seats replaced
-
కంప్యూటర్ సైన్స్‌కే.. సై
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో భర్తీకి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీసెట్) ప్రవేశాల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)కే జై కొట్టారు. రెండో స్థానంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ), మూడో స్థానంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ), నాలుగో స్థానంలో మెకానికల్ ఇంజనీరింగ్ నిలిచాయి. కొత్తగా ప్రవేశపెట్టిన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డిజైన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఆటోమేషన్ తదితర కోర్సుల్లోనూ చేరికలు గతంలో కంటే పెరిగాయి. అయితే ఇంకా భర్తీ కాని సీట్లు కొన్ని విభాగాల్లో ఎక్కువగానే ఉన్నాయి. తొలిసారి ‘బీ’ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన సీట్ల కేటాయింపు గతంలో ‘బీ’ కేటగిరీ సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్లు, మెరిట్‌తో సంబంధం లేకుండా తాము నిర్దేశించిన ఫీజును చెల్లించిన వారికి ఈ సీట్లను కేటాయించేవి. తద్వారా ప్రవేశ పరీక్షలో మెరిట్ ర్యాంకు వచ్చిన వారికి మొండిచేయి చూపేవి. పైగా రిజర్వేషన్లను కూడా అమలు చేసేవి కావు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళల కేటగిరీల్లో ఆయా వర్గాలకు దక్కాల్సిన సీట్లు బయట విద్యార్థులకు దక్కేవి. ఫలితంగా నిరుపేద మెరిట్ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచి ‘బీ’ కేటగిరీ సీట్లను సైతం ప్రభుత్వం కన్వీనర్ కోటాలో భర్తీ చేయించింది. ‘బీ’ కేటగిరీలోని ఎన్ఆర్ఐ కోటాలో మిగులు సీట్లు, నాన్ ఎన్ఆర్ఐ కోటాలో సీట్లకు కలిపి కన్వీనరే కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో ఈసారి ఆయా కళాశాలల్లో రిజర్వుడ్ మెరిట్ అభ్యర్థులకు అవకా>శం దక్కింది. ‘బీ’ కేటగిరీలో 13,564 మందికి సీట్లను కేటాయించారు. మొత్తం 1,12,699 సీట్లు.. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం ఇన్‌టేక్ 1,12,699 సీట్లుండగా 80,935 సీట్లు తొలి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. ఈ సీట్లలో అత్యధికం కంప్యూటర్ సైన్స్‌లోనే ఉండగా భర్తీలోనూ ఇదే అగ్రస్థానంలో నిలిచింది. సీఎస్ఈలో మొత్తం 24,904 సీట్లుండగా తొలి విడతలోనే 23,835 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా కేవలం 1,069 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఈసీఈలో 23,977 సీట్లుండగా 20,275 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,702 సీట్లు మిగిలాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్‌లో మొత్తం 12,678 సీట్లకు 4,760 భర్తీ కాగా 7,918 మిగిలిపోయాయి. అదేవిధంగా ఈఈఈలో 10,931లో 6,410 సీట్లు భర్తీ కాగా 4,521 సీట్లు మిగిలాయి. ఇక సివిల్ ఇంజనీరింగ్‌లో 9,904 సీట్లకు 4,455 సీట్లు భర్తీ కాగా 5,449 సీట్లు ఖాళీగా ఉన్నాయి. -
ఆ సామాజికవర్గాలకు టీడీపీ రిక్తహస్తం..
