sateesh
-
చిరుధాన్యాల రైతుల్ని ప్రోత్సహించాలి
సాక్షి, హైదరాబాద్: ‘వెనక్కి ప్రయాణిద్దాం, ప్రగతి సాధిద్దాం. మనిషి జీవనశైలి వందేళ్లు వెనక్కి వెళ్లాలి. అప్పుడే ఆరోగ్యవంతమైన, శక్తిమంతమైన సమాజం తయారవుతుంది. ఆధునిక మానవుడు అనుసరించాల్సింది ఇదే. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆ చర్యలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి’’అని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ అన్నారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాగి, జొన్నలు, కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాల రైతులకు ఎకరాకు పదివేల రూపాయల చొప్పున ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. ‘చిరుధాన్యాల సేద్యానికి తక్కువ నీరు సరిపోతుంది. వరిసాగుకు పనికిరాని భూముల్లో కూడా ఇవి పండుతాయి, వాతావరణ సంక్షోభాన్ని తట్టుకుని మనుగడ సాగించే ఈ పంటలకు ప్రభుత్వం అండగా నిలిస్తే రాబోయే తరాలు ఆరోగ్యవంతంగా, శక్తిమంతంగా మారుతాయి’అని పేర్కొన్నారు. చిరుధాన్యాల సాగు పూర్తిగా సేంద్రియ వ్యవసాయమేనం టూ సిక్కిం మాదిరిగా తెలంగాణ ప్రభు త్వం కూడా ఒక విధానం ప్రకటించాలని సతీశ్ కోరారు. ‘చిరు’రేషన్ ఇవ్వండి రేషన్ దినుసుల్లో చిరుధాన్యాలను చేర్చాలని సతీశ్ సూచించారు. జాతీయ ఆహారభద్రత చట్టం ప్రకారం ప్రతి రేషన్‌కార్డు మీద కనీసం ఏడు కిలోల చిరుధాన్యాలను పంపిణీ చేయాలని, ఇవి పోషకాహారలోపం తో బాధపడుతున్న వారికి వరం అవుతాయన్నారు. ఆయా రాజకీయ పార్టీల అనుబంధ రైతు సంఘాలు ముందుకు వస్తే చిరుధాన్యాలపై ప్రభుత్వాలు స్పందిస్తాయని దిశ సంస్థ నిర్వాహకులు సత్యనారాయణరాజు అన్నారు. ‘ఇప్పుడు సమాజాన్ని పీడిస్తున్న డయాబెటిస్ వంటి వ్యాధులకు దూరంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతో దోహదం చేస్తాయనే చైతన్యం చాలామందిలో వచ్చింది. అయితే, వాటిని రోజూ ఉడికించి తినడానికి మొహం మొత్తడంతో ఆపేస్తున్నారు. అందుకోసమే పోషకాహార నిపుణులను సంప్రదించి చిరుధాన్యాలను ఎన్నిరకాలుగా వండవచ్చనే అంశం మీద డీడీఎస్ పరిశోధించింది. రాగి, జొన్నలు, కొర్రలు, సామలుతో నలభై రకాల వంటకాలను రూపొందించింది’అని సతీశ్ చెప్పారు. ఈ సందర్భంగా తినడానికి సిద్ధంగా(రెడీ టు ఈట్) జొన్న, రాగి, సజ్జ మురుకులు, కారప్పూస, కొర్ర బూందీ, గవ్వలు, పప్పు చెక్కలు, జొన్న అటుకుల లడ్డు, కారం కాజాలు, రాగి లడ్డు, జొన్న లడ్డు వంటి సంప్రదాయ వంటకాలను ప్రదర్శించారు. -
వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా వొడ్నాల సతీశ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రసుత్తం సతీశ్ వైఎస్సార్సీపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
భార్య కోసం సెల్‌టవర్ ఎక్కాడు!
