sarada pitham
-
ఘనంగా విశాఖ శారదా పీఠం వార్షికోత్సవాలు
-
జలహారతులిచ్చిన స్వామి స్వరూపానందేంద్ర
విశాఖ: సింహాచలం పూల తోటలో శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి జలహారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన జలధారలకు హారతులిచ్చారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ.. సింహగిరిపై ఎనిమిదేళ్లుగా జలధారలు శిథిలమయ్యాయని, ఇనేళ్ల తరువాత జలహారతి కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. సింహగిరిపై మొక్కలు నాటడం శుభపరిణామమని స్వామి పేర్కొన్నారు. అప్పన్న జలధారల పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఏమాత్రం చొరవ చూపలేదని, సింహాచలం ట్రస్ట్‌బోర్డు ప్రత్యేక చొరవతో జలహారతి కార్యక్రమం పునఃప్రారంభానికి నోచుకుందని స్వామి పేర్కొన్నారు. ట్రస్ట్ బోర్డు చొరువను అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని స్వామి ఆరోపించారు. అనతికాలంలోనే జలధారలను పునరుద్ధరించిన ట్రస్ట్ బోర్డును స్వామి ప్రశంసలతో ముంచెత్తారు. జలధారల పునరుద్ధరన విషయంలో సింహాచలం ట్రస్ట్ బోర్డు మిగతా దేవాలయాల ట్రస్ట్ బోర్డులకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్వరూపానందేంద్ర స్వామి స్పందిస్తూ.. స్వార్ధ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు దేవుడితో చలగాటం ఆడటం ఏమాత్రం మంచిది కాదని, దానికి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవాలయాలపై దాడుల నియంత్రణపై ప్రభుత్వ చిత్తశుద్దిని స్వామి ప్రశంశించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ త్వరగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
శారదా పీఠం దానికే అంకితం
సాక్షి, ఢిల్లీ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకే శారదా పీఠం అంకితమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల భూముల ఆక్రమణకు, అన్య మత ప్రచారానికి వ్యతిరేకంగా శారదా పీఠం పోరాటం చేసిందని చెప్పారు. ఈ పోరాటంలో తాను అలిసిపోయానని, ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మనంద పని చేస్తారని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమని ఆయన వ్యాఖ్యానించారు. -
నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలి
సాక్షి, విశాఖపట్నం: నవ్యాంధ్ర సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ తొలిసారి మంగళవారం విశాఖ పర్యటనకు విచ్చేశారు. గన్నవరం నుంచి విమానంలో ఉదయం 11.45 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో పాటు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులందరినీ ఆయన పేరుపేరునా పలుకరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎన్ఎడీ, వేపగుంట మీదుగా మధ్యాహ్నం 12.20 గంటలకు పెందుర్తి మండలం చినముషిడివాడ గ్రామంలో ఉన్న శ్రీ శారదాపీఠానికి చేరుకున్నారు. పీఠం సంప్రదాయం ప్రకారం మేళతాళాల మధ్య గురువులు, వేద పండితులు ముఖ్యమంత్రికి పూర్ణ కుంభంతో వేదమంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికారు. పీఠంలోని జగద్గురు సన్నిధిలో వేంచేసి ఉన్న పీఠాధిపతి శ్రీ శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామిజీని వైఎస్ జగన్ దర్శించుకుని వారి ఆశీస్సులు అందుకున్నారు. స్వామిజీని తులసి, పుష్పమాలలతో సత్కరించి పట్టు వస్త్రాలు, పండ్లు బహూకరించారు. స్వామిజీతో కొద్దిసేపు మాట్లాడారు. భేటీ అనంతరం స్వామిజీతో కలిసి శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వర్ణమండపంలో కొలువైన అమ్మవారి సన్నిధిలో స్వామిజీ స్వయంగా పూజలు నిర్వహించి సీఎంను ఆశీర్వదించారు. అక్కడి నుంచి పీఠంలోని వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి, మేధా దక్షిణామూర్తి, దాసాంజనేయ స్వామి వార్ల దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శారదాంబ పీఠార్చన ప్రాంగణాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సింహాచలం వేద పండితుల ఆశీర్వాదం సింహాచలం దేవస్థానం వేద పండితులు పీఠంలో సీఎంను దుశ్శాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో చంద్రమోహన్ అప్పన్న చిత్రపటాన్ని, స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. పీఠంలో సుమారు రెండు గంటల పాటు గడిపిన ముఖ్యమంత్రి, మధ్యాహ్నం 2.35 గంటలకు బయల్దేరగా, పీఠం ఉత్తరాధికారి బాల స్వామి, ధర్మాధికారి జి.