save andhrapradesh
-
సేవ్ ఆంధ్రప్రదేశ్ సేవ్ డెమోక్రసీ
-
'సస్పెన్షన్ ఎత్తివేత... సచివాలయంలో పోస్టింగ్'
ఏపీఎన్జీవో సభలో తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరిని సచివాలయంలోనే పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆదేశాలలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకిస్తూ... ఏపీఎన్జనీవోలు గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన నగరంలోని లాల్ బహద్దుర్ స్టేడియంలో 'సేవ్ ఆంధ్రప్రదేశ్' భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన కానిస్టేబుళ్లు శ్రీనివాసగౌడ్, శ్రీశైలం ముదిరాజ్‌ల జై తెలంగాణ అంటూ పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఇరుసభలు ఆమోదించడంతోపాటు రాష్ట్రపతి రాజముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పనులు చకచక జరిగిపోయాయి. తెలంగాణ ఆవిర్బావానికి జూన్ 2వ తేదీ అపాయింటెడ్ డేగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. జూన్ 2వ తేదీన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రాంతానికి చెందిన కానిస్టేబుళ్లపై నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జోరువానలో..జనకెరటం
వారి సంకల్పబలం ముందు వరుణుడు సైతం చిన్నబోయాడు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా సమైక్యవాదులు ఉరకలెత్తారు. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా కురిసిన కుండపోత వర్షాన్ని సైతం వారు లెక్క చేయలేదు. చెక్కుచెదరని మనోధైర్యంతో ఉద్యమ కెరటాలై ఎగిశారు. వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారుల సమైక్య నినాదాలతో కాకినాడలో జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ హోరెత్తింది. సమ్మెను తాత్కాలికంగా విరమించామే తప్ప.. ఉద్యమాన్ని విరమించలేదని సభకు వచ్చిన ఉద్యోగులు చాటిచెప్పారు. విభజన విషయంలో ఏమాత్రం ముందడుగు వేసినా మళ్లీ నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించారు. ప్రతికూల వాతావరణంలో సైతం సభను విజయవంతం చేశారు. సాక్షి, కాకినాడ: విభజన ప్రక్రియ ఆగే వరకూ ఉద్యమం కొనసాగుతుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు స్పష్టం చేశారు. కాకినాడ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో మంగళవారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యమాన్ని శాంతియుతంగానే ముందుకు తీసుకువెళ్తామన్నారు. డిసెంబర్ నుంచి ఉద్యమం కొత్త పంథాలో సాగనుందని వెల్లడించారు. ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే రాష్ర్ట విభజన జరుగుతోందన్నారు. విభజనను అడ్డుకునేందుకు తాము చేస్తున్న ఉద్యమానికి సీమాంధ్ర కేంద్ర మంత్రులు తూట్లు పొడుస్తున్నారని, వారికి త్వరలోనే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఐటీ విభాగం చైర్మన్ బ్రహ్మయ్య మాట్లాడుతూ, ఇది కేవలం ఉద్యోగులు, ఉపాధ్యాయుల, కార్మికుల పోరాటం కాదని, తెలుగువారి ఆత్మగౌరవం కోసం చేస్తున్నదని అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే మనతోపాటు పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ మాట్లాడుతూ రూ.2 లక్షల కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో హైదరాబాద్‌లోని పార్కులు, రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేశారని గుర్తు చేశారు. ‘మా నిధులను హైదరాబాద్‌కు మళ్లించి, ఇప్పుడు ఆ హైదరాబాద్ మాది కాదంటే ఎలా ఒప్పుకుంటాం?’ అని ప్రశ్నించారు. రాజీనామా డ్రామాలాడుతున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలను తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉందని సీమాంధ్ర క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ ముత్తాబత్తుల రత్నకుమార్ అన్నారు. ఏపీఎన్జీవోలు ఏ పిలుపు ఇచ్చినా తాము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జేఏసీ జిల్లా చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ ఇంత భారీ వర్షంలో కూడా తరలివచ్చిన జనాన్ని చూస్తుంటే నోట మాట రావడంలేదని, సమైక్య ఉద్యమానికి కాకినాడ సభ మరో మలుపు కానుందని చెప్పారు. జిల్లా కార్యదర్శి పితాని త్రినాధ్ మాట్లాడుతూ, కుండపోత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన సమైక్యవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దంటు సూర్యారావు మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలే లేకపోతే సమైక్య ఉద్యమం జరిగేది కాదన్నారు. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో తాత్కాలిక విరమణ పాటించడం సరికాదని, విభజన పూర్తిగా ఆగేవరకూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమైక్యవాదులపైనే ఉందని అన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జవహర్ ఆలీ మాట్లాడుతూ సీడబ్ల్యుసీ నిర్ణయానికి ముందే తాము ఉద్యమబాట పట్టామని, గత 54 రోజులుగా సీమాంధ్రలో 35 వేల మంది న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ సభలో మేథావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, ఏపీఆర్ఎస్ఏ ఉపాధ్యక్షుడు వీఎస్ దివాకర్, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు అనిల్ జాన్సన్, కవిశేఖర్, ప్రదీప్‌కుమార్, పీఎన్ మూర్తి, బండారు రామ్మోహనరావు, ఆదినారాయణ, విజయ్‌కుమార్, రాజ్యలక్ష్మి, తులసిరత్నం, కుమారిచౌదరి యాదవ్, సుబ్బారావు, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి బాబ్జి, మాలమహానాడు అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. జనకెరటం సాక్షి, కాకినాడ : కుండపోత వర్షంలో సైతం వేలాదిగా తరలివచ్చిన ఉద్యమకారుల సమైక్యనినాదాలతో కాకినాడలో మంగళవారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ హోరెత్తింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం మినహా మరో అవకాశం లేదని సమైక్యవాదులు స్పష్టం చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరో గంటలో సభ ముగుస్తుందనే వరకూ తరలివస్తూనే కనిపించారు. కుండపోత వర్షంలో ఏకంగా మూడు గంటలకు పైగా సభ కొనసాగినా జనం ఎక్కడా చెక్కుచెదరలేదు. రాష్ర్ట నేతల ప్రసంగాలకు ఉద్యమకారుల నుంచి విశేష స్పందన లభించింది. కందుకూరి వీరేశలింగం వేదిక నుంచి ఏపీ ఎన్జీవో రాష్ర్ట అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబుతో సహా రాష్ర్ట, జిల్లా నేతలందరూ సమైక్యనాదం వినిపించారు. రాష్ర్ట విభజన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మిలియన్ మార్చ్ నిర్విహించి సీమాంధ్రుల సత్తా చాటుతామన్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన సభ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ప్రారంభంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు, మహిళల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయనగరం రేలారేరేలా బృందం ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనకు ఉద్యమకారులు చిందులేశారు. అశోక్‌బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తాము ఏ రాజకీయ నాయకులకూ అమ్ముడుపోలేదని.. ప్రజాభిమానానికి అమ్ముడుపో యామని అన్నారు. ఆ అభిమానం కావాలంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులందరూ పదవులకు రాజీనామాలు చేసి తమతో కలిసి ఉద్యమబాట పట్టాలని సూచించారు. ఈ నెల 23 నుంచి నవంబర్ 5 వరకూ చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణను జిల్లా జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదంతో ప్రకటింప జేశారు. కాకినాడ రూరల్ నేతలు గజమాల, పూల కిరీటంతో అశోక్‌బాబును సత్కరించగా, రైతులు నాగలి బహూకరించారు. జోరువానలో జరిగిన ఈ సభ విజయవంతం కావడం సమైక్యవాదుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
