Satyanarayana Swamy Vratam
-
యాదాద్రిలో కార్తీక మాసోత్సవాలు.. ప్రతిరోజూ సత్యనారాయణస్వామి వ్రతాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో భాస్కర్‌రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి ఆలయ సన్నిధిలోని తన చాంబర్లో ఆయన మాట్లాడారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి క్షేత్రానికి భక్తులు అధికంగా రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. శ్రీస్వామిని దర్శించుకోవడంతో పాటు ఆలయంలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని, ఈమేరకు కొండ కింద వ్రత మండపంలో డిసెంబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆరు బ్యాచ్‌లుగా వ్రతాల నిర్వహణ ఉంటుందన్నారు.వచ్చే నెల 15వ తేదీన ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 8 బ్యాచ్‌లుగా వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. అనుబంధ పాతగుట్ట ఆలయంలో నెల రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 బ్యాచ్‌లు, కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు 6 బ్యాచ్‌లుగా వ్రతాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా 15వ తేదీన ప్రధానాలయం, శివాలయంలో రాత్రి 6.30 గంటలకు ఆకాశ దీపారాధన ఉంటుందని తెలిపారు. చదవండి: పోటెత్తిన రద్దీ.. దీపావళికి సొంతూరి బాటలో జనంఈ నెల 31న దీపావళిని పురస్కరించుకుని ఆలయ నిత్య కైంకర్య వేళల్లో మార్పులు చేశామని చెప్పారు. వేకువజామున 3.30 గంటలకు సుప్రభాతం ప్రారంభమవుతుందన్నారు. 4.15 గంటల నుంచి 4.45 వరకు శ్రీస్వామి అమ్మవార్లకు మంగళహారతుల పూజ జరుగుతుందని, ఉదయం 8.15 గంటల నుంచి సర్వ దర్శనాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. -
Vah Vyshnavi: సొంతింట్లో బుల్లితెర నటి సత్యనారాయణ వ్రతం (ఫోటోలు)
-
సత్యదేవుని వ్రతాల్లో జర్నలిస్టులకు అవకాశం
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : పెదవాల్తెరు కరకచెట్టు పోలమాంబ ఆలయంలో మార్చి 5న నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాత్రికేయులు పాల్గొనవచ్చని వీజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్.దుర్గారావు తెలిపారు. హిందూ ధర్మపరిరక్షణ ట్రస్ట్, దేవాదాయ శాఖ, అన్నవరం వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారన్నారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ కరకచెట్టు పోలమాంబ దేవాలయం, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ వెబ్ చానల్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ఉచిత సత్యనారాయణస్వామి వ్రతాల్లో జర్నలిస్టులు పాల్గొనాలని కోరారు. వివరాలకు 9154576846, 9246673421 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో వీజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.