sasikiran
-
అందుకే ‘సత్యభామ’ని నేను డైరెక్ట్ చేయలేదు: శశికిరణ్ తిక్క
‘‘ఇప్పటివరకూ ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా భావోద్వేగాలతో రూపొందిన ‘సత్యభామ’ ప్రత్యేకంగా ఉంటుంది. షూటింగ్ టైమ్‌లో కాజల్ అగర్వాల్గారి ఎనర్జీ మా యూనిట్‌కి ఉత్సాహాన్నిచ్చేది. ఈ సినిమాలో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్సులు చాలా స్పెషల్. ‘సత్యభామ’లో ప్రేక్షకులు కొత్త కాజల్‌ను చూస్తారు’’ అన్నారు శశికిరణ్ తిక్క. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. సుమన్ చిక్కాల దర్శకత్వంలో బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా నేడు రిలీజవుతోంది.ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించిన శశికిరణ్ తిక్క మాట్లాడుతూ– ‘‘యూకేలో ఉండే మా మిత్రులు రమేశ్, ప్రశాంత్ చెప్పిన పాయింట్ నచ్చడంతో నేను, దర్శకుడు సుమన్ ‘సత్యభామ’ కథ సిద్ధం చేశాం. దర్శకుడిగా నేను బిజీగా ఉండటంతో ఈ మూవీకి దర్శకత్వం వహించలేదు. పైగా మా అవురమ్ ఆర్ట్స్‌పై మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాం. నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో ‘సత్యభామ’తో తెలిశాయి.ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉంటుంది. ‘సత్యభామ’ సినిమా ప్రీమియర్స్ వేశాం... చూసిన వాళ్ల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘గూఢచారి’ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. ‘గూఢచారి 2’కి వేరేవాళ్లు దర్శకత్వం చేయాలని నేను, అడివి శేష్ ముందే అనుకున్నాం. మహేశ్‌బాబుగారు ‘మేజర్’ సినిమాలో భాగస్వామ్యం అయ్యారు. ఆయనకు ‘సత్యభామ’ చూపించాలనుకుంటున్నాను’’ అన్నారు. -
Kajal Aggarwal: పెళ్లయితే కెరీర్ మారాలా?
‘‘నన్ను టాలీవుడ్ చందమామ అని పిలుస్తుంటారు. ‘సత్యభామ’ విడుదల తర్వాత సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. చందమామ అందమైన పేరు. సత్యభామ పవర్ఫుల్ నేమ్. ఈ రెండూ నాకు ఇష్టమే’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సత్యభామ’. నవీన్ చంద్ర కీలక పాత్ర చేశారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరించి, స్క్రీన్ ప్లే అందించారు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ పంచుకున్న విశేషాలు... ⇥ ‘సత్యభామ’ కథని సుమన్ చెప్పిన వెంటనే ఒప్పుకున్నా. ఈ స్టోరీ అంత నచ్చింది. ఈ మూవీని నా వ్యక్తిగత జీవితంతో ΄ోల్చుకోవచ్చు. సమాజంలో ఏదైనా ఘటన జరిగితే నిజ జీవితంలో నేనూ స్పందిస్తుంటా. బయటకు వచ్చి ర్యాలీలు చేయకున్నా ఆ ఘటన గురించి ఆలోచనలు వస్తుంటాయి.. డిస్ట్రబ్ చేస్తుంటాయి. ‘సత్యభామ’ సినిమా లాంటి భావోద్వేగాలున్న చిత్రం చేయడం ఇదే తొలిసారి. ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఇప్పటిదాకా ఫీల్ కాని కొన్ని భావోద్వేగాలను అనుభూతి చెందాను. ⇥ ‘సత్యభామ’లో ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్ఫుల్ ΄ోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ సహజంగా ఉంటాయి. రామ్ చరణ్‌లా (మగధీర మూవీని ఉద్దేశించి) వంద మందిని నేను కొడితే ప్రేక్షకులు నమ్మరు.. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. ఈ మూవీలో యువత, బెట్టింగ్ అంశంతో పాటు ఓ మతం గురించిన కీ పాయింట్స్ ఉంటాయి. ⇥ పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ వ్యక్తిగత జీవితం ఉంది. అలాగే హీరోయిన్లకు కూడా. గతంలో పెళ్లయ్యాక కథానాయికలకి అవకాశాలు తగ్గాయేమో? కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్లు అంతకుముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు. నేను నా వ్యక్తిగత జీవితాన్ని, సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నా భర్త గౌతమ్ కిచ్లు, నా ఫ్యామిలీ స΄ోర్ట్ ఎంతో ఉంది. నా భర్తకు ఇష్టమైన కథానాయికల్లో నాతోపాటు సమంత, రష్మిక మందన్న, రాశీ ఖన్నా ఉన్నారు. ‘భారతీయుడు 2’ విడుదల కోసం ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ‘భారతీయుడు 3’ లోనూ నా పాత్ర ఉంటుంది. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు ఒప్పుకున్నాను. -
కాపాబ్లాంకా స్మారక చెస్ టోర్నీ విజేత శశికిరణ్
చెన్నై: ప్రపంచ మాజీ చాంపియన్ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ కృష్ణన్ శశికిరణ్ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. పది రౌండ్ల తర్వాత శశికిరణ్ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ టోర్నీ లో శశికిరణ్ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్ గుర్తింపు పొందాడు. -
ఈ విధిత.. విధి వంచిత
ఆడపిల్ల పుట్టిందని గెంటేసిన భర్త అత్తారింటి వద్ద బాధితురాలు ఆందోళన ముషీరాబాద్: ఆడపిల్ల పుట్టిందని తనను వేధించారని, చివరకు పిచ్చిపట్టిందని ఇంట్లోంచి గెంటేశారని, నాకు న్యాయం చేయాలని ఓ మహిళ రాంనగర్‌లోని భర్త ఇంటి వద్ద తన కూతురితో కలిసి ఆందోళనకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం...వనస్థలిపురానికి చెందిన నర్సాపురం బ్రహ్మచారి, ఉమాదేవిల కూతురు విధితను రాంనగర్‌కు చెందిన అమృత, లక్ష్మీనారాయణ కుమారుడు శశికిరణ్కు ఇచ్చి 2010లో పెళ్లి చేశారు. కట్నం కింద రూ. 10 లక్షలు, 25 తులాల బంగారం ఇచ్చారు. బీటెక్ చదివిన విధిత వెబ్ డిజైనింగ్ నేర్చుకొని కూతురు పుట్టే ముందు వరకు ఉద్యోగం చేసింది. శశికిరణ్ గతంలో ముంబై, బెంగళూరుల్లో సొంతంగా యానిమేషన్ బిజినెస్ చేశాడు. ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నీవు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ నా బిజినెస్‌లో నష్టం వచ్చిందని, నా చెల్లెలు పెళ్లి కావడంలేదని భార్యను వేధించసాగాడు. విధితకు 2013 సెప్టెంబర్‌లో కూతురు పుట్టింది. కూతురుని చూడటానికి శశికిరణ్ వెళ్లలేదు. ఐదు నెలలైనా భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడంతో తల్లిదండ్రులు విధితను రాంనగర్‌లోని అత్తగారింటిలో విడిచి పెట్టి వెళ్లారు. ఇక అత్తమామలు అమృత, లక్ష్మీనారాయణ , ఆడపడుచులు సూటిపోటీ మాటలతో వేధించడంతో పాటు కొట్టడం చేశారు. దీంతో విధితకు పెరాలసిస్ వచ్చింది. వైద్యం చేయించుకొనేందుకు తల్లి గారింటికి వెళ్లింది. ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత కూడా భర్త కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గురువారం తన ఏడాది పాప వేదను తీసుకొని అత్తగారింటికి రావడంతో కనీసం తలుపులు కూడా తీయలేదు. దీంతో ఆమె పాపతో ఇంటి ముందే కూర్చొని ఆందోళనకు దిగింది. రాత్రి వరకు కూర్చున్నా అత్తగారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు. భర్తతో కలిసి ఉంటానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉండగా భర్త శశికిరణ్ తన చెల్లెలు నిశ్చితార్థం ఉండటంతో పది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి ఇక్కడే ఉన్నాడు. ఇప్పటికే అతను భార్య నుంచి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. -
నాన్న నన్ను ఒక్కరోజు కూడా తిట్టలేదు!
