మంత్రి హరీశ్‌రావు తీరు మార్చుకోవాలి
ఆర్మూర్(నిజామాబాద్): రెండో ఏఎన్ఎంల సమస్యలు వినకుండా మిమ్మల్ని ఎవరూ పట్టించుకోకున్నా సమ్మె ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించిన భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తన తీరు మార్చుకోవాలని పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం జిల్లా అధ్యక్షుడు బొర్ర నాగరాజు సూచించారు. ఆర్మూర్‌లోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ డిమాండ్ల సాధన కోసం రెండో ఏఎన్ఎంలు బుధవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
31వ రోజు కొనసాగుతున్న సమ్మెకు పీడీఎస్‌యూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి హరీశ్‌రావుకు ఏఎన్ఎంలు వినతి పత్రం అందజేస్తే ఆయన స్పందించిన తీరు బాధాకరమన్నారు. రెండో ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు యెల్లుల శ్రీకాంత్, స్వామి ఏఎన్ఎంలు ప్రమీళ, రాజగంగు, విజయ, స్వప్న, గీత, ఎస్తేర్, వాణి, రాణి, స్వరూప, కమల, చైతన్య, సుమలత తదితరులు పాల్గొన్నారు.