schem
-
దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు..
సాక్షి, కరీంనగర్: లక్ష కాదు.. రెండు లక్షలు కాదు.. ఏకంగా రూ.10 లక్షలు. తిరిగి ఇచ్చేయాలన్న నియమమేమీ లేదు. అయినా.. వారు ఆ డబ్బును తిరస్కరించారు. తాము మంచి స్థితిలోనే ఉన్నామని, దళితబంధు కింద వచ్చే ఆ డబ్బు పేద సోదరులకు ఉపయోగపడాలంటూ ఆ ఐదుగురు పెద్ద మనసు చాటుకున్నారు. సమాజంలో సిసలైన శ్రీమంతులు అనిపించుకున్నారు. తాము ఆర్థికంగా ఉన్నతస్థితిలోనే ఉన్నామని, తమకు రూ.10 లక్షల సాయం అవసరం లేదని స్పష్టంచేశారు. గివ్ ఇట్ అప్ (వదులుకోవడం) కింద వీరు తమకు వచ్చే భారీ ఆర్థికసాయాన్ని వదులుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ ఐదుగురి గురించే చర్చించుకుంటున్నారు. వీరిలో ముగ్గు రు వ్యక్తులు తండ్రీకొడుకులు కావడం గమనార్హం. ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన దళితుల పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హు జూరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా సర్వే చేసి 5 మండలాల్లో దాదాపు 23 వేలకుపైగా దళితులను గుర్తించింది. వీరికోసం రూ.2,000 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకూ హు జూరాబాద్ నియోజకవర్గంలో 14,421 మంది లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం దళితబంధు నిధులు జమచేసింది. తాజాగా ఐదుగురు వ్యక్తులు తామెందుకు దళితబంధు సాయాన్ని వద్దనుకుంటున్నారో తెలుసుకుందాం..! పేదలకు ఉపయోగపడాలి నేను గెజిటెడ్ ప్రాధానోపాధ్యాయునిగా పదవీవిరమణ పొందాను. నా భార్య కూడా ప్రభుత్వ టీచర్‌గా రిటైరయ్యారు. నేను అంబేడ్కర్ వాదిని. ఆయన కల్పించిన రిజర్వేషన్లను ఆసరా చేసుకొని ఉన్నత స్థితికి చేరుకున్నా. ఇప్పటికీ ఇంకా ఎందరో దళితులు అట్టడుగు స్థితిలో ఉన్నారు. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను ఇతర పేద కుటుంబాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాపస్ ఇచ్చా. – కర్రె నరసింహస్వామి, హుజూరాబాద్ పేదల కోసం వదులుకున్నా ప్రస్తుతం రైల్వేలో డిప్యూటీ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూ మంచి జీతంతో ఉన్నత స్థితిలో ఉన్నా. మా తండ్రి, తల్లి ప్రభుత్వ టీచర్లుగా పదవీవిరమణ పొందారు. వారికి పెన్షన్ కూడా వస్తోంది. అందుకే.. రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం కింద మంజూరు చేసిన 10 లక్షల రూపాయలను పేద దళిత కుటుంబాలకు ఉపయోగపడాలని గివిట్ అప్ కింద ప్రభుత్వానికి తిరిగి ఇచ్చా. – కర్రె కిరణ్ కుమార్, రైల్వే ఇంజనీర్, హుజూరాబాద్ నా పెన్షన్ చాలు పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా రిటైరయ్యాను. ఇప్పటికీ చాలా దళిత కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాయి. నాకు మంజూరైన దళితబంధు డబ్బులు పేద దళిత కుటుంబానికి ఇస్తే వారు అభివృద్ధి చెందుతారు. అదే నాకు తృప్తి. నాకు వచ్చే పెన్షన్ సరిపోతుంది. అందుకే.. నాకు వచ్చిన రూ.10 లక్షలను వదులుకున్నా. – సోటాల మోహన్‌రావు, రిటైర్డ్ ఇంజనీర్, హుజూరాబాద్ చదవండి: కంటోన్మెంట్ విలీనంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ -
పథకం పక్కదారి
చింతపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయితీ గొర్రెల పథకం కొందరికి కాసులపంట పండిస్తుంది. దళారులు లబ్ధిదారుల నుంచి యూనిట్‌కు రూ. 