ప్రముఖ హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ కుమార్తె శశికిరణ్ దర్శకురాలిగా మారి, ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ అనే చిత్రం చేశారు. గతంలో బుల్లితెరపై కొన్ని షోలు డెరైక్ట్ చేసిన అనుభవం శశికిరణ్కు ఉంది. భవిష్యత్తుపై తనకు స్పష్టమైన లక్ష్యం ఉంది. శశికిరణ్‌తో జరిపిన చిట్ చాట్. అసలు మీ కెరీర్ ఎలా ఆరంభమైంది? ముందు గ్రాఫిక్స్ విభాగంలో చేశాను. కానీ, ఒకేచోట కూర్చునే ఉద్యోగం అంటే నావల్ల కాలేదు. వేరే ఏదైనా చేద్దామనుకుని, టీవీకి సంబంధించిన డెరైక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. పలు టీవీ షోస్‌కి డెరైక్షన్ చేశాను. మాటీవీలో చేస్తూనే ఈ సినిమా డెరైక్ట్ చేయడం మొదలు పెట్టాను. ఆ తర్వాత నమ్మకం కుదిరి ఉద్యోగానికి రాజీనామా చేసేశా. ‘సాహెబా సుబ్రహ్మణ్యం’కి ఎలా అవకాశం వచ్చింది? యూఎస్‌లో ఉన్న కొల్లా నాగేశ్వరరావుగారికి నా గురించి ఫ్రెండ్ చెప్పారు. డెరైక్షన్ చేసే ప్రతిభ నాకుందని నా ఫ్రెండ్ చెప్పడంవల్లే నాగేశ్వరరావుగారు నన్ను సంప్రదించారు. మలయాళ సినిమా ‘తట్టత్తు మరియత్తు’ని రీమేక్ చేద్దామని ఆయనే అన్నారు. నాక్కూడా డెరైక్షన్ చేయగలననే నమ్మకం ఉండటంతో అంగీకరించాను. టీవీపరంగా అనుభవం సంపాదించుకున్నా.. సినిమాలపరంగా దర్శకత్వ శాఖలో అనుభవం లేదు కదా.. ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఎక్కడా చేయకపోవడమే మంచిదనిపించింది. ఎవరి దగ్గరైనా పని చేసి ఉంటే, వాళ్ల ప్రభావం నా మీద ఉండి ఉండేది. ఇప్పుడు నా ఆలోచనలు, నా పని తీరు.. ఇవే సినిమాలో ప్రతిబింబిస్తాయి.మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాకి రీమేక్ ఇది. ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ కాబట్టి, ‘సేఫ్’ అనుకున్నారా? అలా ఏం కాదు. ఎందుకంటే, మలయాళ సినిమా అక్కడి నేపథ్యంలో ఉంటుంది. తెలుగు సినిమాని ఇక్కడి నేపథ్యంలో, ఇక్కడివారి అభిరుచులకు తగ్గట్టుగా తీయాలి. మన నేటివిటీకి తగ్గట్టుగా కథాంశాన్ని మలచకపోతే అనువాద చిత్రంలా అనిపించే ప్రమాదం ఉంది. స్ట్రయిట్ సినిమా చేసినప్పుడు ఉన్న వెసులుబాటు రీమేక్ సినిమాకి ఉండదు. నేను ‘కట్ అండ్ పేస్ట్’లా ఈ సినిమా తీయలేదు. రీమేక్ అస్సలు సులువు కాదు. సినిమా పరిశ్రమలో పురుషాధ్యికత ఉంటుందని, స్త్రీలంటే చిన్న చూపు ఉంటుందనే అభిప్రాయం ఉంది.. అదెంతవరకు నిజం? మేల్ డామినేషన్ నిజమేనండి. మొదట్లో ‘ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే’ అని తేలికగానే అనుకున్నారు. నా పనితీరు చూసిన తర్వాత గౌరవించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఒకటేనండి.. నెమ్మదిగా చెప్పేవాళ్లకి నెమ్మదిగా.. కటువుగా చెప్పేవాళ్లకి ఆ విధంగా చెప్పాలి. ఆ లక్షణాలుంటే ఏ రంగంలోనైనా స్త్రీలు రాణించగలుగుతారు. మా నాన్నగారికి పరిశ్రమలో మంచి పేరుండటం హెల్ప్ అయ్యింది. ‘ఎమ్మెస్ నారాయణగారి అమ్మాయి’ అంటూ గౌరవ భావం, అభిమానంతో చూశారు. డెరైక్టర్ అవుతానని చెప్పగానే మీ నాన్నగారు ఏమన్నారు? సినిమా పరిశ్రమలో లేడీస్ ఇమడటం సులువు కాదన్నారు. ఈ సినిమా షూటింగ్ ఆరంభించక ముందు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నాను. అప్పుడే నాన్నగారికి నా మీద నమ్మకం కుదిరింది. నాన్నగారెప్పుడూ ‘సున్నాతో మొదలు కావాలి’ అంటారు. షాట్ డివిజన్ ఎలా చేయాలి? సీన్స్ ఎలా రాసుకోవాలి? అని నా అంతట నేను నేర్చుకుని, సున్నాతోనే మొదలుపెట్టాను. ఈ సినిమాలో మీ నాన్నగారు కూడా నటించారు కదా.. ఆయన్ను డెరైక్ట్ చేయడం ఎలా అనిపించింది? చాలా భయం అనిపించింది. సరిగ్గా చేయకపోతే చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా, తిట్టేస్తారు. ఈ సినిమా షూటింగ్లో నన్ను ఒక్క రోజు కూడా తిట్టలేదు. సో.. బాగా చేశాననే అనుకుంటున్నా. దర్శుకుల్లో మీకెవరు ఆదర్శం? అందరూ ఆదర్శమేనండి. అయితే కె. విశ్వనాథ్‌గారు, బాలు మహేంద్రగారు, మణిరత్నంగార్ల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. మహిళా దర్శకులందరూ ఆదర్శమే. మీరా నాయర్ చేసే సినిమాలంటే ఇష్టం. ’ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘క్వీన్’లాంటి సినిమాలు చేయాలని ఉంది. డెరైక్షన్ కొనసాగిస్తారా? కచ్చితంగా. ప్రస్తుతం ఓ కథ సిద్ధం చేసుకున్నా. అవకాశాలు వస్తున్నాయి. నాన్నగారి దగ్గర అద్భుతమైన కథలున్నాయి. వాటిల్లో ఓ కథను ఎప్పటికైనా తెరకెక్కిస్తాను. -
నాన్నే నాకు స్ఫూర్తి
దర్శకురాలు శశికిరణ్ పేరొందిన హాస్య నటుడి కుమార్తె అయినా ఆమె దృష్టి మాత్రం ఎప్పుడూ దర్శకత్వంపైనే. విలువలతో కూడిన సినిమా తీయూలనే తపనపైనే. ఇలా.. ఎన్నో రోజులుగా ఆమె కన్న కలలు ఇప్పటికి నెరవేరాయి. ‘సాహెరా సుబ్రహ్మణ్యం’ అనే విభిన్న ప్రేమకథతో ప్రత్యేకమైన సినిమా తీశారు. సినీ రంగంలోనైనా.. నిజజీవితంలోనైనా నాన్నే నా స్ఫూర్తి అంటున్న ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్‌తో ‘సాక్షి’ చిట్‌చాట్. ప్రశ్న : సినిమాలపై మక్కువకు కారణం.. జ : నా చిన్నతనం నుంచి సినిమాలంటే ఇష్టం. ప్రతి సినిమాను విశ్లేషణాత్మకంగా చూస్తాను. ఆ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అన్వేషిస్తాను. నాన్న ప్రోత్సాహంతో సినీ రంగాన్ని ఎంచుకున్నాను. ప్రశ్న : మీకు నచ్చిన దర్శకులు.. జ : నాన్నతో పాటు ప్రియద ర్శన్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు.. ఇంకా చాలామందే ఉన్నారు. ప్రశ్న : సినీరంగంలో మీ అనుభవం.. జ : ‘సాహెబా సుబ్రహ్మణ్యం’ సినిమాలో ప్రముఖ నటులు నరేష్, రావు రమేష్ వంటి వారిని డెరైక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ నాకు చాలా సహకరించారు. అన్ని సన్నివేశాలు బాగా పండాయి. ప్రశ్న : ఏ తరహా చిత్రాలంటే ఇష్టం.. జ : సమాజానికి ఎంతో కొంత మెసేజ్ ఇచ్చే సినిమాలను ఇష్టపడతాను. అలాంటి సినిమాల ద్వారా ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతారు. నేను కూడా నా సినిమాలో ఓ సందేశం ఇవ్వనున్నాను. మన సంస్కతీ సంప్రదాయూలు ఇనుమడించేలా సన్నివేశాలు ఉంటాయి. ప్రశ్న : మీకు ఆదర్శం ఎవరు.. జ : కచ్చితంగా మా నాన్నే. నా ఎదుగుదలకు, అభివృద్ధికి ఆయనెంతో కారణం. ఆయనే నాకు స్ఫూర్తి. ఎప్పటికీ ఆయన బాటలోనే నడుస్తా..