sathya nadendla
-
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు ప్రముఖ నేతలు
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు వార్షిక సమావేశాలు వచ్చే నెల 21 నుంచి 25వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్ పట్టణంలో జరగనున్నాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ కిమ్ సహా ఆరుగురు సంయుక్తంగా అధ్యక్షత వహిచనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం పాల్గొనవచ్చని అంచనా వేస్తున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాధిపతులు, రాజకీయ నేతలు, వ్యాపారులు, పౌర సమాజం ప్రముఖులు కలసి 3,000 మంది వరకు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ‘ప్రపంచీకరణ 4.0: నాలుగో పారిశ్రామిక విప్లవం దశలో ప్రపంచ స్వరూపం’ ఈ కార్యక్రమం ప్రధాన అంశంగా ఉంటుంది. వాతావరణం మార్పులు, జీవ వైవిధ్యం, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాల నష్టం అంశాలను పరిష్కరించాల్సి ఉందని ప్రపంచ ఆర్థిక ఫోరం వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లౌస్ ష్వాబ్ పేర్కొన్నారు. కేటీఆర్, లోకేశ్ సైతం...: భారత్ నుంచి పాల్గొనే వారిలో అరుణ్ జైట్లీతోపాటు కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కమల్‌నాథ్, చంద్రబాబునాయుడు, దేవేంద్ర ఫడ్నవిస్ ఉన్నారు. చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, కేటీఆర్ సైతం హాజరు కానున్నారు. వ్యాపార ప్రముఖులు అజీమ్ ప్రేమ్‌జీ, ముకేశ్ అంబానీ దంపతులు, ఉదయ్ కోటక్, గౌతం అదానీ, లక్ష్మీ మిట్టల్, నందన్ నీలేకని, ఆనంద్ మహీంద్రా, అజయ్ పిరమల్ కూడా పాలు పంచుకోనున్నారు. -
అత్యంత శక్తిమంతుల్లో
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో కూడిన ఫోర్బ్స్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీకి 9వ స్థానం దక్కింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అధిగమించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్ ఈ జాబితాను వెలువరించింది. మోదీతో పాటు జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(32వ ర్యాంకు), ఫేస్బుక్ సీఈఓ జుకర్‌బర్గ్(13), బ్రిటన్ ప్రధాని థెరిసా మే(14), చైనా ప్రధాని లీకెకియాంగ్(15), యాపిల్ సీఈఓ టిమ్ కుక్(24) కన్నా మోదీ ముందంజలో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు 40వ స్థానం దక్కింది. ‘ఈ భూమ్మీద మొత్తం 7.5 బిలియన్ల మంది జీవిస్తున్నారు. అందులో ఈ 75 మంది ప్రపంచ గతిని మార్చారు. ప్రతి 100 మిలియన్ల మందికి ఒకరి చొప్పున ఈ ఏడాది అత్యంత శక్తిమంతుల జాబితాను రూపొందించాం’ అని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. భారత్‌లో మోదీకి ఆదరణ కొనసాగుతోందన్న ఫోర్బ్స్.. 2016 నాటి నోట్లరద్దు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జియో సేవలు ప్రారంభించిన రిలయన్స్ భారత టెలీ మార్కెట్లో చవక టారిఫ్‌ల యుద్ధానికి తెరతీసిందని పేర్కొంది. -
వీళ్లనూ తిప్పి పంపేవారా?
‘అమెరికా ఉత్పత్తులనే కొనండి, ఆమెరికా జాతీయులకే ఉద్యోగాలివ్వండి’ అనే తన ఎన్నికల నినాదాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్–1బీ వీసాల జారీ విధానంలో కీలకమార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఇకపై హెచ్–1బీ వీసా పొందడం కఠినం కానుంది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రకారం శాశ్వత నివాసానికి అర్హత కల్పించే ‘గ్రీన్‌కార్డు’ దరఖాస్తు పరిశీలనలో ఉండగానే హెచ్–1బీ వీసా గడువు ముగిసిన ఉద్యోగులు స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం అమలైతే అయిదు నుంచి ఏడున్నర లక్షల మంది భారత ఉద్యోగులపై పెనుప్రభావం పడుతుంది. అయితే.. ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక అమెరికన్ కంపెనీలకు సీఈఓలుగా, అధిపతులుగా ఉన్న భారతీయులు గతంలో హెచ్ –1బీ వీసాలపై అక్కడకు వెళ్లిన వారే. ఒకవేళ ఇప్పుడు ›ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన గతంలోనే అమలై ఉంటే వీరంతా ప్రసిద్ధ కంపెనీల్లో ఉన్నతస్థానాల్లో ఉండేవారా అన్న వాదన ముందుకొస్తోంది. గతంలో సరళమైన వీసా విధానం కారణంగానే పలువురు భారతీయులు ప్రస్తుతం ఆయా కంపెనీల్లో కార్పొరేట్ లీడర్లుగా ఉన్నారు. వీరంతా అమెరికా ఆర్థికాభివృద్ధికి విశేషంగా తోడ్పడి, ఆ దేశానికే అధిక లాభం చేకూర్చారు. వలసదారుల దేశంగా పిలిచే అమెరికాలో 20వ దశాబ్దం నుంచి వీసాలు, స్థిరనివాసం విషయంలో కఠిన నిబంధనలను సడలించారు. ఈ చర్యల ఫలితంగా అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించగలిగారు. భారత్ నుంచి అమెరికా వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడిన కొందరు ప్రముఖులు సత్యా నాదెళ్ల, హైదరాబాద్‌లో జననం. హోదా : సీఈఓ, మైక్రోసాఫ్ట్ చదువు : మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బీఈ, అమెరికాలోని విస్కాన్సిన్–మిల్ఔ – ఎమ్మెస్, షికాగో యూనివర్శిటీలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ – ఎంబీఏ సుందర్ పిచాయ్, తమిళనాడులో పుట్టారు. హోదా : సీఈఓ, గూగుల్ : చదువు : ఐఐటీ ఖరగ్‌పూర్–బీటెక్, స్టాన్‌ఫర్డ్–ఎమ్మెస్, వార్టాన్–ఎంబీఏ ఇంద్రానూయి, చెన్నైలో జన్మించారు హోదా : సీఈఓ, పెప్సీకో : అనుభవం : 1994లో ఆ సంస్థలో చేరిక. కొన్నేళ్లుగా సీఈఓగా బాధ్యతలు.. 2017లో వ్యాపార,వాణిజ్యాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళల ఫోర్బ్స్ జాబితాలో ద్వితీయస్థానం శంతను నారాయణ్, హైదరాబాద్‌లో పుట్టారు హోదా : సీఈఓ, అడోబ్ చదువు : ఉస్మానియా విశ్వవిద్యాలయం–బీఎస్సీ, బెర్క్లే కాలిఫోర్నియా వర్శిటీ–ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ వర్శిటీ–ఎమ్మెస్ అజయ్‌పాల్‌సింగ్ బాంగా హోదా : ప్రెసిడెంట్, సీఈఓ, మాస్టర్‌కార్డ్ చదువు : అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ జార్జి కురియన్, కేరళలో జన్మించారు హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, నెట్‌యాప్ చదువు : ఐఐటీ మద్రాస్‌లో కొంతకాలం ఇంజనీరింగ్ అమెరికాలోని ప్రిన్స్టన్ (న్యూజెర్సీలోని) యూనివర్శిటీలో డిగ్రీ,. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ–ఎంబీఏ దినేష్ పాలివాల్, ఉత్తరప్రదేశ్‌లో జననం హోదా : ప్రెసిడెంట్ అండ్ సీఈఓ, హర్మన్ ఇంటర్మేషనల్ చదువు : ఐఐటీ రూర్కీ–బీటెక్, వయామి వర్సిటీ–ఎమ్మెస్, ఎంబీఏ సంజయ్ ఝా హోదా : సీఈఓ, గ్లోబల్ ఫౌండ్రీస్ అనుభవం : 2014లో ఈ బాధ్యతలు చేపట్టడానికి పూర్వం మోటరోలా మొబిలిటి సీఈఓగా, క్వాల్కామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. 2008లో ఆయన మోటరోలా కో(సహ) సీఈఓగా చేరారు. అజిత్ జైన్, ఒడిశాలో పుట్టారు చదువు : ఐఐటీ, హార్వర్డ్ల నుంచి ఉన్నతవిద్యాభ్యాసం అనుభవం :బెర్క్‌షైర్ హాథ్‌వేలో వారెన్ బఫెట్ వారసుడిగా నియమితులయ్యే వారిలో ముందు వరుసలో ఉన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ నలుగురు మైక్రో సాఫ్ట్ వీడారు
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రో సాఫ్ట్ కంపెనీ నుంచి నలుగురు సీనియర్ ఉద్యోగులు తప్పుకున్నారు. తాము బాధ్యతలను విరమించుకుంటున్నామని రాజీనామా సమర్పించారు. ఈవిషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఈ మెయిల్ ద్వారా ప్రతి ఉద్యోగికి తెలియజేశారు. ఇంజినీరింగ్ విభాగాన్ని మూడు గ్రూపులుగా చేయాలన్న తన నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని సత్య నాదెళ్ల అందులో వివరణ ఇచ్చారు. డివైజెస్ గ్రూప్‌ను పర్యవేక్షిస్తున్న స్టీఫెన్ ఈలోప్, అడ్వాన్స్ టెక్నాలజీ హెడ్ ఎరిక్ రూడర్, బిజినెస్ సొల్యూషన్స్ విభాగం చీఫ్ కిరిల్ తతారినివోలు మైక్రోసాఫ్ట్ ను వీడినట్లు ఆయన తెలియశారు.