2వేలు వసూలు చేస్తున్నారు. అధికారులు నాణ్యమైనవి పంపిణీ చేయకపోవడంతో గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. మరికొందరు అక్రమంగా విక్రయిస్తున్నా అడ్డుకట్ట వేసే వారు కరువవుతున్నారు. చింతపల్లి మండలంలోని 20 గ్రామపంచాయతీల్లో మొదటి దశలో 1105 మంది లబ్ధిదారులు, 2వ విడతలో 1104 మంది లబ్ధిదారులకు రాయితీ గొర్రెలను అందించేందుకు అధికారులు ముందుకొచ్చారు. మొదటి విడతగా 13 గ్రామాలను ఎంపిక చేసి 395 మంది లబ్ధిదారులకు లా టరీ పద్ధతిలో ఎంపిక చేసి 8,295 గొర్రెలను పంపిణీ చేశారు. ప్రతి లబ్ధిదారుడికి కచ్చితంగా 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించాల్సి ఉంది. అధికారులు మాత్రం తక్కువ ధరకు గొర్రెలను కొనుగోలు చేసి 15 గొర్రెలు, 5 పాలు తాగే వయసున్న గొర్రెలను అంటగట్టారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో గొర్రెలను ఇంటికి తెచ్చిన తర్వాత వయసు మీరిన చిన్న గొర్రెలు మృత్యువాతపడుతున్నాయని చెబుతున్నారు. సకాలంలో వైద్యం అందక మరణిస్తున్నాయి. ఇప్పటికే 900 గొర్రెలకు పైగా మృతి చెందినట్లు సమాచారం. 200 యూనిట్లు మాయం.. మండలంలో మొదటి విడతలో 395 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఇప్పటికే 200 యూనిట్లు విక్రయాలు జరిగినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు పశువైద్య అధికారులు గ్రామాలకు వెళ్లి తనిఖీ చేస్తే జీవాలు కనిపించకపోవడంతో కంగుతింటున్నారు. బయటి మార్కెట్లో గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు పేపర్ ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. లబ్ధిదారులు రూ.31,250 చెల్లిస్తే 21 గొర్రెలను అధికారులు అందిస్తున్నారు. బయటి మార్కెట్లో రూ. 80వేలకుపైగా వస్తుండడంతో మండలంలో అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇదే అదునుగా చేసుకుని దళారులకు ఒత్తాసు పలుకుతూ గొర్రెల విక్రయానికి సహకరిస్తున్నట్లు సమాచారం. ఒక్కో రైతు వద్ద రూ. 2వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో నెల రోజుల క్రితం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా అధికారులకు ఖంగుతినే పరిస్థితి కనిపించింది. విక్రయదారులు అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిన సంఘటనలతో పాటు రెండు, మూడు గొర్రెల గుంపును అధికారులు వచ్చే ముందు వారి ఇంటి ముందు ఉంచుకుంటుండడంతో అధికారులు ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నిడమనూరు : ప్రత్యేకావసరాలుగల పిల్లల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను తల్లిదండ్రులు వారికి వినియోగించాలని ఐఈఆర్టీ కో–ఆర్డినేటర్ రవినాయక్ అన్నారు. నిడమనూరు ఎమ్మార్సీలో శనివారం ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వారంలో ఒక రోజు ఆయా మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీల్లో అలాంటి పిల్లలకు ఫిజియోథెరపీ చికిత్స అందిస్తుందన్నారు. వైకల్యాన్ని బట్టి వారికి కావలసిన పరికరాలను అందిస్తుందని, అవసరమైన వారికి ఉన్నత స్థాయిలో ఉచిత చికిత్స సైతం చేయిస్తున్నారని తెలిపారు. ఎంఈఓ బాలునాయక్ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఐఈఆర్టీలు అనంతరాములు, వెంకటేశ్వర్లు, డాక్టర్ రమణారెడ్డి, 50మంది ప్రత్యేకావసరాలు గల పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
ఉపాధి హామీ పథకంలో భాగస్వాములు కావాలి
యాదగిరిగుట్ట: గ్రామీణా ప్రాంతాల్లో నెలకొన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఉపాధి హామీ పథకంలో ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాలని యాత్ర స్వచ్చంధ సంస్థ రాష్ట్ర కన్వీనర్ సురుపంగ శివలింగం కోరారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం అనే అంశాలపై జిల్లా స్థాయి చర్చ వేదిక మండలంలోని మహబూబ్‌పేటలో శనివారం జరిగింది. ఈ చర్చ వేధికకు సూర్యాపేట డివిజన్ ఉపాధి కూలీల నాయకులు, మహిళ సంఘాల నాయకురాలు పాల్గొని మండలంలో జరుగుతున్న ఉపా«ధి హామీ సమాఖ్యల సమావేశాలు, విద్యాహక్కు చట్టం పాఠశాల యాజమాన్య కమిటీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సదస్సులో ప్రముఖులు రేగు బాలనర్సయ్య, మార్తమ్మ, రేగు అశోక్, బాలలక్ష్మీ, గాజుల లక్ష్మీ, స్వామిలతో పాటు ఏపీఎస్‌ఎస్‌ఎస్ సంఘంకు చెందిన 60 మంది, ఏపీ ఎస్ఎస్ఎస్ సూర్యాపేట కో ఆర్డినేటర్లు, సభ్యులు హాజరయ్యారు.