మా సభలకొచ్చిన డ్రైవర్లంత మంది లేరు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ గొప్పదేమీ కాదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నిర్వహించిన టీ ఉద్యోగుల గర్జనకు హాజరైన ఉద్యోగులను తీసుకొచ్చిన వాహనాల డ్రైవర్లంతమంది కూడా ఈ సభకు రాలేదని ఎద్దేవా చేశారు. ఈ సభతో బ్రహ్మాండం బద్దలైందని ఎవరైనా అనుకుంటే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిశాక నగరానికి చేరుకున్న కేసీఆర్ సోమవారం పార్టీ నేత కే కే నివాసంలో టీఆర్ ఎస్, జేఏసీ, తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... సేవ్ ఆంధ్రప్రదేశ్ వంటి సభల్ని తాము గతంలో లక్షలు, వేలు నిర్వహించామని చెప్పారు. ఉద్యోగుల గర్జన సభలకు వచ్చిన 5-6లక్షల మంది ఉద్యోగులను తీసుకువచ్చినంత మంది కూడా సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు హాజరుకాలేదని విమర్శించారు. ఆఫ్ట్రాల్ ఒక సభ పెట్టినవారు ఆ సందర్భంగా వ్యవహరించిన దుర్మార్గపు, జుగుప్సాకర, అసభ్యరీతిని చూసి సమాజం నవ్వుకోవడంతోపాటు జాలిపడుతోందన్నారు. 13 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో శాంతియుతంగా వ్యవహరించామని వాల్‌స్ట్రీట్, న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియాతోపాటు జాతీయ మీడియాలు ఉట ంకించాయని చెప్పారు. తన ఢిల్లీ పర్యటనలో కలిసిన పెద్దలతో పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటించాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీన సమయంలో ఉన్న తెలంగాణను ప్రకటించాలని కోరుతూ ఆ పత్రాలు, వివరాలు అందజేసినట్లు చెప్పారు. ఎలాంటి ఆంక్షల్లేని హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలనేదే తెలంగాణ ప్రజల, జేఏసీ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. 2009లో వలే మరోమారు తెలంగాణ అడ్డుకోవాలనే వారివి పగటికలలేనని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై ఇప్పటికే లక్షల దూషణలు చేశారని వాటిని భరించినట్లే భవిష్యత్తులోనూ ఇంకో లక్ష తిట్లైనా భరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలోవలే సీమాంధ్రలోనూ టీడీపీ డిపాజిట్లు కోల్పోవడం తప్పదన్నారు. అధికారంకోసం అర్రులు చాస్తున్న చంద్రబాబు తెలంగాణలో ఒకమాట... సీమాంధ్రలో మరోమాట మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు విమర్శించారు. పీఆర్పీ ఏర్పాటు సమయంలో సామాజిక తెలంగాణను ప్రతి పాదింపచేసిన డాక్టర్ మిత్ర ఉచితంగా వేదిక దొరికిందని ఇష్టంవచ్చినట్లు మాట్లాడారని పార్టీ నేత నర్సయ్యగౌడ్ ధ్వజమెత్తారు. దాడి చేసినవారిపైగాక దాడికి గురైన వారిపై కేసులు పెట్టడం ఏమిటని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. భేటీలో పార్టీ నేతలు కేకే, కడియం శ్రీహరి, వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, స్వామిగౌడ్, జేఏసీ నేతలు కోదండరాం, విఠల్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు సంఘీభావంగా బంద్
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావంగా శనివారం పలుచోట్ల బంద్ పాటించారు. జేఏసీ పిలుపు మేరకు తాడేపల్లిగూడెంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. వ్యాపార సంస్థలు, దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు మూయించారు. ఉదయం నుంచి పట్టణంలో ఆటోలు తిరుగకుండా కట్టడి చేశారు. ముందుగానే బంద్‌కు సహకరించాల్సిందిగా ఆటో యూనియన్ నాయకులకు చెప్పారు. గూడెం యూనియన్ కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటోలను పట్టణంలో ఆపేశారు. గర్భిణులు, రోగులు, వృద్ధులు ఆటోల్లో ఉంటే వాటికి మినహాయింపునిచ్చారు. లోడు లారీలను పట్టణంలోకి రాకుండా వెనక్కి పంపారు. పాలు, నీరు, గ్యాస్ వంటి నిత్యావసరాలతో వెళ్లే వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ఆటోలు, బిల్డింగ్ కార్మికుల యూనియన్, మైనార్టీల అసోసియేషన్ తదితర సంఘాలు, విద్యార్థులు బంద్‌కు సహకరించారు. జేఏసీ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. బంద్‌కు వైసీపీ మద్దతు ప్రకటించింది. గుమ్మలూరులో... గుమ్మలూరు (పోడూరు) : గుమ్మలూరులో శనివారం యూత్ జేఏసీ ఆధ్వర్యంలో బంద్, రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో పాఠశాలలు, పోస్టాఫీసు, బ్యాంకు, దుకాణాలను మూయించివేశారు. గుమ్మలూరు-వల్లూరు ఆర్అండ్బీ రోడ్డుపై రాస్తారోకో చేశారు. యూత్‌జేఏసీ నాయకులు విప్పర్తి ప్రభాకరరావు, వర్ధనపు శ్రీనివాస్, వడ్లపాటి సుధాకర్ తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. భీమవరంలో... భీమవరం : నాన్‌పొలిటికల్ జేఏసీ పిలుపుమేరకు పట్టణంలో శనివారం బంద్ పాటించి ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సంఘీభావం తెలిపారు. వ్యాపార, విద్య, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జేఏసీ నేతలు, విద్యార్థి ఐక్య కారణ సమితి (ఐకాస) నేతలు బంద్‌ను పర్యవేక్షించారు. -
జిల్లా బంద్ సంపూర్ణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ పేరిట సీఎం కిరణ్ సర్కార్ చేస్తున్న కుట్రలకు నిరసనగా జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లా బంద్ విజయవంతమైంది. అన్ని వర్గాలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో జన జీవనం స్తంభించింది. ఈ సందర్భంగా తెలంగాణవాదులు కదం తొక్కారు. ఊరూరా సీఎం కిరణ్, డీజీపీ దినేష్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహించారు. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పటాన్చెరు, బొల్లారం పారిశ్రామిక వాడల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. తెల్లవారుఝాము నుంచే టీజేఏసీ, టీఆర్ఎస్, సీపీఐ, బీజేపీతోపాటు విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్‌ను విజయవంతం చేసేందుకు కదిలాయి. ఆర్టీసీ డిపోల ఎదుట తెలంగాణ వాదులు బైఠాయించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో ఏడు డిపోల పరిధిలో 570 బస్సులు నిలిచిపోయాయి. దుబ్బాక డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణవాదులతోపాటు బైఠాయించారు. జిల్లా మీదుగా నడిచే ఇతర రాష్ట్ర సర్వీసులు కూడా రద్దయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్చెరు, ఆర్సీ పురంలో కూడా సిటీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 44వ నంబరు జాతీయ రహదారిపై మనోహరాబాద్, రామాయంపేట, 65వ నంబరు జాతీయ రహదారిపై ఇస్నాపూర్, రాజీవ్ రహదారిపై కొడకండ్ల, దుద్దెడలో రాస్తారోకో చేశారు. నాందేడ్ అకోలా రహదారిపై జోగిపేట, మాసాన్‌పల్లి, పెద్దశంకరంపేటలో తెలంగాణవాదులు బైఠాయించారు. మెదక్‌లో ఇద్దరు యువకులు టవర్ ఎక్కి సీఎం, డీఐజీని తప్పించాలంటూ నిరసన వ్యక్తం . పటాన్చెరు, పాశమైలారం, బొల్లారం పారిశ్రామిక వాడల్లో యాజమాన్యాలు బంద్‌ను పాటించాయి. ర్యాలీలు, మానవహారాలు.. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టీజేఏసీ, టీఎన్జీఓస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీజేఏసీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ అధ్యక్షుడు రాజేందర్‌తోపాటు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోని అన్ని విభాగాల సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమాన్ని సిబ్బంది బహిష్కరించారు. జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట సిబ్బంది రాస్తారోకో చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. మెదక్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సంయుక్తంగా మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. జహీరాబాద్‌లో అన్ని పార్టీల ఆధ్వర్యంలో తొమ్మిదో నంబరు జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. నర్సాపూర్, గజ్వేల్, నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రాల్లో తెలంగాణ వాదులు ర్యాలీలు నిర్వహించడంతోపాటు మానవహారాలు నిర్మించారు. బంద్ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఎస్పీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు కేజీహెచ్ వైద్య జేఏసీ మద్దతు
ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యులంతా ఈ రోజు సామూహిక సెలవు పెడుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి విభాగాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కేజీహెచ్ వైద్య జేఏసీ వివరించింది. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు మద్దతు తెలిపిన కేజీహెచ్ వైద్య జేఏసీ
ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యులంతా ఈ రోజు సామూహిక సెలవు పెడుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి విభాగాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కేజీహెచ్ వైద్య జేఏసీ వివరించింది. -
'సేవ్ ఆంధ్రప్రదేశ్'కు మద్దతు తెలిపిన కేజీహెచ్ వైద్య జేఏసీ
ఏపీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ నగరంలో జరుగుతున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు కేజీహెచ్ వైద్య జేఏసీ శనివారం తన సంఘీభావాన్ని ప్రకటించింది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆసుపత్రి వైద్యులంతా ఈ రోజు సామూహిక సెలవు పెడుతున్నట్లు వెల్లడించింది. అలాగే ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపి విభాగాలు నిలిపి వేస్తున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు కేజీహెచ్ వైద్య జేఏసీ వివరించింది. -
యూటీ అంటే ఉద్యమమే
శాడిస్టు ప్రేమికుల్లా సీమాంధ్ర నేతల కుట్రలు టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం(యూటీ)గా మార్చాలని చూస్తే మరో మహోద్యమం తప్పదని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ దేవీప్రసాద్‌రావు హెచ్చరించారు. యూటీ చేయడంవల్ల ప్రభుత్వంలో స్థానిక ప్రజల భాగస్వామ్యం రద్దవుతుందని, దీన్ని సహించబోమన్నారు. ముల్కీ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్లో శాంతి ర్యాలీ, దీక్షల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఎన్జీవోల భవనంలో మీడియాతో మాట్లాడారు. తమకు దక్కనిది ఇతరులకు దక్కకూడదన్న శాడిస్టు ప్రేమికుల్లాగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో 7న జరుపతలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతివ్వాలని 10 రోజుల ముందే అనుమతి కోరితే నిరాకరించిన ప్రభుత్వం ఏపీఎన్జీవోల సభకు మాత్రం ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’కు అనుమతి కుట్రే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట విభజన వద్దంటూ సభ నిర్వహించడం రెచ్చగొట్టడమేనని, హైదరాబాద్‌ను అశాంతి నగరంగా మార్చే కుట్రలో భాగంగానే ఈ సభకు అనుమతిచ్చారని ఆరోపించారు. తాము గతంలో ఎప్పుడు సభలకు అనుమతి కోరినా చివరి నిమిషం వరకు తేల్చకుండా ఇబ్బంది పెట్టిన పోలీసులు నాలుగు రోజుల ముందే ఈ సభకు ఎలా అనుమతిస్తారన్నారు. అసెంబ్లీ వద్ద గతంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల ఆందోళనలకు అనుమతించలేదని, మంగళవారం సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ధర్నాకు మాత్రం పోలీసులు దగ్గరుండి రక్షణ కల్పించారన్నారు. ప్రభుత్వమే సీమంధ్ర ఉద్యమాన్ని నడుపుతోందన్న విషయం ఇప్పుడు రుజువైందని చెప్పారు. శాంతి ర్యాలీకి టీ మంత్రులే అనుమతి ఇప్పించాలని, ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలకైనా టీ మంత్రులే బాధ్యత వహించాలన్నారు. అనుమతి ఇవ్వకపోయినా ర్యాలీ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. ఉద్యోగుల అపోహలను కేంద్రం పరిష్కరించాలని దేవీప్రసాద్ కోరారు.