saraswathidevi idol
-
నిమిషాల్లో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి..
సాక్షి, గుంటూరు : నరసారావుపేటలో సరస్వతీ దేవి విగ్రహం రూపురేఖలు మారిన విషయంలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘సరస్వతి విగ్రహం ధ్వంసం అంటూ ఫేక్ న్యూస్‌ను సర్క్యూలేట్ చేశారు. ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం. జిల్లాలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నిమిషాల వ్యవధిలో ఫేక్ న్యూస్ పలు గ్రూప్స్‌లోకి చేరింది. ఈ ఫేక్ న్యూస్‌కు కుల, మత, రాజకీయ రంగు పులిమారు. ఫేక్ న్యూస్‌పై కాలేజీ యాజమాన్యం కూడా షాక్ తిన్నది. న్యూస్ షేర్ చేసేటప్పుడు ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సోషల్ మీడియాలో పెట్టిన వార్తలపై పోలీసుల నిఘా ఉంటుంది. రెండేళ్ల క్రితం కళాశాల ఖాళీ చేస్తున్న సమయంలో సామాగ్రి, షెడ్లు తరలించే ప్రక్రియలో విగ్రహం దెబ్బతినటంతో అక్కడే వదిలి వెళ్లారు. పాత సంఘటనలను ప్రచారం చేసేవారి మాయలో పడొద్దు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పోస్టులు పెడితే చర్యలు తప్పవు’ అని హెచ్చరించారు. ఇద్దరిపై కేసు నమోదు కాగా ఎల్ఐసీ కార్యాలయం పక్కన పాత కృష్ణవేణి జూనియర్ కళాశాల స్థలంలో ఏర్పాటు చేసి సరస్వతి దేవీ విగ్రహం ధ్వంసం చేశారంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశారు. దీనిపై ప్రచారం జరగడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోషల్ మీడియాలో ఫోటోలు అప్లోడు చేసిన మురళి, మహేష్ రెడ్డి అనే ఇద్దరిపై పిడుగురాళ్ల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. వివాదాల సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
ఇలాంటి చర్యలతో జిల్లాకు, ప్రజలకు నష్టం: ఎస్పీ
-
కన్నుల పండువగా సరస్వతీ విగ్రహ ప్రతిష్ట
నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని షిర్డిసాయిబాబా మందిర అష్టమ వార్షికోత్సవాలలో భాగంగా గురువారం జ్ఞాన సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్ట వేడుకలలో భాగంగా సాయినాధునికి పాలాభిషేకాలు నిర్వహించారు. జగద్గురు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి.. సరస్వతీ దేవి విగ్రహాన్ని షిర్డిసాయిబాబా మందిరంలో భక్తుల కోలాహలం మధ్య ప్రతిష్టాపించారు. అష్టమ వార్షికోత్సవాలు, సరస్వతి విగ్రహ ప్రతిష్ట వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద మంత్రోత్సరణల మధ్య ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని భక్తులు బారులు తీరి దర్శించుకుని, సాయి నాధునికి పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి వారు ప్రవచనాలు, ఆశ్శీర్వచనాలు ఇచ్చారు. ఈ ప్రతిష్ట మహోత్సవ వేడుకలలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, డాక్టర్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాపోలు రఘునందన్ పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా హాజరైన భక్తులందరికి అన్నదానం చేశారు.