sankirtana
-
తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకనే ఇలా..!
జగిత్యాల: ఉన్నత చదువులు చదివించాలనే తల్లిదండ్రుల తపన.. చదువు కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉండ లేక తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యయత్నంకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలావనపర్తికి చెందిన కనుకట్ల కమల్–రేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు సంకీర్తన జూలపల్లి మండలం తెలుకుంట కసూర్తిభా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో ఇంట్లో ఉన్న సంకీర్తనను పాఠశాలలు ప్రారంభమైన తర్వాత తల్లిదండ్రులు కస్తూరిబా విద్యాలయానికి వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక కొంత సమయం తీసుకుంది. అయితే ఈనెల 15న రేపు విద్యాలయానికి తీసుకెళ్తానని, వస్తువులు సర్దుకోవాలని కూతురు సంకీర్తనకు తండ్రి కమల్ చెప్పి రైస్‌మిల్లులో పనిచేసేందుకు వెళ్లాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఇష్టం లేక మానసిక వేదనకు గురై ఇంట్లో రేకుల షెడ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే తండ్రికి సమాచారం అందించి పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి కమల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
క్రీడాకారిణి సంకీర్తనకు ఎంబీబీఎస్ సీటు ఇవ్వండి!
విజయవాడ స్పోర్ట్స్: బీజింగ్(చైనా)లో 2015 మే 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఫెన్సింగ్ ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి సంకీర్తనకు ఎంబీబీఎస్ సీటు కేటాయించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆమె లాయర్లు శుక్రవారం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.అనురాధకు అందజేశారు. ఏపీ మెడికల్ కౌన్సెలింగ్‌లో స్పోర్ట్స్ కోటా కింద సంకీర్తన దరఖాస్తు చేసుకోగా, ఆమె సర్టిఫికెట్ల పరిశీలనకు శాప్‌కు పంపించారు. అయితే శాప్ ఇచ్చిన ప్రాధాన్యతా క్రమం మేరకు సీటు లభించకపోవడంతో సంకీర్తన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై దీపక్ మిశ్రా, ఉదయ్ ఉమేష్లలిత్లతో కూడిన 4వ కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ప్రతిభ గణన సక్రమంగా నిర్వహించి ప్రాధాన్యత ప్రకారం ఎంబీబీఎస్ సీటు కేటాయించాలని, ఇందుకోసం వారం గడువు ఇస్తున్నట్లు కోర్టు ఆదేశాల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించిన పత్రాలను సంకీర్తన, ఆమె న్యాయవాదులు, తల్లిదండ్రులు హెల్త్ వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.అనురాధకు అందజేశారు. అప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియ ముగియడంతో దీనిపై అనురాధ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలను శాప్ పంపుతామని పేర్కొన్నారు.