seating
-
ఇలా ఎందుకు? అయోమయంలో ఆనంద్ మహీంద్ర: ట్వీట్ వైరల్
ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ప్రత్యేకమైన, వినూత్న వాహనాలు అంటే ఆసక్తి చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో పలు రకాల వెహికల్స్ గురించి ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేస్తూ ఉంటారు. అధునాతన టెక్నాలజీ, ఇంజనీరింగ్, వింటేజ్ ఇలా అనేక రకాల వాహనాల వీడియోలు, చిత్రాలను పంచు కోవడం ఆయనకు అలవాటు. తాజాగా ఒక విచిత్రమైన వాహనానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాదు ఆసక్తికరంగా ఉంది.. కానీ ఇలా ఎందుకు? అంటూ ఒక క్వశ్చన్‌మార్క్ వదిలేరు. ఇంకేముంది ఫ్యాన్స్ ఫన్నీ..ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ వీడియోలో సాధారణ ట్రాక్టర్‌లా కుండా, ట్రాక్టర్లో సీటు ప్లేస్మెంట్ వెరైటీగా చాలా ఎత్తులో ఉంచారు. సుమారు 7 అడుగుల ఎత్తులో కూర్చున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను నడుపుతూ కనిపిస్తాడు. సీటు ఎడ్జస్ట్మెంట్ కూడా కనిపిస్తోంది. కానీ ఈ సర్దుబాటు వెనుక ఉద్దేశ్యం మాత్రం అస్పష్టం. దీని పైనే మహీంద్ర ఆరా తీసారు తన ట్వీట్లో. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. బహుశా అతను పంట ఎత్తు ఎక్కువగా ఉన్న పొలంలో ట్రాక్టర్‌ను ఉపయోగిస్తున్నాడనుకుంటా..అందుకే అక్కడ కూర్చున్నాడని ఒకరు, ట్రాఫిక్ గురించి ముందుగానే తెలుసుకుందామని కొందరు వ్యాఖ్యానించారు. JCB ఆపరేటర్ ట్రాక్టర్ యజమాని లేదా డ్రైవర్ అయితే ఇలానే ఉంటుందని మరొకరు కమెంట్ చేశారు. కాదు. కాదు.. అతను ఇతర ట్రాక్టర్ల కంటే రెండు అడుగులు ముందే ఉండాలనుకుంటున్నాడేమో అని మరో యూజర్ వ్యాఖ్యానించారు. Interesting. But I have only one question: WHY? pic.twitter.com/Iee9NZC48E — anand mahindra (@anandmahindra) November 17, 2023 -
ఎంజీ గ్లూస్టర్ సావీలో కీలక మార్పులు.. ధర తగ్గనుందా?
MG Motors Glooster Saavy ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో కటింగ్ టెక్నాలజీ అందించే లక్ష్యంతో ఇటీవల రిలయన్స్ జియోతో జట్టు కట్టిన ఎంజీ మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైఎండ్ లగ్జరీ వెహికల్‌గా ఉన్న గ్లూస్టర్లో మరో మార్పు చేసింది. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీ ఎంజీ మోటార్స్ సంస్థ ఎలాగైనా భారత మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఎంజీ హెక్టార్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉండగా గ్లూస్టర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ కేటగిరిలో ఉంది. గ్లూస్టర్లో సూపర్, స్మార్ట్, షార్ప్, సావీ వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఇందులో సూపర్, షార్ప్ వేరియంట్లు సెవన్ సీటర్లుగా ఉన్నాయి. సావీ పూర్తి లగ్జరీ కారుగా