sarada peeth
-
విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ కు దక్కిన భాగ్యం
-
విశాఖ శారదపీఠం ఆధ్వర్యంలో..
-
శ్రీ శారదాపీఠం... ఉత్తరపథం
ఆదిశంకరుల మార్గాన్ని అనుసరిస్తూ అద్వైతసిద్ధాంత ప్రచారకులుగా మన నేల మీద నడయాడిన మహోపాధ్యాయులు ఎందరో ఉన్నారు. వారిలో అగ్రేసరునిగా చెప్పదగ్గవారు జగద్గురు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతీ మహాస్వామి. వారు శంకరాద్వైతానికి ప్రతీక. ఆ కోవలో చేరేవారే విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి. సచ్చిదానందేంద్రస్వామి నిరూపించిన నిర్గుణ బ్రహ్మవాదాన్ని పుణికి పుచ్చుకుని స్వరూపానందేంద్ర ధర్మపరిరక్షకులుగా నేటి భారతాన దర్శనమిస్తున్నారు.సనాతన ధర్మ పరిరక్షణమే సమాజానికి ఆవశ్యకమని చాటి చెబుతున్నారు. ధర్మపోరాటాలు చేపడుతున్నారు. అలాంటి స్వరూపానందేంద్రులవారు 1990 దశకంలో విశాఖపట్నంలోని పెందుర్తి సమీపాన చినముషిడివాడ గ్రామంలో వేదోక్తంగా నెలకొల్పిన శారదా పీఠం దినదిన ప్రవర్థమానమవుతూ ఎందరికో మార్గనిర్దేశం చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన శ్రీ విశాఖ శ్రీశారదాపీఠ వైభవం రాబోయే తరాల్లోనూ వెల్లివిరియాలన్న లక్ష్యంతో స్వరూపానందేంద్ర స్వామి పీఠం భావి బాధ్యతలను ఇరవై ఆరేళ్ల బ్రహ్మచారి కిరణ్ కుమారశర్మకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. కుమారశర్మకు శిష్యతురీయాశ్రమ దీక్షను స్వయంగా తానే ప్రదానం చేయదలిచారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం... భారతీయ ధర్మపీఠాలు నిత్యం ప్రవహించే జీవనదులు. జనబాహుళ్యంలో చేతన నింపగల దివ్యధామాలు. ప్రజాళిని మంచి మార్గాన నడిపించే భక్తి సదనాలు. ఆదిశంకరాచార్యుని మొదలు ఇప్పటి మహాస్వాముల వరకూ ఎందరెందరో స్వధర్మ సంరక్షణకు పాటుపడుతున్నారు. శ్రుతి, స్మృతి పురాణాలను మరింతగా సమన్వయం చేస్తున్నారు. ప్రకరణ గ్రంథాల సాయంతో జీవితసత్యాలను వెల్లడి చేస్తున్నారు. పరబ్రహ్మతత్వాన్ని ఎరుకపరుస్తున్నారు. ఇలాంటి మహనీయుల పరంపర ఆగిపోకూడదు. వీరు నిర్వహించే పీఠాలు నిత్యమై శాశ్వతమై ధర్మప్రచారాన్ని నిర్వహిస్తూనే ఉండాలి. ఈ యోచనతోనే భారతీయ ధర్మకేంద్రాల అధిపతులు తమ ఉత్తరాధికారిగా ఒకానొక శిష్యుణ్ణి ఎంపిక చేసుకుంటారు. భావి మహాస్వామిగా ఆ బాలసన్యాసిని ప్రకటిస్తారు. శంకరభగవత్పాదులు ప్రారంభించిన పూరీ, శృంగేరీ, ద్వారక, జ్యోతిర్మఠాలు సహా వివిధ సంప్రదాయ పీఠాలెన్నో పరంపరానుగతంగా ఈ సరళిలోనే ముందుకు సాగుతున్నాయి. అజరామరమై విరాజిల్లుతున్నాయి. ఈ ధర్మపీఠాలకు నియుక్తులైన ఉత్తరాధికారులు భవిష్యత్తులో జగద్గురు స్థానాన్ని చేపట్టవలసి ఉంటుంది. జాతికి నీతిని నేర్పవలసి ఉంటుంది. సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడవలసి ఉంటుంది. శంకర పదం.. స్వరూప పథం.. తురీయాశ్రమ ధర్మాన్ని భారతీయ ఉపనిషద్సారం విడమరిచి చెప్పింది. మానవజన్మకు సంబంధించిన జాగృత, స్వప్న, సుషుప్తావస్థలను దాటి నాలుగవదశకు చేరిన చతుర్థశ్రేణి అశ్రమమే తురీయాశ్రమ సన్యాసం. సర్వసంగాలను తెంచుకుని బ్రహ్మజ్ఞానాన్ని అనుసరిస్తూ సన్యాసి తన జీవితాన్ని గడపవలసి ఉంటుంది. ఇలాంటి సన్యాసాశ్రమం స్వీకరించడానికి ధర్మనిష్ఠతో పాటు, స్వీయ ఆత్మను తెలుసుకోవడం పునాది అవుతుంది. శారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులవుతున్న కిరణ్కుమారశర్మ ఈ విషయంలో పూజనీయులు. వేదవిద్యను ఆకళింపు చేసుకున్న వేత్తలు. కనక దుర్గమ్మ సాక్షిగా.. కనకదుర్గమ్మ పాదాలచెంత ఈ ఉత్తరాధికార నియామకాన్ని ఒక మహత్కార్యంగా జరిపించాలని స్వరూపానందేంద్ర తలపోశారు. విజయవాడ కృష్ణా నది ఒడ్డున ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం జయదుర్గా తీర్థాన్ని ఇందుకు వేదికగా శ్రీ చరణులు ఖరారు చేశారు. జూన్ 15, 16, 17 తేదీల్లో వేదవేద్యుల సన్నిధిలో ఆహితాగ్ని సాక్షిగా కిరణ్కుమారశర్మ సన్యాసాశ్రమ స్వీకరణ ఉత్సవం ఘనంగా జరిగేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వేదవిహితమైన అగ్నికార్యాలు ఏర్పాటవుతున్నాయి. సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. శాస్త్ర వాక్యార్థ సభలు సాకారమవుతాయి. వైశ్వానర స్థాలీపాకం, విరజా హోమాలూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతాయి. ప్రాచీన, నవీన గురువందనాలు సభక్తికంగా వీటికి జతపడతాయి. బాలస్వామికి యోగపట్టాను శ్రీ చరణులు అనుగ్రహిస్తారు. ఈ మహత్కార్యంలో భాగం పంచుకునేందుకు ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాలనుంచీ భక్తకోటి తరలిరానుంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈ.ఎస్.ఎల్. నరసింహన్, ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖరరావు, వై.ఎస్. జగన్మోహనరెడ్డి తదితర పెద్దల సమక్షంలో కార్యక్రమం జరుగుతుంది. భక్తి ఉద్యమసారధి బాలస్వామి.. శ్రీశారదా పీఠం ఉత్తరాధికారిగా నియమితులయ్యే కిరణ్కుమారశర్మ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం. 1993 ఏప్రిల్ 4 విశాఖలో జన్మించారు. తల్లిదండ్రులు పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ. వీరిది మధ్యతరగతి కుటుంబం. హనుమంతరావు ఇద్దరు పిల్లలలో పెద్దవాడు కిరణ్కుమారశర్మ మూడవ తరగతి చదువుతుండగా యాదృచ్ఛికంగా తల్లిదండ్రులతో కలిసి స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామిని దర్శించే భాగ్యం కలిగింది. బాలకిరణుడు మహాస్వామి కంటికి అపరశంకరునిగా గోచరించారు. అద్భుత ముఖవర్ఛస్సుతో, బ్రహ్మజ్ఞాన సముపార్జనార్హతతో కళకళలాడుతూ పిల్లవాడు కనిపించడం స్వామివారిని విశేషంగా ఆకర్షించింది.