暴 #敦煌 pic.twitter.com/XDpyhlW0PV — Neil Schmid 史瀚文 (@DNeilSchmid) July 25, 2021 -
ఘోర ప్రమాదం: ఇసుక తుఫాను బీభత్సం... 22 వాహనాలు ఢీ
వాషింగ్టన్(కానోష్): అమెరికాలోని ఉతాహ్ రాష్ట్రంలో ఇసుక తుఫాను కారణంగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కానోష్ నగరంలోని ఇంటర్ స్టేట్ హైవే 15 మీద ఈ ప్రమాదం జరిగింది. ఇసుకు తుఫాను కారణంగా రోడ్డు స్పష్టంగా కనిపించకపోవడంతో, దాదాపు 22 వాహనాలు ఢీకొట్టుకొని ఒకదానిపైకి మరొకటి ఎక్కాయి. దీంతో 8 మంది మరణించారు. బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు ఎయిర్ అంబులెన్సులను ఉపయోగించారు. ఇసుక తుఫాను, రోడ్డు ప్రమాదం కారణంగా హైవే 15ను ఆదివారం మూసేశారు. -
‘ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉంది’
నియామీ : వందల అడుగుల ఎత్తైన ఇసుక తుఫాను నైజర్ దేశ రాజధాని నియామీపై దండెత్తింది. అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. తుఫాను రాకతో వాతవరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి. తుఫాను ప్రభావంతో నగరంలోని కొన్ని ప్రదేశాలు ఎరుపు, ఆరెంజ్ రంగులో దర్శనమిచ్చాయి. అనంతరం నగరం మొత్తం దుమ్మతో నిండిపోయింది. అయితే ఆ వెంటనే వర్షం కురవటంతో పరిస్థితి చక్కబడింది. నియామీలో ఇసుక తుఫాన్లు రావటం కొత్తేమీ కాదు. సహారా ఎడారి కారణంగా అక్కడ తరచుగా తుఫాన్లు వస్తుంటాయి. ( చిలుక నిర్ణయం: యాజమాని షాక్! ) జనవరినుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఇవి వస్తుంటాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ ఇసుక తుఫాను ఎంత భయంకరంగా ఉంది.. అపోకలిప్టో సినిమాలోని ఓ సీన్‌ను తలపిస్తోంది ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( ఏటీఎమ్ చోరీకి యత్నించిన కోతి ) -
రాజస్థాన్‌లో మళ్లీ ఇసుక తుఫాన్ బీభత్సం
జైపూర్: రాజస్థాన్‌ను భారీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతోంది. రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఇసుక తుఫాన్ విరుచుకుపడింది. బికనీర్ జిల్లాలో ఇసుక తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. బీకనీర్ జిల్లా ఖజువాలా ప్రాంతంలో భారీ ఇసుకు తుఫాన్ చెలరేగుతుండటంతో అక్కడ పరిస్థితి భీతావహంగా ఉంది. ప్రకృతి బీభత్సంగా ఉండటం.. ఆకాశం అంత ఎత్తు నుంచి ఇసుక విరుచుకుపడుతుండటంతో స్థానికులు బెంబేలెత్తుతున్నారు. ఇసుక తుఫాన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు భయపెట్టేలా ఉన్నాయి. ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని అల్వార్, భరత్ పూర్ ప్రాంతాల్లో పెనువేగంతో వీచిన గాలులు, ఇసుక తుఫాన్.. పెనువిధ్వంసం మిగిల్చింది. యూపీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. మళ్లీ ఇసుక తుఫాన్ ముంచెత్తుతుండటంతో రాజస్థాన్‌లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తరాది రాష్ట్రాలకు హెచ్చరిక 13 ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. పిడుగులు పడే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది. రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది. -
భయంకర ఇసుక తుఫాను!
చైనాః హాలీవుడ్ సన్నివేశాలను తలపించే భయంకర ఇసుక తుఫాను కస్గర్ నగరాన్ని వణికిస్తోంది. చైనా జిన్జియాంగ్ ఇగూర్ అటనమస్ ప్రాంతంలోని కాష్గర్ ఫ్రిఫెక్చర్ లో సంభవించిన ఇసుక తుఫానుతో అక్కడి గృహాలన్నీ కప్పడిపోయాయి. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తున్న ఇసుక... అతి పెద్ద భవనానలను సైతం కప్పేస్తుండటంతో పరిస్థితి అతి భయానకంగా మారిపోయింది. కాష్గర్ పరిస్థితిని సమీక్షించిన స్థానిక వాతావరణ అధికారులు రెండో ప్రమాద హెచ్చరికగా అరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. వాయువ్య చైనా జిన్జియాంగ్ ఇగూర్ ప్రాంతంలో ఏర్పడ్డ తీవ్ర ఇసుక తుపానుతో.. టంగ్జంక్ నగరం, మిన్ ఫెంగ్ కౌంటీలు భారీ ఇసుక కెరటాల్లో చిక్కుకుపోయాయి. ఆ రెండు ప్రాంతాలూ ఇసుక కెరటాలతో తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో అధికారులు స్థానికులను ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ళనుంచి బయటకు రావద్దని హెచ్చిరికలు జారీ చేశారు. అక్కడి పరిస్థితిపై స్థానికులు చిత్రించిన వీడియో ఇప్పడు యూట్యూబ్ వినియోగదారుల్లో ఆత్రుతను నింపుతోంది. తుఫాన్లతో నీటికి కొట్టుకుపోయే నగరాలను చూసేందుకే అలవాటు పడ్డ జనం... ఇసుక తుఫానుతో ఏకంగా నగరాలకు నగరాలనే కప్పేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.