సిక్స్ సీట్ లే అవుట్తోనే మార్కెట్లో కొససాగుతోంది. ఆగస్టు 9న ఇండియన్ మార్కెట్ డిమాండ్‌కి తగ్గట్టుగా సేవీ సీటింగ్ లేవుట్‌లో మార్పులు చేసింది. సెవన్ సీటర్ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సావీ వేరియంట్లోనూ ఏడుగురు కూర్చునేలా మార్పులు చేసింది. సెవన్ సీటర్ సావీ కారుని ఆగస్టు 9న మార్కెట్లో విడుదల చేయనుంది. హై ఎండ్ మోడల్ ఎంజీ మోటార్ ఇండియాకు సంబంధించి గ్లూస్టర్ సావీనే హై ఎండ్ మోడల్. ఇందులో అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ సాయంతో ఈ కారును డ్రైవ్ చేయడం పార్క్ చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ స్పీడ్‌తో పాటు డిమాండ్‌ను బట్టి ఫోర్ డ్రైవింగ్‌ను సైతం అందిస్తోంది. ఇక సెవన్ డిఫరెంట్ టెర్రైన్ డ్రైవింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 సీటర్ గ్లూస్టర్ సావీ ధర రూ. 44.59 లక్షలుగా ఉంది. సెవన్ సీటర్ లే అవుట్ ధర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. -
వీకెండ్ లాక్‌డౌన్‌తో హిందీ చిత్రాలకు షాక్
హిందీ చిత్రాలకు కరోనా పెద్ద షాక్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బాలీవుడ్‌ను కష్టాలపాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 15 మందికిపైగా బాలీవుడ్ స్టార్స్ కరోనా బారినపడ్డారు. థియేటర్స్‌లో సీటింగ్ ఆక్యుపెన్సీని యాభై శాతానికే పరిమితం చేయడం వల్ల సినిమాల రిలీజ్లు కూడా వాయిదాలు పడుతు న్నాయి. ఈ కారణాలతోనే బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్‌ను అనౌన్స్ చేసింది. దీంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లైంది బాలీవుడ్ పరిస్థితి. నైట్ కర్ఫ్యూ వలన సెకండ్ షో సినిమాలు రద్దు అవుతాయి. ఈ ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది. సాధారణంగా సినిమా రిలీజ్లు అన్నీ వీకెండ్స్‌లోనే ఉంటాయన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం తాజా వీకెండ్ లాక్డౌన్ కారణంగా కొత్త సినిమాల విడుదల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వీకెండ్ లాక్డౌన్ శుక్రవారం రాత్రి 8గంటల నుంచి సోమవారం ఉదయం 7గంటల వరకు ఉంటుంది. ఈ ప్రకారం శుక్రవారం ఫస్ట్ షో తర్వాత మళ్లీ థియేటర్లో బొమ్మ పడేది సోమవారం ఫస్ట్ షోతోనే. ఈ పరిస్థితులు కలెక్షన్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మరోవైపు సినిమాల ప్రదర్శనే కాదు... షూటింగ్‌లపై కూడా నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్డౌన్ల ప్రభావం పడుతుంది. ఇప్పటివరకు షూటింగ్ లొకేషన్స్‌లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం షూట్ చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం షూట్ లోకేషన్లో 33శాతం మంది క్రూ మెంబర్స్‌కు మాత్రమే అనుమతి. ఈ నిబంధన ప్రకారం భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు, క్రౌడ్ ఎక్కువ కావాల్సిన సన్నివేశాల చిత్రీకరణకు, సాంగ్స్‌కు బ్రేక్ పడక తప్పదు. అలాగే నైట్ కర్ఫ్యూతో నైట్ షూటింగ్‌లు అన్నీ రద్దు అవుతాయి. ఈ పరిణామాలు బాలీవుడ్‌ను మరింత కుదిపేస్తాయి. ‘‘గత ఏడాది సెప్టెంబర్‌లో ఉన్న పరిస్థితుల మాదిరిగానే పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, పెద్ద ఫైట్ సీన్స్‌కు అనుమతి లేదు. 33శాతం క్రూ మెంబర్స్‌తో మాత్రమే లొకేషన్లో షూట్ చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బిన్ తివారి. సినీ ప్రముఖలందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను విధించిందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. -
‘థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచాలి’
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలనకు తెలుగు సినిమా నిర్మాతల మండలి లేఖ రాసింది. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కానీ 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపడం వల్ల థియేటర్ల నిర్వహణకు ఎక్కవ ఖర్చు అవుతుందని, దీని వల్ల థియేటర్ల యాజమాన్యాలు నష్టాలను భరించాల్సి వస్తుందని నిర్మాతల మండలి పేర్కొంది. సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50 శాతం నుంచి 100 శాతంకు పెంచుతూ, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ థియేటర్లు నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు జనవరి 4న తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి: థియేటర్లలో ఎంజాయ్ చేద్దాం: ప్రభాస్ కరోనా కేసులు రోజురోజుకి తగ్గుతున్న క్రమంలో థియేటర్ల యాజమాన్యాలు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని తమిళనాడు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని, తమిళనాడు తరహాలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ 100 శాతం సీటింగ్ కెపాసిటీతో చిత్ర ప్రదర్శనలకు అనుమతి ఇవ్వాలంటూ నిర్మాతల మండలి కోరింది. ఇందుకు లేఖల ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రభుత్వ విభాగాధిపతులను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది. ఇలాంటి నిర్ణయం తీసుకుంటే సినిమా థియేటర్ల నిర్వహణకు, సినీ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొంది. -
గతుకుల రోడ్లపై హ్యాపీ జర్నీ..
ఒకవైపు మెట్రో నిర్మాణ పనులు, మరోవైపు ఫ్లై ఓవర్ నిర్మాణాలు.. వీటికి తోడు నాణ్యతలేని రోడ్లు.. చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ గుంతలమయంగా మారుతున్నాయి. నగరంలోని వందలాది కిలోమీటర్ల పొడవునా ఈ గుంతలే దర్శనమిస్తున్నాయి. బండి నడపాలంటేనే భయమేస్తుంది. మరోవైపు ట్రాఫిక్ రద్దీ. గంటల తరబడి రోడ్లపై పడిగాపులు. ఈ పరిస్థితుల్లో ప్రయాణంలో ఎలాంటి అలసట లేకుండా సాగిపోయేందుకు ఈ కొత్త సీటింగ్ సదుపాయం దొహదం చేస్తుందంటున్నారు తయారీదారులు. వీటిని https://bit.ly/338bHtr లింక్ ద్వారా బుక్ చేసుకోవచ్చంటున్నారు. సాక్షి,సిటీబ్యూరో: నగర రోడ్లపై అడుగడుగునా గుంతలు.. అరగంట పాటు బండి నడిపితే వెన్ను నొప్పితో పాటు నడుము పట్టేస్తుంది. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లుపై వాహనాలు నడపడం నరకప్రాయమే. ఎక్కడ ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అలాగని ఇంటి నుంవచి బండి బయటకు తీయకుండా ఉండలేం. నగరంలో ఏ చిన్న అవసరానికైనా ద్విచక్ర వాహనం నిత్యావసరం. ఇలాంటి పరిస్థితుల్లో గతుకుల రోడ్లపై, గుంతల్లోంచి బండి నడుపుతూ వెన్ను, నడుం నొప్పితో సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలమా! నగర రహదారులపై బైక్‌లు, కార్లలో సాఫీగా ప్రయాణం చేయగలమా!!.. అంటే సాధ్యమేనంటోంది హైదరాబాద్ కేంద్రంగా ఆవిర్భవించిన ‘ఫీల్‌గుడ్ ఇన్నొవేషన్స్’ స్టార్టప్ సంస్థ. గతేడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు పరిచయం చేసిన 10 స్టార్టప్ సంస్థల్లో ఇది ఒకటి. ఎయిర్ సస్పెన్షన్ పద్ధతిలో రూపొందించిన సీట్లను వినియోగించడం ద్వారా వెన్ను నొప్పి సమస్య లేకుండా బైక్‌పై సాఫీ సాగిపోవచ్చని చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపక ఇంజినీరింగ్ నిపుణులు మాధవరెడ్డి, సంతోష్‌కుమార్, విశ్వనాథ్. వీరు కలిసి చేసిన కుషన్ ప్రయోగం విజయవంతమైంది. కారు, బైక్ నడిపే సమయంలో డ్రైవర్‌కు సీటుకు మధ్య ఒక గాలిపొరతో కూడిన సీటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది కుదుపుల వల్ల వచ్చే ఒత్తిడిని డ్రైవింగ్ చేసే వ్యక్తులపై పడకుండా నిరోధిస్తుంది. బైక్ కోసం రూపొందించిన ఎయిర్ కుషన్ సీటు ఇక సాఫీగా ప్రయాణం బైక్, కారు నడిపేటప్పుడు కుదుపులను ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు జెల్, కుషన్, ఫోమ్ సీట్లను వినియోగిస్తున్నారు. కానీ వీటి నుంచి లభించే ప్రయోజనం చాలా తక్కువ. ఫీల్‌గుడ్ ఇన్పొవేషన్స్ రూపొందించిన ఫిగో సెయిల్ స్పోర్ట్, ఫిగో సెయిల్ పిలియన్, ఫిగో ఫ్లోట్ మూడు రకాల సీటింగ్ సదుపాయం ఎంతటి బలమైన కుదుపులనైనా తట్టుకొనే సామర్థ్యంతో ఉంటాయి. వాహనాలు గుంతల్లో పడినప్పుడు వెన్నుపై ఒత్తిడి పడకుండా సీటింగ్ మధ్యలో ఉన్న గాలిపొర అడ్డుకుంటుంది. దీంతో కనీసం 2 గంటల పాటు హాయిగా బండి నడపవచ్చునని చెబుతున్నారు సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన విశ్వనాథ్ మల్లాది. ‘మేం రూపొందించిన ఈ సీటింగ్ సదుపాయం వల్ల ఒక గాలిపొరపై కూర్చుని బండి నడుపుతున్నట్లుంటుంది’ అని చెప్పారు. ఫీల్‌గుడ్ ఇన్నొవేషన్స్ గతంలో కేవలం స్పోర్ట్స్ బైక్‌లను దృష్టిలో ఉంచుకొని సీట్లను రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని రకాల వాహనాలకు వినియోగించే అనువైన సీటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. కార్లు, బైక్‌లకు షాక్ అబ్జర్వర్స్ వల్ల కొంతమేర ఒత్తిడి తగ్గుతుంది. మిగతా ఒత్తిడిని ఈ సరికొత్త ఎయిర్ సస్పెన్షన్ సీట్లు నిరోధిస్తాయి. ప్రస్తుతం ఈ సీట్లను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. -
