Sarbanand Sonowal
-
Himanta Biswa Sarma: అస్సాం సీఎంగా హిమంత
గువాహటి: అస్సాం నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంత బిశ్వ శర్మ ఎన్నికయ్యారు. రాష్ట్ర 15వ సీఎంగా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం తమ శాసనసభా పక్ష నేతగా శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ఎన్డీఏ కూడా ఆయనను తమ శాసన సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రస్తుత సీఎం సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ రేసులో ఎట్టకేలకు శర్మ విజయం సాధించారు. పార్టీ అధిష్టానం ఈ ఇద్దరు నేతలను శనివారం ఢిల్లీకి పిలిపించి, చర్చలు జరిపింది. శాసనసభాపక్ష భేటీలో హిమంత బిశ్వ శర్మ పేరును సర్బానంద సోనోవాలే ప్రతిపాదించడం విశేషం. అన్ని కోవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ అసెంబ్లీ భవనంలోని బీజేపీ కాన్ఫరెన్స్ హాల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి శర్మ, సోనోవాల్ కలిసి ఒకే వాహనంలో వచ్చారు. అంతకుముందు, ఉదయం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్ జగదీశ్ ముఖికి రాజీనామా సమర్పించారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడ్డాయి. 126 స్థానాల అసెంబ్లీలో ఎన్డీయే 75 సీట్లు గెలుచుకోగా, బీజేపీ సొంతంగా 60 సీట్లలో విజయం సాధించింది. సోనోవాల్ నా మార్గదర్శి హిమంత బిశ్వ శర్మ ఆదివారం సాయంత్రం గవర్నర్ జగదీశ్ ముఖిని కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎన్డీయే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. శర్మతో పాటు సీఎం పదవి నుంచి దిగిపోతున్న సర్బానంద సోనోవాల్ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లారు. అస్సాం సీఎంగా శర్మతో సోమవారం మధ్యా హ్నం 12 గంటలకు శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. అంతకుముందు, శర్మ మాట్లాడుతూ.. సర్బానంద సోనోవాల్ తనకు మార్గదర్శిగా కొనసాగుతారన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజాసేవకు అవకాశం కల్పిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితర నేతలు, రాష్ట్ర ప్రజలకు శర్మ కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా నిజాయితీగా, నిబద్ధతతో పని చేస్తానన్నారు. ముఖ్యమంత్రిగా సోనోవాల్ గొప్పగా పనిచేశారని, ఆయన హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని సోనోవాల్పై శర్మ ప్రశంసలు గుప్పించారు. ముందు చూపున్న, రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసిన, విలువలతో కూడిన నేత సోనోవాల్ అని పేర్కొన్నారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఈశాన్య ప్రాంతానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, తాజా ఎన్నికల ప్రచారంలోనూ రాష్ట్రమంతా పర్యటించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. అస్సాంను మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారు శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మ తనకు తమ్ముడులాంటి వాడని తాత్కాలిక సీఎం సర్బానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్డీఏ పక్షాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘హిమంతకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. ఆయనకు నా ప్రేమ, ఆశీస్సులు అందజేస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కోసం ఆయన కృషి చేస్తారు’ అని ఆకాంక్షించారు. -
కొండచరియలు విరిగిపడి 20 మంది మృతి
డిస్ పూర్ : అసోంలో కొండచరియలు విరిగిపడి 20 మంది మృతిచెందారు. మూడు వేర్వేరు చోట్ల మంగళవారం జరిగిన ఈ ప్రమాదాల్లో 20 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని కరీమ్గంజ్ జిల్లాలోని కలియాగంజ్‌లో కొండచరియలు విరిగిపడి ఆరుగురు, కాచర్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు చనిపోయారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలపై అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Deeply anguished at the loss of lives due to landslides triggered by incessant rain in Barak valley. I have directed Cachar, Hailakandi & Karimganj district administrations and SDRF to step up rescue, relief operations and facilitate all possible help needed to those affected. — Sarbananda Sonowal (@sarbanandsonwal) June 2, 2020 -
‘నేను సీఎంగా కొనసాగడంలో అర్థం లేదు’
గువహటి : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థంలేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయ సేకరణకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఎలాంటి పత్రాలు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత పౌరసత్వ చట్టం 1955ని సవరణ చేస్తూ భారత పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 7 నుంచి 9 వరకు అసోంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బుద్దిస్టులు, జైనులు, పార్శిలు) ఏ విధమైన పత్రాలు లేకుండానే భారత పౌరసత్వ చట్ట (2016) సవరణ చేపట్టనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్న క్రమంలో సోనోవాల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనం, ప్రజల భద్రత సరిగ్గా లేనప్పుడు తాను ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగా’లని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు మేధావులతోను చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోబోనని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాగా బిల్లుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాలు నిర్వహించారు. -
1.9 కోట్లమందిని భారత పౌరులుగా గుర్తించారు!
గువాహటి: రాష్ట్రంలోని 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన పౌరులుగా గుర్తిస్తూ అసోం ప్రభుత్వం ఆదివారం అర్ధరాత్రి జాతీయ పౌర నమోదు (ఎన్ఆర్సీ) తొలి ముసాయిదాను ప్రచురించింది. మొత్తం 3.29 కోట్లమంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1.9 కోట్లమందిని చట్టబద్ధమైన భారత పౌరులుగా గుర్తించింది. మిగతా వారు దరఖాస్తులు వివిధ ధ్రువీకరణ దశల్లో ఉన్నాయని భారత రిజిస్టర్ జనరల్ శైలేష్ తెలిపారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ కూడా ఈ విషయమై స్పందించారు. ఈ జాబితాలో పేరులేని ‘నిజమైన పౌరులు’ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తుది జాబితాలో వారి పేర్లు తప్పకుండా ఉంటాయని సీఎం సోనోవాల్ అన్నారు. ఇది ఈ జాబితాను రూపొందించడం చారిత్మాతక సందర్భమని ఆయన అభివర్ణించారు. దేశ విభజన అనంతర వలసల నేపథ్యంలో 1951లో జాతీయ పౌర నమోదు జాబితాను తొలిసారి చేపట్టిన రాష్ట్రంగా అసోం నిలిచిందని, ఇప్పుడు కూడా అలాంటి జాబితా రూపకల్పనను చేపట్టిన ఏకైక రాష్ట్రం అసో అని అన్నారు. ‘ఈ-సేవ’ కేంద్రాలు, ఎస్సెమ్మెస్ సర్వీస్ ద్వారా తమ పేరు జాబితాలో ఉందో లేదో ప్రజలు తెలుసుకోవచ్చు. పొరుగు దేశాల నుంచి వలసల నేపథ్యంలో అసోంలోని నిజమైన స్థానిక పౌరుల గుర్తింపు కోసం జాతీయ పౌర నమోదును చేపట్టాలన్న డిమాండ్‌పై 2005 నుంచి చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం దీనిని చేపట్టింది. -
ఎవరినీ వదిలిపెట్టబోం!
గువాహటి: బోడోల్యాండ్‌లోని కోక్రాఝర్‌లో తాజాగా చోటుచేసుకున్న తీవ్రవాద నరమేధం నేపథ్యంలో అసోం ముఖ్యమంత్రి సరబానంద్ సోనోవాల్ ఆదివారం అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు. ఈ ఉగ్రవాద ఘటనకు కారణం ఎవరైనా వారిని విడిచిపెట్టబోమని, తీవ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ప్రజలతో కలిసి ఉమ్మడిగా పోరాడుతామని, ఉగ్రవాద పోకడలపై ఎలాంటి కనికరం చూపకపోవడమే తమ విధానమని సీఎం సోనోవాల్ తెలిపారు. గత శుక్రవారం జరిగిన కోక్రాఝర్‌లో జరిగిన తీవ్రవాద నరమేధంలో 14మంది చనిపోయిన సంగతి తెలిసిందే. నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్-సంగ్బిజిత్కు చెందిన స్వయంప్రకటిత కమాండర్ మనోజ్ ఇస్లాహారి ఈ తీవ్రవాద దాడికి పాల్పడ్డాడు. సీఎం ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని, బోడో తీవ్రవాద చర్యలను ఎంతమాత్రం సహించబోమని అసోం డీజీపీ ముఖేష్ సహాయ్ తెలిపారు.