![The Sarada Peetham is Dedicated to It - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/6/swamy%20copy.jpg.webp?itok=i4VI4brT)
సాక్షి, ఢిల్లీ: ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేసేందుకే శారదా పీఠం అంకితమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ దేవాలయాల భూముల ఆక్రమణకు, అన్య మత ప్రచారానికి వ్యతిరేకంగా శారదా పీఠం పోరాటం చేసిందని చెప్పారు. ఈ పోరాటంలో తాను అలిసిపోయానని, ఇక నుంచి శారద పీఠానికి ఉత్తరాధికారిగా స్వామి స్వాత్మనంద పని చేస్తారని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ కోసం అన్ని తరాలు పనిచేయాలనేది శారదాపీఠం సంకల్పమని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment