Sarojini Eye Hospital
-
దీపావళి వేడుకల్లో అపశ్రుతి..ఆస్పత్రికి క్యూ
-
కరోనా తగ్గిన వారి కళ్లల్లో కండరాల వాపు
-
ర్యాంకు రెండు.. అయినా ఉద్యోగం రాలేదు
దోమ: దివ్యాంగ కోటాలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు.. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి అనుకున్న ఓ దివ్యాంగుడికి ఇప్పటివరకు ఉద్యోగం లభించలేదు. వివరాలు.. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ ముదిరాజ్ టీఆర్టీ–2017 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దివ్యాంగ కోటాలో జిల్లాలోనే మెరిట్ ప్రకారం రెండో ర్యాంకులో నిలిచాడు. రెండు నెలల కిందట టీఎస్పీఎస్సీ ఎంపిక చేసిన టీఆర్టీ జాబితాలో తన పేరు లేకపోవడంతో రామకృష్ణ మనోవేదనకు గురయ్యాడు. తనను ఎందుకు ఎంపిక చేయలేదని బోర్డును ప్రశ్నించగా.. ‘ఒక కన్ను చూపు లేదని దివ్యాంగ ధ్రువపత్రం సమర్పించావు. అది తప్పు అని తేలింది. చూపు బాగానే ఉందని హైదరాబాద్‌లోని సరోజిని ఆస్పత్రి వైద్యులు మాకు నివేదిక ఇచ్చారు’అని బోర్డు వివరణ ఇచ్చిందన్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేయలేమని బోర్డు తెలపడంతో సరోజిని ఆస్పత్రిని రామకృష్ణ సంప్రదించగా.. దివ్యాంగుడే అని నివేదిక ఇచ్చామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయన్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక జరిగిన ఘటనను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవిస్తూ వీడియో తీసి శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. -
స్వామిగౌడ్ హెల్త్ బులిటెన్ విడుదల
-
అంధత్వ నివారణ అందరి బాధ్యత
సాక్షి, హైదరాబాద్: అంధత్వ నివారణ అందరి బాధ్యతని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాలలో భాగంగా ఆదివారం నుంచి 17వ తేదీ వరకు అంధత్వ నివారణ సంస్థ, సరోజినీ కంటి ఆస్పత్రి సంయుక్తంగా ఏర్పాటు చేసిన అవేర్నెస్ వాక్‌ను ఆయన ప్రారంభించారు. 40 ఏళ్లు దాటిన వారిలో వారసత్వంగా సంక్రమించే ఈ గ్లకోమా వ్యాధిని సాధ్యమైనంత తొందరగా గుర్తించగలిగితే వైద్య చికిత్స అందించవచ్చన్నారు. కనుగుడ్డు చుట్టూ రంగుల వలయాలు ఏర్పడటం, నొప్పి ఉండటం, చూపు మందగించడం, కాంతి లేకపోవడం దీని లక్షణాలని చెప్పారు. ఇండియాలో 1.2 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని సర్వేలు చెబుతున్నాయన్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రే ఏడాదికి 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నదన్నారు. అందులో సగటున 600 మందికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. సీఎం చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి కంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచితంగా గ్లకోమా స్క్రీనింగ్ పరీక్షలు వ్యాధిని ప్రాథమిక స్థాయిలో గుర్తించి, చికిత్స చేయించుకుంటే గ్లకోమా వ్యాధి నుంచి తప్పించుకోవచ్చని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా సరోజినీ కంటి ఆస్పత్రి ఆధ్వర్యంలో వారం పాటు గ్లకోమా స్క్రీనింగ్ కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. ప్రజా చైతన్యం కలిగించే ర్యాలీలు, సెమినార్లు, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, రోగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డీఎంఈ రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. -
సరోజిని దేవి కంటి ఆసుపత్రిలో కీచకుడు
మెహిదీపట్నం: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళా రోగులు, వారికి సహాయకులకు కనీస రక్షణ లేకుండా పోయింది. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాల్సిన సిబ్బంది వారిపాలిట కీచకుల్లా మారుతున్నారు. సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తప్పతాగి ఓ రోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలి బంధువులు హుమాయిన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం కంటి పరీక్షల నిమిత్తం ఆస్పత్రిలో చేరిన రోగి పట్ల అతను శనివారం రాత్రి అసభ్యంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్లు వింటే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, త్వరగా సర్జరీ కూడా చేయిస్తానని చెప్పాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో డ్రైవర్ శివపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఉదయం రోగుల, సహాయకులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. అయినా అధికారులు స్పందించక పోవడంతో హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రాజు తెలిపారు. -
సెలైన్ వల్లే వారి కంటి చూపు పోయింది
సాక్షి, హైదరాబాద్: సెలైన్ వాటర్‌లో స్వచ్ఛత లేకపోవడం వల్లే సరోజినీ కంటి ఆసుపత్రిలో ఏడుగురు కంటి చూపు కోల్పోయారని కల్చర్ రిపోర్టు తెలిపింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) సుదీర్ఘంగా కల్చర్ (స్టెరిలిటీ) పరీక్షలు జరిపిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ రిపోర్టును తాజాగా వైద్య ఆరోగ్యశాఖకు అందజేసింది. మొత్తం మూడు బ్యా చ్‌లకు చెందిన సెలైన్ వాటర్ బాటిళ్ల నమూనాలను పరీక్షించగా... వాటిలో ఒక బ్యాచ్ బాటిళ్ల నమూనాలో స్వచ్ఛత లేదని రిపోర్డు తెలిపింది. స్వచ్ఛమైన సెలైన్ వాటర్ కాదని నిర్ధారించిన డీసీఏ... అందులో ఏముందో స్పష్టత ఇవ్వలేదని అధికారులు తెలిపారు. బ్యాక్టీరియా ఉండవచ్చని అంచనా వేస్తున్నా రు. సెలైన్ వాటర్‌లో ఉండే ఏదో ఒక లవణంలో కానీ... రసాయనంలో కానీ లోపం ఉండొచ్చని భావిస్తున్నారు. వాటిని సరఫరా చేసిన కంపెనీపై చట్టపరంగా కేసు పెట్టి తగు చర్య తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. 1,200 బాటిళ్ల సరఫరా... రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలు అన్నింటినీ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. ఆ ప్రకారం గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా బాధ్యతను నాగపూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1200 సెలైన్ బాటిళ్లు సరోజినీ ఆసుపత్రికి అందజేశారు. వాటిలో 16,385 బ్యాచ్‌కు చెందిన 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్‌కు చెందిన 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆ ఆసుపత్రికి అందాయి. వాటిలో 624 బాటిళ్లు ఉపయోగించారు. అందులోని కొన్నింటి కారణంగా ఏడుగురు కంటి చూపు కోల్పోయారు. వాటి నమూనాలనే డీసీఏ పరీక్షించి తాజా నివేదిక సమర్పించింది. -
సైకో చేష్టలతో ఇబ్బంది పడ్డ రోగులు