second phase poling
-
సార్వత్రిక ఎన్నికల్లో నేడే రెండో దశ పోలింగ్.. 13 రాష్ట్రాల్లోని 88 స్థానాలకు ఎన్నికలు..ఇంకా ఇతర అప్డేట్స్
-
హస్తానికి అందని ద్రాక్షేనా!
హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2 స్థానాలకు పడిపోయింది. 2019కి వచ్చేసరికి ఒకే సీటుకు పరిమితమైంది. మిగతా 28 చోట్లా కాషాయ జెండాయే ఎగిరింది! గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ దుమ్ము రేపింది. శుక్రవారం రెండో విడతలో రాష్ట్రంలో ఆరు కీలక స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇవన్నీ బీజేపీ కంచుకోటలే. ఇక్కడ బీజేపీని ఎదుర్కోలేక రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ అష్టకష్టాలు పడుతోంది. ఆ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులు, వారి బలాబలాలపై ఫోకస్... ఖజురహో...కాంగ్రెస్ సెల్ఫ్ గోల్బలమైన బీజేపీని దీటుగా ఢీకొట్టాల్సిన వేళ హస్తం పార్టీ ఆదిలోనే ‘చేయి’ కాల్చుకుంది. పోలింగ్‌కు ముందే ఈ స్థానాన్ని చేజేతులా ‘కమలం’ పువ్వులో పెట్టి మరీ అందిస్తోంది. పొత్తులో భాగంగా ఖజురహోను సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ త్యాగం చేసింది. ఇక్కడ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ వీడీ శర్మపై అనామకుడైన మనోజ్ యాదవ్‌ను ఎస్పీ తొలుత అభ్యర్థిగా ప్రకటించింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే మీరా దీపక్ యాదవ్‌కు సీటిచి్చంది. కానీ నామినేషన్ పత్రాల్లో సంతకం మర్చిపోవడంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఈసీ తిరస్కరించింది. దాంతో కంగుతిన్న కాంగ్రెస్, ఎస్పీ పెద్దగా సోదిలో లేని ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి ఆర్.బి.ప్రజాపతికి మద్దతివ్వాల్సి వస్తోంది. దీంతో ఇక్కడ విజయం బీజేపీకి నల్లేరుపై నడకే కానుంది. 2019లో 4.3 లక్షల పై చిలుకు మెజారిటీతో గెలిచిన శర్మ ఈసారి దాన్ని మరింత పెంచుకుంటారంటున్నారు. ‘‘వీడీ శర్మ చూడ్డానికి సన్నగా కనిపించినా ఆయన నాయకత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త రికార్డులు కొట్టింది’’ అంటూ తాజాగా దామోహ్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ఆకాశానికెత్తారు. హోషంగాబాద్.. కుబేరుడితో సరస్వతీ పుత్రుడు ఢీ!ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. దాంతో ఈసారి ఐదు మాస్టర్ డిగ్రీల వీరుడు, రైతు ఉద్యమకారుడు దర్శన్ సింగ్చౌదరిని బీజేపీ బరిలో దింపింది. నెరిసిన గడ్డం, తెల్లటి తలపాగాతో సౌమ్యంగా కనిపించే ఈయన సరస్వతీ పుత్రుడు. ఫిలాసఫీ, ఇంగ్లి‹Ù, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సోషియాలజీల్లో ఎంఏ చేశారు. నర్మదా లోయలో పలు రైతు ఉద్యమాలకు సారథ్యం వహించారు. బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తే అయినా బాగా గుర్తింపున్న నాయకుడు. కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ రాష్ట్రంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.233 కోట్లు. హోషంగాబాద్ నియోజకవర్గ పరిధిలోని తెండుఖేడా అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు. అయితే గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడారు. తికంగఢ్... యమా టఫ్2009లో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారినప్పటి నుంచీ ఇక్కడ కాషాయ జెండానే ఎగురుతోంది. ఇక్కడ బీజేపీ హ్యాట్రిక్ వీరుడు, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఖటిక్ మళ్లీ బరిలో ఉన్నారు. గతంలో సాగర్ లోక్‌సభ స్థానంలోనూ నాలుగుసార్లు గెలిచిన రికార్డు ఆయనది. 2009లో తికంగఢ్ స్థానం ఏర్పడ్డప్పటి నుంచీ ఆయనే గెలుస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ఇక్కడ ప్రతిసారీ అభ్యర్థులను మార్చినా ఫలితం మాత్రం శూన్యం. వీరేంద్ర అంతకంతకూ మెజారిటీ పెంచుకుంటూ పోతున్నారు. ఈసారి పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ అహిర్వార్ రూపంలో యువ నేతను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జతారా స్థానం నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన తిరుగుబావుటా ఎగరేశారు. దాంతో ఇలా ఎంపీ టికెటిచి్చంది. బాహుబలి వంటి కేంద్ర మంత్రి వీరేంద్రపై పోటీకి నిలపడం పంకజ్‌ను బలిపశువును చేయడమేనని కాంగ్రెస్ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు! దామోహ్.. లోధీ వర్సెస్ లోధీబడా నేతలెవరూ రేసులో లేకున్నా ఆసక్తి రేపుతున్న నియోజకవర్గమిది. బీజేపీ అభ్యర్థి రాహుల్ సింగ్ లోధీ, కాంగ్రెస్ అభ్యర్థి తర్బార్సింగ్ లోధీ ఇద్దరూ ఒకప్పుడు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభారతి వీరవిధేయులే! పైగా బంధువులు కూడా. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇద్దరూ బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దామోహ్ నుంచి రాహుల్, బాందా నుంచి తర్బార్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. 15 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడంతో రాహుల్ మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య పోటీ హోరాహోరీగానే ఉండొచ్చనేది పరిశీలకుల అభిప్రాయం. ఇక్కడ రెండుసార్లు నెగ్గిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గత డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర మంత్రి అయ్యారు. సత్నా.. హోరాహోరీనాలుగుసార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ బలశాలి గణేశ్ సింగ్‌పై యువ ఎమ్మెల్యే సిద్దార్థ్ కుశ్వాహను కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఐదు నెలల క్రితమే సత్నా అసెంబ్లీ స్థానంలో గణేశ్ సింగ్‌ను కుశ్వాహ మట్టికరిపించడం విశేషం! దాంతో ఈసారి వారిద్దరి పోటీ ఉత్కంఠ రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి షాకిచి్చన చరిత్ర కుశ్వాహది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత శంకర్‌లాల్ తివారీని ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరొందారు.రేవా.. కమలానికే మొగ్గుబ్రాహ్మణ ఓట్లు ఎక్కువగా ఉన్న ఈ స్థానంలో ఇరు పారీ్టలూ ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులనే నిలబెడుతూ వస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ జనార్దన్ మిశ్రాకే బీజేపీ మళ్లీ టికెటిచ్చింది. ఇక్కడ 2014లో 1.68 లక్షల ఓట్ల మెజారిటీతో నెగ్గిన మిశ్రా 2019లో దాన్ని 3.12 లక్షలకు పెంచుకున్నారు. ప్రతిసారీ అభ్యర్థులను మారుస్తున్న కాంగ్రెస్ ఈసారి మహిళకు టిక్కెట్ ఇచి్చంది. రేవా మేయర్ అభయ్ మిశ్రా భార్య నీలంను రంగంలోకి దించింది. అయితే ఈ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయి. ఈసారీ ఆ పారీ్టకే విజయావకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సర్పంచ్.. మలి పంచ్ నేడే
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలు రెండో విడత జరిగే గ్రామాల్లో శనివారం ఉదయం 6.30 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగు తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. రెండో విడతలో 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ కాగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని ఒక్కో గ్రామ పంచాయతీలలో సర్పంచి పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు పోలింగ్ జరగనుంది. సర్పంచి స్థానాలకు 7,507 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో విడత గ్రామాల్లో 33,570 వార్డులుండగా 12,604 ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 29,304 కేంద్రాల్లో పోలింగ్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం 29,304 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు తదితర సామగ్రితో పోలింగ్ సిబ్బంది శుక్రవారం రాత్రికే ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. 4,181 కేంద్రాలను అత్యంత సమస్యాత్మ కంగా, 5,480 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. బ్యాలెట్ పేపరుతో ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో 18,387 పెద్దవి, 8,351 మధ్యస్థం, 24,034 చిన్న సైజు బ్యాలెట్ బాక్స్‌లను వినియోగిస్తున్నారు. పోలింగ్ విధుల్లో 81,327 మంది సిబ్బంది పాల్గొంటుండగా 4,385 మంది జోనల్ అధికారులు, రూట్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లుగా వ్యవహరిం చనున్నారు. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుండగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలింగ్ సమయంగా నిర్ణయించారు. కోవిడ్ పాజిటివ్ బాధితులకు పోలింగ్ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతిస్తామని కమిషన్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 9,661 కేంద్రాలలో ప్రత్యేక వెబ్ కెమెరాలను ఏర్పాటు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజాశంకర్ తమ కార్యాలయాల నుంచి పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు శనివారం సాయంత్రమే మొదలు కానుంది. నాలుగు గంటల నుంచి లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. బ్యాలెట్ బాక్స్‌లను నిర్దేశిత ప్రాంతానికి తరలించి తొలుత వార్డులకు తర్వాత సర్పంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. వేర్వేరు గదుల్లో ఏర్పాట్లు.. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు వెంటనే చేపడుతున్న నేపథ్యంలో రెండు వేర్వేరు గదుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, ఇతరులు బ్యాలెట్ పేపర్లు తాకకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశించింది. రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, జిల్లా ఇన్చార్జ్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు రాత్రి కూడా నిర్వహించే పక్షంలో తగినన్ని లైట్లు, సిబ్బందికి భోజన సదుపాయాలు కల్పించాలన్నారు. కంట్రోల్ రూం ద్వారా వెబ్ కాస్టింగ్‌ను నిరంతరం పర్యవేక్షించాలని, డేటాను భద్రంగా ఉంచాలని సూచించారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీల్లో అదనంగా ఒక అధికారిని నియమించాలని, పెద్ద పంచాయతీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్వోకి సహాయంగా గెజిటెడ్ అధికారిని నియమించుకోవాలని సూచించారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 13 జిల్లాలకు ఇప్పటికే రూ.80 కోట్లు విడుదల చేశామని, రెండో విడత కోసం రూ.116 కోట్లు విడుదలయ్యాయని, నిధులను పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. -
తొలిసారి ఓటు వేయడం కోసం..