కామేశ్వరశర్మ, పీఠం ప్రతినిధులు సాదరంగా వీడ్కోలు పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో గన్నవరం బయల్దేరారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గొడ్డేటి మాధవి, డాక్టర్ భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అన్నంరెడ్డి అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాస్, పెట్ల ఉమా శంకర గణేష్, చెట్టి ఫల్గుణ, కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, ధర్మాన కృష్ణదాస్, విశ్వసరాయ కళావతి, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు, తెర్లం బాలరాజు, కంబాల జోగులు, కడుబండి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వర రావు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరరావు, బలిరెడ్డి సత్యారావు, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంత్రం 3.40 గంటలకు వైజాగ్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి బయలుదేరారు. -
శ్రీవారి ఆలయం మూసివేత వెనుక కుట్ర ఉందా?
పెందుర్తి: మహా సంప్రోక్షణ పేరుతో ఆగస్టు 9 నుంచి 16 వరకు ఆలయాన్ని మూసేస్తామన్న టీటీడీ నిర్ణయంలో కుట్ర కోణం ఏమైనా దాగి ఉందా? అని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుమానం వ్యక్తం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం మహా సంప్రోక్షణ జరిగే విధానాన్ని భక్తులంతా తిలకిస్తారని.. కానీ ఆ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపివేస్తామంటూ టీటీడీ ప్రకటించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. చాతుర్మాస దీక్ష నిమిత్తం రుషికేష్ పర్యటనలో ఉన్న స్వరూపానందేంద్ర స్వామి టీటీడీ నిర్ణయంపై స్పందిస్తూ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పాలకమండలి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం మూసివేత నిర్ణయం తీసుకునే ముందు.. శృంగేరి, కంచి వంటి పీఠాలతో గానీ, ఆగమ పండితులతో గానీ సంప్రదింపులు జరిపారా అని ప్రశ్నించారు. వైఖానస ఆగమం ఏం చెబుతుందో పాలక మండలి తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలన్నీ భక్తుల్లో అనుమానాలు పెంచుతున్నాయన్నారు. అసలు వారం పాటు సీసీ కెమెరాలను నిలుపుదల చేయాల్సిన అవసరమేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఆలయం మూసివేతపై ఆగమ పండితులను గానీ పీఠాధిపతులను గానీ సంప్రదించి.. వారి సూచన మేరకు నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీ, ప్రభుత్వంపై ఉందన్నారు. -
'ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవు'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు వచ్చిన ఆయన.. విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలను ఆధ్యాత్మికంగా కాకుండా, అధికారికంగా నిర్వహించాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఒంటిమిట్ట రామాలయంలో నిర్వహించాలనే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆధ్యాత్మిక విషయాలలో పీఠాధిపతులు, మఠాధిపతులను సంప్రదించకుండా, పక్కన పెట్టడం శోచనీయమని ఆయన అన్నారు. హైందవ మతాలకు మంచి జరుగుతుందనే.. ఈ ప్రభుత్వాలను గెలిపించేందుకు రోడ్ల మీదకు వచ్చామని స్వరూపానంద చెప్పారు. కానీ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులను విస్మరించిన ప్రభుత్వాలకు దేవుడి ఆశీస్సులు ఉండవని అన్నారు.