అనారోగ్యం...పరిష్కార భాగ్యం...
యోగా ఆరోగ్య సమస్యలున్నవారికి ఆ సమస్యలను తీసివేసేటట్టుగా యోగసాధన ఉండాలి. కొత్త సమస్యలను సృష్టించే విధంగా ఉండకూడదు. కొందరికి కొన్ని ఆసనాలు సాధన సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు ఛెయిర్ యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటివి ఉన్నవారు కుర్చీని ఉపయోగిస్తే ఆసనాలు వేయడం సులభమవుతుంది. భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకండా పనిచేయడం ద్వారా ఆసనం వేయడం చాలా తేలికవుతుంది. సంప్రదాయపద్ధతిలో చేసే యోగ సాధన ద్వారా ఎంత ఫలితం ఉంటుందో అంతే ప్రయోజనం ఇందులోనూ పొందవచ్చు. పర్వతాసనంలో భిన్న రకాలను కుర్చీ ఆసరాగా సాధన చేసే విధానమిదీ... 1. పర్వతాసనం/అధో ముఖాసనం ఫొటోలో చూపిన విధంగా కుర్చీలను ఉంచి, రెండు మోకాళ్లను ఒక కుర్చీ మీదకి, చేతుల్ని రెండో కుర్చీ మీదకు తీసుకురావాలి. సౌకర్యంగా అనిపంచకపోతే కుర్చీల మధ్య ఖాళీని సరిచేసుకోవచ్చు. ఆ తర్వాత చేతుల్ని బలంగా కుర్చీకి నొక్కుతూ నెమ్మదిగా మోకాళ్లను పైకి ఎత్తాలి. ఆసనంలో ఉన్నప్పుడు చేతి మణికట్టులో నొప్పి లేకుండా అరచేతుల్ని సరిచేసుకోవాలి. తలను వదులుగా ఉంచి పాదాలను పూర్తిగా కుర్చీలో ఆనించాలి. శరీరం వెనుక భాగంలో కాలి మడమల దగ్గర్నుంచి చేతివేళ్ల కొనల వరకూ ఆరోహణా క్రమంలో ఒక్కో భాగాన్ని అంటే కాలి మడమ, కాలి పిక్క కండరాలు, తొడ కీలు, నడుము, వెన్నెముక మొత్తం, భుజం కీలు, మోచేతులు, చేతి వేళ్ల కొనల వరకూ దృష్టి ఉంచాలి. అలా ఆసనంలో 9 నుంచి 10శ్వాసల పాటు ఉన్న తర్వాత బయటకు రావాలి. ప్రయోజనాలు: వెన్నుముకలో ఉండే పూసల మధ్య ఒత్తిడి తగ్గించి అవసరమైనంత వదులుగా ఉండేలా బలోపేతం చేస్తుంది. స్పాండిలైటిస్, భుజ కండరాలు బిగుసుకుపోవడం... వంటి సమస్యలకు పరిష్కారం. తొడలు, కాలి పిక్కలలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. 2. పర్వతాసనం/అధోముఖశ్వానాసనం పర్వతాసనంలోకి వచ్చినట్టే వచ్చి రెండు చేతుల్ని బలంగా ఆన్చి నెమ్మదిగా గాలి తీసుకుంటూ కుడి మోకాలిని మడిచి పైకెత్తాలి. తర్వాత కాలిని వీలైనంత వరకూ సరళరేఖలో ఉంచాలి. అలా 5 నుంచి 10శ్వాసల వరకూ ఉన్న తర్వాత నెమ్మదిగా కుడి మోకాలిని మడిచి కిందకి తీసుకురావాలి. ఇదే ఆసనాన్ని ఎడమవైపునకు కూడా చేయాలి. ప్రయోజనాలు: తొడ కీలును వదులు చేస్తుంది. తద్వారా నడుము ప్రాంతంలో ఒత్తిడి దూరమవుతుంది. మూత్ర విసర్జన వ్వవస్థకి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించిన సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. 