Satyam Computers scam case
-
ఇంకా విడుదల కాని ‘సత్యం’ రాజు
బెయిల్ కాగితాలు చర్లపల్లి జైలు అధికారులకు ఇంకా చేరకపోవడమే కారణం హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న దోషులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినా వారి విడుదలలో జాప్యం ఏర్పడింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 9న దోషులకు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రామలింగరాజు, రామరాజులకు రూ.5.75 కోట్లు, మిగతా దోషులకు రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరిమానా విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో ఉంటున్న రామలింగరాజు విజ్ఞప్తి మేరకు ప్రత్యేకకోర్టు జైలుశిక్ష అమలును నిలిపివేసి దోషులందరికీ సోమవారం బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు జరిమానాలో 10 శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లోగా చెల్లించాలని కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలాగే రామలింగరాజు, రామరాజులు రూ. లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగిలిన 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని బెయిల్ ఉత్తర్వుల్లో షరతు విధించింది. బెయిల్ కాగితాలు మంగళవారం రాత్రి వరకు కూడా చర్లపల్లి జైలు అధికారులకు చేరలేదు. దీంతో విడుదలలో జాప్యం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల బెయిల్ ఉత్తర్వుల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్లే జైలు అధికారులకు చేరలేదు. బుధవారం సాయంత్రంలోగా బెయిల్ పేపర్లు జైలు అధికారులకు చేరే అవకాశాలు ఉన్నాయని జైలు వర్గాలు పేర్కొన్నాయి. రామలింగరాజు కొద్దిరోజులుగా జైలులో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు. -
సత్యం రామలింగ రాజు రేపు విడుదల
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం ప్రధాన నిందితుడు, సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బీ రామలింగరాజు మరో తొమ్మిదిమంది బుధవారం విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ వచ్చినా.. అది ఇంకా జైలు అధికారులకు చేరకపోవడంతో ఆయన విడుదల ఒక రోజు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు చర్లపల్లి సెంట్రల్ జైళ్లో ఉన్నారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో వీరికి ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. -
‘సత్యం’ రాజుకు బెయిల్
జైలు శిక్ష అమలును నిలిపివేసిన ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన 4 వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. విచారణను జాప్యం చేసే యత్నం చేస్తే బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది. హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో దోషులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్ష అమలును నిలిపివేసి, రామలింగరాజు సహా ఇతరులకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రత్యేక కోర్టు విధించిన జరిమానా మొత్తంలో పది శాతాన్ని జైలు నుంచి విడుదలైన నాలుగు వారాల్లో చెల్లించాలని షరతు విధించింది. దీంతోపాటు బెయిల్ కోసం రామలింగరాజు, రామరాజులు రూ.లక్ష చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు, మిగతా 8 మంది దోషులు రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు గత నెల 9న దోషులకు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రామలింగరాజు, రామరాజులకు రూ. 5.75 కోట్లు, మిగతా దోషులకు రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై వారు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టులో అప్పీలు దాఖలు చేయగా.. సోమవారం దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా దోషుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ... తీవ్రమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో, సమాజానికి ప్రమాదకరమని భావించే కేసుల్లో మినహా దోషులను అప్పీళ్ల విచారణ సమయంలో జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసిందని కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మదుపుదారులెవరికీ నష్టం జరగలేదని, దోషులు మాత్రమే బాధితులుగా మిగిలిపోయారని చెప్పారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. అప్పీళ్ల విచారణకు సహకరించాలని, పదేపదే వాయిదాలు కోరరాదని దోషులకు స్పష్టం చేశారు. వారు కోర్టు విచారణలో జాప్యం చేసే ప్రయత్నం చేస్తే బెయిల్ రద్దు చేయాల్సిందిగా సీబీఐ న్యాయస్థానాన్ని కోరవచ్చని పేర్కొన్నారు.