వెనువెంటనే తల్లిదండ్రులతో మాట్లాడారు. లౌకికవిద్యకు స్వస్తి పలికించి పిల్లవాణ్ణి పీఠానికి చేర్చమని సూచించారు. పీఠానికి వచ్చిన నాటినుంచీ కిరణ్కుమారశర్మ జీవితం పూర్తిగా మారిపోయింది. ఆంగ్ల విద్య మలిగిపోయింది. అంతఃచక్షువులకు సంబంధించిన వేదాధ్యయనం మొదలైంది. సంధ్యావందనంతో ప్రారంభమైన చదువు షోడశకర్మలు, పంచదశ కర్మలూ దాటింది. స్మార్తం హృదయగతమైంది. ద్వాదశి విశ్వనాథం, ఉప్పులూరి సంతోష్కుమార్శర్మల గురుత్వంలో కుమారశర్మ రాటుదేలుతూ వచ్చారు. రాణి దక్షిణామూర్తిగారి వద్ద ఉపనిషత్తులు, కారికలు, అరుణం పూర్తి చేశారు. దక్షిణామూర్తి, గిరీశశర్మ అధ్యాపకత్వంలో కృష్ణయజుర్వేదాన్ని అస్థిగతం చేసుకున్నారు. వ్యావహారిక సంస్కృతగ్రామంగా ప్రపంచంలోనే ప్రసిద్ధమైన కన్నడసీమలోని మత్తూరు వాస్తవ్యులు అరుణావధాని, బోధనలో మెళకువలు తెలిసిన ఇరుకు విద్యాసాగరశర్మ వంటి గురువుల నుంచి సంస్కృతం నేర్చుకున్నారు. శ్రీ చరణుల వద్దనే కిరణ్కుమార శర్మ తర్క, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసలతో పాటుగా వేదాంగాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేశారు. మహాస్వామి ప్రధాన శిష్యునిగా మారిపోయారు. బాలస్వామిగా ప్రఖ్యాతమయ్యారు. రామేశ్వరం నుంచీ హిమాలయాలవరకూ స్వరూపానందేంద్రతో కలిసి విశేష పర్యటనలు జరిపారు. ఆ రకంగా మహాస్వామి అడుగులలో అడుగులు కదుపుతూ శిష్య తురీయాశ్రమ సన్యాస దీక్షా స్వీకరణకు సిద్ధమయ్యారు.విశ్వజనీనమైన స్వధర్మాన్ని రానున్న కాలాన బాలస్వామి కుమారశర్మ మునుముందుకు నడిపిస్తారనేదే భక్తజనుల ఆశ. ఆకాంక్ష. – డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు బాలస్వామి యోగ్యుడు అదిశంకరుడు, సచ్చిదానందేంద్రుడు, అద్వైతానందేంద్రుడు వీరి పరంపరగా శారదా పీఠం నడుస్తూ వస్తోంది. దీనికి ఉత్తరాధికారిగా కిరణ్కుమారశర్మ వ్యవహరించబోతున్నారు. వీరి సన్యాసనామం వేరుగా ఉంటుంది. దానిని శిష్యతురీయాశ్రమదీక్ష స్వీకార సమయంలో వెల్లడి చేస్తాం. కిరణ్కుమార శర్మ యోగ్యులు. వేదవేదాంగాలు చదువుకున్నవారు. వారి నేతృత్వంలో శ్రీ శారదా పీఠం మరిన్ని సత్కార్యాలు చేయనుంది. – స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి పూర్వజన్మ సుకృతం బంగారం లాంటి మా అబ్బాయిని స్వరూపానందేంద్ర స్వామివారే మేలిమి బంగారంలా తయారు చేశారు. ధర్మ పరిరక్షణకోసం వినియోగిస్తున్నారు. ఇంతకంటే ఏ తల్లిదండ్రులకయినా కావలసింది ఏముంటుంది. అందుకే విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాబు నియమితులవుతున్నారని తెలిసి సంతోషించాం. కిరణ్కుమారశర్మ ఇంతవరకూ మా అబ్బాయి. ఇప్పుడు జగద్గురువు స్థానానికి చేరారు. ఇది మా పూర్వజన్మ సుకృతం. – పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మ, కిరణ్కుమారశర్మ తల్లిదండ్రులు స్వామి అడుగుజాడల్లో... విశాఖ శ్రీ శారదాపీఠం విలక్షణమైనది. బాధ్యతాయుతమైనది. ఆదిశంకరాచార్యుల వారందించిన చైతన్యంతో నడుస్తోంది. శ్రీ స్వరూపానందేంద్ర మహాస్వామి అడుగుజాడల్లో నడిచి మరిన్ని ధర్మపోరాటాలు చేయాలనేది నా ఆకాంక్ష. వారి సూచనలు పాటిస్తూ ధర్మప్రచారం కోసం అహరహమూ శ్రమిస్తాను. సర్వశక్తులూ ఒడ్డుతాను. – కిరణ్కుమారశర్మ, శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి -
14న విశాఖకు సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్రావు మరోసారి ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నారు. ఫిబ్రవరి 14న విశాఖపట్నంలోని శారద పీఠానికి వెళ్లనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల చివరి రోజు నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. పూర్ణాహుతి కార్యక్రమానికి రావాల్సిందిగా విశాఖ శారదా పీఠం నుంచి కేసీఆర్కు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఉత్సవాలకు హాజరు కావాలని నిర్ణయించారు. శారద పీఠం కార్యక్రమానికి హాజరయ్యేలా సీఎం కేసీఆర్ పర్యటన ఖరారైనట్లు తెలిసింది. ఫెర్నాండెజ్ మృతిపై సంతాపం... కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జీ ఫెర్నాండెజ్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కార్మిక నాయకుడిగా, కేంద్ర మంత్రిగా ఫెర్నాండెజ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫెర్నాండెజ్ మృతిపై ఆయన సన్నిహితులకు సానుభూతి వ్యక్తం చేశారు. నేడు గాంధీజీకి నివాళులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లంగర్హౌజ్లోని బాపు ఘాట్ వద్ద తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, సీఎం కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు బాపు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. అసెంబ్లీ ప్రొరోగ్... శాసన మండలి, శాసన సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ నరసింహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం జనవరి 17 నుంచి 20 వరకు శాసనసభ సమావేశాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగం, దీనికి ధన్యవాదాలు తెలిపే అంశంపై జనవరి 19, 20 తేదీల్లో శానసమండలి సమావేశాలు జరిగాయి. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుత సమావేశాలను ప్రొరోగ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మనో నిగ్రహంతోనే మనశ్శాంతి
