sarry
-
పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలతో..50 కోట్లు వచ్చాయ్!
సాక్షి,ముంబై: ఇంజనీర్లు చేస్తున్న ఉద్యోగం వారికి సంతృప్తి ఇవ్వలేదు. దీనికిమించి ఇంకేదో చేయాలని గట్టిగా అనుకున్నారు. ఆ ఆలోచన ‘సుత’ అనే చీరల బ్రాండ్ ఆవిష్కారానికి నాంది పలికింది. తమదైన ప్రతిభ, చొరవతో రాణిస్తూ సక్సెస్‌పుల్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్‌గా అవతరించారు. చెరొక మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం కేవలం ఆరేళ్లలో ఇపుడు 50 కోట్లకు చేరింది. బిజినెస్ టుడే కథనం ప్రకారం ముంబైకి చెందిన సుజాత (36) తానియా (34) ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కొన్నాళ్ల తరువాత మరింత కష్టపడి ‘ప్రభావవంతమైన’ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలన ఆలోచనలేనప్పటికీ, చీరల పట్ల మక్కువతో చీరల బిజినెస్ బావుంటుందని నిశ్చయించు కున్నారు. పైగా ఇద్దరికీ భారతీయ సాంప్రదాయ దుస్తులు, తీరుతెన్నులపై మంచి అవగాహన ఉంది. అలా తమ ఇరువురి పేర్లలోని సు, త అనే మొదటి రెండు అక్షరాలతో ‘సుత’ (Suta) బ్రాండ్‌ని సృష్టించారు. photo courtesy : BusinessToday.In ఒక్కొక్కరు రూ.3 లక్షలు వెచ్చించి రూ.6 లక్షల కార్పస్ ఫండ్‌తో మొదలుపెట్టారు. అలా ఇన్‌స్టాగ్రాంలో పాపులర్ బ్రాండ్‌గా అవతరించింది. అలా అంచెలంచెలుగా విస్తరిస్తూ గత ఏడాది తమ వ్యాపారాన్ని 50 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి తెచ్చారు. ఇప్పుడిక భౌతిక దుకాణాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. సాంప్రదాయ,నేత దుస్తులు, నేతన్నలపై లోతైన పరిశోధన చేశారు. మొదట్లో బెంగాల్, ఫూలియా, బిష్ణుపూర్, రాజ్పూర్, ధనియాఖలి వంటి గ్రామాలు, ఒరిస్సాతో పాటు చీరలకోసం అవసరమైన ప్రతిచోటికీ వెళ్లారు. అలా మొదట్లో అల్మారలో మొదలైన ప్రస్థానం గిడ్డంగిని అద్దెకు తీసుకునేదాకా శరవేగంగా వృద్ధిచెందేలా పరుగులు పెట్టించారు. కరోనా మహమ్మారి తరువాత అందరూ ఆన్లైన్ స్టోర్ల వైపు మొగ్గుచూపుతోంటే..లాక్డౌన్లు ముగిసిన వెంటనే భౌతిక దుకాణాలను తెరవాలని సుతా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే దుస్తులు, ముఖ్యంగా చీరల షాపింగ్ ఆన్లైన్లో కంటే భౌతికంగా చూసిన తరువాత కొనడానికి ఇష్టపడతారు. అందుకే కోల్‌కతాలో ఒకటి ప్రారంభించగా, త్వరలోనే బెంగుళూరులో తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నారు. photo courtesy : BusinessToday.In తమ దగ్గర చీరలు సాధారణంగా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయని చెప్పారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్‌ను బాగా స్టడీ చేయాలంటున్నారు. అంతేకాదు అక్కాచెల్లెళ్లుగా చిన్నచిన్న విషయాలపై పోట్లాడుకున్నా.. బిజినెస్ విషయంలోమాత్రం చాలా దృఢంగా ఉంటామని చెప్పారు. అలాగే సెల్ఫ్ ఫండింగ్‌తో నిర్వహించిన తమ బిజినెస్‌ను వీలైనంతవరకు అలాగే కొనసాగిస్తామని సుజాత ధీమా వ్యక్తం చేశారు. -
నేటి నుంచి మగువలకు బతుకమ్మ కానుక
సాక్షి, వరంగల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీకి ఉమ్మడి వరంగల్‌లో రంగం సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ పండుగ పూట పేద వర్గాల మహిళలు నిరుత్సాహంగా ఉండకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. సిరిసిల్ల, షాద్‌నగర్, నారాయణపేట, కొత్తపల్లి, తదితర ప్రాంతాల్లో తయారైన చేనేత చీరలను అందజేయడం ద్వారా కార్మికులకు సైతం ఉపాధి కల్పిస్తోంది. చదవండి: ‘మీ కాళ్లు మొక్కుతా.. మేం దళితులం.. మా పంట పాడు చేయకండి’ ఈ నెల 6 నుంచి బతుకమ్మ సంబరాలు మొదలై 13 వరకు జరగనున్నాయి. దీంతో అధికారులు ముందుగానే స్టాక్ తెప్పించి, గోదాముల్లో భద్రపరిచారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ మండలం మినహా, జిల్లా పరిధిలోని మిగతా ప్రాంతాల్లో చీరల పంపిణీకి ఎన్నికల కమిషన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చదవండి: టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు 13.45 లక్షల చీరలు... రూ.46.97 కోట్ల వ్యయం... దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఆహార భద్రత కార్డు ఉన్న కుటుంబాల్లోని 18 సంవత్సరాలు పై బడిన యువతులు, మహిళలు చీరలు పొందేందుకు అర్హులు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 12.87 లక్షల ఆహార భద్రత కార్డులు ఉండగా, 13,45,015 మంది అర్హతగల వారిని గుర్తించారు. లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు 11.25 లక్షల చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లాలో 2,83,341, వరంగల్‌లో వరంగల్ 3,37,334, జనగామలో1,99,556, మహబూబాబాద్ 2,71,000, జేఎస్ భూపాలపల్లి1,43,000, ములుగులో 1,10,784 చీరలను అర్హులైన మహిళలకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. చౌక ధరల దుకాణాల డీలర్లు, గ్రామస్థాయి కమిటీల ద్వారా లబ్ధిదారులకు అందజేయనున్నారు. అలాగే కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో వార్డుస్థాయి కమిటీల ద్వారా పంపిణీ చేయనుండగా అధికారులు పర్యవేక్షిస్తారు. ఉమ్మడి వరంగల్‌లో రూ.46,96,76,000 వ్యయంతో మొత్తం 13,45,015 చీరలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆడపడుచులకు కేసీఆర్ కానుక.. బతుకమ్మ చీరలు తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పండగ కానుకగా చీరలు అందజేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న మహిళలను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఉమ్మడి వరంగల్‌లో సుమారుగా 13.50 లక్షల చీరలు పంపిణీ చేస్తారు. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే.. బతుకమ్మ ఆడడానికి వెళ్లే మహిళలు.. తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడం కోసం ఆకర్శణీయమైన రంగులతో రూపుదిద్దుకున్న ఈ చీరల పంపిణీ శనివారం ప్రారంభమవుతుంది. – ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి -
హైకోర్టును ఆశ్రయించిన కొడెల సూర్యలతాకుమారి
-
కనకదుర్గమ్మ ఆలయంలో వెలుగులోకి మరో వివాదం
-
శ్రావణ సుమగంధం