3. ప్రసరిత మార్జాలాసనం కుర్చీలను మ్యాట్‌పై కదలకుండా స్థిరంగా ఉంచాలి. రెండు మోకాళ్లను ఒక కుర్చీ మీదకు తీసుకురావాలి. తర్వాత రెండు చేతుల్నీ రెండవ కుర్చీ మీద ఉంచాలి. ఇప్పుడు చూడడానికి రెండు చేతుల్ని మోకాళ్లను నేల మీద ఆన్చినట్టుగా ఆసనం ఉంటుంది. తర్వాత రెండు చేతుల్ని కుర్చీ మీద బలంగా ఆన్చి నెమ్మదిగా కుడికాలిని పైకెత్తాలి. కుడికాలిని నేలకు సమాంతరంగా సరళరేఖలా ఉంచాలి. అప్పుడు నెమ్మదిగా ఎడమ చేతిని పైకెత్తాలి. అలా 5 నుంచి 10 శ్వాసల పాటు ఉన్న తర్వాత శ్వాస వదులుతూ కాలిని చేతిని కిందకు దించాలి. ఇదే విధంగా ఎడమవైపు కూడా చేయాలి. సాధన సమయంలో ధ్యాస అంతా నడుము, తొడ కీలు, తొడ కండరాలపై ఉంచాలి. ప్రయోజనాలు: వెన్నెముక సంబంధిత సమస్యలు, నడుమును బలోపేతం చేయడానికి ఉపకరిస్తుంది. -
గ్రంథులకు గుడ్
తాబేలుకు ఒక నేచురల్ హెల్మెట్ ఉంటుంది. అది తలను మాత్రమే గాక... దాని ఒంటినంతా రక్షిస్తుంది. గ్రంథులను ఉత్తేజపరచి, దేహానికంతా రోగనిరోధకశక్తిని కలిగించి, గట్టి తాబేటి హెల్మెట్‌లాంటి రక్షణనిచ్చే ఆసనమే కూర్మాసనం... అనగా తాబేటి ఆసనం. ఇది బహుమేటి ఆసనం. కూర్మాసనమంత ప్రయోజనానిచ్చేవే ఇక్కడున్న పశ్చిమోత్తానాసనం, జానుశీర్షాసనం. ఈ ఆసనాలు వేయండి. ఆరోగ్యానికి ఇమ్యూనిటీ అనే హెల్మెట్ తొడగండి. 1జాను శీర్షాసన కుడికాలు ముందుకు స్ట్రెచ్ చేసి ఎడమ మడమ పెరీనియంకు ఉంచి, శ్వాస తీసుకుని చేతులు, నడుము బాగా పైకి సాగదీయాలి. శ్వాస వదులుతూ నడుము కింద భాగం నుండి స్ట్రెచ్ చేస్తూ ముందుకు వంగి రెండు చేతులతో కుడిపాదం పట్టుకుని గడ్డం మోకాలు కిందకు తీసుకురావాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. కుడి కాలు ముందుకి స్ట్రెచ్ చేయలేనివారు మోకాలు కొంచెం పైకి లేపి ఉంచవచ్చు. కుడిపాదం అందనట్లైతే ఒక తాడును గాని, బెల్టును గాని పాదం చుట్టూ పోనించి రెండు చేతులతో పట్టుకుని శ్వాస వదులుతూ కొంచెం కొంచెం ముందుకు వంగడానికి ప్రయత్నించవచ్చు. ఉపయోగాలు: కాలేయం, స్ప్లీన్, కిడ్నీ భాగాలకు మంచిది. జాగ్రత్తలు: స్త్రీలలో రుతుచక్రం మొదలైన తరువాత 13 నుండి 18వ రోజు మధ్యలో అండము విడుదలై గర్భాశయం వైపుకు ప్రయాణిస్తుంది. ఈ ఆసనము వలన అండం దిగువ ప్రయాణం ఆపబడుతుంది. కనుక గర్భం ధరించాలనుకునే స్త్రీలు ఈ రోజులలో ఈ ఆసనం చేయకూడదు. 2పశ్చిమోత్తానాసన పశ్చిమ అంటే వీపు భాగం, ఉత్తాన అంటే సాగదీయడం. ఈ ఆసనంలో వీపు భాగం బాగా సాగదీయబడుతుంది కనుక పశ్చిమోత్తానాసన అని పేరు. కాళ్లు రెండూ కలిపి ముందుకు స్ట్రెచ్ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ తల, చేతులు ముందుకు వ ంచి రెండు చేతులతో రెండు పాదాలు ఇంటర్ లాక్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయాలి. నుదురు మోకాలుకు దగ్గరగా లేదా మోకాలు క్రిందకు, మోచేతులు రెండూ వీలైతే నేల మీద పెట్టే ప్రయత్నం చేయాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల, చేతులు పైకి శ్వాస వదులుతూ రెండు చేతులు ప్రక్క నుండి అరచేతులు భూమి వైపుకు చూపిస్తూ క్రిందకు తీసుకురావాలి. ఫొటోలో చూపిన విధంగా చేయలేని వారు ఏదైనా తాడును గాని, బెల్టును గాని తీసుకుని పాదాల క్రింద సపోర్టుగా ఉంచి రెండు కొనలను రెండు చేతులతో పట్టుకుని ముందు వంగే ప్రయత్నం చేయవచ్చు. ఉపయోగాలు: వెన్నెముక, వీపు భాగాలు, కిడ్నీలు, ఎడ్రినలిన్ గ్రంథులకు చక్కగా టోనింగ్ జరుగుతుంది. పొట్ట బాగా లోపలికి లాగబడుతుంది. కనుక పొట్టలో కొవ్వు తగ్గుతుంది. జీర్ణశక్తికి మంచిది. జాగ్రత్తలు: వెన్నెముక, సయాటిక సమస్యలు ఉన్నవారు మోకాళ్లు పైకి లేపి ఉంచవచ్చు. నిదానంగా చేసినట్లైతే సయాటిక సమస్యను పరిష్కరించవచ్చు. 3కూర్మాసన కూర్మం అనగా తాబేలు. రెండు కాళ్లు ముందుకు, కాళ్ళ మధ్యలో రెండు అడుగుల దూరం, మోకాళ్లు కొంచెం పైకి లేపి శ్వాస వదులుతూ తల, శరీరాన్ని ముందుకు వంచి, చేతులను రెండు మోకాళ్ల కిందకు తీసుకువెళ్లి, వెనుక వీపు కింద భాగంలో చేతులు రెండు ఇంటర్‌లాక్ చేసి లేదా ఎడమచేతి మణికట్టును కుడి చేతితో పట్టుకుని, 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస తీసుకుంటూ తల, శరీరం పైకి తీసుకురావాలి. ఫొటోలో చూపిన విధంగా చేయలేని వారు రెండు కాళ్ల మధ్యలో నిలువుగా ఒక బాలిస్టర్ను ఉంచి శ్వాస వదులుతూ ముందుకు వంగి తల, ఛాతి భాగాలను బాలిస్టర్ మీద పెట్టి సౌకర్యంగా విశ్రాంత స్థితిలో ఉండవచ్చు. ఉపయోగాలు: జీర్ణావయవాలకు, వెన్నెముకకు, ఎడ్రినలిన్ గ్రంథులకు మంచిది. హైబీపికి, మానసిక ప్రశాంతతకు మంచి ఆసనం. యోగావగాహన హఠయోగ సాధనలోని ముఖ్యమైన భాగాలు ఆరు. 1. శుద్ధిక్రియలు 2. ఆసనాలు 3. ప్రాణాయామం 4. ముద్రలు. 5. బంధనాలు 6. కుండలిని. ఈ వారం శుద్ధిక్రియల గురించి తెలుసుకుందాం. వీటిని ఆయుర్వేదంలో షట్కర్మలుగా, యోగాలో షట్క్రియలుగా పిలుస్తారు. షట్క్రియలు 6 రకాలు: 1. నేతి 2. ధౌతి 3. వస్తి 4. భాతి 5. నౌలి 6. త్రాటకం 1. నేతి: కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని కొమ్ముచెంబుతో తీసుకుని తలను ప్రక్కకు వంచి, నీటిని ఒక ముక్కు రంధ్రంలో నుండి పోసినప్పుడు అది రెండో ముక్కు రంధ్రంలో నుండి బయటకు రావటాన్ని జలనేతి అంటారు. రెండు మిల్లీమీటర్ల వ్యాసం గల రబ్బరు గొట్టాన్ని ఒక ముక్కు రంధ్రంలో నుండి పోనిచ్చి, నోటి లో నుండి బయటకు తీయాలి. అలాగే రెండో ముక్కులో నుండి కూడా చేసే క్రియను సూత్రనేతి అంటారు. ఉపయోగాలు: సైనస్ క్లియర్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ వాపు, తలనొప్పి, పార్శనొప్పులను తగ్గిస్తుంది. సెప్టమ్ డీవియేషన్ సమస్యను శస్త్రచికిత్స లేకుండా నయం చేయవచ్చు. 2. ధౌతి: కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని సుమారు 3 లీటర్లు తాగి దానిని వమనం (వాంతి) చేసుకోవడం జలధౌతి అంటారు. 