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ టిక్కెట్ల కేటాయింపులో రాష్ట్రంలోని పలు కీలక సామాజిక వర్గాలకు రిక్తహస్తం చూపించింది. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే బీసీ కులాలైన కాళింగ, తూర్పు కాపు సామాజిక వర్గాలను అస్సలు పట్టించుకోలేదు. అలాగే రాయలసీమలో అత్యధికంగా ఉండే బీసీ కులాలైన బోయ, కురుబ సామాజిక వర్గాలనూ పరిగణనలోకి తీసుకోలేదు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మాదిగ సామాజిక వర్గానికి కనీసం ఒక్క ఎంపీ స్థానం కూడా కేటాయించకపోవడం గమనార్హం. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గాలన్నింటికీ టికెట్ల కేటాయింపులో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒక్కో ఎంపీ స్థానం చొప్పున కేటాయించడం ద్వారా బీసీ కులాల అభ్యున్నతికి తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంది. ఉత్తరాంధ్రలో బీసీ సామాజిక వర్గాలైన కాళింగ, తూర్పుకాపు సామాజిక వర్గాలు అత్యంత కీలకమైనవి. ఈ ప్రాంతంలో జనాభాపరంగా తూర్పుకాపు సామాజికవర్గం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సామాజికవర్గానికి చెందిన వారు సుమారు ఆరు లక్షల మంది వరకు ఉంటారని అంచనా. అలాగే కాళింగ సామాజికవర్గానికి చెందినవారు కూడా ఐదు లక్షలకు పైగా ఉంటారని అంచనా. అటువంటి అత్యంత కీలకమైన ఈ రెండు సామాజికవర్గాలకు ఎంపీ టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ రిక్తహస్తం చూపించింది. వీరికి కనీసం ఒక్క సీటు కూడా కేటాయించలేదు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ ఈ రెండు సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది. ఈ రెండు కులాలకు ఒక్కో ఎంపీ స్థానాన్ని కేటాయించింది. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కాళింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసింది. సీమలో బోయ, కురుబలకు టీడీపీ నో టికెట్ మరోవైపు రాయలసీమలో బీసీ వర్గాలైన బోయ, కురుబ కులాలవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కానీ ఈ రెండు బీసీ వర్గాల గురించి టీడీపీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించలేదు. అదే సమయంలో వైఎస్సార్సీపీ ఈ రెండు వర్గాలకు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా అగ్రవర్ణాల ఆధిపత్యం ఉండే అనంతపురం జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలను బీసీలకు కేటాయించడం ద్వారా చారిత్రక నిర్ణయం తీసుకుంది. అనంతపురం ఎంపీ స్థానం నుంచి బోయ సామాజికవర్గానికి చెందిన తలారి రంగయ్యను బరిలోకి దింపింది. హిందూపురం లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ను ఎంపిక చేసింది. మాదిగ సామాజికవర్గం ఊసెత్తని ‘దేశం’ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మాదిగ సామాజిక వర్గాన్ని అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా మరచిపోయింది. కనీసం ఒక్క లోక్‌సభ స్థానంలోనూ మాదిగ సామాజికవర్గం నేత పేరును పరిశీలించలేదు. అదే సమయంలో వైఎస్సార్సీపీ మాత్రం ఎంపీ అభ్యర్థుల ఎంపికలో మాదిగ సామాజికవర్గానికి సముచిత స్థానం కల్పించింది. బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా మాదిగ సామాజికవర్గానికి చెందిన నందిగం సురేష్‌ను ఎంపిక చేసింది. బ్రాహ్మణులకు టీడీపీ మొండిచేయి.. వైఎస్సార్సీపీ సముచిత ప్రాధాన్యం తెలుగుదేశం పార్టీకి మొదట్నుంచీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా ముద్ర ఉంది. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ సామాజికవర్గానికి టిక్కెట్ల కేటాయింపులో ఎప్పుడూ అన్యాయమే జరుగుతూ వచ్చింది. ప్రస్తుత ఎన్నికల్లోనూ టీడీపీ అదే రీతిలో వ్యవహరించింది. బ్రాహ్మణులకు పూర్తిగా మొండిచేయి చూపింది. ఆ సామాజికవర్గానికి చెందిన వారికి కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కేటాయించలేదు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ ఈ ఎన్నికల్లో బ్రాహ్మణులకు సముచిత గౌరవం కల్పించింది. ఆ సామాజికవర్గానికి నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనం. గుంటూరు జిల్లా బాపట్ల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి మరోసారి అవకాశం కల్పించారు. విజయవాడ సెంట్రల్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించిన అక్కరమాని విజయనిర్మల కూడా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందినవారు. అమె గతంలో భీమిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేశారు. ఆమె భర్త వెంకటరావు యాదవ సామాజికవర్గానికి చెందిన నేత. ఆ నియోజకవర్గంలో యాదవ, బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. దాంతో ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. – వడ్దాది శ్రీనివాస్, సాక్షి, అమరావతి -
పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు
జిల్లాలో ఒకేసారి 1267 పైగా పదవుల భర్తీ 27 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా 1267 పైగా రాజకీయ పదవులు జిల్లాలో భర్తీ అయ్యాయి. ఎంపీటీసీ సభ్యుల నుంచి ఎంపీ వరకు ఒకేసారి పదవులు భర్తీ కావడంతో ఈ ఏడాది ప్రత్యేక గుర్తింపును కైవశం చేసుకుంది. 1987లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. మళ్లీ 27 ఏళ్ల తరువాత ఇప్పుడు స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో కొత్తగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికలను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, మేయర్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టడమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరికి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అధికారం ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా, నెలవారీ గౌరవ వేతనం, అలవెన్సులు, రక్షణ,రాజధానిలో కొలువు, ఇతర వసతులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఇక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ నిధులు అందుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యకలాపాల్లో వీరి ప్రాతినిధ్యం తప్పనిసరి. మున్సిపల్ పాలకులు.. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాల్టీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు పూర్తయ్యాయి. గెలిచిన అభ్యర్థులు పదవీ ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 169 వార్డు కౌన్సిలర్లు, 50 కార్పొరేటర్ పదవులు ఉన్నాయి. వీరిలో కొందరు మున్సిపల్ చైర్పర్సన్లుగా, కార్పొరేషన్ మేయర్‌గా కొనసాగుతారు. అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండడంతో ఇవి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక కేంద్రాలుగా పిలవబడుతున్నాయి. మున్సిపాల్టీల్లో చైర్పర్సన్లతో పాటు కౌన్సిలర్ల హోదాలో వారిని ప్రత్యేకంగా చూపుతుంది. ఇక కార్పొరేషన్లో అయితే ఎమ్మెల్యే, ఎంపీకన్నా మేయర్‌కే స్థానబలం ఎక్కువ. ప్రొటోకాల్ ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా పాలక వర్గంలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వం సానుకూలంగా ఉంటే కావాల్సినంత నిధులు వస్తాయి. జెడ్పీ చైర్పర్సన్... జెడ్పీటీసీ సభ్యులు జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి. జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన 65 మంది నుంచే ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి క్యాబినెట్ హోదాతో సమానమైంది. స్థానిక పాలనలో పెద్దగా జెడ్పీ చైర్పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు తమ మండలాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. మండలానికి సంబంధించిన ఏ సమస్యనైనా జెడ్పీ సమావేశంలో ప్రస్తావించవచ్చు. మడల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం కూడా ఇస్తుంది. ఎంపీపీలు.. ఎంపీటీసీ సభ్యులు జిల్లాలో 901 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యా రు. వీరిలో 65 మంది ఎంపీపీలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఆ మండల ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్‌ను నడిపించేది వీరే. మండలాభివృద్ధి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఎంపీటీసీ సభ్యునిగా ఎన్నికై మెజారిటీ సభ్యుల మద్దతు కూడగడితే ఎంపీపీ పదవిని చేపట్టవచ్చు. ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే గ్రామాల అభివృద్ధికి పాటుపడవచ్చు. మండల పరిషత్ సమావేశాల్లో గ్రామానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించవచ్చు, వాటి పరిష్కారానికి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో కృషి చేయవచ్చు. ఇదే ప్రథమం.. జిల్లాలో ఒకేసారి ఇన్ని రాజకీయ పదవులు భర్తీ కానుం డడం ఇదే ప్రథమం. ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వారు అదృష్టం ఉంటే మంత్రులు, జెడ్పీలో వైస్ చైర్మన్లు, స్థాయి సంఘాల అధ్యక్షులు, మున్సిపాల్టీల్లో వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లో డెప్యూటీ మేయర్లు, స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా కొనసాగుతారు. మొత్తం మీద జయనామ సంవత్సరంలో 1267 మందికి పైగా వివిధ రాజకీయ పదవుల్లో ఆశీను లు కానున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు 14 మంది, ఎంపీ లు ముగ్గురు, జెడ్పీ చైర్పర్సన్ ఒకరు, మునిసిపల్ చైర్మ న్లు ఆరుగురు, జెడ్పీటీసీ సభ్యులు 65 మంది, మండలాధ్యక్షులు 65 మంది, ఎంపీటీసీ సభ్యులు 901మంది, కార్పొరేషన్ మేయర్‌గా ఒకరు, వార్డు కౌన్సిలర్లు 169 మంది, కార్పొరేటర్లుగా 50 మంది ఉన్నారు. వీరంతా ప్రజా సమస్యలను ఏ మేరకు పరిష్కరించి గ్రామాలు, పట్టణాలు, నగరాలను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తారో వేచి చూడాల్సి ఉంది.