బిజీలైఫ్.. పొట్టి జడను, పోనీ టెయిల్‌ను సపోర్ట్ చేసినా, అకేషనల్ షెడ్యూల్ మాత్రం వాలుజడ.. పూలజడనే సవరిస్తోంది! ఇందుకు సాక్ష్యం.. ఈ వరలక్ష్మీ వ్రతమే! అయితే ఈ అలంకరణను ఇదివరకటిలా అమ్మ.. అత్తమ్మ... అమ్మమ్మలు చేయట్లేదు స్పెషల్ డిజైనర్లు అల్లుతున్నారు అందంగా.. సంస్కృతిని చాటే పండుగపబ్బాలకు సంప్రదాయ సోకులే అసలైన ఆకర్షణ. అందుకే మామూలప్పుడు ఎలా ఉన్నా పర్వదినాలకు మాత్రం బారెడు జడ.. మూరెడుపూలతో కాంతులీనుతుంటారు కాంతలు. ఈ అలంకరణ ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల అమ్మమ్మల దాకా అందరికీ ప్రీతిపాత్రమే! ఇంతకుముందు ఈ జడల్లో మల్లెలు, మరువాలు, బంతులు, చేమంతులు, కనకాంబరాలు చేరేవి. కట్టేది చీరైనా, పరికిణీ జాకెట్టయినా.. ఓణీ అయినా పూలు ఇవే! జడలో తురిమే వైనమూ అదే! ఇపుడు.. కాలం మారింది. అభిరుచి పాతదే అయినా అమలయ్యే తీరు కొత్తందాన్ని సంతరించుకుంది. విదేశీపుష్పాలు సైతం కురులకు కలరింగ్ ఇస్తున్నాయి. కొంచెం సృజన ఉన్నవాళ్లు ఈ జడను అప్డేట్ చేసి పూలజడ డిజైనర్లుగా అడ్రస్ చాటుకుంటున్నారు. పువ్వులతో పాటు.. బుజ్జిబుజ్జి నడకల తన బుజ్జాయి బుల్లి జడకు పువ్వులు భారమవుతాయని అమ్మలు భావిస్తే.. వీసమెత్తు బరువులేని కనకాంబరంలాంటి పూలతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలను జడ ఒంపుల్లో చేర్చి ఆ బిడ్డల్ని బంగారు బొమ్మల్లా తీర్చిదిద్దుతున్నారు. అరచేతి వెడల్పున డిజైన్లు సృష్టించి, వాటిని జడ పొడవునా పొదుగుతున్నారు. సిగ్గులొలికే పెళ్లికూతురి కోసం మల్లెమొగ్గలతో జడను కుడుతున్నారు. అత్తారింట జరిగే రిసెప్షన్‌కి ఆ అపరంజి ఇంకాస్త అందంగా కనిపించడానికి ఆమె జడపై నెమళ్లను నాట్యమాడిస్తున్నారు. ఇలా ఒక్కో వేడుకకు ఒక్కో విధమైన వైవిధ్యాన్ని పూలజడల్లో చూపిస్తున్నారు. రంగులను బట్టి.. చీర.. లంగా ఓణీల రంగులను బట్టి పువ్వులను.. వాటి చుట్టూ వాడే పూసలను ఎంచుకుంటున్నారు. తెలుపు చీరకు ప్రకృతి ఇచ్చిన మల్లె, లిల్లీ సుమాలు.. మధ్య మధ్యలో ముత్యాలు, కృత్రిమంగా చేసిన గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్ని జతచేర్చి జడలో కూర్చుతున్నారు. ఆకుపచ్చ రంగు చీరయితే సంపంగి, మరువాన్ని అల్లేసి ఇతర పువ్వులను, మోటివ్స్ను, రకరకాల జడబిళ్లలను కలిపేస్తున్నారు. వంకాయ రంగుకు ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ వాడుతున్నారు. ఈ పూలజడలు డిజైన్‌ను బట్టి ధర.రూ.2,000/- నుంచి 3,500/- వరకు లభిస్తున్నాయి. మరింత ఖరీదైన జడబిళ్లలు వాడాలంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్సెసరీస్ మన హైదరాబాద్‌లోనే దొరుకుతాయి. - విజయారెడ్డి ‘ఏ చిన్న వేడుకైనా అమ్మాయిల అలంకరణ కోసండిజైనర్ పూల జడలను అడుగుతున్నారు. ఈ మాసం నోములు, వ్రతాలలో అమ్మాయిలను లక్ష్మీదేవిలా అలంకరించాలనుకుంటారు. రాబోయే దసరా, నవరాత్రి, దీపావళి వేడుకల్లో.. పెళ్లి సంబరాల్లో డిజైనర్ పూలజడలకు మంచి గిరాకీ ఉంటోంది. ఆర్డర్ మీద వీటిని తయారుచేస్తుంటాం.’ - కల్పన రాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్