సత్యదేవుని దర్శించుకున్న భన్వర్లాల్
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా): రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్ దంపతులు ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఇన్చార్జి ఈఓ జగన్నాథరావు ఆధ్వర్యంలో పండితులు స్వాగతం పలికారు. స్వామివారి వ్రతం, దర్శనం అనంతరం వారికి వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను అందజేశారు.