సనాతన ధర్మ పరిరక్షణ కోసం జగద్గురు ఆదిశంకరుల వారు దేశం నలుమూలలా నెలకొల్పిన పీఠాలలో దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదా పీఠం ప్రసిద్ధమైనది. ఆ పీఠానికి 36వ అధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వాములవారి ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి. వారి విజయ యాత్రలో భాగంగా ప్రస్తుతం హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో వేంచేసి ఉన్నారు. సాక్షికి ప్రత్యేకంగా వారు అందించిన అనుగ్రహ ఉపదేశ సారాంశం ప్రశ్నోత్తరాల రూపంలో క్లుప్తంగా.... ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం... వీటిలో ప్రస్తుతకాలానికి ఏది అనుసరణీయం? ద్వైతం అనేది వ్యావహారికం. అద్వైతం అనేది పారమార్థికం. భగవంతుడు వేరు, నేను వేరు అనే భావన ఉంటేగానీ మనం భగవంతుడిని పూజించలేం. జ్ఞానం వచ్చేంతవరకు ద్వైతం ఉపయోగపడుతుంది. జ్ఞానం వచ్చాక అద్వైతం మాత్రమే ఉంటుంది. కల కంటున్నంతవరకు అది కల అని తెలియదు. బాహ్యస్మృతిలోకి వచ్చాక మాత్రమే అది కల అని తెలుస్తుంది. ద్వైతంలో ఉన్నా, విశిష్టాద్వైతంలోకి వెళ్లినా, ఆఖరికి అద్వైతంలోకి రావలసిందే. ఎందుకంటే, జగత్తు అంతా మిధ్య, బ్రహ్మం ఒక్కడే అంటే అందరూ అర్థం చేసుకోలేరు. ఈ ఉపాసనలు, ఆరాధనలు అద్వైతం కోసమే. కాబట్టి ద్వైతంలోనే ఉంటూ చివరికి అద్వైతానికి చేరుకోవాలి. ఏకేశ్వరోపాసన, బహుదేవతారాధనలలో ఏది మంచిది? ఏకేశ్వరోపాసన చేసినా, అనేకమంది దేవతలను పూజించినా, ఏ వ్యత్యాసమూ లేదు. ఎందుకంటే, భగవంతుడు ఒక్కడే. కాని, రూపాలు, నామాలు అనేకం ఉన్నాయి. ఆ రూపాల వెనకాల ఉండే చైతన్యం మాత్రం ఒకటే. మనం ఈశ్వరుణ్ణి ఆరాధించినా, విష్ణువును ఆరాధించినా ఫలంలో ఎటువంటి తేడా రాదు. ఈశ్వరుడి ఎటువంటి ఫలాన్నిస్తాడో, విష్ణువూ అదే ఫలాన్నిస్తాడు. ఇతర దేవతలూ అదేవిధమైన ఫలాన్ని ప్రసాదిస్తారు. హిందూ మతంలో ఇందరు దేవుళ్లు, ఇన్ని సంప్రదాయాలు ఎందుకు ఉన్నాయి? మనం వినాయక చవితికి గణపతిని, నవరాత్రికి అమ్మవారిని, శివరాత్రికి శివుణ్ణి... ఇలా ఏ పర్వదినానికి తగ్గట్టు ఆ దేవుడు లేదా దేవతా రూపాన్ని పూజిస్తాం. అలాగని మనం నలుగురు దేవతలను ఆరాధించినట్టు కాదు. ఒకే దేవుణ్ణి నాలుగుమార్లు పూజించినట్టు. మరి ఎందుకని అన్ని రూపాలు అంటే, సాధకులను అనుగ్రహించడం కోసం భగవంతుడు వారికి రుచించిన రూపంలో వస్తాడని, అందుకనే ఇన్ని రూపాలని ఆదిశంకరులు చెబుతారు. మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే ఏం చేయాలి? ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాన్ని ఆచరించడమే. అందుకోసం చిన్నప్పటినుంచి పిల్లలకు మంచి సంస్కారాన్ని అందించే రామాయణ, భారత, భాగవత కథలు చెప్పాలి. ఇలాంటి కథలవల్ల వారిలో మంచి సంస్కారం ఏర్పడుతుంది. బాల్యం నుంచి స్వధర్మాన్ని అలవరచాలి. మంచి సంస్కారం కలిగితే, అదే ధర్మాన్ని ఆచరింపజేస్తుంది. పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకోవాలి. వారు విననప్పుడు పెద్దలు