నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని షిర్డిసాయిబాబా మందిర అష్టమ వార్షికోత్సవాలలో భాగంగా గురువారం జ్ఞాన సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్ట వేడుకలలో భాగంగా సాయినాధునికి పాలాభిషేకాలు నిర్వహించారు. జగద్గురు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి.. సరస్వతీ దేవి విగ్రహాన్ని షిర్డిసాయిబాబా మందిరంలో భక్తుల కోలాహలం మధ్య ప్రతిష్టాపించారు. అష్టమ వార్షికోత్సవాలు, సరస్వతి విగ్రహ ప్రతిష్ట వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద మంత్రోత్సరణల మధ్య ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని భక్తులు బారులు తీరి దర్శించుకుని, సాయి నాధునికి పూజలు నిర్వహించారు.
హాజరైన భక్తులకు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి వారు ప్రవచనాలు, ఆశ్శీర్వచనాలు ఇచ్చారు. ఈ ప్రతిష్ట మహోత్సవ వేడుకలలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, డాక్టర్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాపోలు రఘునందన్ పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా హాజరైన భక్తులందరికి అన్నదానం చేశారు.
కన్నుల పండువగా సరస్వతీ విగ్రహ ప్రతిష్ట
Published Thu, Apr 30 2015 6:46 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement