SCs and STs
-
అక్షరక్షరంలో పైత్యం నిండిన రాతలు.. మీ బాబూ మళ్లించారు రామోజీ!
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో అన్నీ చక్కగా భేషుగ్గా అనిపించినవి ఇప్పుడు జగన్ పాలనలో అవే అంశాలు బాబు రాజగురువు రామోజీరావుకు పెద్ద తప్పుగా అనిపిస్తున్నాయి. బాబు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్లుగా ఉన్నాయి ఆయన రాతలు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా.. ఏం లాభం?’ శీర్షికతో గుండెలు బాదుకున్న రామోజీ.. బాబు బాగోతాన్ని దాచేసి ఆ కథనంలో ప్రస్తుత ప్రభుత్వంపై తన పైత్యాన్ని అక్షరక్షరంలో నింపారు. బాబు పథకాలకూ ఎస్సీ కాంపొనెంట్ నిధులు చంద్రబాబు పాలనలోనే అనేక పథకాలకు ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ నిధులు ఖర్చుచేశారు. అప్పట్లో అనేక పథకాలకు ఎస్సీ కాంపొనెంట్ నిధులను కేటాయించారు. నాటి ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు 2018 మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఉదా.. సామాజిక పెన్షన్లలో భాగంగా దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ఎన్టీఆర్ పెన్షన్ స్కీమ్, పొలంబడి, పొలంబడి–చంద్రన్న రైతు క్షేత్రాలు, జవహర్ నాలెడ్జ్ సెంటర్లలో మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం (పౌష్టికాహారం), పిల్లలు, తల్లులకు ప్రత్యేక పోషకాహారం, అన్న అమృతహస్తం, డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్, ఎన్టీఆర్ జలసిరి, ఎన్టీఆర్ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ విద్యావసతి స్కీమ్, మా ఇంటి మహాలక్ష్మి వంటి అనేక పథకాలకు ఎస్సీ కాంపొనెంట్ (ఉప ప్రణాళిక) నిధులను కేటాయించారు. కానీ, ఈ వాస్తవాలను వక్రీకరించి అల్లిన కథనం వెనుక రామోజీకి ఉన్న ఉద్దేశాలు జగమెరిగినవే. జగన్ పాలనలోనే ఎక్కువ మేలు.. ఇక చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్‌కు ఖర్చుచేసిన నిధులకు మించి ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఖర్చుచేసిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఐదేళ్ల కాలంలో ఎస్సీ ఉప ప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్ వరకు మూడున్నరేళ్ల కాలంలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది. చదవండి: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది? అంటే ఐదేళ్లలో టీడీపీ సర్కార్ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించడం రికార్డు. ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48 కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు ఖర్చుచేసింది. అంటే గత ప్రభుత్వం ఐదేళ్లలో కేటాయించిన మొత్తంకంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.3,101.9 కోట్లు అదనంగా ఖర్చుచేసింది. కానీ, ఇవేమి పరిగణనలోకి తీసుకోని ఈనాడు నిధుల కోత అంటూ వక్రీకరించి గుండెలు బాదుకుంటోంది. బాబు హయాంలో నిధుల మళ్లింపు అంశాన్ని మరుగునబెట్టి ప్రస్తుత ప్రభుత్వంపై బురదజల్లుతోంది. -
Fact Check: ఎస్సీ, ఎస్టీలకు నిజంగా మేలు చేసిందెవరు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉపాధిపరంగా నిజంగా మేలు చేసిందెవరు? అని ఆ వర్గాల వారిని ఎవరైనా ప్రశ్నిస్తే.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో జరగని మేలు జగన్ నేతృత్వంలో మూడున్నరేళ్లలో అంతకుమించి జరిగిందన్నది జగమెరిగిన సత్యం. అప్పట్లో బాబు కేటాయించిన నిధులు.. నేడు సీఎం జగన్ ఖర్చుచేస్తున్న మొత్తం గణాంకాలను గమనిస్తే గతానికన్నా ఎంతో మేలు జరిగిందన్నది స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ, ఇవేమి పరిగణలోకి తీసుకోని ఈనాడు విషపత్రిక ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ (సబ్‌ప్లాన్)పై తన కడుపుమంటను ప్రదర్శించింది. సబ్‌ప్లాన్‌ను మరో పదేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌పై ఆ వర్గాలకు చెందిన నేతలు, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తంచేస్తుంటే రామోజీ మాత్రం ఎప్పటిలాగే తన అక్కసును వెళ్లగక్కారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘పేరుకే చట్టం.. ఎన్నేళ్లున్నా ఏం లాభం?’ అంటూ ఈనాడు మరో అభూతకల్పనను వండివార్చింది. వాస్తవానికి.. 2017–18 నుంచి కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం కారణంగా బడ్జెట్లో ప్రణాళిక, ఉపప్రణాళిక అన్న పదాలేలేవు. సబ్‌ప్లాన్‌ను కాంపొనెంట్‌గా కేంద్ర ప్రభుత్వం మార్చింది. దీంతో ఎస్సీ కాంపొనెంట్, ఎస్టీ కాంపొనెంట్‌గా కేటాయింపులు జరుగుతున్నాయి. అలాగే, ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, వారి కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయిస్తోంది. బాబు చేస్తే ఒప్పు.. జగన్ చేస్తే తప్పు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏ రకంగా చూసినా ఎస్సీ, ఎస్టీలు గత మూడున్నరేళ్లుగా అత్యధిక లబ్ధిపొందరానేది సుస్పష్టం. అర్హతే ప్రామాణికంగా అత్యంత పారదర్శకంగా పథకాలను అమలుచేస్తోంది. వివిధ సామాజిక పెన్షన్ల కోసం ఎస్సీ, ఎస్టీలకు చేస్తున్న ఖర్చును ఉప ప్రణాళికలో చూపించడాన్ని తప్పు అంటూ ‘ఈనాడు’ గుండెలు బాదుకుంది. కానీ, నిజమేమిటంటే.. 2019 జూన్‌కు ముందున్న టీడీపీ ప్రభుత్వం కూడా సామాజిక పెన్షన్లు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు, మధ్యాహ్న భోజనం కోసం చేసిన ఖర్చులన్నింటినీ ఎస్సీ, ఎస్టీల ఉపప్రణాళికలో ఒక భాగంగానే చూపించిన విషయాన్ని పాపం వృద్ధ రామోజీకి గుర్తున్నట్లులేదు. అంతేకాదు.. మా ఇంటిమహాలక్ష్మి, పిల్లలకు–తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం, అన్న అమృతహస్తం, చంద్రన్న పెళ్లికానుక, ఎన్టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా మహిళలకు ఇచ్చే శానిటరీ నాప్కిన్స్, చంద్రన్న రైతు క్షేత్రాలు, పొలంబడి, జవహర్ నాలెడ్జ్ సెంటర్ మెంటార్లకు ఇచ్చే గౌరవ వేతనాలు సైతం గత ప్రభుత్వం సబ్‌ప్లాన్‌లో భాగంగానే చూపిన విషయం మర్చిపోతే ఎలా రామోజీ.. అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు అంటే ఎలా? మూడున్నరేళ్లలోనే ఐదేళ్లకు మించిన మేలు ఇక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును గమనిస్తే చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో కేటాయించిన నిధులకు మించి ఈ మూడున్నరేళ్లలోనే జరిగిందన్నది గణాంకాలే చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం వీరికోసం చేసిన ఖర్చు గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. గత ప్రభుత్వం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకు ఎస్సీ ఉపప్రణాళిక కోసం రూ.33,625.49 కోట్లు కేటాయిస్తే... ప్రస్తుత ప్రభుత్వం 2019–20 నుంచి 2022 డిసెంబర్ వరకు మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.48,899.66 కోట్లు ఖర్చుచేసింది. అంటే.. టీడీపీ కేటాయించిన మొత్తానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.15,274.17 కోట్లు అదనంగా కేటాయించింది. ఇక ఎస్టీల కోసం చేసిన ఖర్చుచూస్తే.. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48కోట్లు ఖర్చుచేస్తే, ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలో రూ.15,589.38 కోట్లు వెచి్చంచింది. ఇవేమి పరిశీలించకుండానే రామోజీ మనసు 20 శాతం నిధులు కోత అంటూ తెగ బాధపడిపోయింది. ఎస్సీలకు లబ్ధిలో మనమే నెంబర్–1 ►ఎస్సీ కాంపొనెంట్ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ►దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఏపీలోనే 35.92లక్షల మందికి లబ్ధిచేకూరింది. ►అలాగే, ఎస్సీ కాంపొనెంట్ ద్వారా కొత్తగా దేశంలో 12.41 లక్షల స్వయం సంఘాలు ఏర్పాటుచేస్తే ఒక్క ఏపీలోనే ఏకంగా 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. ►ఇది మనం చెబుతున్నది కాదు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది రామోజీ.. గిరి బిడ్డలపైనా ప్రత్యేక శ్రద్ధ.. ►మరోవైపు.. ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కూడా వైఎస్సార్సీపీ సర్కారు పటిష్టంగా అమలుచేస్తూ గిరిజనులపైనా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ►రాష్ట్రంలోని జిల్లాల పునర్విభజనలో గిరిజనులకు రెండు జిల్లాలు కేటాయించి అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్), పార్వతీపురం మన్యం జిల్లాలను ఏర్పాటుచేసింది. ►ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం మొత్తం 4.49 లక్షల ఎకరాల భూమిని 2.22 లక్షల మంది ఎస్టీ రైతులకు అందించింది. ►దీంతోపాటు 39,272 ఎకరాల డీకేటీ భూమిని 26,287 మంది ఎస్టీ పేద రైతులకు పంపిణీ చేశారు. ►అర్హులైన ప్రతి గిరిజన కుటుంబానికి కనీసం రెండెకరాల భూమి ఉండేలా చూడాలని భావించిన సీఎం జగన్ ఆ దిశగా విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ►ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఒక్కటిగా ఉంటే ఇబ్బందని భావించి షెడ్యూల్డ్ తెగల కోసం ప్రత్యేక రాష్ట్ర కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ►ఏఎస్ఆర్ జిల్లా పాడేరులో గిరిజన వైద్య కళాశాలను రూ.500 కోట్లతో మంజూరు చేసి సీఎం ఇప్పటికే శంకుస్థాపన చేశారు. ►పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం వద్ద రూ.153.85 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలకూ శంకుస్థాపన చేశారు. -
AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలతో చేయూత వైఎస్సార్ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. -
కాకినాడలో కదం తొక్కిన దళిత,గిరిజనులు
-
ఎక్కువే ఇస్తున్నాం
సబ్‌ప్లాన్‌ను మించి నిధులు ఖర్చు చేస్తున్నాం: సీఎం కేసీఆర్ ► ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ► వారికి అన్నివిధాలా సహకారం అందిస్తాం ► హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మొటిక్ చార్జీలు పెరగాలన్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఖర్చు చేసిన వివరాలు, విషయాలు వారికి తెలియకపోతే ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందనే భావన కలిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురైన ఎస్సీ, ఎస్టీల పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు, అభివృద్ధి, సంక్షేమ చర్యలపై సీఎం సోమవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, సందీప్ సుల్తానియా, కరుణాకర్, ప్రవీణ్ కుమార్, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు విషయంలో ప్రతీనెలా అధికారులు సమీక్ష జరపాలి. మూడు నెలలకోసారి మంత్రులు సమావేశాలు నిర్వహించాలి. అరు నెలలకోసారి ముఖ్యమంత్రే స్వయంగా సమీక్ష నిర్వహించాలి. సబ్‌ప్లాన్ ప్రకారం కేటాయించిన నిధులే కాకుండా.. ఆయా వర్గాలకు ప్రభుత్వం ఎక్కువే ఖర్చు చేస్తోంది. ఇదే ఒరవడి ఇక ముందు కూడా కొనసాగాలి. వారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందించాలి. ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లు, ఓవర్సీస్ స్కాలర్ షిప్స్.. ఇలా ఆర్థిక లబ్ధి కల్పించే పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీని అందిస్తోంది. కల్యాణలక్ష్మి, దళితులకు భూపంపిణీ అమల్లో ఉంది. ఇతర పథకాల్లోనూ వారికే గరిష్ట లబ్ధి చేకూరుతోంది. ఇది మంచి పరిణామం. భవిష్యత్తులోనూ కొనసాగించాలి’’అని సీఎం చెప్పారు. మెస్ ఛార్జీలు పెరగాలి ‘‘రాష్ట్రంలో హాస్టళ్ల పరిస్థితి మారాలి. విద్యార్థులకు చెల్లించే మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు అవసరమైనంత పెరగాలి. ఓవర్సీస్ స్కాలర్ షిప్స్ ఎస్సీ, ఎస్టీల్లో పరిమితి లేకుండా ఎంత మందికి అవసరమైతే అంత మందికి అందించాలి’’అని సీఎం అధికారులకు సూచించారు. ఆ భూములు వినియోగంలోకి తేవాలి ఎస్సీ, ఎస్టీలకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములతో పాటు సొంత భూములు ఉపయోగంలోకి తేవాలని సీఎం పేర్కొన్నారు. వారు వ్యవసాయం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని, మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పారు. కేంద్రం ఆ పద్దులను తీసేసింది.. ‘‘కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో మార్పులు చేసింది. ప్లాన్, నాన్ ప్లాన్ పద్దులు తీసేసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు పోను మిగతా వ్యయమంతా ఒకే పద్దు కింద చూపించేలా మార్గదర్శకాలు రూపొందించింది. వాటినే అనుసరించాలి. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు అనుసరించాల్సిన వ్యూహం రూపొందించాలి’’అని ఆదేశించారు. -
ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోనిది కాదు: రావెల
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, అది కేంద్ర పరిధిలోని అంశమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మంత్రులను అడ్డుకోవడం తగదన్నారు. తమ ప్రభుత్వం మాల, మాదిగలను సమానంగా అభివృద్ధి చేస్తుందని ఆయన తెలిపారు.