దండన మార్గాన్ని అనుసరించి అయినా, స్వధర్మాన్ని అలవరచాలి. మాధవ సేవ చేస్తే పుణ్యం వస్తుంది. మరి మానవ సేవ వల్ల ప్రయోజనం ఏమిటి? ఉపకారగుణం అనేది మనిషిలో ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం. అది లేకపోతే మనిషి, తాను మనిషి అనిపించుకోవడానికి కూడా యోగ్యుడు కాడు. ప్రస్తుతం లోకంలో మానవ సేవా జరుగుతోంది, మాధవ సేవా జరుగుతోంది. భగవత్ప్రీతికరమైన కార్యాలు ఎన్నో జరుగుతున్నాయి. కష్టాలలో ఉన్నవాళ్లకి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు మనస్సులో పరిశుద్ధమైన భావన ఉండాలి. ప్రఖ్యాతి కోసం చేయకూడదు. నాకేదో ఫలం లభించాలి, నేను చేసే ఈ పని ప్రపంచం మొత్తానికి తెలియాలి అని ఆలోచించకూడదు. అప్పుడు భగవంతుడు మనల్ని ఇష్టపడతాడు. ఆయన అనుగ్రహ ఫలాలను ప్రసాదిస్తాడు. మనిషికి ధర్మాధర్మ విచక్షణ ఎలా వస్తుంది? ఏది ధర్మమో, ఏది అధర్మమో తెలియాలంటే బాల్యం నుంచే పెద్దలు తగిన శిక్షణ ఇవ్వాలి. ధర్మాధర్మాల గురించి తెలియజెప్పాలి. రామాయణ భారత భాగవతాదుల గురించి చెప్పాలి. రామాయణంలో ఉండే 24000 శ్లోకాలు, మహాభారతంలో ఉండే లక్షశ్లోకాలు.. అన్నీ కలిపి ఏమి చెబుతున్నాయి... రాముడిలాగా ఉండాలి. రావణుడిలాగా ఉండకూడదు. యుధిష్ఠిరుడిలాగా ఉండాలి. దుర్యోధనుడిలాగా ఉండకూడదు అనే కదా... ఆయా కథలు వారికి తెలిస్తే, ఏమి చెయ్యాలో, ఏమి చేయకూడదో, ఎలా ఉంటే మంచిదో, ఏ విధంగా ప్రవర్తించడం చెడో అనే విచక్షణ వస్తుంది. ఆదిశంకరులవారి రచనలలో ఉత్కృష్టమైనది ఏది? ఆయన రచనలన్నీ ఉత్కృష్టమైనవే. లోకంలో ఉండే మనుషుల అర్హతను బట్టి, వారి పరిజ్ఞానాన్ని బట్టి, ఎవరికి ఏ రచన వల్ల అధిక ప్రయోజనమో, ఆ విధమైన రచనలు చేశారు ఆది శంకరులవారు. శాస్త్రజ్ఞానం ఉండి, శాస్త్రాలలో చెప్పిన గంభీరమైన విషయాలను అర్థం చేసుకోగల మేధాశక్తి ఉన్న వారికి బ్రహ్మసూత్ర భాష్యం, ప్రస్థానత్రయం అందించారు. సామాన్యమైన విషయాలను అర్థం చేసుకోగలిగే పరిజ్ఞానం, మేధాశక్తి ఉన్న వారికోసం వివేక చూడామణి, శతశ్లోకి వంటి గ్రంథ రచన చేశారు. ఇక సాధారణమైన వారికోసం శ్లోకాలు, స్తోత్రాలు వంటి వాటిని అందించారు. ఈ రకంగా ఆయన రచించిన గ్రంథాలన్నీ ఉత్కృష్టమైనవే. ఆదిశంకరుల జయంతిని ఏ విధంగా జరుపుకోవాలి? ఆదిశంకరులవారు సాక్షాత్తూ ఈశ్వరుని అవతారం... కాబట్టి శంకర జయంతినాడు వారిని విశేషంగా పూజించాలి. వారి అష్టోత్తర శతనామాలు చెప్పుకుని, వారి సన్నిధిలో... వారి చరిత్రను చెప్పే శంకర విజయాన్ని పారాయణ చేయాలి. వారి ఉపదేశాలను జనబాహుళ్యానికి తెలిసే విధంగా చేయాలి. మహాపురుషులందరి జయంతులు, వర్థంతుల సందర్భంలో కూడా ఇదే చేయాలి. అశాంతి తొలగి పోవాలంటే...? మన అశాంతికి మూల కారణం మన మనస్సే. అశాంతి తొలగి పోవాలంటే బాహ్యపదార్థాల వల్ల కాదు. మానసికంగా ఒక పదార్థం కావాలి. ఆ పదార్థమే తృప్తి. భగవంతుడు మనకు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. ఒక మనిషి ఇంకో మనిషిని హింసించడమో, ఇంకేదైనా తప్పు చేయడమో చేస్తున్నాడంటే మూడు కారణాలున్నాయి. అవి ఒకటి– కామం, అంటే దురాశ. రెండవది. క్రోధం. మూడవది లోభం. ఈ మూడూ నరకానికి వెళ్లడానికి మూడు ద్వారాలు. ఒక మనిషి ఒక వస్తువు కావాలి అనుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తాడు. సన్మార్గంలో అది లభించకపోవడం వల్ల తప్పుడు మార్గాన్ని అనుసరిస్తాడు. అందులో భాగంగా ఇంకొకరితో విరోధం ఏర్పడుతుంది. అప్పుడు అశాంతి చెలరేగుతుంది. కాబట్టి ఆశ అనే గుర్రాన్ని తృప్తి అనే కళ్లెంతో అదుపు చేయాలి. నాకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడున్నాడు, ఆయనే ఆదుకుంటాడనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అప్పుడు అశాంతి అనేది ఉండదు. వేదాలు, స్మృతులు– వీటికి తేడా ఏమిటి? వీటిలో దేనిని అనుసరించాలి? శాస్త్రాలన్నింటికీ మూల ప్రమాణం వేదమే. వేదం స్వతః ప్రమాణం. దానికి మించింది మరొకటి లేదు. వేదాన్ని ఆధారం చేసుకుని ఏర్పడ్డదే స్మృతి. ఇది స్వయంగా ఉపదేశం చేయదు. వేదంలో ఉన్నదాన్నే ఉపదేశిస్తుంది. ఏదైనా ఒక విషయంలో స్మృతి, వేదం వేర్వేరుగా చెప్పాయంటే, స్మృతిని వదిలేసి, వేదాన్నే అనుసరిస్తాం. విగ్రహారాధన ఎందుకు? భగవంతుడు అణువణువులోనూ ఉన్నాడు. కానీ, ఆయన్ని చూడగలిగే జ్ఞానం అందరికీ లేదు. అందుకే ఆలయాలు, ఆ ఆలయాలలో విగ్రహాలను ఏర్పాటు చేశారు పెద్దలు. ప్రహ్లాదుడు మహా భక్తుడు కాబట్టి అన్నింటిలోనూ దేవుణ్ణి చూడగలిగాడు, దేవుడి ఉనికిని ప్రశ్నించిన తండ్రికి స్తంభంలోనే దేవుణ్ణి చూపగలిగాడు. అందరికీ అది సాధ్యం కాదు కదా. అందుకోసమే విగ్రహారాధనలు నేటికీ వర్థిల్లుతున్నాయి. అశాంతి, అరాచకాలను ఎదుర్కోవాలంటే...? అశాంతి, అరాచకాలకు కారణం అపరాధాలు పెరిగిపోవడమే, లౌకికంగా చెప్పాంటే తగిన చట్టాలు రూపొందించి, కఠనంగా అమలు చేయాలి. అసలు అపరాధమే జరగకుండా ఉండాలంటే అహంకారాన్ని జయించాలి, కామాన్ని, క్రోధాన్ని పోగొట్టుకోవాలి, ప్రతి మనిషీ సద్గుణాలు అలవరచుకోవాలి. మనస్సును మలినం చేసే సాధనాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. వీటిని నిషేధిస్తే కానీ సగం చిక్కులు, చికాకులు తొలగవని మా అభిప్రాయం. -
శారదాపీఠాన్ని సందర్శించిన వైఎస్ జగన్
విశాఖపట్నం: విశాఖపట్నంలోని శారదాపీఠంలోని పలు ఆలయాలను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఆయనకు శారదాపీఠం నిర్వాహకులు ఎదురువెళ్లి ఘన స్వాగతం పలికారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యఙయాగంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆలయ విశిష్టతను స్వామి స్వరూపానందను అడిగి తెలుసుకున్నారు.