గుంటూరు: తన భార్యను కాపురానికి పంపనందుకుగానూ ఏకంగా సెల్ టవరెక్కాడో వ్యక్తి. సతీష్ అనే యువకుడు నాలుగు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇంతలో భార్య తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. దాంతో తన భార్యను కాపురానికి పంపాలంటూ సతీష్ నిరసనకు దిగాడు. ఈ క్రమంలో పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ ఎదుట సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
ఘట్కేసర్: రంగారెడ్డి జిల్లా లో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతిచెందాడు. ఘట్ కేసర్ మండలంలోని అన్నోజిగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దిల్సుఖ్ నగర్ కు చెందిన సతీష్(27) ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈ రోజు ఆఫీస్ బైక్‌పై బయలు దేరిన సతీష్ అన్నోజిగూడ వద్ద ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో మృతి చెందాడా.. లేక ఏదైనా వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ కలిపింది.. గోదావరి విడదీసింది..
చేపల వేట సరదా ధర్మాజీ యాదగిరి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్యోగంలో చేరాల్సిన సమయంలో మృత్యుఒడికి చేరాడు. పట్టణంలోని కాలేజీరోడ్కు చెందిన యూదగిరి మంళవారం మధ్యాహ్నం వరుసకు సోదరుడైన సతీశ్‌తో కలిసి గోదావరి నదికి చేపల వేటకు వెళ్లాడు. అరగంటపాటు చేపలు పట్టారు. ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు యాదగిరి నది నీటి మడుగులో పడి గల్లంతయ్యూడు. అతడిని కాపాడేందుకు సతీశ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కుటుంబ సభ్యులతోపాటు తహశీల్దార్ కిషన్, అగ్నిమాపక సిబ్బంది నది వద్దకు చేరుకుని రాత్రి ఎనిమిది గంటల వరకు గాలింపు చేపట్టినా యూదగిరి జాడ తెలియరాలేదు. బుధవారం ఉదయం తొమ్మిది గంట లకు మృత దేహం కరీంనగర్ జిల్లా సరిహద్దు గోదావరి నదిలో లభ్యమైంది. మృతదేహాన్ని చూడగానే కుటుం బ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. కరీంనగర్ జిల్లా రామగుండం పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నా రు. ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మంచిర్యాలకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెళ్లరుున ఆరు నెలలకే.. యాదగిరి, శ్రీరాంపూర్‌కు చెందిన సరిత ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించి మే 18న పెళ్లి చేసుకున్నారు. స్నేహితులు, బంధువులు సర్దిజెప్పడంతో యూదగిరి తల్లిదండ్రులు సమ్మతించారు. కొడు కు, కోడలిని తమ ఇంటికి తీసుకొచ్చారు. యూదగిరి, సరిత కాపురం సంతోషంగా సాగింది. మంచిర్యాలలో బీఎస్సీ బయోమెట్రిక్స్ చదివిన యాదగిరి ఓ ప్రముఖ మెడికల్ కంపెనీ రిప్రజెంటీటివ్ ఉద్యోగం కోసం ఐదు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యూడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చి తాను ఇం టర్య్వూలో సెలెక్ట్ అయ్యానని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో అంతా ఆనందించారు. ఇక తమ కష్టాలు తీరనున్నాయని ఆ నవ దంపతులు సంబరపడ్డారు. అంతలోనే యూదగిరిని చేపల వేట రూపంలో గోదావరినది బలిగొంది. ఎన్నో ఆశలతో ప్రేమించినోడి వెంట వచ్చి అతడిని పెళ్లి చేసుకున్న సరిత యూదగిరి మృతితో శోకసంద్రంలో ముని గిపోరుుంది. ఆమె దయనీయ స్థితి బంధువులు, స్థాని కులను కంటతడి పెట్టించింది. యాదగిరికి తల్లిదండ్రులు, తమ్ముడు, అక్క, చెల్లె ఉన్నారు. తండ్రి రాజమ ల్లు సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాడు. పెద్ద కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.