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు రెండో దశ పోలింగ్ నేడు ప్రారంభం అయ్యింది. 17 జిల్లాలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేడు ఓటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓ యువతి పలువురు దృష్టిని ఆకర్షించింది. ఓటు వేయడం కోసం సదరు యువతి సైకిల్ మీద తన బామ్మతో కలిసి పట్నా పోలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఓటు హక్కు వచ్చిన తర్వాత మొదటిసారి దాన్ని వినియోగించుకున్నాను. మా బామ్మతో కలిసి ఓటు వేయడానికి వచ్చాను. భవిష్యత్తులో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపింది. (చదవండి: నితీష్‌కు ఇదే చివరి ఎన్నిక : చిరాగ్) బిహార్ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరుగుతోంది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేటి పోలింగ్‌లో 2.85 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వృద్ధులు, కోవిడ్ లక్షణాలున్నవారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్య చర్యలను పాటిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ జరుగుతోంది. -
నేడు బిహార్‌లో రెండో దశ ఎన్నికలు
పట్నా: బిహార్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మహామహులు బరిలో నిలిచిన ఈ రెండో దశను బిహార్ ఎన్నికల్లో కీలక దశగా భావిస్తున్నారు. అధికార ఎన్డీయే అభ్యర్థుల కోసం ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌సహా కీలక నేతలు, విపక్ష మహా కూటమి కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్‌గాంధీ, ఆర్జేడీ ముఖ్య నేత తేజస్వీ సహా ముఖ్యమైన నాయకులు ప్రచారం నిర్వహించారు. 17 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 94 అసెంబ్లీ స్థానాలకు నేడు(మంగళవారం) ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 1.35 కోట్ల మహిళా ఓటర్లు సహా మొత్తం 2.85 కోట్ల మంది ఓటర్లు సుమారు 1500 అభ్యర్థుల భవితను నిర్దేశించనున్నారు. ఈ రెండో దశ ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఆర్జేడీ నేత, విపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా కాంగ్రెస్ తరఫున బంకీపూర్ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జిల్లా నలందలోని ఏడు స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. నలంద జిల్లాలో జేడీయూ బలంగా ఉంది. రెండోదశ ఎన్నికలు జరుగుతున్న 94 సీట్లలో విపక్ష కూటమి తరఫున 56 స్థానాల్లో ఆర్జేడీ, 24 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాలుగు స్థానాల చొప్పున, సీపీఐఎంఎల్ మరికొన్ని స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అధికార ఎన్డీయే నుంచి బీజేపీ 46 స్థానాల్లో, జేడీయూ 43 సీట్లలో, వీఐపీ 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎల్జేపీ 52 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికలు కీలకం నేడు 10 రాష్ట్రాల్లోని 54 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపై అందరి దృష్టి ఉంది. సీఎం చౌహాన్‌కు సవాలుగా మారిన ఎన్నికలివి. కాంగ్రెస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కమల్ సర్కారు కూలడం తెల్సిందే. ఆ 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గుజరాత్(8), కర్నాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ(1)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
రెండో దశలో 68% పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ తెలిపింది. పశ్చిమబెంగాల్, మణిపూర్లలో హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గురువారం తమిళనాడులోని 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, యూపీ, అస్సాం, బిహార్, ఒడిశాలలో ఐదేసి సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్లో మూడు చొప్పున, జమ్మూకశ్మీర్‌లో రెండు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానం, ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో పుదుచ్చేరిలో అత్యధికంగా 80%, మణిపూర్‌లో 75% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్లో అత్యల్పం కశ్మీర్లో వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శ్రీనగర్‌లో అత్యల్పంగా 14.8% పోలింగ్ నమోదైంది. శ్రీనగర్ పార్లమెంటరీ స్థానంలోని 90 పోలింగ్ బూత్‌లతో ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉథంపూర్‌లో మాత్రం 70% పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలో 80 శాతం తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాల్లో 63.73% పోలింగ్ నమోదైంది. అరక్కోణంలో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. అదేవిధంగా, 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 67% పోలింగ్ నమోదైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 80% మంది ఓటు వేశారు. బెంగాల్లో హింసాత్మకం పశ్చిమబెంగాల్లోని మూడు సీట్లకు జరిగిన ఎన్నికలో 76% ఓటింగ్ నమోదైంది. జల్పాయ్గురిలో అత్యధికంగా 82.76%, రాయ్గంజ్లో 72.14% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాయ్‌గంజ్ నియోజకవర్గంలో అల్లరిమూక రాళ్లు రువ్వడంతో పోలీసులు, బాష్పవాయువు ప్రయోగించి, కాల్పులు జరిపారు. నియోజకవర్గంలోని చోప్రా ఏరియాలో ఆగంతకులు బాంబులు విసిరారని ఈసీ అధికారి తెలిపారు. కటఫూల్బరిలో వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన స్థానిక టీవీ చానెల్ రిపోర్టర్, కెమెరామన్‌పై కొందరు దాడికి పాల్పడ్డారు. కారులో వెళ్తుండగా కొందరు దాడి చేశారంటూ సీపీఎం అభ్యర్థి ఎండీ సలీం ఫిర్యాదు చేశారు. మావోయిస్టు ప్రాంతాల్లో.. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68.37% మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. బహు భాషానటి సుమలత, సీఎం కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తున్న మాండ్య నియోజకవర్గంలో అత్యధికంగా 80.37 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బెంగళూరు సెంట్రల్లో అత్యల్పంగా 50 శాతం పోలింగ్ నమోదైంది. మణిపూర్‌లో 75% మంది ఓ టు వేశారు. ఇక్కడ రెండు బూత్‌లలో ఓటింగ్ నిలిపివేశారు. మహారాష్ట్రలోని 10 నియోజకవర్గాల్లో 57.22% పోలింగ్ నమోదైంది. నాందేడ్‌లో 60.88%, హింగోలిలో 60.69% మంది ఓటేశారు. నాందేడ్‌లో ఏకంగా 78 ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వేరే వాటిని ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో్ల 68.70% శాతం పోలింగ్ నమోదైంది. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గంలోని మొహ్లా–మాన్పూర్లో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటన మినహా ఇతర హింసాత్మక ఘటనలేవీ జరగలేదు. ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ఇక్కడ 53% పోలింగ్ నమోదైంది. బిహార్‌లో 62.52%, యూపీలో 62.30%, అస్సాంలో 73.32% నమోదైంది. లోక్‌సభలోని 543 సీట్లకు ఏడు విడతలుగా ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటి వరకు రెండు విడతలు పూర్తయ్యాయి. మిగిలినవి ఈ నెల 18, 23, 29 తేదీలతోపాటు మే 6, 12, 19వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులోని అవకతవకలకు అవకాశం ఉందన్న అనుమానంతో వెల్లూరు స్థానం పోలింగ్‌ను అధికారులు రద్దు చేశారు. అలాగే, త్రిపుర (పశ్చిమ)లో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముందని భావించి ఎన్నికను వాయిదా వేశారు. పశ్చిమబెంగాల్లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్న పోలీసు కేతిగనహళ్లిలో ఓటేసిన కర్ణాటక సీఎం కుమారస్వామి, భార్య, కొడుకు. దొడ్డ అరసినకెరెలో ఓటేసిన సుమలత. మథురలో ఓటేసిన హేమమాలిని -
రెండో దశ పోలింగ్.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. నేడు పోలింగ్ జరగనున్న ఆరు జిల్లాల్లో నిషేధిత మావోయిస్టు పార్టీకి గట్టి పట్టుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికే ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలుస్తున్నది. కైమూర్, రోహ్ తాస్, అర్వాల్, జహనాబాద్, ఔరంగాబాద్, గయా జిల్లాల్లోని మొత్తం 32 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 456 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు కావడంతో 11 నియోజకవర్గాల్లో సాయంత్ర 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నట్లు అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్. లక్ష్మణణ్ తెలిపారు. మరో 12 నియోజకవర్గాల్లో సాయంత్ర 4 గంటల వరకు, కేవలం 9 నియోజవర్గాల్లో మాత్రమే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. మొత్తం 86, 13, 870 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ మేరకు 9, 119 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి. 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 12 న జరిగిన మొదటి దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. మూడో దశ 28న, నాలుగో దశ నవంబర్ 1న, ఐదో దశ నవంబర్ 5న పోలింగ్ జరగనుంది.