3 మీటర్ల పొడవాటి రిబ్బనువలె ఉన్న వస్త్రాన్ని నోటి ద్వారా లోపలికి మింగి చిన్న ప్రేవులలో ఉన్న మలిన పదార్థాలతో కలిపి బయటకు తీయడం వస్త్రధౌతి అంటారు. ఉపయోగాలు: ఉదరకోశ శుద్ధికి, అజీర్తి, ఎసిడిటీ, ఎనరెక్సియా సమస్యలకు పరిష్కారం. 3. వస్తి (శంఖ ప్రక్షాళన): కొంచెం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని 2, 3 గ్లాసులు చొప్పున తాగుతూ శంఖ ప్రక్షాళన ఆసనాలను సాధన చేస్తూ సుమారు 4 లేదా 5 లీటర్లు తాగిన తరువాత ఆ ఒత్తిడికి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులలో ఉన్న వ్యర్థ పదార్థాలను గుద ద్వారం గుండా బయటకు పంపించుట. ఉపయోగాలు: జీర్ణవ్యవస్థ, మలవిసర్జన వ్యవస్థ శుద్ధి అవుతుంది. 4. భాతి: కపాలభాతి ద్వారా ముక్కు రంధ్రాల నుండి గాలిని జర్కులుగా బయటకు పంపిస్తూ పొట్టను పదే పదే లోపలికి లాగుట. ఉపయోగాలు: నడుము, పొట్ట భాగాల్లోని ఎడిపోజ్ టిష్యూలో ఉన్న కొవ్వు కరగడానికి ఉపయోగపడుతుంది. 5. నౌలి: నిలబడి కొంచెం ముందుకు వంగి, మోకాళ్లు ముందుకు వంచి, పొట్టని లోపలికి లాగి నిలువుగా దండం ఏర్పడిన తరువాత, లోపల చిన్న ప్రేవులను కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి తిప్పాలి. ఇది మూడు రకాలు. వామ, దక్షిణ, మధ్యమ నౌలి. ఉపయోగాలు: పునరుత్పత్తి సమస్యలకు, ఫైబ్రాయిడ్స్, ఒవెరియన్ సిస్ట్లు కరగడానికి ఉపయోగపడుతుంది. వీటికి శస్త్ర చికిత్స అవసరం లేదు. 6. త్రాటకం: చేతి బొటవ్రేలును ముఖానికి దూరంగా ముందు ఉంచి శ్వాస తీసుకుంటూ చేతిని, బ్రొటనవేలును పైకి, శ్వాస వదులుతూ క్రిందకు వర్తులాకారంలో తిప్పుతూ తలతిప్పకుండా కేవలం కనుగుడ్లను మాత్రమే తిప్పుతూ తదేకంగా బొటనవేలు గోరును చూస్తూ 10 లేదా 15 నిమిషాల పాటు చేయడం. ఉపయోగాలు: కంటిచూపు, ఏకాగ్రత పెరగడానికి దోహదం చేస్తుంది. కార్టెక్స్ మెదడుమీద పనిచేస్తుంది. పైన చెప్పిన క్రియలన్నీ అనుభవజ్ఞులైన యోగశిక్షకుల పర్యవేక్షణలోనే (ఉదయపు సమయంలో)చే యాలి. -
లోక్‌సభలో ముందువరుస సీట్లకు పోటీ
ఢిల్లీ: లోక్‌సభలో సీట్ల కేటాయింపు వచ్చే నెల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు గడుస్తున్నా లోక్‌సభలో సీట్ల కేటాయింపు కొలిక్కి రాలేదు. శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ముందు కుర్చీల కేటాయింపు పూర్తయ్యే అవకాశముందని పార్లమెంట్ అధికారి ఒకరు తెలిపారు. ఏ పార్టీకి ఎక్కడ సీటింగ్ ఇవ్వాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం జరిగే పార్లమెంటరీ వ్యవహారాల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. ముందువరుస సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ప్రతిపక్షం లేనందున ముందువరుస సీట్లను తమకు కేటాయించాలని మిగతా పక్షాలు కోరుతున్నాయి. కాంగ్రెస్ తో కలిసి సీట్లు పంచుకునేందుకు అన్నాడీఎంకే, తృణమూల్, బీజేడీ ఆసక్తి చూపకపోవడంతో కుర్చీల కేటాయింపు ఆలస్యమైంది. నవంబర్ 24 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.