తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకనే ఇలా..! | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకనే ఇలా..!

Published Sun, Jul 23 2023 12:48 AM | Last Updated on Sun, Jul 23 2023 9:43 AM

- - Sakshi

జగిత్యాల: ఉన్నత చదువులు చదివించాలనే తల్లిదండ్రుల తపన.. చదువు కోసం తల్లిదండ్రులకు దూరంగా ఉండ లేక తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యయత్నంకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిలావనపర్తికి చెందిన కనుకట్ల కమల్‌–రేఖ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.

చిన్న కూతురు సంకీర్తన జూలపల్లి మండలం తెలుకుంట కసూర్తిభా గాంధీ విద్యాలయంలో తొమ్మిదో తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో ఇంట్లో ఉన్న సంకీర్తనను పాఠశాలలు ప్రారంభమైన తర్వాత తల్లిదండ్రులు కస్తూరిబా విద్యాలయానికి వెళ్లాలని సూచించారు. తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక కొంత సమయం తీసుకుంది. అయితే ఈనెల 15న రేపు విద్యాలయానికి తీసుకెళ్తానని, వస్తువులు సర్దుకోవాలని కూతురు సంకీర్తనకు తండ్రి కమల్‌ చెప్పి రైస్‌మిల్లులో పనిచేసేందుకు వెళ్లాడు.

తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఇష్టం లేక మానసిక వేదనకు గురై ఇంట్లో రేకుల షెడ్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే తండ్రికి సమాచారం అందించి పెద్దపల్లి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి కమల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement